“సదాకాలిక స్నేహులుగా అవ్వండి."
ఈ రోజు స్నేహసాగరుడైన బాబా తమ స్నేహీ పిల్లలను
కలుసుకునేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరినీ సహజయోగిగా
చేసేస్తుంది, ఈ స్నేహము పాత సంస్కారాలన్నింటిని మరపింపజేసేందుకు సాధనము. ఈ
స్నేహము ప్రతి ఆత్మనూ బాబాకు చెందినవారిగా చేయడంలో ఏకైక శక్తిశాలీ సాధనము. ఈ
స్నేహమే బ్రాహ్మణజీవితానికి పునాది. స్నేహము శక్తిశాలీ జీవితమును
తయారుచేసుకునేందుకు, పాలనకు ఆధారము. శ్రేష్ఠ ఆత్మలెవరైతే బాబా వద్దకు సమ్ముఖముగా
వచ్చి చేరుకున్నారో వారందరూ అలా చేరుకునేందుకు ఆధారము కూడా స్నేహమే. స్నేహమనే
రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి మధువన నివాసులుగా అవుతారు. అందరూ స్నేహులే కానీ ఉన్న
తేడా ఏమిటి? నెంబర్ వారీగా ఎందుకు అవుతున్నారు. కారణమేమిటి? అని బాప్ దాదా
స్నేహీ పిల్లలందరినీ గమనిస్తున్నారు. అందరూ స్నేహులే కానీ కొందరు సదా స్నేహులుగా
ఉంటే మరికొందరు స్నేహులుగా ఉన్నారు. మూడవ రకం వారు - సమయానుసారముగా స్నేహులుగా
అయ్యేవారు. బాప్ దాదా మూడు రకాల స్నేహులనూ చూసారు. ఎవరైతే సదా స్నేహులుగా ఉంటారో
వారు లవలీనముగా ఉన్న కారణముగా శ్రమ మరియు కష్టము నుండి సదా అతీతముగా ఉంటారు.
వారికి కష్టపడవలసిన అవసరమూ లేదు. అలాగే ఎటువంటి కష్టమూ అనుభవమవ్వదు కూడా,
ఎందుకంటే, సదా స్నేహులుగా ఉన్న కారణముగా వారి ముందు ప్రకృతి మరియు మాయ ఇప్పటి
నుండే దాసిగా అయిపోతాయి. అనగా సదా స్నేహులుగా ఉండే ఆత్మలు యజమానులుగా అయిపోతాయి.
తద్వారా ప్రకృతి, మాయ స్వతహాగానే దాసీ రూపముగా అయిపోతుంది. సదా స్నేహులుగా
ఉండేవారి సమయమును లేక సంకల్పాలను తనవైపుకు మరలించుకునే ధైర్యము ప్రకృతికి కానీ,
మాయకు కానీ లేదు. సదా స్నేహీ ఆత్మల సమయము మరియు సంకల్పాలు ఒక్క బాబా స్మృతి
మరియు సేవల పట్లే ఉన్నాయి. కావున సదా స్నేహీ పిల్లలు సంకల్పము ద్వారా కూడా
ఎప్పుడూ తమ ఆధీనముగా అవ్వజాలరని ప్రకృతికి, మాయకు తెలుసు. వారు సర్వశక్తుల
యొక్క అధికారీ ఆత్మలు. సదా స్నేహీ ఆత్మల స్థితికే గాయనము ఉంది. వారికి ఒక్క బాబా
తప్ప ఇంకెవ్వరూ ఉండరు. బాబాయే వారి ప్రపంచము.
రెండవ విషయము - స్నేహీ ఆత్మలు స్నేహములో తప్పకుండా
ఉంటారు కానీ, సదా స్నేహులుగా లేని కారణముగా అప్పుడప్పుడూ మనస్సు యొక్క సంకల్పాల
ద్వారా వేరేవైపులకు కూడా స్నేహము వెళుతుంది. కొద్దిగా మధ్య మధ్యలో స్వయమును
పరివర్తన చేసుకున్న కారణముగా కాసేపు శ్రమను, కష్టమును అనుభవం చేసుకుంటారు. కానీ
చాలా కొద్దిగా, ప్రకృతి యొక్క లేక మాయ యొక్క సూక్ష్మ యుద్దమేదైనా జరిగితే అదే
సమయంలో స్నేహము కారణముగా త్వరగా గుర్తుకు వచ్చేస్తుంది మరియు ఆ స్మృతి శక్తి
ద్వారా చాలా త్వరగానే స్వయమును పరివర్తన కూడా చేసుకుంటారు. కానీ, అదే సమయమైతే
సంకల్పాలు శ్రమలో వినియోగింపబడ్డాయి కదా! అప్పుడప్పుడూ స్నేహము సాధారణముగా
అయిపోతుంది, మళ్ళీ అప్పుడప్పుడూ స్నేహములో లవలీనమై ఉంటారు. ఆ స్థితిలో తేడా ఉంటూ
ఉంటుంది. అయినా ఎక్కువ సమయము లేక సంకల్పాలు వ్యర్ధమవ్వవు. కావున స్నేహము ఉన్నా
అది సదా లేని కారణముగా రెండవ నెంబర్ లోకి వచ్చేస్తారు.
మూడవ విషయము - సమయానుసారముగా స్నేహమును
నిర్వర్తించేవారు. సత్యమైన స్నేహము ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరినుండి
లభించజాలదని మరియు ఇదే ఆత్మిక స్నేహము సదా కాలికముగా శ్రేష్టముగా
తయారుచేస్తుందని భావిస్తారు. జ్ఞానము అనగా వివేకం. పూర్తిగా ఉంటుంది. అలాగే ఈ
స్నేహి జీవితమే ప్రియమనిపిస్తుంది కూడా. కానీ తమ దైహిక ఆకర్షణ యొక్క సంస్కారాలు
లేక ఏవైనా విశేషమైన పాత సంస్కారాలు లేక ఎవరైనా వ్యక్తి లేక వస్తువుల యొక్క
సంస్కారాలు లేక వ్యర్థ సంకల్పాల యొక్క సంస్కారాలకు వశమై, నిగ్రహ శక్తి లేని
కారణం వ్యర్థ సంకల్పాల యొక్క భారము ఉంటుంది. సంఘటిత శక్తి యొక్క లోపము ఉన్న
కారణంగా సంఘటనలో సఫలులుగా అవ్వలేరు. సంఘటన యొక్క పరిస్థితి స్నేహమును సమాప్తము
చేసి తనవైపుకు ఆకర్షించుకుంటుంది. మరికొందరు సదా త్వరగా నిరుత్సాహులుగా అయిపోతూ
ఉంటారు. ఇప్పుడు చూస్తే చాలా బాగా ఎగురుతూ ఉంటారు. మళ్ళీ కాసేపటికి చూస్తే తమపై
తాము కూడా నిరుత్సాహులుగా ఉంటారు. ఈ విధముగా స్వయం పట్ల నిరుత్సాహులుగా అయ్యే
సంస్కారము కూడా సదా స్నేహులుగా అవ్వనివ్వదు. ఏదో ఒక సంస్కారము పరిస్థితి వైపుకు,
ప్రకృతి వైపుకు ఆకర్షించేస్తుంది మరియు ఎప్పుడైతే అలజడిలోకి వచ్చేస్తారో,
స్నేహము యొక్క అనుభవం ఉన్న కారణముగా, స్నేహీ జీవితము ప్రియముగా అనిపించిన
కారణముగా బాబా యొక్క స్మృతి కలుగుతుంది. ఇప్పుడు ఇంకా బాబా స్నేహములో
ఇమిడిపోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు... కావున సమయానుసారముగా, పరిస్థితి
అనుసారముగా అలజడిలోకి వస్తున్న కారణముగా కాసేపు స్మృతి చేస్తారు. మరి కాసేపు
యుద్ధం చేస్తారు. యుద్ధముతో కూడిన జీవితము ఎక్కువగా ఉంటుంది మరియు స్నేహములో
ఇమిడిపోయే జీవితము దానికన్నా కాస్త తక్కువగా ఉంటుంది. కావున మూడవ నెంబర్ గా
అయిపోతారు. అయినా విశ్వములోని సర్వాతలతో పోల్చి చూస్తే మూడవ నెంబర్ వారిని కూడా
అతి శ్రేష్టమైన వారు అనే అనడం జరుగుతుంది. ఎందుకంటే బాబాను గుర్తించి బాబాకు
చెందినవారిగా అయ్యారు. బ్రాహ్మణ పరివారానికి చెందినవారిగా అయ్యారు.
ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ ఆత్మలు బ్రహ్మాకుమారి, కుమారులుగా పిలువబడతారు. కావున
ప్రపంచం లెక్కలో పోల్చి చూస్తే వారు కూడా శ్రేష్ట ఆత్మలే. కానీ సంపూర్ణత యొక్క
లెక్కలో మూడవ నెంబర్ గా ఉన్నారు. కావున అందరూ స్నేహులే కానీ నెంబరు వారీగా
ఉన్నారు. నెంబర్ వన్ సదా స్నేహీ ఆత్మలు సదా కమలపుష్ప సమానముగా అతీతముగా మరియు
బాబాకు అతి ప్రియమైన వారిగా ఉంటారు. స్నేహితులు అతీతముగానూ ఉంటారు మరియు
ప్రియముగానూ ఉంటారు కానీ బాబా సమానముగా శక్తిశాలిగా, విజయులుగా ఉండరు. లవలీనముగా
ఉండరు, స్నేహులుగా ఉంటారు. మేము మీకు చెందినవారము. మీకు చెంది ఉంటాము అన్నది
వారి విశేష స్లోగన్. సదా ఇదే గీతమును గానం చేస్తూ ఉంటారు. అయినా స్నేహము ఉన్న
కారణముగా 80 శాతం సురక్షితముగా ఉంటారు. అయినా అప్పుడప్పుడు అన్న పదము కూడా
వచ్చేస్తుంది. సదా అన్న పదము ఉండదు మరియు మూడవ నెంబర్ ఆత్మలు పదే, పదే స్నేహము
కారణముగా స్నేహములో ప్రతిజ్ఞలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పటి నుండి ఈ విధముగా
అవుతాము, ఇప్పటి నుండి ఇది చేస్తాము అని అంటారు కానీ తేడా అయితే తెలుసు కదా!
ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. అలాగే పురుషార్థమును కూడా చేస్తారు. కానీ ఏదో ఒక పాత
సంస్కారము లగనములో మగనముగా అయి ఉండనివ్వదు.. విఘ్నాలు మాగ్నావస్థ నుండి కిందకు
తీసుకు వస్తాయి కావున సదా అన్న పదము రాజాలదు. కాసేపు ఒకలా మరి కాసేపు ఇంకోలా
ఉన్న కారణముగా ఏదో ఒక విశేష బలహీనత ఉండిపోతుంది. ఇటువంటి ఆత్మలు బాప్ దాదాల
ముందు ఆత్మిక సంభాషణలో చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ కూడా ఎంతో
చూపిస్తారు. మీ డైరెక్షన్లు అయితే ఉన్నాయి కానీ మా వైపు నుండి కూడా మీరే చేయండి
మరియు పొందేది మాత్రం మేము అని ఎంతో యుక్తిగా, స్నేహముతో అంటారు. మీరు మమ్మల్ని
మీవారిగా చేసుకున్నారు. కావున అది మీకే తెలియాలి అని అంటారు. బాబాకైతే తెలుసు
కానీ పిల్లలు కూడా దానిని అంగీకరించాలి కదా! అని బాబా అంటారు. కానీ పిల్లలు మేము
ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీరైతే ఒప్పుకోవాల్సిందే అని అంటారు. కానీ బాబాకు
పిల్లలపైన వీరు ఎంతైనా బ్రాహ్మణ పిల్లలే కదా! అన్న దయ కలుగుతుంది. కావున స్వయమూ
నిమిత్తమై ఉన్న ఆత్మల ద్వారా విశేష శక్తిని ఇస్తారు. కానీ కొందరు శక్తిని
తీసుకుని పారిపోతారు కూడా. మరికొందరు శక్తి లభిస్తున్నా తమ సంస్కారాలలో మగ్నమై
ఉన్న కారణంగా శక్తిని ధారణ చేయలేరు. ఉదాహరణకు ఏదైనా శక్తివంతమైన వస్తువును
తినిపించినా దానిని వారు తినకపోతే ఏమి చేయగలము?
బాబా విశేషమైన శక్తిని ఇస్తున్నా మెల్లమెల్లగా
శక్తిశాలిగా అవుతూ, అవుతూ మూడవనెంబర్ నుండి రెండవ నెంబర్లోకి కూడా వెళ్ళిపోతారు.
కానీ కొందరు చాలా నిర్లక్ష్యముగా ఉన్నకారణముగా ఎంతగా అయితే తీసుకోవాలో అంతగా
తీసుకోలేరు. మూడు రకాల స్నేహీ పిల్లలు ఉన్నారు. అందరికి స్నేహీ పిల్లలు అన్న
టైటిలే ఉంది. కానీ నెంబర్ వారీగా ఉన్నారు.
ఈరోజు ఇది జర్మనీ వారి టర్న్ మొత్తం గ్రూప్ అంతా
నెంబర్ వన్ గా ఉన్నారు కదా! నెంబర్ వన్ సమీప రత్నాలు. ఎందుకంటే, ఎవరైతే సమానముగా
ఉంటారో వారే సమీపముగా ఉంటారు.శరీరము ద్వారా ఎంత దూరముగా ఉన్నా కానీ హృదయము
ద్వారా ఎంత సమీపముగా ఉన్నారంటే వారు హృదయములోనే ఉంటారు. ఎవరైతే స్వయం బాబా
హృదయసింహాసనముపై ఉంటారో వారి హృదయములో స్వతహాగానే బాబా తప్ప ఇంకెవ్వరూ ఉండజాలరు.
ఎందుకంటే బ్రాహ్మణ జీవితములో బాబా హృదయంతోనే వ్యాపారము చేసారు కదా! హృదయమును
ఇచ్చారు, హృదయమును తీసుకున్నారు. ఇది హృదయం యొక్క ఇచ్చి పుచ్చుకోవడమే కదా!
హృదయపూర్వకముగా బాబాతో కలిసి ఉంటారు. శరీరము ద్వారా ఎవరు ఎక్కడ ఉన్నా కానీ,
అందరినీ ఇక్కడ ఉంచితే కూర్చొని ఏమి చేస్తారు? సేవకొరకైతే మధువనములో ఉండేవారిని
కూడా బయటకు పంపవలసి వచ్చింది. లేకపోతే విశ్వము యొక్క సేవ ఎలా జరుగుతుంది? బాబాపై
ప్రేమ ఉంది, అలాగే సేవపై కూడా ప్రేమ ఉంది. కావుననే డ్రామా అనుసారముగా భిన్న
కార్య స్థానాలకు చేరుకున్నారు మరియు అక్కడి సేవకు నిమిత్తముగా అయిపోయారు. కావున
డ్రామాలో ఈ పాత్రకూడా రచింపబడి ఉంది. తమ సహచరుల యొక్క సేవకు నిమిత్తముగా
అయిపోయారు. జర్మనీవారు సదా సంతోషముగా ఉండేవారే కదా! బాబాతో సదాకాలికమైన
వారసత్వము ఇంత సహజముగా లభిస్తున్నప్పుడు ఆ సదాకాలికముగా లభించేదానిని వదిలి
కొద్దిగా లేక అప్పుడప్పుడూ ఎందుకు తీసుకోవాలి? దాత ఇస్తున్నప్పుడు తీసుకునేవారు
తక్కువగా ఎందుకు తీసుకోవాలి. కావున సదా సంతోషము యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి.
కావున మాయాజీతులుగా, ప్రకృతీజీతులుగా అయి విజయులుగా అయి విశ్వం ముందు విజయం
యొక్క ఢంకాను ఎంతో జోరుజోరుగా మ్రోగించండి...
ఈనాటి ఆత్మలు వినాశి సాధనాలలో చాలా మగమై నషాలో అన్నా
ఉంటున్నారు లేక దుఃఖము, అశాంతితో అలసిపోయి ఎటువంటి గాఢ నిదురలో
నిదురిస్తున్నాయంటే వారు చిన్న చిన్న శబ్దాలను వినలేరు. ఎవరైతే నషాలో పడిపోతారో
వారిని కుదపవలసి వస్తుంది. బాగా గాఢ నిదురలో ఉన్నవారిని కూడా కుదిపి లేపవలసి
ఉంటుంది. కావున హేంబర్గ్ వారు ఏమి చేస్తున్నారు? బాగుంది. మంచి శక్తిశాలీ గ్రూప్,
అందరికీ బాబాపై మరియు చదువుపై ప్రీతి బాగుంది. ఎవరికైతే చదువు పట్ల ప్రీతి
ఉంటుందో వారు సదా శక్తిశాలిగా ఉంటారు. బాబా అనగా మురళీధరునిపై ప్రీతఉండడం, అనగా
మురళీపై ప్రీతి ఉండడం. మురళీపై ప్రీతి లేకపోతే మురళీధరునిపై కూడా ప్రీతి ఉండదు.
నాకు బాబాపై ప్రేమ ఉంది కానీ చదువుకునేందుకు సమయం లేదు అని ఎవరు ఎంతగా అన్నా
బాబా దానిని అంగీకరించరు. ఎక్కడైతే లగనము ఉంటుందో అక్కడ ఎటువంటి విఘ్నమూ
నిలువజాలదు. అది స్వతహాగానే సమాప్తమైపోతుంది. చదువుపై ప్రీతి గలవారు, మురళీపై
ప్రీతి గలవారు విఘ్నాలను సహజముగానే దాటివేస్తారు. ఎగిరే కళ ద్వారా వారు స్వయం
ఉన్నతముగా అయిపోతారు, విఘ్నాలు కింద ఉండిపోతాయి. ఎగిరేకళలో ఉండేవారి కొరకు
పర్వతాలు కూడా రాయి సమానమే. చదువుపై ప్రీతిని ఉంచేవారి కొరకు ఎటువంటి సాకు ఉండదు.
ఆ ప్రీతి కష్టమైన దానిని కూడా సహజం చేసేస్తుంది. ఒకటేమో మురళీపై ప్రేమ, ఇంకొకటి
చదువుపై ప్రేమ మరియు పరివారము యొక్క ప్రేమ ఒక కోటలా అయిపోతుంది. కోటలో ఉండేవారు
సురక్షితముగా ఉంటారు. ఈ గ్రూపును ఈ రెండు విశేషతలు ముందుకు తీసుకువెళుతున్నాయి.
చదువు మరియు పరివారము యొక్క ప్రేమ కారణముగా పరస్పరం ప్రేమ యొక్క ప్రభావముతో
సమీపముగా చేసేసుకుంటారు. మీకు నిమిత్తమైన ఆత్మ (పుష్పాల్) కూడా
ప్రేమపూర్వకమైనవారు లభించారు. స్నేహము భాషను కూడా చూడదు, స్నేహము యొక్క భాష
అన్ని భాషలకన్నా శ్రేష్ఠమైనది. అందరూ వారిని స్మృతి చేస్తున్నారు. బాప్ దాదాకు
కూడా గుర్తుంది. మంచి ప్రత్యక్ష ప్రమాణమును చూస్తున్నారు, సేవ యొక్క వృద్ధి
జరుగుతోంది. ఎంతగా వృద్ధి చేస్తూ ఉంటారో అంతగా మహాన్ పుణ్య ఆత్మలుగా అయ్యే ఫలము
సర్వుల యొక్క ఆశీర్వాదముగా ప్రాప్తమవుతూ ఉంటుంది. పుణ్య ఆత్మలే పూజ్య ఆత్మలుగా
అవుతారు. ఇప్పుడు పుణ్య ఆత్మలుగా లేకపోతే భవిష్యత్తులో పూజ్య ఆత్మలుగా అవ్వజాలరు.
పూజ్య ఆత్మలుగా అవ్వడం కూడా ఎంతో అవసరం.