''బ్యాలెన్స్ ఉంచుకుంటేనే
బ్లెస్సింగ్స్(ఆశీర్వాదాల) ప్రాప్తి''
ఈ రోజు ప్రేమ స్వరూపము, స్మృతి స్వరూప పిల్లలకు వారి
ప్రేమ మరియు స్మృతికి బదులు ఇచ్చేందుకు ప్రేమ సాగరుడైన తండ్రి ఈ ప్రియమైన సభలోకి
వచ్చారు. ఇది ఆత్మిక ప్రేమ యొక్క సభ, ఆత్మిక సంబంధంతో మిలనం చేసే సభ. ఈ సభ
మొత్తం కల్పంలో ఇప్పుడే అనుభవం చేస్తారు. కేవలం ఈ ఒక్క జన్మ తప్ప ఇంకెప్పుడూ
ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక ప్రేమ లభించజాలదు. ఈ ఆత్మిక ప్రేమ ఆత్మలకు సత్యమైన
విశ్రాంతిని ఇస్తుంది, సత్యమైన మార్గము చూపుతుంది, సత్యమైన సర్వ ప్రాప్తులను
చేయిస్తుంది. ఈ సాకార సృష్టిలో ఈ జన్మలో ఇలాంటి సహజమైన విధి ద్వారా
ఆత్మ-పరమాత్మల ఆత్మిక మిలనము సన్ముఖములో జరుగుతుందని ఎప్పుడైనా సంకల్పంలో కూడా
వచ్చిందా? తండ్రి ఎలాగైతే ఉన్నతోన్నతమైన తేజోమయులు, గొప్ప కంటే గొప్పవారో అలాగే
వారిని కలుసుకునే విధానం కూడా కష్టంగా మరియు గొప్ప అభ్యాసంతోనే ఉంటుందని
అనుకుంటూ అనుకుంటూ నిరాశావాదులుగా అయ్యారు. కానీ తండ్రి నిరాశ చెందిన పిల్లలను
ఆశావాదులుగా చేశారు. బలహీన పిల్లలను శక్తిశాలిగా చేశారు. ఎప్పుడు కలుస్తారు అని
అనుకునేవారికి ఇప్పుడు మిలనం ద్వారా అనుభవం చేయించారు. మొత్తం ఆస్తికి
అధికారులుగా చేశారు. ఇప్పుడు అధికారి ఆత్మలు తమ అధికారాన్ని తెలుసుకున్నారు కదా!
బాగా తెలుసుకున్నారా లేక ఇంకా తెలుసుకోవాలా?
ఈ రోజు బాప్దాదా పిల్లలను చూసి ఆత్మిక సంభాషణ
చేస్తున్నారు. పిల్లలందరికి సదా నిశ్చయం కూడా ఉంది, ప్రేమ కూడా ఉంది, స్మృతి
చేయాలనే లగనము(పట్టుదల) కూడా ఉంది, సేవ చేయాలనే ఉత్సాహము కూడా ఉంది, లక్ష్యం
కూడా శ్రేష్ఠంగా ఉంది. ఎలా తయారవ్వాలి అని ఎవరిని అడిగినా అందరూ
లక్ష్మీనారాయణులుగా అయ్యేవారము అని చెప్తారు. రాముడు-సీత అని ఎవ్వరూ చెప్పరు.
16 వేల మాలను కూడా హృదయపూర్వకంగా ఇష్టపడరు. 108 మాలలోని పూసలుగా అవుతామని అంటారు.
ఇదే ఉత్సాహం అందరికీ ఉంటుంది. సేవలో చదువులో ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఎవ్వరితోనూ
తక్కువ యోగ్యులుగా భావించరు. అయినా సదా ఏకరస స్థితి, సదా ఎగిరేకళలో ఉండు అనుభూతి,
సదా ఒక్కరిలో ఇమిడిపోయి దేహము మరియు దేహ సంబంధమైన అల్పకాలిక ప్రాప్తులతో సదా
అతీతంగా, వినాశీ వస్తువులను పూర్తిగా మర్చిపోయి ఉన్న స్థితిని సదా అనుభవం
చెయ్యడంలో నెంబర్ వారీగా అవుతారు. ఇలా ఎందుకు? బాప్దాదా ఇందుకు విశేష కారణం
చూస్తున్నారు. ఏ కారణం చూశారు? ఒక్కటే శబ్ధం కారణంగా ఉంది.
అన్నీ తెలుసు అంతేకాక అందరికీ అన్నీ ప్రాప్తించాయి
కూడా. విధిని గురించిన జ్ఞానం కూడా ఉంది. సిద్ధిని(సఫలతను) గురించిన జ్ఞానం కూడా
ఉంది. కర్మ మరియు ఫలం రెండిటి జ్ఞానం కూడా ఉంది, కానీ సదా బ్యాలెన్స్ లో ఉండడం
రావడం లేదు. ఈ బ్యాలెన్స్ అనే ఈశ్వరీయ నియమం సమయానికి నిభాయించడం రావడం లేదు.
అందువలన ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో బాప్దాదా మరియు సర్వ శ్రేష్ఠ ఆత్మల నుండి
శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు ప్రాప్తించవు. కష్టపడాల్సి వస్తుంది. సహజంగా సఫలత అనుభవం
అవ్వదు. ఏ విషయంలో బ్యాలెన్స్ మర్చిపోతారు? ఒకటేమో స్మృతి మరియు సేవ. స్మృతిలో
ఉండి సేవ చెయ్యడం. ఇది స్మృతి మరియు సేవల బ్యాలెన్స్. కానీ సేవలో ఉంటూ సమయ
ప్రమాణంగా స్మృతి చెయ్యడం. సమయం లభించిందంటే స్మృతి చేస్తారు లేకుంటే సేవనే
స్మృతిగా భావిస్తారు. దీనిని అన్ బ్యాలెన్స్ అని అంటారు. కేవలం సేవయే స్మృతి
మరియు స్మృతిలోనే సేవ ఉందని భావిస్తారు. విధిలో ఈ కొంచెం తేడా సిద్ధిని
మార్చేస్తుంది. తర్వాత స్మృతి శాతం ఎలా ఉంది అని ఫలితాన్ని అడిగితే ఏమంటారు?
సేవలో ఎంత బిజీగా అయ్యామంటే ఏ విషయమూ జ్ఞాపకం లేదు, సమయమే లేదు లేక సేవ కూడా
తండ్రిదే చేశాము కదా, తండ్రి అయితే జ్ఞాపకంగానే ఉన్నారు అని అంటారు. కానీ సేవలో
ఎంత సమయము మరియు లగనము ఉందో అంత శక్తిశాలి స్మృతి అనుభూతి అయ్యిందా? సేవలో ఎంత
స్వమానం ఉందో అంత నిరహంకార భావముందా? ఈ బ్యాలెన్స్ ఉందా? చాలా గొప్పగా, చాలా
మంచి సేవ చేశాము, ఈ స్వమానం అయితే మంచిగా ఉంది. కానీ ఎంత స్వమానమో అంత నిర్మాన
భావంలో ఉన్నారా? చేయించే తండ్రి నిమిత్తంగా అయ్యి సేవ చేయించారు. ఇది నిమిత్త
భావము, నిర్మాన భావము. నిమిత్తంగా అయ్యాము, సేవ బాగా జరిగింది, వృద్ధి జరిగింది,
సఫలతా స్వరూపంగా అయ్యాము - ఈ స్వమానం అయితే బాగుంది. కానీ కేవలం స్వమానం కాదు,
నిర్మాన భావంతో బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఈ బ్యాలెన్స్ సదా సహజంగా సఫలతా
స్వరూపంగా చేస్తుంది. స్వమానం కూడా తప్పనిసరి. దేహ భ్రాంతి ఉండరాదు. స్వమానములో
ఉండాలి. కానీ స్వమానము మరియు నిర్మానము రెండిటి బ్యాలెన్స్ లేని కారణంగా
స్వమానము దేహాభిమానంలోకి మారిపోతుంది. సేవ జరిగింది, సఫలత జరిగింది. ఈ సంతోషం
అయితే ఉండాలి. ఓహో! బాబా, మీరు నన్ను నిమిత్తంగా చేశారు, నేను చెయ్యలేదు. ఈ '(మైపన్)
నాది' స్వమానాన్ని దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. స్మృతి మరియు సేవల
బ్యాలెన్స్ఉంచుకునేవారు స్వమానం మరియు నిర్మానాల బ్యాలెన్స్ కూడా ఉంచుకుంటారు.
కనుక ఏ విషయంలో బ్యాలెన్స్ కిందికి పైకి అవుతుందో అర్థమయిందా!
అలాగే బాధ్యతా కిరీటధారిగా ఉన్న కారణంగా ప్రతి
కార్యంలో బాధ్యతను కూడా పూర్తిగా నిభాయించాలి. లౌకికం నుండి అలౌకిక
వ్యవహారం(ప్రవృత్తి) కావచ్చు, ఈశ్వరీయ సేవ సంబంధమైన వ్యవహారం(ప్రవృత్తి) కావచ్చు,
రెండు ప్రవృత్తులలోని తమ తమ బాధ్యతలను నిభాయించడంలో ఎంత అతీతంగా ఉంటారో అంత
ప్రియంగా ఉండండి. ఈ బ్యాలెన్స్ఉండాలి. ప్రతి బాధ్యతను నిభాయించడం కూడా అవసరము.
కానీ ఎంత పెద్ద బాధ్యత ఉంటుందో అంత డబల్ లైటుగా ఉండాలి. బాధ్యతను నిభాయిస్తున్నా
బాధ్యతా బరువుకు అతీతంగా ఉండాలి. వీరినే తండ్రికి ప్రియమైనవారని అంటారు. ఏం
చెయ్యాలి అని భయపడకండి. చాలా బాధ్యత ఉంది, ఇది చెయ్యాలా లేక వద్దా, ఏం చెయ్యాలి?
ఇది కూడా చెయ్యాలి, అది కూడా చెయ్యాలి చాలా కష్టము! - ఇలా అనుకోవడం(భావించడం)
అనగా భారము. కావున డబల్ లైటుగా అయితే అవ్వలేదు కదా! డబల్ లైట్ అనగా అతీతంగా ఉండి
బాధ్యతతో చేసే ఏ కర్మ కూడా అలజడిగా, భారంగా అవ్వరాదు. అటువంటి వారినే అతీతత్వం
మరియు ప్రియత్వంల బ్యాలెన్స్ ఉంచుకునేవారని అంటారు.
రెండవ విషయం :-పురుషార్థంలో నడుస్తూ నడుస్తూ
పురుషార్థం ద్వారా ఏ ప్రాప్తి జరుగుతుందో దానిని అనుభవం చేస్తూ చేస్తూ చాలా
ప్రాప్తి ద్వారా నషా మరియు సంతోషంలోకి వచ్చేస్తారు. మేము పొందాము, అనుభవం
చేసుకున్నాము చాలు. మహావీరులుగా, మహారథులుగా అయ్యాము. జ్ఞానులుగా అయ్యాము,
యోగులుగా కూడా అయ్యాము, సేవాధారులుగా కూడా అయ్యామని భావిస్తారు. ఈ ప్రాప్తి చాలా
మంచిది. కానీ ఈ ప్రాప్తి నశాలో సోమరితనం, నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది. అందుకు
కారణం జ్ఞానిగా అయ్యారు, యోగిగా కూడా అయ్యారు, సేవాధారిగా కూడా అయ్యారు. కానీ
ప్రతి అడుగులో ఎగిరేకళను అనుభవం చేస్తున్నారా? ఎంతవరకు జీవించాలో అంతవరకు ప్రతి
అడుగులో ఎగిరేకళలో ఎగరాలి. ఈ లక్ష్యంతో ఈ రోజు చేసేదానిలో ఇంకా ఏదైనా నవీనత
వచ్చిందా లేక ఎక్కడి వరకు చేరుకున్నారో దానినే సంపూర్ణత యొక్క హద్దుగా భావించారా?
పురుషార్థంలో ప్రాప్తి యొక్క నషా మరియు సంతోషం కూడా అవసరమే కానీ ప్రతి అడుగులో
ఉన్నతి లేక ఎగిరేకళ అనుభవం కూడా అవసరము. ఒకవేళ ఈ బ్యాలెన్స్ లేకుంటే సోమరితనం
వచ్చి అది ఆశీర్వాదాలను ప్రాప్తి చేయించలేదు. అందువలన పురుషార్థ జీవితంలో ఎంత
పొందారో దాని నషా కూడా ఉండాలి, అంతేకాక ప్రతి అడుగులో ఉన్నతి అవుతున్నామని
అనుభవం కూడా అవ్వాలి. దీనినే బ్యాలెన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ సదా ఉండాలి.
మేము అన్నీ తెలుసుకున్నాము అని భావించరాదు. అనుభవీలుగా అయ్యారు, చాలా బాగా
నడుస్తున్నారు, మంచిగా అయ్యారు. ఇది చాలా మంచిదే కానీ ఇంకా ఎక్కువ ఉన్నతిని
పొందాలి. ఇలాంటి విశేష కర్మ చేసి సర్వాత్మల ముందు నిమిత్తంగా ఉదాహరణ మూర్తిగా
అవ్వాలి. ఇది మర్చిపోవద్దు. ఏ ఏ విషయంలో బ్యాలెన్స్ఉంచుకోవాలో అర్థమయ్యిందా? ఈ
బ్యాలెన్స్ ద్వారా స్వత:గానే ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. నెంబర్లు ఎందుకు
తయారవుతాయో అర్థమయ్యిందా? కొంతమంది ఒక విషయంలో, కొంతమంది ఇంకొక విషయంలో
బ్యాలెన్స్ ఉంచుకోవడంలో సోమరులుగా అవుతారు.
బొంబాయి నివాసులు సోమరులుగా లేరు కదా? ప్రతి విషయంలో
బ్యాలెన్స్ ఉంచుకునేవారిగా ఉన్నారు కదా! బ్యాలెన్స్ఉంచుకునే కళలో తెలివిగలవారిగా
ఉన్నారు కదా! బ్యాలెన్స్ కూడా ఒక కళ. ఈ కళలో సంపన్నంగా ఉన్నారు కదా! బొంబాయిని
సంపన్న సంపద గల దేశమని అంటారు. కావున బ్యాలెన్స్ సంపదలో, ఆశీర్వాదాల సంపదలో కూడా
సంపన్నంగా ఉన్నారు కదా! నర్దేశావర్(అధిక జనాభా) గలదనే ఆశీర్వాదం ఉంది.
బొంబాయివారు ఏ విశేషత చూపిస్తారు? బొంబాయిలో కోటానుకోట్ల సంపద గలవారు చాలామంది
ఉన్నారు కదా! కావున బొంబాయివారు ఇలాంటి ఆత్మలకు ఆత్మిక అవినాశి పదమాపదమాల పతి,
సర్వ ఖజానాల గనులకు యజమాని ఎలా ఉంటారో అనుభవం చేయించడం అవసరం. కావున ఇది వారికి
అనుభవం చేయించండి. వారు కేవలం వినాశీ ధనానికి యజమానులు. అలాంటివారికి ఈ అవినాశి
ఖజానాల మహత్వం వినిపించి అవినాశి సంపదకు సంపన్నులుగా చేయండి. వారు ఈ ఖజానా
అవినాశి శ్రేష్ఠ ఖజానా అని అనుభవం చెయ్యాలి. ఇలాంటి సేవ చేస్తున్నారు కదా! సంపద
గలవారి దృష్టిలో ఈ అవినాశి సంపద గల ఆత్మలు శ్రేష్ఠంగా ఉన్నారని అనుభవమవ్వాలి.
అర్థమయిందా? వీరి పాత్ర లేనే లేదు అని భావించకండి. చివర్లో వీరు కూడా మేల్కొనే
పాత్ర ఉంది. సంబంధంలోకి రారు కానీ సంపర్కంలోకి వస్తారు. అందువలన ఇప్పుడు ఇలాంటి
ఆత్మలను మేల్కొలిపే సమయం వచ్చేసింది. కావున వారిని మేల్కొల్పండి. బాగా మంచిగా
మేల్కొల్పండి. ఎందుకంటే సంపద ఉందని నషా నిద్రలో నిదురించి ఉన్నారు. నషా గలవారిని
మాటిమాటికి మేల్కొల్పవలసి ఉంటుంది. ఒక్కసారికే మేల్కోరు. కావున ఇప్పుడు ఇలాంటి
నషాలో నిద్రపోయే ఆత్మలకు అవినాశీ సంపద కలిగించిన అనుభవాలతో పరిచయం చేయించండి.
అర్థమయిందా? బొంబాయివారు మాయాజీతులుగా ఉన్నారు కదా! మాయను సముద్రంలో పడేశారు కదా!
సముద్ర గర్భంలో వేశారా లేక పై పైన వేశారా? పైన ఏ వస్తువు ఉన్నా మళ్లీ అలలతో
ఒడ్డుకు వచ్చేస్తుంది. లోపల గర్భంలో వేస్తే స్వాహా అవుతుంది. కావున మాయ మళ్లీ
తీరానికి రావడం లేదు కదా? బొంబాయి నివాసులు ప్రతి విషయంలో ఉదాహరణ మూర్తులుగా
అవ్వాలి. ప్రతి విశేషతలో ఉదాహరణ మూర్తిగా అవ్వాలి. బొంబాయి అందాలను చూచేందుకు
దూర దూరం నుండి అందరూ వస్తారు కదా! ఇలా దూర దూరం నుండి చూచేందుకు వస్తారు. ప్రతి
గుణం యొక్క ప్రత్యక్ష స్వరూపానికి ఉదాహరణగా అవ్వండి. సరళత జీవితంలో చూడాలనుకుంటే
ఈ సెంటర్కు వెళ్లి ఈ పరివారాన్ని చూడండి. సహనశీలత చూడాలనుకుంటే ఈ సెంటర్లో ఈ
పరివారంలోకి వెళ్లి చూడండి. బ్యాలన్స్ చూడాలనుకుంటే ఈ విశేష ఆత్మలను చూడండి అని
అనాలి. ఇలాంటి అద్భుతం చేసేవారిగా ఉన్నారు కదా! బొంబాయివారు డబల్ రిటర్న్ఇవ్వాలి.
ఒకటి జగదాంబ(అమ్మ) పాలనకు, రెండవది బ్రహ్మబాబా విశేష పాలనకు. జగదాంబ పాలన కూడా
బొంబాయి వారికి విశేషంగా లభించింది. కావున బొంబాయి వారు అందుకు రిటర్న్ఇవ్వవలసి
వస్తుంది కదా! ప్రతి స్థానం, ప్రతి విశేష ఆత్మ ద్వారా తండ్రి విశేషత, తల్లి
విశేషత, మరియు విశేష ఆత్మల విశేషత కనిపించాలి. దీనినే బదులు ఇవ్వడం అని అంటారు.
మంచిది. భలే విచ్చేశారు. తండ్రి ఇంటికి లేక తమ ఇంటికి భలే విచ్చేశారు.
తండ్రి అయితే సదా పిల్లలను చూసి సంతోషిస్తారు.
ఒక్కొక్క పుత్రుడు విశ్వానికి దీపము. కేవలం కులదీపము కాదు, విశ్వానికి దీపము.
ప్రతి ఒక్కరు విశ్వకళ్యాణార్థము నిమిత్తంగా అయినట్లయితే విశ్వానికి దీపాలుగా
అయ్యారు కదా. వాస్తవానికి మొత్తం విశ్వం అంతా బేహద్ కులమే. ఆ సంబంధంతో అనంతమైన
కులానికి దీపాలు అని కూడా చెప్పవచ్చు. కానీ హద్దు కులానికి చెందినవారు కాదు.
బేహద్ కులానికి దీపాలు అనండి లేక విశ్వ దీపాలు అని అనండి, అలా ఉన్నారు కదా! సదా
వెలుగుతున్న దీపాలుగా ఉన్నారు కదా! మిణుకు మిణుకుమని వెలిగేవారు కాదు. లైటు ఆగి
ఆగి వెలుగుతూ ఉంటే చూసి కళ్ళు పాడవుతాయి. మంచిగా అనిపించదు కదా! కావున సదా
వెలుగుతూ ఉన్న దీపాలుగా ఉన్నారు కదా! ఇలాంటి దీపాలను చూసి బాప్దాదా సదా
సంతోషిస్తారు. అర్థమయిందా. మంచిది.
సదా ప్రతి కర్మలో బ్యాలన్స్ ఉంచుకునేవారికి, సదా
తండ్రి ద్వారా ఆశీర్వాదాలు తీసుకునేవారికి, ప్రతి అడుగులో ఎగిరేకళను అనుభవం
చేసేవారికి, సదా ప్రేమ సాగరంలో ఇమిడిపోయి, సమాన స్థితిలో స్థితమై ఉండేవారికి,
పదమాపదమ భాగ్యశాలి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.
దాదీలతో :-అందరూ కిరీటధారీ రత్నాలుగా ఉన్నారు కదా! సదా
ఎంత పెద్ద కిరీటమో అంత తేలిక కంటే తేలికగా ఉండాలి. ఇలాంటి కిరీట ధారణ చేశారా? ఈ
కిరీటాన్ని ధరించి ఏ కర్మ చేస్తున్నా కిరీటధారులుగా ఉండగలరు. రత్నాలతో పొదిగిన
కిరీటమైతే దానిని సమయ ప్రమాణంగా ధరిస్తారు, తీసేస్తారు. కానీ ఈ కిరీటం
ఎలాంటిదంటే తీసేయాల్సిన అవసరమే లేదు. నిద్రపోతున్నా కిరీటధారి, నిద్ర లేచినా
కిరీటధారిగానే ఉంటారు. అనుభవం ఉంది కదా! కిరీటం తేలికగా ఉంది కదా? భారంగా లేదు
కదా! పేరు గొప్పగా బరువు-తేలికగా ఉంటుంది. సుఖదాయి కిరీటము. సంతోషాన్ని ఇచ్చే
కిరీటం. తండ్రి ఎలాంటి కిరీటధారులుగా చేస్తారంటే జన్మ-జన్మలు కిరీటాలు లభిస్తూనే
ఉంటాయి. ఇలాంటి కిరీటధారి పిల్లలను చూసి బాప్దాదా సంతోషిస్తారు. బాప్దాదా కిరీట
మహోత్సవ రోజును ఇప్పటి నుండే జరిపి సదా కాలంగా ఉండే ఆచారాన్ని నియమంగా చేశారు.
సత్యయుగంలో కూడా కిరీట ధారణ మహోత్సవం జరపబడ్తుంది. సంగమ యుగంలో కిరీటధారణ
మహోత్సవం జరిపారు. దీనికి స్మృతిచిహ్నమే అవినాశిగా నడుస్తూ ఉంటుంది. అవ్యక్త
వతనంలో సేవాధారిగా ఉన్నారు కానీ సాకార వతనంలో వానప్రస్థులుగా అయ్యారు కదా! స్వయం
తండ్రి సాకార వతనంలో వానప్రస్థులుగా అయ్యి పిల్లలకు సింహాసనం కిరీటం ఇచ్చి స్వయం
అవ్యక్త వతనంలోకి వెళ్లిపోయారు. కిరీటధారణ మహోత్సవ రోజుగా అయ్యింది కదా!
విచిత్రమైన డ్రామా కదా! వెళ్లేందుకు ముందు చెప్పినట్లయితే అద్భుతమైన డ్రామాగా
అవ్వదు. ఇది విచిత్రమైన డ్రామా, దీని చిత్రాన్ని గీయలేము. విచిత్రమైన తండ్రికి
విచిత్రమైన పాత్ర ఉంది. దీని చిత్రాన్ని బుద్ధిలో సంకల్పం ద్వారా కూడా గీయలేరు.
దీనినే విచిత్రము అని అంటారు. అందువలన విచిత్ర కిరీట ధారణ మహోత్సవం జరిగింది కదా!
బాప్దాదా మహావీర పిల్లలకు కిరీటధారణ మహోత్సవం చేయించుకునే కిరీటధారీ స్వరూపంలో
చూస్తున్నారు. బాప్దాదా తోడునివ్వడంలో దాగబడలేదు. కానీ సాకార ప్రపంచం నుండి దాగి
అవ్యక్త ప్రపంచంలో ఉదయించారు. 'తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము' ఈ ప్రతిజ్ఞ
అయితే ఉంది. ఈ ప్రతిజ్ఞ ఎప్పుడూ తొలగిపోదు. అందువలన బ్రహ్మబాబా ఎదురు
చూస్తున్నారు. లేకుంటే కర్మాతీతులుగా అయ్యారు కనుక వెళ్ళగలరు కదా! బంధనం అయితే
లేదు కదా! కానీ స్నేహ బంధనం ఉంది. స్నేహ బంధనం ఉన్న కారణంగా తోడుగా నడుస్తాము
అనే ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న కారణంగా తండ్రి వేచి ఉండాల్సిందే. తోడు
నిభాయించాలి, తోడుగా వెళ్లాలి. ఇలాంటి అనుభవమే ఉంది కదా! మంచిది. ప్రతి ఒక్కరూ
విశేషమైనవారు. ఒక్కొక్కరిది విశేషత వర్ణన చేసినట్లయితే ఎంత ఉంటుంది! మాల
తయారవుతుంది. అందువలన హృదయంలోనే ఉంచుకుంటారు. వర్ణన చెయ్యరు. మంచిది.