2014
డిసెంబర్ 15
అవ్యక్త బ్రహ్మతో ఫరిస్తా యొక్క సంభాషణ
స్మృతికి
రావలసిన మొదటి విషయము
నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ
అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ఈ
ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి
వచ్చాను.
నేను ఎవరు?
నేను ఒక ఫరిస్తాను.. నేను అమృత వేళ యోగం లో
కూర్చోగానే అవ్యక్త బ్రహ్మ ను చాలా ప్రేమ తో
చూస్తున్నాను. బ్రహ్మాబాబా ద్వారా శివ బాబా ఎదైతే
సేవ చేస్తున్నారో దానిని చాలా అభినందిస్తున్నాను.
నేను సూక్ష్మ వతనంలో బేహద్ సేవ చేస్తున్న బ్రహ్మా
బాబాను చూస్తున్నాను.
నేను ఎవరికి
చెందుతాను?
బాబా తో
ఆత్మ యొక్క సంభాషణ:
మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్.. సూక్శ్మ వతనం లో
ఫరిస్తా రూపంలో నేను మీతో కూర్చున్నాను.. నేను మీ
దృష్టి ద్వారా ఈ ప్రపంచానికి దారి చూపించే శక్తులను
అనుభూతి చెందుతున్నాను.ఇక్కడ మీ సాంగత్యంలో వుండటం
వలన నేను సంపూర్ణంగా తయారవుతున్నాను. మీరు చేసే
అలసట లేని సేవ నన్ను ఫరిస్తాగా అవడానికి ప్రేరణ
కలిగిస్తుంది. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. మీ
నిస్వార్ధమైన ప్రేమకు నేను రెటర్న్ ఇవ్వాలి. మీలాగే
నేను కూడా సదా యోగీ మరియు సదా సేవధారిగా అవ్వాలి.
అత్మతో బాబా
యొక్క సంభాషణ:
మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో... బ్రహ్మా
బాబా నీ యొక్క బలహీనతలు అర్థం చేసుకోవడం వలన,
నిన్ను శక్తులు మరియు దైర్యంతో నింపుతున్నారు. బాప్
దాదా నిన్ను బేహద్ సేవ అనే ఆసనంలో
కూర్చోబెడుతున్నారు. నేను నిన్ను శక్తులతో
నింపుతున్నాను కావునా నీవు ఉల్లాస ఉత్సాహాలతో
విశ్వ సేవను చేస్తావు. ఎలాగైతే శిల్పి కళ్ళు,
చెవులతో మొహాన్ని తయారుచేస్తాడో... అలానే నేను నీలో
ఆత్మిక గుణాలను నింపుతున్నాను.
ప్రేరణ
పొందుట:
నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును
శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను...
బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే
సంకల్పాలను పొందుతున్నాను.
బాబా నుంచి
వరదానములను పొందుట:
సూక్ష్మ వతనం లో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ
చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన
మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా నేను వరదానాలను
పొందుతున్నాను.
నీవు చాలా జగ్రత్తగా నీ సంకల్పాలను గమనిస్తున్నావు.
నీలో వ్యర్ధ మరియు నెగిటివ్ అలోచనలను ఒక్క సెకండ్
లో తొలగించి వాటిని దివ్యమైన మరియు అధ్యాత్మిక
లక్శ్యాలకు ఉపయోగించే శక్తి వుంది. ఈ అభ్యాసం
ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని పరివర్తన చేసే
శక్తిని నువ్వు పొందుతున్నావు.
బేహద్
సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)
నేను పై వరదానాన్ని దాత గా అయ్యి ఈ ప్రపంచానికి
ఇస్తున్నాను. నేను ఈ వరదానాన్ని బాబా నుంచి
తీసుకుని ఈ మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాల తో
బహుమతి రూపము లో ఇస్తున్నాను... నా ఫరిస్తా స్వరూపం
లో ఈ భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి ఈ
వరదానాన్ని ఇస్తున్నాను.
నిద్రకు
ఉపక్రమించే ముందు:
నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను.
నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం
కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను
ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్
చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబా కి
చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ
ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను
చార్ట్ లో రాసి 30 నిమిషాల యోగం ద్వారా ఆ కర్మల
యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన
మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.