పవిత్రంగా అయ్యి పవిత్రంగా చేసే స్మృతి చిహ్నము''
హోలీయెస్ట్(అత్యంత పవిత్రుడైన) తండ్రి హోలీ హంసలతో
హోలీ రోజును(పండుగను) జరిపేందుకు వచ్చారు. హోలీ రోజు(డే) అని సంగమ యుగమును
అంటారు. సంగమ యుగము అంటేనే పవిత్రమైన రోజు. కావున హోలీయెస్ట్ తండ్రి హోలీ
పిల్లలతో హోలీ రోజును జరిపేందుకు వచ్చారు. ప్రపంచంలో హోలీ ఒకటి -రెండు రోజులు
మాత్రమే ఉంటుంది. కానీ హోలీ హంసలైన మీరు సంగమ యుగమంతా హోలీ జరుపుకుంటారు. వారు
రంగులు వేసుకుంటారు, మీరు తండ్రి సాంగత్య రంగుతో తండ్రి సమానం సదాకాలం కొరకు
పవిత్రంగా అవుతారు. హద్దు నుండి బేహద్ వారిగా అవ్వడంతో సదాకాలం కొరకు హోలీ అనగా
పవిత్రంగా అవుతారు. ఈ హోలీ ఉత్సవము(పండుగ) హోలీ అనగా పవిత్రంగా చేసి పవిత్రంగా
అయ్యే ఉత్సాహమును ఇప్పిస్తుంది. స్మృతిచిహ్న విధులు(పండుగలు) ఏవి జరుపుకున్నా
అన్ని విధులలో పవిత్రంగా అయ్యే సారము ఇమిడి ఉంటుంది. హోలీగా తయారై లేక హోలీ
జరుపుకునేందుకు ముందు అపవిత్రతను, చెడును భస్మం చెయ్యాలి, కాల్చేయాలి.
అపవిత్రతను పూర్తిగా సమాప్తి చెయ్యనంత వరకు పవిత్రతా రంగు ఎక్కదు. పవిత్రతా
దృష్టితో ఒకరు ఇంకొకరి పై రంగును వేసే ఉత్సవాన్ని జరుపుకోలేరు. ఈ ఉత్సవము
భిన్న-భిన్న భావాలను మరచి ఒకే కుటుంబానికి చెందినవారము, అందరూ సమానమే అనగా
సోదర-సోదరులము అని ఒకే సమాన వృత్తితో(భావముతో) జరుపుకునే స్మృతిచిహ్నము. వారు
లౌకిక రూపంలో చిన్న - పెద్ద, స్త్రీలు - పురుషులు సమాన భావంలో జరుపుకోవాలనే
భావంతో జరుపుకుంటారు. వాస్తవానికి సోదర - సోదర సమాన స్వరూప స్మృతి అవినాశి
రంగును అనుభవం చేయిస్తుంది. ఎప్పుడైతే ఈ సమాన స్వరూపంలో స్థితులవుతారో అప్పుడు
అవినాశి సంతోషం యొక్క మెరుపు అనుభవం అవుతుంది. అంతేకాక సదాకాలం కొరకు
సర్వాత్మలకు ఇలాంటి అవినాశి రంగు వెయ్యాలి అని ఉత్సాహం ఉంటుంది. పిచికారి ద్వారా
రంగు వేస్తారు. మీ పిచికారి ఏది? తమ దివ్యబుద్ధి అనే పిచికారిలో అవినాశి రంగు
నింపబడి ఉంది కదా! సాంగత్య రంగుతో అనుభవం చేస్తున్నారా, అలాంటి భిన్న భిన్న
అనుభవాలనే రంగులతో పిచికారి నిండి ఉంది కదా! నిండి ఉన్న బుద్ధి అనే పిచికారితో
ఏ ఆత్మనైనా దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, నోటి (వాచా) ద్వారా ఈ రంగులో
రంగరిస్తారు. దీనితో వారు సదాకాలం కొరకు హోలీగా అయిపోతారు. వారు హోలీ జరుపుతారు,
మీరు హోలీగా తయారుచేస్తారు. అన్ని రోజులను హోలీ రోజులుగా చేస్తారు. వారు పండుగను
జరుపుకునేందుకు అల్పకాలం కొరకు తమ మూడ్ ను సంతోషంగా చేసుకుంటారు. కానీ మీరందరూ
సదా జరుపుకునేందుకు హోలీ మరియు హ్యాపీ మూడ్‌లో ఉంటారు. మూడ్(స్థితి) తయారు
చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సదా హోలీ స్థితిలో ఉంటారు. వేరే ఏ విధమైన మూడ్ఉండదు.
హోలీ స్థితి(మూడ్) సదా తేలికగా, సదా నిశ్చింతగా, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా
బేహద్ స్వరాజ్యాధికారిగా చేస్తుంది. రకరకాల స్థితులు ఏవైతే మారుతున్నాయో
అప్పుడప్పుడు సంతోషం, ఒకసారి ఎక్కువ ఆలోచించడం, ఒకసారి తేలికగా, ఒకసారి భారంగా
ఈ అన్ని రకాల స్థితులు మారి సదా సంతోషం మరియు హోలీ స్థితి గలవారిగా అవుతారు.
ఇలాంటి అవినాశి ఉత్సవాన్ని తండ్రి జతలో జరుపుకుంటారు. తొలగించుకోవడము,
జరుపుకోవడము తర్వాత మిలనము జరుపుకోవడము. దీని స్మృతిచిహ్నంగా కాలుస్తారు, రంగు
వేస్తారు తర్వాత మిలనము జరుపుకుంటారు. మీరు కూడా తండ్రి రంగులో
రంగరించబడినప్పుడు జ్ఞాన రంగులో, సంతోష రంగులో ఎన్ని రంగుల హోలీ ఆడతారు! ఈ అన్ని
రంగులతో రంగరించబడినట్లయితే తండ్రి సమానంగా అవుతారు మరియు సమానమైనవారు పరస్పరంలో
కలుసుకున్నప్పుడు ఎలా కలుసుకుంటారు? స్థూలంగా అయితే హృదయానికి హత్తుకుంటారు.
కానీ మీరు ఎలా కలుస్తారు? సమానంగా అయినప్పుడు స్నేహంలో ఇమిడిపోతారు. ఇమిడిపోవడమే
కలుసుకోవడము. కావున ఈ మొత్తం విధానం ఎక్కడి నుండి మొదలయ్యింది? మీరు అవినాశిగా
జరుపుకుంటారు. వారు వినాశి స్మృతి చిహ్న రూపంలో పండుగ జరుపుకొని సంతోషిస్తారు.
వారు ఇప్పుడు కేవలం మీ స్మృతిచిహ్న రోజును జరుపుకుంటేనే ఇంత సంతోషపడ్తున్నారంటే
మీరు ఎంత అవినాశి ఉత్సవం అనగా ఉత్సాహంలో ఉండే అనుభవీలుగా అయ్యారో ఆలోచించండి.
అంతిమం వరకు కూడా మీ ఉత్సాహం మరియు సంతోషాల స్మృతిచిహ్నము అనేకమంది ఆత్మలకు
సంతోషాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. కావున ఇలాంటి ఉత్సాహభరిత జీవితం, సంతోషాలతో
నిండిన జీవితాన్ని తయారు చేసుకున్నారు కదా!
డ్రామాలో సంగమ యుగానికి అద్భుతమైన పాత్ర ఉంది. ఇప్పుడు
మీరు అవినాశి ఉత్సవాన్ని జరుపుకుంటూ తమ స్మృతిచిహ్న ఉత్సవాన్ని కూడా
చూస్తున్నారు. ఇదే డ్రామాలో సంగమయుగ పాత్ర. ఒకవైపు చైతన్య శ్రేష్ఠ ఆత్మలు,
రెండవ వైపు మీ చిత్రాన్ని చూస్తున్నారు. ఒకవైపు స్మృతి స్వరూపంగా అయ్యారు,
రెండవ వైపు మీ ప్రతి శ్రేష్ఠ కర్మల స్మృతిచిహ్నాన్ని చూస్తున్నారు. మహిమా
యోగ్యులుగా అయ్యారు అంతేకాక కల్పక్రితపు మహిమను వింటున్నారు. ఇది అద్భుతం కదా!
ఇది మా గాయనమే అనే స్మృతితో చూడండి. వాస్తవానికి ప్రతి ఆత్మ భిన్న నామ-రూపాలతో
తమ శ్రేష్ఠ కర్మల స్మృతిచిహ్న చిత్రాన్ని చూస్తున్నారు కూడా. కానీ వారికి
తెలియదు. ఇప్పుడు గాంధీగారు కూడా వేరే నామ -రూపాలతో తన సినిమాను(ఫిల్మ్‌ను)
చూస్తూ ఉంటాడు కదా! కానీ గుర్తించలేరు. మీరు గుర్తించి మీ చిత్రాన్ని చూస్తారు.
''ఇది మా చిత్రము, మా ఉత్సాహంతో నిండిన రోజుల స్మృతి చిహ్నమును ఉత్సవం రూపంలో
జరుపుకుంటున్నారు'' అని మీకు తెలుసు. ఈ మొత్తం జ్ఞానమంతా వచ్చేసింది కదా! డబల్
విదేశీయుల చిత్రం మందిరంలో ఉందా? ఈ దిల్వాడా మందిరంలో మీ చిత్రాన్ని చూశారా?
లేక కేవలం భారతదేశంవారి చిత్రాలే ఉన్నాయా? అందరూ మీ చిత్రాలను చూసుకున్నారా? ఇది
మా చిత్రం అని గుర్తించారా? ఎలాగైతే ఓ అర్జునా! అని ఒక్కరి ఉదాహరణ మాత్రమే ఉందో
అలా స్మృతిచిహ్నాలు కూడా కొన్ని మాత్రమే చూపిస్తారు. కానీ అందరివీ ఉన్నాయి.
ఇక్కడ కొన్ని చిత్రాలు మాత్రమే ఉన్నాయి, ఇందులో మేము ఎలా ఉంటాము అని భావించకండి.
ఇవి స్యాంపుల్కు చూపించారు. కానీ ఇవి మీ అందరి స్మృతిచిహ్నాలు. ఎవరైతే స్మృతిలో
ఉంటారో, వారి స్మృతిచిహ్నం తప్పకుండా తయారవుతుంది. అర్థమయ్యిందా? కావున అందరి
పెద్ద పిచికారి నిండి ఉంది కదా! ఒక్కసారికే సమాప్తి అయ్యే చిన్న చిన్న
పిచికారీలు కాదు కదా! పదే పదే నింపవలసిన శ్రమ చేసే అవసరం కూడా లేదు. అందరినీ
అవినాశి రంగుతో రంగరించండి. హోలీగా చేసే హోలీ జరుపుకోండి. మీకైతే హోలీ
అయిపోయింది కదా! లేక ఇంకా జరుపుకోవాలా? హోలీ అయిపోయింది అనగా హోలీ జరుపుకున్నారు.
రంగు అంటుకొని ఉంది కదా! ఈ రంగు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్థూల రంగును
కూడా సంతోషంగానే వేసుకుంటారు. మళ్లీ దాని నుండి రక్షించుకోవాలని కూడా అనుకుంటారు.
కానీ మీ రంగు ఎటువంటిదంటే ఇంకా వెయ్యండి అని అంటారు. దీనితో ఎవ్వరూ భయపడరు. ఆ
రంగు కళ్ళలో పడకూడదని భయపడ్తారు. ఈ రంగు మాత్రం ఎంత వేస్తే అంత మంచిది అని
అంటారు. ఇలాంటి హోలీ జరుపుకున్నారు కదా! హోలీగా(పవిత్రంగా) అయ్యారు. ఇది
పవిత్రంగా తయారై తయారు చేసే స్మృతి చిహ్నము.
ఇక్కడ భారతదేశంలో అయితే అనేక కథలు తయారు చేశారు.
ఎందుకంటే భారతీయులు కథలు వినేందుకు ఇష్టపడ్తారు. కనుక ప్రతి ఉత్సవానికి కథలు
తయారు చేశారు. మీ జీవిత కథతో రకరకాల చిన్న చిన్న కథలు తయారు చేశారు. కొంతమంది
రాఖీ కథలు తయారు చేశారు, కొంతమంది హోలీ కథలు తయారుచేశారు. కొందరు జన్మించిన కథలు
తయారు చేశారు. కొందరు రాజ్య పట్టాభిషేక కథలు తయారుచేశారు. కానీ ఇవన్నీ మీ జీవిత
కథలకు సంబంధించిన కథలు. ద్వాపర యుగంలో వ్యవహారంలో కూడా ఇంత సమయం ఇవ్వవలసిన అవసరం
ఉండేది కాదు. ఫ్రీ గా ఉండేవారు. జనసంఖ్య కూడా ఈ రోజు లెక్కతో తక్కువగా ఉండేది.
సంపద కూడా రజోప్రధానంగా ఉండేది. స్థితి కూడా రజోప్రధానంగా ఉండేది. అందువలన ఖాళీ
లేకుండా బిజీగా ఉండేందుకు ఈ కథ, కథలు, కీర్తనలను సాధనంగా చేసుకున్నారు. ఏదైనా
సాధనం కావాలి కదా! మీరు ఫ్రీగా ఉన్నట్లయితే సేవ చేస్తారు లేక స్మృతిలో
కూర్చుంటారు. వారు ఆ సమయంలో ఏం చెయ్యాలి? ప్రార్థన చేస్తారు లేక కథలు, కీర్తనలు
చేసేవారు. అందువలన ఖాళీ బుద్ధిగా అయ్యి కథలు చాలా మంచి మంచివి తయారు చేశారు.
అయినా మంచిదే. ఎక్కువ అపవిత్రతలోకి వెళ్ళకుండా రక్షింపబడ్డారు. ఈ రోజులలోని
సాధనాలు ఎలా ఉన్నాయంటే 5సం||ల పిల్లలను కూడా వికారులుగా చేసేస్తాయి. ఆ సమయంలో
కొన్ని మర్యాదలు కూడా ఉండేవి. కానీ ఇవన్నీ మీ స్మృతిచిహ్నాలు. మా
స్మృతిచిహ్నాన్ని పండుగగా జరుపుకుంటున్నారనే నషా మరియు సంతోషం ఉంది కదా! మన
పాటలు పాడుకుంటున్నారు. ఎంత ప్రేమగా పాడుకుంటున్నారు! ఇంత ప్రేమ స్వరూపంగా మీరు
అయ్యారు అందుకే ప్రేమతో పాడుతున్నారు. హోలీ స్మృతిచిహ్నం ఏమిటో అర్థమయ్యిందా.
సదా సంతోషంగా ఉండండి, తేలికగా ఉండండి. జరుపుకోవడమంటే ఇదే. మంచిది. ఎప్పుడూ
స్థితిని పాడు చేసుకోకండి (మూడ్ఆఫ్చేసుకోకండి). సదా హోలీ మూడ్, లైట్ మూడ్,
హ్యాపి మూడ్ ఉండాలి. ఇప్పుడు చాలా మంచి తెలివిగలవారిగా అవుతూ ఉంటారు. మొదటి రోజు
మధువనానికి వచ్చినప్పటి ఫోటో మళ్లీ వెళ్లేటప్పటి ఫోటో రెండూ తీయించండి. సైగతోనే
అర్థం చేసుకుంటారు. అయినా బాప్‌దాదాకు లేక బాప్‌దాదా ఇంటికి మీరు అలంకారము. మీరు
రావడం వలన మధువనం శోభ ఎంత మంచిగా అవుతుంది! ఎక్కడ చూస్తే అక్కడ ఫరిస్తాలు
వస్తున్నారు, వెళ్తున్నారు. ఆనందంగా ఉంది కదా! మీరు ఇంటికి అలంకారమని బాప్‌దాదాకు
తెలుసు. మంచిది.
జ్ఞానం యొక్క రంగులో రంగరింపబడిన అందరికీ, సదా తండి
సాంగత్య రంగులో ఉండేవారికి, తండి సమానంగా, సంపన్నంగా అయ్యి ఇతరులను కూడా అవినాశి
రంగులో రంగరించే వారికి, సదా హోలీ రోజును (పండుగను) జరుపుకునే హోలీహంస ఆత్మలకు,
సదా సంతోషంగా మరియు హోలీగా ఉండాలని బాప్‌దాదా శుభాకాంక్షలు. సదా స్వయాన్ని
సంపన్నంగా చేసుకొని ఉత్సాహ - ఉల్లాసాలలో ఉండాలనే శుభాకాంక్షలు. తోడుతోడుగా
నలువైపులా లగ్నములో నిమగ్నమై ఉండువారు, సదా మిలనం జరుపుకునే విశేష పిల్లలకు
పియ్ర స్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగతంగా కలయిక :-
1. సదా స్వయాన్ని తండ్రి వారసత్వానికి అధికారిగా
అనుభవం చేస్తున్నారా? అధికారి అనగా శక్తిశాలి ఆత్మ. ఇలా భావిస్తూ కర్మలు
చెయ్యండి. ఎటువంటి బలహీనత మిగిలి లేదు కదా? తండ్రి ఎలా ఉన్నారో, నేను అలా ఉండాలి,
తండ్రి సర్వ శక్తివంతులు అయితే పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులు - సదా ఈ
స్మృతితో స్వయాన్ని సహజంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సంతోషం సదా ఉండాలి ఎందుకంటే
ఇప్పటి సంతోషం మొత్తం కల్పంలో ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు తండ్రి ద్వారా ప్రాప్తి
ఉంది. తర్వాత ఆత్మల ద్వారా ఆత్మలకు ప్రాప్తి ఉంటుంది. తండ్రి ద్వారా ఏదైతే
ప్రాప్తిస్తుందో, అది ఆత్మల ద్వారా జరగజాలదు. ఆత్మలు స్వయం సర్వజ్ఞులు కారు.
అందువలన వారి ద్వారా జరిగే ప్రాప్తులు అల్పకాలమైనవిగా ఉంటాయి. తండ్రి ద్వారా
సదాకాలపు అవినాశి ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశి సంతోషం
లభిస్తుంది అని స్మృతిలో సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కదా! సదా సంతోషం అనే
ఊయలలో ఊగుతూ ఉండండి. క్రిందకు వచ్చారు, మురికిగా అయ్యారు ఎందుకంటే క్రింద మట్టి
ఉంది. సదా ఊయలలో ఉంటే స్వచ్ఛంగా ఉంటారు. స్వచ్ఛంగా అవ్వకుండా తండ్రితో మిలనం
జరుపుకోలేరు. తండ్రి స్వచ్ఛంగా ఉన్నారు. వారిని కలుసుకునే పద్ధతి - స్వచ్ఛంగా
అవ్వవలసి ఉంటుంది. కావున సదా ఊయలలో ఉండేవారు సదా స్వచ్ఛంగా ఉంటారు. ఊయల లభిస్తూ
ఉంటే క్రిందకు ఎందుకు వస్తారు? ఊయలలోనే తినండి, ఊయలలోనే త్రాగండి, నడవండి,.....
ఇది చాలా పెద్ద ఊయల. క్రిందకు వచ్చే రోజులు సమాప్తం అయ్యాయి. ఇప్పుడు ఊగే రోజులు.
కావున సదా తండ్రితో పాటు సుఖం అనే ఊయలలో సంతోషం, ప్రేమ, జ్ఞానం, ఆనందం అనే ఊయలలో
ఊగే శ్రేష్ఠ ఆత్మలు. ఇది సదా గుర్తుంచుకోండి. ఎప్పుడు ఏ విషయం వచ్చినా ఈ వరదానం
జ్ఞాపకం ఉంచుకుంటే మళ్లీ వరదానం ఆధారంతో బాబా తోడును, ఊయలలో ఊగే అనుభవం చేస్తారు.
ఈ వరదానం సదా రక్షక సాధనము. వరదానం గుర్తుంచుకోవడం అనగా వరదాతను గుర్తుంచుకోవడం.
వరదానంలో ఎలాంటి శ్రమ ఉండదు, సర్వ ప్రాప్తులు సహజంగా జరుగుతాయి.
2. అందరూ ఒకే బలం, ఒకే నమ్మకంతో నడిచే శ్రేష్ఠ ఆత్మలు
కదా! ఒకే బలం, ఒకే నమ్మకంతో నడిచే నిశ్చయబుద్ధి గల పిల్లలకు ఈ సాకార మురళి ఏదైతే
ఉందో అదే మురళి. మధువనం నుండి ఏ శ్రీమతం లభిస్తుందో, అదే శ్రీమతమని తెలుసు.
తండ్రి మధువనంలో తప్ప ఇక ఎక్కడా లభించరు. సదా ఒక్క తండ్రి చదువులో నిశ్చయం
ఉండాలి. మధువనం నుండి చదువులో ఏ పాఠాలు వెళ్తాయో, అదే చదువు. ఇంకొక చదువు ఏదీ
లేదు. ఎక్కడైనా భోగ్ మొదలైన సమయాలలో సందేశీ ద్వారా బాబా పాత్ర నడుస్తూ ఉంటే అది
పూర్తిగా తప్పు. ఇది కూడా మాయ. దీనిని ఒకే బలం, ఒకే నమ్మకం అని అనరు. మధువనం
నుండి ఏ మురళి వస్తూ ఉందో దాని పై ధ్యాస ఇవ్వకపోతే వేరే మార్గాలలోకి
వెళ్ళిపోతారు. మధువనంలోనే బాబా మురళి నడుస్తుంది మధువనంలోనే బాబా వస్తారు.
అందువలన ప్రతి పుత్రుడు ఈ జాగ్రత్త వహించండి. లేకుంటే మాయ మోసం చేస్తుంది