"అమృతవేళ శ్రేష్ఠ ప్రాపుల యొక్క వేళ"
ఈరోజు ఆత్మిక తోటమాలి తమ ఆత్మిక గులాబీ పుష్పాల
పూతోటను చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక గులాబీల తోట ఇప్పుడు ఈ సంగమయుగములోనే బాప్
దాదాల ద్వారానే తయారవుతుంది. బాప్ దాదా ప్రతి ఒక్క ఆత్మిక గులాబీ పుష్పము యొక్క
ఆత్మిక సుగంధమును మరియు ఆత్మికతతో వికసించిన పుష్పాల యొక్క శోభను చూస్తున్నారు.
అందరూ సుగంధమయమైనవారే. కానీ కొందరి సుగంధము సదాకాలికముగా ఉంటుంది. మరికొందరి
సుగంధము కొద్ది సమయం కొరకే ఉంటుంది. కొన్ని గులాబీలు సదా వికసించి ఉన్నాయి.
మరికొన్ని ఒకసారి వికసించి, మరొకసారి కొద్దిగా ఎండకు లేక వాతావరణ ప్రభావానికి
వాడిపోతాయి కూడా. కానీ, అందరూ ఆత్మిక తోటమాలి యొక్క పూలతోటలోని ఆత్మిక గులాబీలే.
కొన్ని ఆత్మిక గులాబీలలో ఙ్ఞానము యొక్క సుగంధము విశేషముగా ఉంది. మరి కొన్నింటిలో
ధారణ యొక్క సుగంధము ఉంది. మరికొందరిలో సేవ యొక్క సుగంధము విశేషముగా ఉంది. కొందర
సర్వ సుగంధాలతో సంపన్నముగా కూడా ఉన్నారు. కావున పూల తోటలో అన్నింటికన్నా ముందు
దృష్టి ఎవరి వైపుకు వెళుతుంది? ఎవరి సుగంధమైతే దూరము నుండే ఆకర్షిస్తుందో
వారివైపుకే అందరి దృష్టి మొట్టమొదట వెళుతుంది. కావున ఆత్మిక తోటమాలి సదా ఆత్మిక
గులాబీల పుష్పాలన్నింటినీ చూస్తూ ఉంటారు. కానీ నెంబర్ వారీగా ఉన్నారు. అందరిపైనా
ప్రేమ కూడా ఉంది. ఎందుకంటే, గులాబీ పుష్పాలు అందరిలోనూ తోటమాలిపై ఎంతో ప్రేమ
ఉంది. యజమానికి పుష్పాలపై ప్రేమ ఉంది. అలాగే పుష్పాలకు యజమానిపై ప్రేమ ఉంది.
అయినా కానీ ఏ పుష్పాలైతే సదా సుగంధముతో సంపన్నముగా ఉంటాయో మరియు సదా వికసించి
ఉంటాయో ఆ పుష్పాలనే షోకేస్ లో పెట్టడం జరుగుతుంది. కానీ వాడిపోయిన వాటిని
ఎప్పుడూ పెట్టరు. రోజూ అమృతవేళ బాప్ దాదాస్నేహము మరియు శక్తి యొక్క విశేష పాలన
ద్వారా ఆత్మిక గులాబీ పుష్పాలందరితో మిలనమును జరుపుతూ ఉంటారు.
అమృతవేళ విశేషముగా ప్రభుపాలన యొక్క వేళ, అమృతవేళ
విశేషముగా పరమాత్మ మిలనము యొక్క మేళ, అది ఆత్మిక సంభాషణ చేసే వేళ. అమృతవేళ భోలా
భండారి అయిన బాబా వరదానాల యొక్క ఖజానాతో సహజముగా వరదానమును ప్రాప్తింపజేసే వేళ.
మన మనస్సుకు నచ్చిన ఫలము ప్రాప్తమవుతుంది అన్న గాయనమేదైతే ఉందో అది అమృతవేళ సమయం
యొక్క గాయనమే. ఎటువంటి కష్టమూ లేకుండా తెరిచియుంచిన ఖజానాలను ప్రాపించుకునే వేళ
ఇది. ఇటువంటి శుభమయమైన సమయమును గూర్చి మీరు అనుభవముతో తెలుసుకున్నారు కదా! ఈ
శ్రేష్ఠ సుఖమును గూర్చి, శ్రేష్ఠ ప్రాప్తులను గూర్చి అనుభవజ్ఞులే తెలుసుకోగలరు.
కావున బాప్ దాదా ఆత్మిక గులాబీలందరినీ చూస్తూ హర్షిస్తున్నారు. బాప్ దాదా కూడా,
ఓహో నా ఆత్మిక గులాబీలు అని అంటారు. మీరు ఓహో, ఓహో అనే గీతాలను గానం చేస్తే బాప్
దాదా కూడా అదే గీతాలను గానం చేస్తారు. అర్ధమయ్యిందా?
మురళీలనైతే ఎన్నో విన్నారు. వింటూ, వింటూ సంపన్నముగా
అయిపోయారు. ఇప్పుడు ఇక మహాదానులుగా అయి వాటిని పంచే ప్లాన్‌ను తయారుచేస్తున్నారు.
ఈ ఉత్సాహము చాలా బాగుంది. ఈరోజు యు.కే, అనగా ఓకేగా ఉండే వారి టర్న్. డబుల్
విదేశీయుల ఒక్క పదమును విని బాప్ దాదా సదా హర్షిస్తూ ఉంటారు. అది ఏమిటి? థాంక్యూ.
అలా థాంక్యూ, థాంక్యూ అంటూ బాబాను కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే
అందరికన్నా ముందు బాబాకే హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటారు. కావున
ఎప్పుడైనా, ఎవరికైనా ధన్యవాదాలు తెలిపేటప్పుడు మొదట బాబాయే గుర్తుకు వస్తారు కదా!
బ్రాహ్మణ జీవితములో మొదటి ధన్యవాదాలు స్వతహాగానే బాబా పట్లే వెలువడతాయి. లేస్తూ,
కూర్చుంటూ అనేకసార్లు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు. ఇది కూడా బాబాను స్మృతి
చేసేందుకు ఒక విధి. యు.కే. వారు సర్వ భిన్న, భిన్న హద్దులోని శక్తులు గలవారిని
కలిసేందుకు నిమిత్తముగా అయ్యారు కదా! అనేక రకాల జ్ఞానము యొక్క శక్తులు ఉన్నాయి.
భిన్న, భిన్న శక్తులు గలవారు. భిన్న భిన్న వర్గాలవారు, భిన్న భిన్న ధర్మాలవారు,
భిన్న, భిన్న భాషలవారు అందరినీ కలిపి ఒకే బ్రాహ్మణ వర్గములోకి తీసుకురావడము.
బ్రాహ్మణ ధర్మములోకి, బ్రాహ్మణ భాషలోకి తీసుకురావడం - ఇలా అందరినీ ఒక్కటిగా
చేయడంలో యు.కే. వారందరూ బిజీగా ఉంటారు కదా! బ్రాహ్మణుల భాష కూడా వేరు. అసలు వీరు
ఏమి చెబుతున్నారు అన్నది కూడా కొత్తవారు అర్హం చేసుకోలేరు. కావున బ్రహ్మణుల భాష,
బ్రాహ్మణుల డిక్షనరీయే వేరు. సంఖ్య కూడా బాగుంది మరియు స్నేహముకూడా బాగుంది.
ప్రతి స్థానానికి దాని, దాని విశేషత అయితే ఉండనే ఉంది. కానీ ఈ రోజున యు.కే.
వారిని గూర్చి వినిపిస్తున్నారు. యజ్ఞస్నేహులు, యజ్ఞ సహయోగులు- ఈ విశేషత మంచిగా
కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ మొదట యజ్ఞము అనగా మధువనము యొక్క భాగమును తీయడంలో
మంచి నెంబర్లో ముందుకు వెళుతున్నారు. నేరుగా మధువనము యొక్క స్కృతి ఒక విశేష
కానుకగా అయిపోతుంది. ప్రతి కార్యములో, ప్రతి అడుగులో మధువనము అనగా బాబా యొక్క
స్మృతి ఉంటుంది లేక బాబా యొక్క చదువు ఉంటుంది, లేక బాబా బ్రహ్మా భోజనము ఉంటుంది,
బాబాతో మిలనము ఉంటుంది. మధువనము స్వతహాగానే బాబా యొక్క స్మృతిని కలిగిస్తుంది.
ఎక్కడ ఉంటున్నా మధువనము యొక్క స్మృతి కలగడం అనగా విశేష స్నేహము. లిఫ్ట్
అయిపోతుంది. ఎక్కడము అనే శ్రమనుండి విముక్తులైపోతారు. ఒక్క క్షణములో స్విచ్ ఆన్
చేయగానే అక్కడకు చేరుకుంటారు. బాప్ దాదాకు వజ్రాలు, ముత్యాలు ఏమీ అవసరం లేదు.
బాబాకు స్నేహముతో కూడిన చిన్న వస్తువు కూడా రత్నాలతో, వజ్రాలతో సమానము. కావుననే
సుధాముని పచ్చి మెతుకులు కూడా ఎంతో గాయనము చేయబడ్డాయి. దీని భావార్ధము-
స్నేహముతో కూడుకున్న చిన్న సూదిలో కూడా మధువనము గుర్తుకు వస్తుంది. కావున అది
కూడా చాలా అమూల్య రత్నమే, ఎందుకంటే ఇది స్నేహముతో కూడుకున్నది. ఇక్కడ విలువ
స్నేహానిదే కానీ వస్తువుది కాదు. ఎవరైనా ఎంత ఇచ్చినా కానీ స్నేహము లేకపోతే
వారిది జమ అవ్వదు మరియు స్నేహముతో కొద్దిగా జమ చేసుకున్నా వారిది కోటానురెట్లుగా
జమ అయిపోతుంది. కావున బాబాకు స్నేహమే పసందు. కావున యు.కే. వారి విశేషత యజ్ఞ
స్నేహులుగా, యజ్ఞ సహయోగులుగా ఆది నుండి ఉన్నారు. ఇదే సహజయోగము కదా! సహయోగము
సహజయోగము. సహయోగము యొక్క సంకల్పము కలుగడం ద్వారా కూడా బాబా యొక్క స్మృతే ఉంటుంది.
కావున సహయోగులు స్వతహాగానే సహజయోగులుగా అయిపోతారు. యోగము బాబాతో ఉంటుంది.
మధువనముతో అనగా బాప్ దాదాతో ఉండడమే. కావున సహయోగులుగా అయ్యేవారు కూడా
సహజయోగులుగా అయ్యే సబ్జెక్టులో మంచి నంబర్‌ను తీసుకుంటారు. హృదయపూర్వకమైన
సహయోగము బాబాకు ప్రియము, కావున ఇక్కడ దిల్వడా మందిరమునే స్మృతిచిహ్నముగా
తయారుచేసారు. కావున హృదయరాముడైన బాబాకు హృదయపూర్వకమైన స్నేహము, హృదయపూర్వకమైన
సహయోగమే ఎంతో ప్రియము. చిన్న హృదయము గలవారు చిన్న వ్యాపారమును చేసి
సంతోషపడిపోతారు మరియు విశాల హృదయము గలవారు అనంతమైన వ్యాపారమును చేస్తారు. విశాల
హృదయము పునాదిగా ఉంటే, విస్తారము కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిచోట్ల వృక్షపు
శాఖలు కూడా కాండములా అయిపోతాయి కదా! కావున యు.కే. యొక్క పునాది ద్వారా కాండము
వెలువడింది, శాఖలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ శాఖలు కూడా కాండముగా అయిపోయాయి. వాటి
నుండి కూడా శాఖలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్, ఆఫ్రికా
మొదలైనవి వెలువడ్డాయి కదా! అన్నీ కాండముగా అయిపోయాయి మరియు ప్రతి ఒక్క కాండము
యొక్క శాఖలు ఇప్పుడు మంచిగా వృద్ధినొందుతున్నాయి. ఎందుకంటే పునాది స్నేహము మరియు
సహయోగము యొక్క నీటి ద్వారా దృఢముగా ఉంది. కావుననే విస్తారముకూడా బాగుంది మరియు
ఫలాలుకూడా బాగున్నాయి. అచ్చా!