'' లక్ష్య ప్రమాణంగా సఫలతను పొందేందుకు
స్వార్థానికి బదులు సేవార్థము కార్యము చేయండి ''
ఈ రోజు త్రిమూర్తి మిలనాన్ని చూస్తున్నారు.
జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు మరియు జ్ఞాన నక్షత్రాల మిలనము జరుగుతోంది. ఈ
త్రిమూర్తి మిలనము ఈ బ్రాహ్మణ ప్రపంచములోని విశేషమైన మధువన మండలములో జరుగుతుంది.
ఆకాశ మండలములో చంద్రుడు మరియు నక్షత్రాల మిలనము జరుగుతుంది. ఈ బేహద్ మధువన
మండలములో సూర్యుడు మరియు చంద్రుడు ఇరువురి మిలనము జరుగుతుంది. ఈ ఇరువురి మిలనము
ద్వారా నక్షత్రాలకు జ్ఞానసూర్యుని ద్వారా శక్తులు విశేష వరదానంగా లభిస్తాయి.
చంద్రుని ద్వారా స్నేహము విశేష వరదానంగా లభిస్తుంది. దీని ద్వారా
లవ్లీగా(ప్రియంగా) మరియు లైట్ హౌస్ గా అయిపోతారు. ఈ రెండు శక్తులు సదా జతజతలో
ఉండాలి. తల్లి వరదానము మరియు తండ్రి వరదానము రెండూ సదా సఫలతా స్వరూపంగా చేస్తాయి.
అందరూ ఇటువంటి సఫలత గల శ్రేష్ఠ నక్షత్రాలు. సఫలతా నక్షత్రాలు అందరికీ సఫలతా
స్వరూపంగా అయ్యే సందేశాన్ని ఇచ్చేందుకు వెళ్తున్నారు. ఏ వర్గానికి చెందిన
ఆత్మలైనా, ఏ కార్యము చేస్తున్నా వారందరికీ, మేము మా కార్యంలో సఫలత పొందాలి అని
ముఖ్యమైన లక్ష్యముంటుంది. సఫలతను ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే మా ద్వారా
అందరికీ సుఖ-శాంతుల ప్రాప్తి లభించాలని భావిస్తారు. తమకు పేరు లభించాలని
స్వార్థముతో చేసినా అల్పకాలిక సాధనాలతో చేసినా, స్వయం పట్ల లేక సర్వుల పట్ల సుఖ
- శాంతుల లక్ష్యమే ఉంటుంది. అందరి లక్ష్యము బాగానే ఉంది కానీ తమ స్వార్థము
కారణంగా, లక్ష్య ప్రమాణంగా ధారణ చేయలేకపోతున్నారు. అందువలన లక్ష్యము మరియు
లక్షణాలలో తేడా వచ్చిన కారణంగా సఫలతను పొందలేరు. ఇటువంటి ఆత్మలకు తమ ముఖ్య
లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనాన్ని ఇదే వినిపించండి - ఒక్క
పదమును మార్చడం ద్వారా సఫలతకు మంత్రము లభిస్తుంది. అదేమంటే ''స్వార్థానికి బదులు
సర్వుల సేవార్థము.'' స్వార్థము లక్ష్యము నుండి దూరము చేసేస్తుంది. సేవార్థము
అన్న ఈ సంకల్పము లక్ష్యాన్ని పొందడంలో సహజమైన సఫలతను ప్రాప్తింపజేస్తుంది. ఏదైనా
లౌకిక లేక అలౌకిక కార్యార్థము నిమిత్తమైనప్పుడు తమ-తమ కార్యాలలో సంతుష్టతను లేక
సఫలతను సహజంగా పొందేస్తారు. ఒక్క పదములోని తేడా అనే ఈ మంత్రాన్ని అన్ని వర్గాల
వారికి వినిపించండి.
మొత్తం కలహ-క్లేశాలు, అలజడులు, విశ్వం నలువైపులా ఉన్న
అనేక రకాల గొడవలు, అన్నీ ఒక్క 'స్వార్థము' అన్న పదము కారణంగానే ఉన్నాయి. కావున
సేవా భావము సమాప్తమైపోయింది. ఏ వృత్తి వారైనా, ఎవరైనా తమ కార్యమును
ప్రారంభించేటప్పుడు ఏ సంకల్పము తీసుకుంటారు? 'నిస్వార్థ సేవ' అనే సంకల్పమును
చేస్తారు కానీ లక్ష్యము మరియు లక్షణాలు నడుస్తూ-నడుస్తూ మారిపోతాయి. ఏ వికారము
వచ్చినా అందుకు మూలకారణము స్వార్థమే. కనుక అందరికీ తమ లక్ష్యమును ప్రాప్తి
చేసుకునే తాళంచెవిని ఇచ్చి రండి. అక్కడ కూడా మనుష్యులు ముఖ్యమైన తాళంచెవినే
కానుకగా ఇస్తారు. కావున మీరు అందరికీ సఫలత పొందేందుకు తాళంచెవిని ఇచ్చేందుకు
వెళ్తున్నారు. మిగిలినవన్నీ ఇచ్చేస్తారు కానీ ఖజానా తాళంచెవి ఎవ్వరూ ఇవ్వరు. ఏ
తాళంచెవిని ఎవ్వరూ ఇవ్వరో దానిని మీరు ఇవ్వండి. సర్వ ఖజానాల తాళంచెవి వారి
వద్దనే ఉన్నప్పుడు సఫలత లభించే తీరుతుంది. మంచిది. ఈ రోజైతే కేవలం
కలుసుకునేందుకే వచ్చారు.
రాజ్యతిలకమైతే 21 జన్మలకు లభిస్తూనే ఉంటుంది, స్మృతి
తిలకము కూడా సంగమ యుగములో నామకరణం రోజున బాప్దాదా ద్వారా లభించింది. బ్రాహ్మణులు
స్మృతి తిలకధారులుగా ఉండనే ఉన్నారు, దేవతలు రాజ్యతిలకధారులు. మిగిలింది మధ్యలో
ఫరిస్తా రూపము. దాని తిలకము - సంపన్న స్వరూప తిలకము మరియు సమాన స్వరూప తిలకము.
బాప్దాదా ఏ తిలకము దిద్దుతారు? సంపన్న మరియు సమాన స్వరూప తిలకమును దిద్ది, అన్ని
విశేషతలనే మణులతో అలంకరించబడిన కిరీటమును ఇస్తారు. మీరు ఇటువంటి తిలకధారులు
మరియు కిరీటధారులైన ఫరిస్తా స్వరూపులు. మీరు సదా డబల్ లైట్ సింహాసనాధికారులైన
శ్రేష్ఠ ఆత్మలు. బాప్దాదా ఇదే అలౌకిక అలంకారాలతో ఉత్సవాన్ని జరుపుతున్నారు.
కిరీటధారులుగా అయిపోయారు కదా! కిరీటము, తిలకము మరియు సింహాసనము. ఇదే విశేషమైన
ఉత్సవము(సెరిమని). అందరూ ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా! మంచిది.
దేశ-విదేశాలలోని సఫలతా నక్షత్రాలకు బాప్దాదా సఫలతా
మాలను మెడలో వేస్తున్నారు. మీరు కల్ప-కల్పము సఫలతకు విశేష అధికారి ఆత్మలు.
కావున సఫలత ప్రతి కల్పము మీ జన్మ సిద్ధ అధికారము. ఇదే నిశ్చయంతో, నషాతో సదా
ఎగురుతూ ఉండండి. పిల్లలందరూ ప్రేమ మరియు స్మృతుల మాలను ప్రతిరోజు చాలా స్నేహముతో
విధి పూర్వకంగా తండ్రి వద్దకు చేరుస్తారు. దీనినే భక్తులందరు కాపీ చేస్తూ రోజూ
మాలను తప్పకుండా ధరింపజేస్తారు. సత్యమైన లగ్నములో(పేమలో) మగ్నమై ఉండే
పిల్లలెవరైతే ఉన్నారో వారు అమృతవేళ చాలా ఫస్ట్ క్లాస్ స్నేహపూరితమైన శ్రేష్ఠ
సంకల్పాల మాలలను, ఆత్మిక గులాబీల మాలలను బాప్దాదాకు ప్రతిరోజు తప్పకుండా
ధరింపజేస్తారు. కావున పిల్లలందరి మాలలతో బాప్దాదా అలంకరింపబడ్తారు. ఎలాగైతే
భక్తులు కూడా మొదటి కార్యంగా తమ ఇష్టులను మాలతో అలంకరిస్తారో, పుష్పాలను
అర్పిస్తారో, అలా జ్ఞానయుక్త ఆత్మలు, స్నేహీ పిల్లలు కూడా బాప్దాదాకు తమ
ఉల్లాస-ఉత్సాహాలనే పుష్పాలను అర్పిస్తారు. ఇటువంటి స్నేహీ పిల్లలకు స్నేహానికి
బదులుగా బాప్దాదా పదమా రెట్లు స్నేహము, వరదానాలు, శక్తుల మాలలను వేస్తున్నారు.
అందరూ సంతోషంగా చేసే నాట్యమును కూడా బాప్దాదా చూస్తున్నారు. డబల్ లైటుగా అయ్యి
ఎగురుతున్నారు అంతేకాక ఎగిరించే ప్లాను తయారు చేస్తున్నారు. పిల్లలందరూ విశేషంగా
మొదటి నంబరులో తమ పేరు ఉన్నట్లుగా భావించి మొదటి నంబరులో నాకు బాబా నుండి
స్మృతులు లభించాయని స్వీకరించండి. పేర్లు అయితే అనేకం ఉన్నాయి. కానీ అందరూ
నెంబరువారి స్మృతులకు పాత్రులుగా ఉన్నారు. మంచిది.
మధువనం వారందరూ శక్తిశాలి ఆత్మలే కదా! అలసట లేని(అథక్)
సేవా పాత్రను కూడా అభినయించారు, అలాగే స్వ అధ్యయనము చేసే పాత్రను కూడా
అభినయించారు. సేవలో శక్తిశాలిగా అయ్యి అనేక జన్మల భవిష్యత్తును, వర్తమానాన్ని
కూడా జమ చేసుకున్నారు. కేవలం భవిష్యత్తుకే కాదు, వర్తమానంలో కూడా మధువనవాసుల
పేరు ప్రసిద్ధంగా ఉంది. కనుక వర్తమానాన్నీ తయారు చేసుకున్నారు, భవిష్యత్తును
కూడా తయారు చేసుకున్నారు. అందరూ శారీరిక విశ్రాంతిని తీసుకున్నారు. ఇప్పుడు
మళ్లీ సీజను కొరకు తయరైపోయారు. సీజనులో అనారోగ్యంగా అవ్వరాదు. కావున ఆ
లెక్కాచారాన్ని కూడా పూర్తి చేశారు. మంచిది.
ఎవరైతే వచ్చారో వారందరికి లాటరీ అయితే లభించనే
లభించింది. ఇక్కడకు రావడం అనగా పదమాల రెట్లు జమ అవ్వడం. మధువనంలో ఆత్మ శరీరము
రెండిటికి రిఫ్రెష్మెంట్(విశ్రాంతి) జరుగుతుంది. మంచిది.
జగదీష్ భాయితో :- సేవలో
శక్తులతో కలిసి పాత్రను అభినయించేందుకు నిమిత్తంగా అవ్వడం కూడా విశేష పాత్రయే.
సేవ ద్వారా జన్మ జరిగింది. సేవ ద్వారా పాలన జరిగింది. సదా సేవలో ముందుకు వెళ్తూ
ఉండండి. సేవ ఆదిలో మొదట పాండవులు డ్రామానుసారం నిమిత్తంగా అయ్యారు. కావున ఇది
కూడా విశేష సహయోగానికి ప్రతిఫలమే. సహయోగము సదా ప్రాప్తించి ఉంది ఇకమీదట కూడా
ఉంటుంది. ప్రతి విశేష ఆత్మకు విశేషత ఉంది. అదే విశేషతను సదా కార్యములో
ఉపయోగిస్తూ విశేషత ద్వారా విశేష ఆత్మగా ఉన్నారు. సేవ అనే భండారములోకి
వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లడం అనగా సేవ భండారములోకి వెళ్ళడం. శక్తులతో పాటు
పాండవులకు కూడా విశేషమైన పాత్ర ఉంది. సదా అవకాశము లభిస్తూనే ఉంది, ఇకమీదట కూడా
లభిస్తూనే ఉంటుంది. ఇదే విధంగా అందరిలో విశేషతలు నింపండి. మంచిది.
మోహిని బెహన్ తో:- సదా
తోడుగా ఉండే విశేషమైన పాత్ర ఉంది. హృదయము ద్వారా కూడా సదా తోడు అంతేకాక సాకార
రూపములో కూడా శ్రేష్ఠమైన తోడును పొందే వరదానీ ఆత్మవు. అందరికీ ఇదే వరదానము
ద్వారా తోడును అనుభవం చేయించండి. మీకు లభించిన వరదానము ద్వారా ఇతరులను కూడా
వరదానులుగా చేయండి. శ్రమకు బదులుగా ప్రేమ ఎలా ఉంటుందో, శ్రమ నుండి విడుదలై
ప్రేమలో ఉండడం - ఇది అందరికీ విశేషమైన అనుభవమవ్వాలి. అందుకే మీరు వెళ్తున్నారు.
విదేశీ ఆత్మలు శ్రమ చేయాలని కోరుకోరు, అలసిపోయారు. ఇటువంటి ఆత్మలకు సదా తోడును
అనగా ప్రేమలో నిమగ్నమై ఉండే సహజమైన అనుభవాన్ని చేయించండి. సేవ చేసేందుకు అవకాశము
లభించడం కూడా గోల్డెన్ లాటరి. సదా లాటరీని తీసుకునే సహజ పురుషార్థివి. శ్రమ
లేకుండా ప్రేమ అనుభవం ఎలా ఉంటుందో దీని విశేషతను అందరికి వినిపించి స్వరూపంగా
తయారు చేయండి. ఏ దృఢ సంకల్పమునైతే చేశారో దానిని చాలా బాగా చేశారు. సదా అమృతవేళ
ఈ దృఢ సంకల్పాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. మంచిది.
పార్టీలతో కలయిక :- తమ
విశేష పాత్రను చూసి సదా హర్షితంగా ఉంటున్నారా? ఉన్నతోన్నతులైౖన తండ్రితో కలిసి
పాత్రను అభినయించే విశేష పాత్రధారులు. విశేష పాత్రధారుల ప్రతి కర్మ స్వతహాగానే
విశేషంగా ఉంటుంది. ఎందుకంటే 'నేను విశేష పాత్రధారిని' అన్న స్మృతిలో ఉన్నారు.
ఎటువంటి స్మృతియో అటువంటి స్థితి స్వతహాగా తయారవుతుంది. ప్రతి కర్మ, ప్రతి మాట
విశేషమైనది, సాధారణత సమాప్తమయ్యింది. విశేష పాత్రధారి అందరినీ స్వతహాగా
ఆకర్షిస్తారు. మా ఈ విశేష పాత్ర ద్వారా అనేక ఆత్మలు తమ విశేషతలను తెలుసుకుంటారు
అన్న స్మృతిలో సదా ఉండండి. విశేష ఆత్మలనెవరినైనా చూసినప్పుడు స్వయం కూడా
విశేషంగా అయ్యే ఉల్లాసం కలుగుతుంది. ఎక్కడ ఉన్నా, ఎంత మాయావి వాయుమండలంలో ఉన్నా,
విశేష ఆత్మ ప్రతి స్థానంలో విశేషంగా కనిపిస్తుంది. ఎలాగైతే వజ్రం మట్టిలో కూడా
మెరుస్తూ కనిపిస్తుందో, వజ్రం వజ్రంగానే ఉంటుందో, అలాగే వాతావరణము ఎలాగున్నా
విశేష ఆత్మ సదా తమ విశేషతలతో ఆకర్షిస్తుంది. మేము విశేష యుగములోని విశేష
ఆత్మలమని సదా గుర్తుంచుకోండి.
బొంబాయి వారి కొరకు ప్రియస్మృతులు :-
అన్నింటికంటే ముందు బొంబాయిలో సందేశాన్ని ఇవ్వాలి. బొంబాయి వారు చాలా బిజీగా
కూడా ఉంటారు. బిజీగా ఉండేవారికి చాలా సమయం ముందే సందేశాన్ని ఇవ్వాలి లేకపోతే
మేము బిజీగా ఉన్నాము, మీరు చెప్పనే లేదు అని ఫిర్యాదు చేస్తారు. కావున వారిని
కూడా ఇప్పటి నుండే మంచి రీతిగా మేల్కొల్పాలి. బొంబాయి వారికి తమ జన్మ యొక్క
విశేషతను సేవలో విశేషంగా వినియోగించమని చెప్పండి. దీని ద్వారా సఫలతను సహజంగా
అనుభవం చేస్తారు. ప్రతి ఒక్కరి జన్మకు విశేషత ఉంది, కేవలం అదే విశేషతను అన్ని
వేళలా కార్యములో ఉపయోగించండి. మీ విశేషతను స్టేజ్ పైకి తీసుకు రండి. కేవలం లోపల
ఉంచుకోకండి. స్టేజ్ పైకి తీసుకు రండి. మంచిది.
అవ్యక్త మురళి నుండి ఎన్నుకోబడిన ప్రశ్నలు మరియు
జవాబులు
ప్రశ్న :- ఏకాగ్రతా
శక్తి ఏ ఏ అనుభూతులను చేయిస్తుంది?
జవాబు :- 1) ఏకాగ్రతా
శక్తి ద్వారా యజమానత్వ శక్తి (మాలిక్ పన్ శక్తి) వస్తుంది. దీని ద్వారా సహజంగా
నిర్యిఘ్న స్థితి అనుభవమవుతుంది, యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. 2) స్వతహాగా
ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న అనుభూతి కలుగుతుంది. 3) ఏకరస ఫరిస్తా
స్వరూపము స్వతహాగా అనుభవమవుతుంది 4) అందరి పట్ల స్నేహము, కళ్యాణము గౌరవించే
వృత్తి స్వతహాగా ఉంటుంది.
ప్రశ్న :- బ్రహ్మబాబా
సమానంగా, సంపన్నతా సమయం సమీపంగా వచ్చే కొలది అటువంటి ఏ స్వమానం ఉంటుంది?
జవాబు :- ఫరిస్తా స్థితి
యొక్క స్వమానము. నడుస్తూ-తిరుగుతూ దేహ భాన రహితమైన ఫరిస్తా రూపము అనుభవమవుతుంది.
బ్రహ్మబాబా ఎలాగైతే కర్మ చేస్తూ, మాట్లాడుతూ, డైరెక్షన్ఇస్తూ, ఉల్లాస-ఉత్సాహాలను
పెంచుతున్నా దేహానికి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభవం చేశారో, అలాగే
మాట్లాడుతూ ఉన్నారని కూడా అనిపించేది కానీ ఇక్కడ లేనట్లుగా ఉండేవారు,
చూస్తున్నారు కాని దృష్టి అలౌకికంగా ఉందనిపించేది. దేహ భావానికి అతీతంగా ఇతరులకు
కూడా దేహ భావము రాని అతీతమైన రూపం కనిపించేది. దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా
స్వరూపము అని అంటారు.
ప్రశ్న :- ఫరిస్తా
రూపంతో ఫరిస్తాగా అయ్యి వతనంలోకి వెళ్ళాలంటే ఏ విషయం పై ధ్యాస ఉంచాలి?
జవాబు :- మానసిక
ఏకాగ్రత పైన. ఆర్డరుతో(ఆజ్ఞానుసారంగా) మనసును నడిపించండి. ఎలాగైతే నెంబర్ వన్
బ్రహ్మ ఆత్మ సాకార రూపంలో ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయించారో ఫరిస్తాగా
అయిపోయారో, అలా ఫరిస్తాతనపు అనుభూతిని స్వయం కూడా చేయండి, ఇతరులకు కూడా
చేయించండి. ఎందుకంటే ఫరిస్తా అవ్వకుండా దేవతగా అవ్వజాలరు.
ప్రశ్న :- మంచిగా
అనిపించని ఏ స్థితి వశీభూత స్థితి ?
జవాబు :- చాలామంది
పిల్లలు కోరుకోలేదు, ఆలోచించలేదు కానీ జరిగిపోయింది, చేయరాదు కానీ జరిగిపోయింది
అని అంటారు. ఇది మానసిక వశీభూత స్థితి. అటువంటి స్థితి మంచిగా అనిపించదు.
చేయాలంటే మనసు ద్వారా కర్మ జరగాలి. లేకుంటే చేయరాదు, మరి మనసు చేయమని చెబితే అది
అధికారత్వము కాదు.
ప్రశ్న :- ఏ విషయంలో
బ్రహ్మబాబాను అనుసరించాలి?
జవాబు :- ఎలాగైతే
బ్రహ్మబాబా ద్వారా, ఎదురుగా ఫరిస్తా నిలబడి ఉన్నారు, ఫరిస్తా బాబా
దృష్టినిస్తున్నారని అనుభవం చేశారో అలా బ్రహ్మబాబాను అనుసరించండి. మానసిక
ఏకాగ్రతా శక్తి సహజంగా అటువంటి ఫరిస్తాగా తయారు చేస్తుంది.