''సంగమయుగ సమయము శ్రేష్ఠమైన సమయము, శ్రేష్ఠ
భాగ్య చిత్రాన్ని తయారు చేసుకునే సమయము''
ఈ రోజు బాప్దాదా ప్రతి ఒక్క శ్రేష్ఠమైన బ్రాహ్మణ ఆత్మ
తన శ్రేష్ఠ జీవితాన్ని తీసుకున్న జన్మ వేళను, భాగ్యరేఖను చూస్తున్నారు.
పిల్లలందరి జన్మించిన వేళ శ్రేష్ఠంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి ఈ యుగమే
పురుషోత్తమమైనది, శ్రేష్ఠమైనది. శ్రేష్ఠ సంగమ యుగములో అనగా శ్రేష్ఠమైన వేళలో
శేష్ఠ బ్రాహ్మణులందరు జన్మించారు. అందరి జన్మించిన సమయము శ్రేష్ఠంగా ఉంది.
భాగ్యరేఖ మరియు భాగ్యము కూడా బ్రాహ్మణులందరిదీ శ్రేష్ఠంగా ఉంది. ఎందుకంటే
శ్రేష్ఠమైన తండ్రి అయిన శివుని శివవంశీ బ్రహ్మకుమారీ, కుమారులు కనుక శ్రేష్ఠమైన
తండ్రి, శ్రేష్ఠమైన జన్మ, శ్రేష్ఠమైన వారసత్వము, శ్రేష్ఠమైన పరివారము,
శ్రేష్ఠమైన ఖజానాలు........... ఈ భాగ్య రేఖ జన్మ నుండే అందరిదీ శ్రేష్ఠంగా ఉంది.
వేళ కూడా శ్రేష్ఠంగా ఉంది మరియు శ్రేష్ఠమైన ప్రాప్తుల కారణంగా భాగ్యరేఖ కూడా
శ్రేష్ఠంగా ఉంది. ఈ భాగ్యము పిల్లలందరికీ ఒక్క తండ్రి ద్వారా ఒకే విధంగా
ప్రాప్తించింది. ఇందులో తేడా లేదు. అయినా ఒకే విధమైన భాగ్యము ప్రాప్తించినా
నంబరువారీగా ఎందుకున్నారు? తండ్రి ఒక్కరే, జన్మ ఒక్కటే, వారసత్వమూ ఒక్కటే,
పరివారమూ ఒక్కటే, వేళ కూడా ఒక్కటే అనగా సంగమయుగము. అయినా నంబరు ఎందుకు? సర్వ
ప్రాప్తులు అనగా భాగ్యము అందరికీ బేహద్ భాగ్యం లభించింది. కానీ తేడా ఏమిటి?
బేహద్ బాగ్యాన్ని జీవితంలో కర్మల రూపీ చిత్రంలోకి తీసుకు రావడంలో యథాశక్తిగా
ఉన్న కారణంగా తేడా ఏర్పడ్తుంది. బ్రాహ్మణ జీవితము అనగా భాగ్యాన్ని చిత్రములోకి
తీసుకురావడం, జీవితంలోకి తీసుకురావడం, ప్రతి కర్మలోకి తీసుకురావడం, ప్రతి
సంకల్పం ద్వారా, మాట ద్వారా, కర్మల ద్వారా భాగ్యవంతులకు భాగ్యము అనుభవమవ్వాలి
అనగా కనిపించాలి. బ్రాహ్మణులు అనగా భాగ్యవంతులైన ఆత్మల నయనాలు, మస్తకం, మందహాసము,
ప్రతి అడుగు అందరికీ శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభూతిని చేయించాలి. దీనినే భాగ్య
చిత్రాన్ని తయారు చేసుకోవడమని అంటారు. భాగ్యమును అనుభవమనే కలము ద్వారా కర్మ రూపీ
కాగితపు చిత్రంలోకి తీసుకురావాలి. భాగ్య చిత్రము యొక్క చిత్రరేఖను తయారు చేయాలి.
చిత్రమునైతే అందరూ తయారు చేసుకుంటున్నారు. కాని కొందరి చిత్రం సంపన్నంగా ఉంది,
కొందరి చిత్రం ఎంతో కొంత ఏదో ఒక సమయంలో తక్కువగా ఉంటోంది. అనగా ప్రాక్టికల్
జీవితంలోకి తీసుకురావడంలో కొందరి మస్తకరేఖ అనగా మనస్సు, నయనరేఖ అనగా ఆత్మిక
దృష్టి, ముఖము పై మందహాసము అనగా సదా సర్వ ప్రాప్తి స్వరూపులుగా, సంతుష్ట
ఆత్మలుగా ఉండడం. సంతుష్టతయే మందహాస రేఖ. చేతుల రేఖ అనగా శ్రేష్ఠ కర్మల రేఖ.
పాదాల రేఖ అనగా ప్రతి అడుగులో శ్రీమతమును అనుసరించే శక్తి. ఈ విధంగా భాగ్య
చిత్రాన్ని తయారు చేయడంలో కొందరిది కొన్నిటిలో, కొందరిది కొన్నిటిలో తేడా
వచ్చేస్తోంది. ఎలాగైతే స్థూల చిత్రాన్ని తయారు చేసినప్పుడు కొందరికి
నయనాలు(కనులు) వేయడం రాదు, కొందరికి కాళ్లు వేయడం రాదు, కొందరు చిరునవ్వును
చూపించలేరు. కనుక తేడా ఏర్పడ్తుంది కదా! చిత్రము ఎంత సంపన్నంగా ఉంటుందో అంత
విలువైనదిగా ఉంటుంది. ఒకరి చిత్రం లక్షలు సంపాదిస్తుంది, మరికొందరిది 100
రూపాయలే సంపాదిస్తుంది. కావున ఏ విషయంలో తేడా వచ్చింది? సంపన్నతలో. అలాగే
బ్రాహ్మణ ఆత్మలు కూడా అన్ని రేఖలలో సంపన్నంగా లేని కారణంగా ఏదైనా ఒక రేఖ లేక
రెండు రేఖలలో సంపన్నంగా లేని కారణంగా నంబరువారీగా అయిపోతారు.
కావున ఈ రోజు భాగ్యవంతులైన పిల్లల చిత్రాలను
చూస్తున్నారు. ఎలాగైతే స్థూలమైన భాగ్యంలో కూడా భిన్న భిన్న భాగ్యాలు ఉంటాయో, అలా
ఇక్కడ భాగ్యము యొక్క భిన్న భిన్న చిత్రాలను చూశారు. ప్రతి చిత్రములో ముఖ్యంగా
మస్తకం మరియు నయనాలు చిత్రము విలువను పెంచుతాయి. అలాగే ఇక్కడ కూడా మనసా వృత్తి
యొక్క శక్తి మరియు నయనాల ఆత్మిక దృష్టి యొక్క శక్తికే మహత్యముంటుంది. ఇదే
చిత్రానికి పునాది. మా చిత్రం ఎంత సంపన్నంగా తయారయ్యింది అని అందరూ తమ తమ
చిత్రాలను చూసుకోండి. చిత్రములో తమ భాగ్యాన్ని తయారు చేసేవారు కనిపించే విధంగా
అటువంటి చిత్రం తయారయ్యిందా! ప్రతి ఒక్కరు రేఖను చెక్చేసుకోండి. ఈ కారణంగానే
నంబరు ఏర్పడ్తుంది. అర్థమయ్యిందా!
దాత ఒక్కరే, వారు ఇచ్చేది కూడా ఒకే విధంగానే ఉంటుంది.
కాని తయారయ్యేవారు, తయారవ్వడంలో నంబరువారీగా అయిపోతారు. కొందరు అష్టదేవులుగా
మరియు ఇష్టదేవతలుగా అవుతారు. కొందరు దేవతలుగా అవుతారు. కొందరు దేవతలను చూసి చూసి
హర్షితులుగా అయ్యేవారిగా అవుతారు. మీ చిత్రాన్ని చూసుకున్నారు కదా! మంచిది.
సాకార రూపములో మిలనము చేసేందుకు అయితే సమయాన్ని,
సంఖ్యను చూడవలసి ఉంటుంది. కాని అవ్యక్త మిలనములో సమయము మరియు సంఖ్య విషయమే ఉండదు.
అవ్యక్త మిలనము చేసే అనుభవీలుగా అయిపోయినట్లైతే అవ్యక్త మిలనములో విచిత్ర
అనుభవాన్ని చేస్తూ ఉంటారు. బాప్దాదా పిల్లలకు సదా ఆజ్ఞాకారులుగా ఉన్నారు. కావున
అవ్యక్తమై కూడా వ్యక్తంలోకి రావలసి వస్తోంది. కాని ఎలా అవ్వాలి? అవ్యక్తంగా
అవ్వాలా? లేక వ్యక్తంలోకి రావాలా? అవ్యక్తంగా అవ్వండి. అవ్యక్తంగా అవ్వడం వలన
తండ్రితో కలిసి నిరాకారంగా అయ్యి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు సూక్ష్మలోక స్థితి
వరకు కూడా చేరుకోలేదు. ఫరిస్తా స్వరూపము ద్వారా నిరాకారులుగా అయ్యి ఇంటికి
వెళ్లగలరు. కనుక ఇప్పుడు ఫరిస్తా స్వరూపులుగా అయ్యారా? భాగ్య చిత్రాన్ని
సంపన్నంగా చేసుకున్నారా? సంపన్నమైన చిత్రమే ఫరిస్తా. మంచిది.
భిన్న భిన్న జోన్ల నుండి వచ్చిన పిల్లలందరిని ప్రతి
జోన్ యొక్క విశేషతల సహితంగా బాప్దాదా చూస్తూ చూస్తూ హర్షితమవుతున్నారు. కొందరికి
భలే భాష తెలియదు కాని ప్రేమ మరియు భావనల భాషను తెలుసుకోవడంలో చురుకుగా ఉన్నారు.
వారికి ఇంకేమీ తెలియదు కాని మురళి భాష తెలుసు. ప్రేమ మరియు భావన ద్వారా అర్థం
కానివారు కూడా అర్థం చేసుకుంటారు. బెంగాల్, బీహార్ వారైతే సదా వసంత ఋతువులోనే
ఉంటారు. సదా వసంత ఋతువే కదా!
పంజాబ్ వారు అంటేనే సదా అందరినీ పచ్చదనంతో నిండుగా
చేసేవారు. పంజాబ్లో వ్యవసాయం బాగా జరుగుతుంది. హర్యానా అంటేనే పచ్చదనంతో నిండుగా
ఉండేది. పంజాబ్, హర్యానా సదా పచ్చదనంతో పచ్చగా ఉంటాయి ఎక్కడ పచ్చదనం ఉంటుందో ఆ
స్థానాన్ని సదా కుశలమైన శ్రేష్ఠ స్థానమని అంటారు. పంజాబ్, హర్యానా సదా సంతోషంతో,
పచ్చదనంతో నిండుగా ఉన్నాయి. అందువలన బాప్దాదా కూడా చూస్తూ చూస్తూ
హర్షితమవుతున్నారు. రాజస్థాన్ విశేషత ఏమిటి? రాజస్థాన్ చిత్రలేఖనంలో
ప్రసిద్ధమైనది. రాజస్థాన్ చిత్రాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఎందుకంటే చాలామంది
రాజులు ఉండేవారు కదా! కావున రాజస్థాన్ భాగ్య చిత్రాలు అన్నిటికంటే ఎక్కువగా
విలువైనవిగా తయారుచేసేవి. చిత్రాల రేఖలో సదా శ్రేష్ఠంగా ఉన్నారు. గుజరాత్
విశేషత ఏమిటి? అక్కడ అద్దాలతో అలంకరణ ఎక్కువగా జరుగుతుంది. కావున గుజరాత్ దర్పణం
వంటిది. దర్పణం అనండి, అద్దమనండి, అందులో తండ్రి మూర్తి కనిపించాలి. అద్దంలో
ముఖాన్ని చూసుకుంటారు కదా! కావున గుజరాత్ దర్పణం ద్వారా తండ్రి చిత్రమైన ఫరిస్తా
స్వరూప చిత్రాన్ని అందరికీ చూపించే విశేషత ఉంది. కావున గుజరాత్ విశేషత -
తండ్రిని ప్రత్యక్షం చేసే దర్పణం. ఇక చిన్నదైన తమిళనాడు మిగిలింది. చిన్నదే
అద్భుతం చేస్తుంది. పెద్ద కార్యాన్ని చేసి చూపిస్తుంది. తమిళనాడు వారు ఏం
చేస్తారు? అక్కడ మందిరాలు చాలా ఉన్నాయి. మందిరాలలో నాదమును మ్రోగిస్తారు.
తమిళనాడు విశేషత ఏదంటే ఢంకాను మ్రోగించి తండ్రి ప్రత్యక్షమయ్యారంటే శబ్ధాన్ని
మారుమ్రోగించడం. మంచి విశేషత ఉంది. చిన్నతనంలోనే నాదమును వాయిస్తారు. భక్తులు
కూడా చాలా ప్రేమగా నాదమును మ్రోగిస్తారు మరియు పిల్లలు కూడా ప్రేమతో
మ్రోగిస్తారు. ఇప్పుడు ప్రతి స్థానము తమ విశేషతను ప్రత్యక్ష స్వరూపంలోకి
తీసుకురండి. అన్ని జోన్ల వారిని కలుసుకున్నాము కదా! చివరికైతే ఇలా కలుసుకోవడమే
జరుగుతుంది. మమ్ములను ఎందుకు పిలవలేదని పాత పిల్లలు అడుగుతారు. ప్రజలను కూడా
తయారు చేసుకుంటారు. చదివిస్తూ కూడా ఉంటారు. కనుక పాతవారు కొత్త కొత్త వారికి
ఛాన్స్ఇవ్వవలసి ఉంటుంది కదా! అప్పుడే సంఖ్య పెరుగుతుంది. పాతవారు కూడా పాత
నడవడికతో నడుస్తూ ఉంటే కొత్తవారి సంగతి ఏమవుతుంది? పాతవారు దాతలు, ఇచ్చేవారు
మరియు కొత్తవారు తీసుకునేవారు. కనుక ఛాన్స్ఇవ్వాలి. ఇందులో దాతగా అవ్వవలసి
ఉంటుంది. సాకార మిలనంలో అన్ని హద్దులు వచ్చేస్తాయి. అవ్యక్త మిలనంలో ఏ హద్దులూ
ఉండవు. సంఖ్య పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? అని చాలామంది అంటారు. సాకార మిలన
విధి కూడా మారుతుంది. సంఖ్య పెరగగలదు. కొన్ని దానపుణ్యాలను కూడా చేయవలసి ఉంటుంది.
మంచిది.
దేశ విదేశాలలోని నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలందరి
స్నేహ హృదయము యొక్క శబ్ధము, సంతోష గీతములు మరియు హృదయపూర్వకంగా వ్రాసిన సమాచార
పత్రాలకు బదులుగా బాప్దాదా పిల్లలందరికీ పదమాల రెట్లు ప్రియస్మృతులతో పాటు సదా
స్మృతి ద్వారా అమరభవ వరదానులుగా అయ్యి ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు
తీసుకెళ్తూ ఉండండి అని బదులు ఇస్తున్నారు. ఉమంగ-ఉత్సాహాలతో ఉండే పిల్లలందరికీ
బాప్దాదా స్వ ఉన్నతి మరియు సేవా ఉన్నతి కొరకు అభినందనలు తెలుపుతున్నారు.
అభినందనలు. సదా తోడుగా ఉండండి, సదా సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఉండండి. అలాంటి
సర్వ వరదానీ పిల్లలకు బాప్దాదా మళ్లి ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రియస్మృతులు
మరియు నమస్తే.
పార్టీలతో- సదా స్వయాన్ని తండ్రి సమానంగా సంపన్న
ఆత్మగా భావిస్తున్నారా! ఎవరైతే సంపన్నంగా ఉంటారో, వారు సదా ముందుకు వెళ్తూ
ఉంటారు. సంపన్నంగా లేకపోతే ముందుకు వెళ్లలేరు. కావున బాబా ఎలా ఉన్నారో పిల్లలు
కూడా అలా ఉన్నారు. తండ్రి సాగరుడు, పిల్లలు మాస్టర్ సాగరులు. ప్రతి గుణాన్ని
చెక్ చేసుకోండి. ఉదాహరణానికి తండ్రి జ్ఞానసాగరుడైతే మనం మాస్టర్ జ్ఞానసాగరులము,
తండ్రి ప్రేమ సాగరుడైతే మనం మాస్టర్ ప్రేమసాగరులము. ఇలా సమానతను చెక్
చేసుకున్నప్పుడే తండ్రి సమానంగా సంపన్నంగా అయ్యి సదా ముందుకు వెళ్తూ ఉంటారు.
అర్థమయిందా! సదా ఇలా పరిశీలించుకుంటూ ఉండండి. సదా ఎవరినైతే విశ్వం వెతుకుతూ ఉందో,
వారే స్వయంగా మనలను తమవారిగా చేసుకున్నారనే సంతోషంలో సదా ఉండండి. మంచిది.
అవ్యక్త మహావాక్యాలు - విశ్వ కళ్యాణకారులుగా అవ్వండి
బాప్దాదా పిల్లలైన మిమ్ములను విశ్వ సేవ కోసం
నిమిత్తంగా చేశారు. విశ్వం ముందు తండ్రిని చూపించేవారు పిల్లలైన మీరే. పిల్లల
ద్వారానే తండ్రి కనిపిస్తారు. వెన్నెముకగా అయితే తండ్రి ఉండనే ఉన్నారు. ఒకవేళ
తండ్రి వెన్నెముకగా అవ్వకపోతే మీరు ఒంటరిగా అయ్యి అలసిపోతారు. కావున తండ్రిని
వెన్నెముకగా భావించి విశ్వకళ్యాణ సేవలో తనువు-మనసు-ధనము, మనసా-వాచా-కర్మణా
ద్వారా బిజీగా ఉన్నట్లయితే సహజంగా మాయాజీతులుగా అయిపోతారు.
వర్తమాన సమయం మొత్తం విశ్వంలోని అల్పకాలిక ప్రాప్తుల
రూపీ ఫలాలు, పుష్పాలు ఎండిపోయి ఉన్నాయి. అందరూ మనసు ద్వారా, నోటి ద్వారా
అరుస్తున్నారు. నిస్సహాయ స్థితిలో జీవితాన్ని, దేశాన్ని ఎలాగో నడిపిస్తున్నారు.
ఖుషీ ఖుషీగా(చాలా సంతోషంతో) నడవడం అంతమైపోయింది. కావున అటువంటి నిస్సహాయతతో
నడిచేవారికి ప్రాప్తులనే రెక్కలను ఇచ్చి ఎగిరింపజేయండి. కాని స్వయం ఎగిరేకళలో
ఉన్నప్పుడే ఇతరులను ఎగిరించగలరు. దీని కొరకు తండ్రి సమానంగా విశ్వకళ్యాణకారి అనే
అనంతమైన స్టేజిపై స్థితులై విశ్వంలోని సర్వ ఆత్మలకు సకాష్ ఇవ్వండి. విశ్వ భ్రమణం
చేయండి. ఎలాగైతే చిత్రంలో గ్లోబు పై శ్రీ కృష్ణుడు కూర్చుని ఉన్నట్లుగా
చూపిస్తారో అలా విశ్వమనే గ్లోబుపై కూర్చుని నలువైపులా దృష్టిని సారించినట్లైతే
స్వతహాగా విశ్వ భ్రమణం జరిగిపోతుంది. ఉదాహరణానికి చాలా ఉన్నతమైన స్థానానికి
వెళ్లినప్పుడు తిరగవలసిన అవసరం ఉండదు. ఒకే స్థానంలో ఉంటూ అంతా కనిపిస్తుంది.
ఎవరైనా తమ ఉన్నతమైన స్థితిలో, బీజరూప స్థితిలో, విశ్వకళ్యాణకారి స్థితిలో
స్థితులైనప్పుడు విశ్వమంతా చిన్న బంతి వలె కనిపిస్తుంది. కనుక సెకండులో
విశ్వమంతా తిరిగి వస్తారు.
మీరు సర్వాత్మల తండ్రికి పిల్లలు, ఆత్మలంతా మీ సోదరులు.
కనుక మీరు మీ సోదరుల వైపు సంకల్పమనే దృష్టిని సారించండి. విశాల బుద్ధి,
దూరదృష్టి గలవారిగా అవ్వండి. చిన్న చిన్న విషయాలలో మీ సమయాన్ని పోగొట్టుకోకండి.
ఉన్నతమైన స్థితిలో స్థితులవ్వండి. ఇప్పుడు విశాల కార్యానికి నిమిత్తంగా అవ్వండి.
హే విశ్వ కళ్యాణకారీ ఆత్మలూ, సదా విశాల కార్యము యొక్క ప్లానును గుర్తుంచుకోండి.
అందరి విశేషతల ద్వారానే విశ్వకళ్యాణ బేహద్ కార్యము పూర్తి అవ్వనున్నది. ఎలాగైతే
ఏదైనా స్థూల పదార్థాన్ని తయారు చేసినప్పుడు కూడా అందులో అన్ని పదార్థాలు
వేయకపోతే, సాధారణమైన తీపి లేక ఉప్పు లేకపోయినట్లైతే ఎంత గొప్ప పదార్థాన్ని తయారు
చేసినా అది తినేందుకు యోగ్యంగా అవ్వజాలదు. అదే విధంగా ఇంత శ్రేష్ఠమైన విశ్వ
కార్యం కోసం ప్రతి రత్నము అవసరమైనదే. అందరి సహాయం కావాలి. ప్రతి ఒక్కరి సహాయమనే
వేలుతోనే విశ్వపరివర్తన కార్యం పూర్తి అవ్వాలి.
విశ్వంలో సదా కొరకు సుఖం మరియు శాంతి జెండా ఎగురుతూ
ఉండాలని బాప్దాదాకు మనసులో ఉంది. సదా సుఖ-శాంతుల మురళి మ్రోగుతూ ఉండాలి. ఈ
లక్ష్యాన్ని తీసుకొని సర్వుల సహయోగమనే వ్రేలుతో ఈ విశాల కార్యాన్ని సంపన్నం
చేయండి. మాస్టర్ జ్ఞానసూర్యులుగా అయ్యి విశ్వమంతటికీ సర్వశక్తుల కిరణాలను
ఇవ్వడమే ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీ విశేష కర్తవ్యము. కావున అందరూ
విశ్వకళ్యాణకారులుగా అయ్యి విశ్వానికి సర్వశక్తుల కిరణాలు ఇవ్వండి. ఎలాగైతే
సూర్యుడు తన కిరణాల ద్వారా విశ్వానికి వెలుగునిస్తాడో అలా మీరు మాస్టర్జ్
ఙ్ఞానసూర్యులుగా అయ్యి సర్వ శక్తుల కిరణాలను విశ్వంలో వ్యాపింపజేయండి. అప్పుడు
ఆత్మలందరికి సకాశ్ లభించగలదు.
మీరు విశ్వానికి దీపాలు, అవినాశి దీపాలు. దీని
స్మృతిచిహ్నంగానే దీపావళి జరుపుకుంటారు. ఇప్పటివరకు మీ మాలను స్మరణ చేస్తున్నారు.
ఎందుకంటే మీరు అంధకారాన్ని ప్రకాశమయంగా చేసేవారు. కావున స్వయాన్ని సదా ఇలా
జాగృతమై ఉన్న(వెలుగుతున్న) దీపాలుగా అనుభవం చేయండి. ఎన్ని తుఫానులు వచ్చినా సదా
ఒకే విధంగా, అఖండ జ్యోతి సమానంగా వెలిగే దీపాలు. అలాంటి దీపాలకు విశ్వం కూడా
నమస్కరిస్తుంది అంతేకాక తండ్రి కూడా అలాంటి దీపాలకు తోడుగా ఉంటారు. ఎలాగైతే
తండ్రి సదా జాగంతి జ్యోతిగా ఉన్నారో, అఖండ జ్యోతిగా ఉన్నారో, అమర జ్యోతిగా
ఉన్నారో అలా పిల్లలైన మీరు కూడా సదా అమరజ్యోతిగా అయ్యి విశ్వాన్ని అంధకారం నుండి
వెలికి తీసే సేవ చేయండి. విశ్వంలోని ఆత్మలు వెలుగుతున్న దీపాలైన మీ వైపు చాలా
స్నేహంతో చూస్తున్నారు. మీరు రాత్రి నుండి పగలుగా తయారు చేసే చైతన్యమైన దీపాలు.
ఎంతోమంది ఆత్మలు అంధకారంలో భ్రమిస్తూ, ప్రకాశం కొరకు తపిస్తున్నారు. ఒకవేళ
దీపాలైన మీ ప్రకాశం మిణుకు మిణుకుమంటూ ఉంటే భ్రమిస్తున్న, వెతుకుతున్న ఆత్మల
పరిస్థితి ఏమవుతుంది! ఆరిపోతూ-వెలుగుతూ ఉన్న లైటును ఎవ్వరూ ఇష్టపడరు. కనుక
వెలుగుతున్న జ్యోతులుగా అయ్యి అంధకారాన్ని తొలగించే బాధ్యత గల ఆత్మగా భావిస్తూ
నడవండి. అప్పుడు విశ్వకళ్యాణకారులని అంటారు.
మీరు పూర్వజ ఆత్మలు. మీ వృత్తి విశ్వ వాతావరణాన్ని
పరివర్తన చేసేదిగా ఉండాలి. పూర్వజులైన మీ దృష్టి వంశావళి వారందరికీ బ్రదర్
హుడ్(సోదరత్వాన్ని) స్మృతినిప్పించేదిగా ఉండాలి. పూర్వజులైన మీరు బాబా స్మృతిలో
ఉంటూ వంశావళి వారందరికీ అందరి తండ్రి వచ్చేశారని గుర్తు చేయండి. పూర్వజులైన మీ
శ్రేష్ఠ కర్మలు, వంశావళికి శ్రేష్ఠ చరిత్ర అనగా చరిత్ర నిర్మాణము చేసుకోవాలనే
శుభ ఆశను ఉత్పన్నం చేయాలి. అందరి దృష్టి పూర్వజులైన మిమ్ములను వెతుకుతోంది.
కనుక ఇప్పుడు బేహద్ స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఎలాగైతే తండ్రి మహిమలో 'నిర్బలురకు
బలమునిచ్చేవారు' అని మహిమ చేస్తారో, అలా మీరందరూ బ్రాహ్మణ పరివారంలో గాని,
విశ్వాత్మలలో గాని ప్రతి ఆత్మకు, నిర్బలురకు బలమునిచ్చేవారిగా మహాబలవంతులుగా
అవ్వండి. ఎలాగైతే ఉదాహరణానికి వారు పేదరికాన్ని తొలగించండి(గరీబీ హటావో) అని
నినాదం చేస్తూ ఉంటారో, అలా మీరు నిర్బలతను తొలగించండి. నిమిత్తంగా అయ్యి
విశ్వంలోని ప్రతి ఆత్మకు తండ్రి నుండి ధైర్యం మరియు సహాయాన్ని ఇప్పించండి.
మంచిది. ఓంశాంతి.