''బిందువు మరియు బూంద్( నీటి చుక్క )ల రహస్యము''
ఈ రోజు బాప్దాదా తమ భోళా పిల్లలతో, పిల్లల అవతరణయే
తండ్రి అవతరణ రోజును అనగా అలౌకిక ఆత్మిక జయంతిని జరుపుకునేందుకు వచ్చారు.
భోళానాథుడైన తండ్రికి అందరికంటే ప్రియమైనవారు భోళా పిల్లలు. భోళా అనగా సదా సరళ
స్వభావము, శుభ భావము మరియు స్వచ్ఛతా సంపన్నమైనవారు. మనసు మరియు కర్మలు రెండిటిలో
సత్యత మరియు స్వచ్ఛత కలిగినవారు(ఎలాంటి ఏ దోషము లేనివారు). ఇటువంటి భోళా పిల్లలు
భోళానాథుడైన తండ్రిని కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు. భోళానాథుడైన తండ్రి ఇటువంటి
సరళ స్వభావము గల భోళా పిల్లల గుణాల మాలను సదా స్మరణ చేస్తూ ఉంటారు. మీరందరూ
అనేక జన్మలలో తండ్రి నామాల (పేర్ల) మాలను స్మరణ చేశారు. అందుకు తండ్రి ఇప్పుడు
సంగమ యుగములో పిల్లలకు రిటర్న్(బదులు) ఇస్తున్నారు. పిల్లల గుణ మాలను స్మరణ
చేస్తున్నారు. భోళా పిల్లలు భోళానాథునికి ఎంతో ప్రియమైనవారు. ఎంత జ్ఞాన
స్వరూపులుగా, నాలెడ్జ్ ఫుల్ గా , పవర్ ఫుల్ గా ఉంటారో అంత భోళాగా ఉంటారు.
భగవంతునికి ప్రియమైనది భోళాతనము. భగవంతుని మోహింపజేసి మీవారిగా చేసుకున్న
ఇటువంటి తమ శ్రేష్ఠ భాగ్యము గురించి తెలుసు కదా.
ఈ రోజు భక్తులు మరియు పిల్లలు ఇరువురూ విశేషంగా పండుగ
జరుపుకునే రోజు. భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు. కానీ
మీరు సన్ముఖములో కూర్చొని ఉన్నారు. భక్తుల లీలలు కూడా తండ్రి చూసి చూసి మందహాసము
చేస్తున్నారు. పిల్లల మిలన మేళాను కూడా చూసి చూసి హర్షిస్తున్నారు. ఒకవైపు
వియోగులైన భక్త ఆత్మలు, రెండవ వైపు సహజయోగీ పిల్లలు. ఇరువురూ తమ తమ
ఆసక్తితో(లగ్నముతో) తండ్రికి ప్రియంగా ఉన్నారు. భక్తులు కూడా తక్కువైనవారేమీ
కాదు. రేపటి రోజు ఆకారీ ఇష్ట దేవతా రూపములో నలువైపులా తిరిగి చూడండి. తండ్రితో
పాటు సాలిగ్రామ పిల్లలకు కూడా విశేషంగా పూజలు జరుగుతాయి. భక్తులు తండ్రితో పాటు
మిమ్ములను పూజించుటను చూడండి. ఇప్పటికీ అంత్యము వరకు కొంతమంది పిల్లలు నౌధా
భక్తి(నవవిధాల భక్తి, గాఢమైన భక్తి) చేసి, వారి భక్తి భావానికి అల్పకాల ఫలమును
అనుభవం చేస్తున్నారు. రేపటి రోజు భక్తులు విశేష లగ్నముతో, ఆసక్తితో భక్తి చేసే
రోజు అర్థమయ్యిందా.
మీరు తండ్రి జయంతిని జరుపుకుంటారా లేక మీ జయంతిని
జరుపుకుంటారా? మొత్తం కల్పమంతటిలో తండ్రి మరియు పిల్లలు ఒకే రోజు పుట్టడం
ఎప్పుడైనా జరుగుతుందా? ఒకే తేదీ ఉండవచ్చు కానీ ఒకే సంవత్సరం ఉండజాలదు. తండ్రి
పుట్టిన సంవత్సరానికి పిల్లలు పుట్టిన సంవత్సరానికి తేడా ఉంటుంది కదా. కానీ
తండ్రి మరియు పిల్లల అలౌకిక పుట్టిన రోజు ఒక్కటే. మేము మా తండ్రి పుట్టిన రోజును
జరుపుకుంటామని మీరంటారు. పిల్లల పుట్టినరోజు జరుపుతామని తండ్రి అంటారు. కనుక ఇది
అద్భుతమైన పుట్టినరోజు కదా. మీ పుట్టినరోజును జరుపుకుంటారు, జత జతలో తండ్రి
పుట్టినరోజును కూడా జరుపుతారు. ఇరువురి పుట్టినరోజు ఒక్కటే - దీని ద్వారా
భోళానాథుడైన తండ్రికి పిల్లలంటే ఎంత స్నేహము(ప్రేమ) ఉందో ఆలోచించండి. కనుక
భోళానాథుడైన తండ్రిని ఇంతగా మోపింపజేశారు కదా. భక్తులు తమ భక్తి పారవశ్యంలో
మస్త్ అయిపోతారు. మీరు ''పొందుకున్నాము'' అనే సంతోషంలో తండ్రి జత జతలో
ఆచరిస్తారు. పాడ్తారు, నాట్యము చేస్తారు. స్మృతిచిహ్నంగా తయారు చేసిన దానిలో
కూడా చాలా రహస్యము ఇమిడి ఉంది.
పూజలో, చిత్రాలలో విశేషంగా 2 విశేషతలున్నాయి. ఒకటేమో
బిందువు యొక్క విశేషత, రెండవది(బూంద్) చుక్క-చుక్క యొక్క విశేషత. పూజించు
పద్ధతిలో చుక్క-చుక్కకు విశేషత ఉంది. ఈ సమయంలో పిల్లలైన మీరు బిందువు రహస్యములో
స్థితులౌతారు. మొత్తం జ్ఞాన సారమంతా ఒక్క బిందువు శబ్ధములోనే ఇమిడి ఉంది. తండ్రీ
బిందువే, ఆత్మలైన మీరు కూడా బిందువులే. అంతేకాక డ్రామా జ్ఞానాన్ని ధారణ
చేసేందుకు జరిగిపోయినదంతా ఫినిష్(అయిపోయింది) అనగా ఫుల్ స్టాప్ అనగా బిందువు
పెట్టేస్తారు. అందువలన భక్తిమార్గములో కూడా ప్రతిమ(శివలింగము) మధ్యలో గల
బిందువుకు మహత్యముంది. రెండవది - బూంద్(చుక్క) యొక్క మహత్యము - మీరు స్మృతిలో
కూర్చున్నప్పుడు లేక ఎవరినైనా స్మృతిలో కూర్చోబెట్టినప్పుడు ఏ విధి ద్వారా యోగము
చేయిస్తారు? సంకల్పాల బూంద్ల ద్వారా చేయిస్తారు. నేను ఆత్మను, ఈ మొదటి బూంద్ను
వేస్తారు. తండ్రి సంతానాన్ని - ఇది రెండవ బూంద్(చుక్క). ఇలా శుద్ధ సంకల్పాల
చుక్కల (బూంద్ల) ద్వారా మిలనములో సిద్ధిని అనుభవం చేస్తారు కదా. కనుక ఒకటేమో
శుద్ధ సంకల్పాల స్మృతి అనే బూంద్(చుక్క). ఇక రెండవది ఆత్మిక సంభాషణ చేయునప్పుడు
తండ్రికి గల ఒక్కొక్క మహిమను, తండ్రి నుండి లభించే ప్రాప్తుల శుద్ధ సంకల్పాల
బూంద్ను వేస్తారు కదా. '' మీరు ఇంత గొప్పవారు'', ''మీరు మమ్ములను ఇలా తయారు
చేశారు'' - ఇటువంటి మధురాతి మధురమైన, శీతలమైన బూంద్లను తండ్రి పై వేస్తారు. అనగా
తండ్రితో ఆత్మిక సంభాషణ చేస్తారు. ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఆలోచిస్తారు కదా.
అన్ని మాటలు ఒకేసారి మాట్లాడరు. మూడవ విషయము - పిల్లలందరు తమ తమ
తనువు-మనసు-ధనముల ద్వారా సహయోగమనే బూంద్ వేస్తారు. అందుకే మీరు విశేషంగా బిందువు
- బిందువు కలిసి సరోవరమవుతందని అంటారు. ఇంత పెద్ద విశ్వపరివర్తనా కార్యము,
సర్వశక్తివంతుల బేహద్ విశాలమైన కార్యములో మీలో ప్రతి ఒక్కరు చేసే సహయోగము బూంద్
సమానమైన సహయోగమే కదా. కాని అందరి చుక్క-చుక్క సహయోగము, విశాల సాగర సమానమైన
సహయోగముగా అవుతుంది. అందువలన పూజా విధిలో కూడా బూంద్కు మహత్యాన్ని
చూపిస్తారు(శివలింగము పైన అమర్చిన ధారా పాత్ర నుండి చుక్క చుక్క నీరు పడుతూ
ఉంటుంది).
విశేషంగా వ్రత విధానాన్ని చూపిస్తారు. వ్రతము
తీసుకుంటారు కదా. పిల్లలైన మీరంతా తండ్రికి సహయోగులుగా అవ్వడంలో, వ్యర్థ
సంకల్పాల భోజనము స్వీకరించమని వ్రతము తీసుకుంటారు(ప్రతిజ్ఞ చేస్తారు). ఏ వ్రతము?
- ఎప్పుడూ బుద్ధిలో అశుద్ధమైన వ్యర్థ సంకల్పాలను స్వీకరించము అనే వ్రతము. ఈ
వ్రతము అనగా దృఢ సంకల్పము చేస్తారు. ఇందుకు గుర్తుగా భక్తులు అశుద్ధ భోజనము
తినమనే వ్రతమును ఉంచుకుంటారు(ఉపవాస వ్రతము). ఈ వ్రతముతో పాటు మీరు సదా వెలిగే
జ్యోతులుగా అవుతారు. ఇందుకు గుర్తుగా వారు జాగరణ చేస్తారు. పిల్లలైన మీరు
ఆచరించే అవినాశి ఆత్మిక అంతర్ముఖీ విధులను భక్తులు స్థూలమైన బాహ్యముఖ విధులుగా
చేసేశారు. వారు మీ విధులనే కాపీ చేశారు. ఏ ఏ విషయాలు టచ్ అయ్యాయో, వాటిని వారి
రజోప్రధాన బుద్ధి కారణంగా ఇటువంటి విధిని తయారుచేశారు. వాస్తవానికి నంబరువన్
రజోగుణీ భక్తుడు, భక్తి లెక్కతో సతోగుణీ భక్తుడు బ్రహ్మయే. విశేష ఆత్మలైన మీరంతా
నిమిత్తంగా అవుతారు. మొదట మనసులో స్నేహము(ప్రేమ), మనసులో శక్తి ఉన్నందున మానసిక
భావముతో భక్తి ప్రారంభమవుతుంది. తర్వాత ఈ స్థూలమైన విధులు నెమ్మది నెమ్మదిగా
ఎక్కువైతాయి. అయినా రచయిత అయిన తండ్రి తన రచన అయిన భక్త ఆత్మలను, వారి విధులను
చూచి ఈ భక్తుల టచింగ్ బుద్ధి కూడా అద్బుతమని అంటారు. ఈ విధుల ద్వారా భక్తులు
వారి బుద్ధిని బిజీగా ఉంచుకున్నందున, వికారాలలోకి వెళ్ళకుండా ఎంతో కొంత అయినా
రక్షించుకున్నారు కదా. మీరు సిద్ధి పొందేందుకు అవలంభించే యథార్థమైన విధి
భక్తమార్గములో ఎలా కొనసాగుతూ వస్తోందో అర్థమయ్యిందా. ఇది స్మృతిచిహ్నానికి గల
మహత్యము.
డబుల్ విదేశీ పిల్లలైతే భక్తి నుండి దూరంగా ఉంటారు.
కానీ వారు మీ అందరి భక్తులు. కనుక పూజ్య ఆత్మలైన మీరు - భక్త ఆత్మలు ఇప్పుడు
కూడా మిమ్ములను ఎలా పూజిస్తున్నారో, ఎలా ఆహ్వానిస్తున్నారో అనుభవం చేస్తారు. ఇలా
అనుభవం చేస్తున్నారా? భక్తుల ఆక్రందనలు ఎప్పుడైనా అనుభవం అవుతాయా? భక్తుల పై దయ
వస్తుందా? భక్తుల జ్ఞానము కూడా బాగుంది కదా. భక్తుల ఆక్రందనలు మీకు అర్థము
కాకుంటే భక్తుల గతి ఏమవుతుంది? అందువలన భక్తులంటే ఎవరు? పూజారులు ఎవరు?
పూజ్యులంటే ఎవరు? ఈ రహస్యము కూడా బాగా తెలుసు. పూజ్యులు మరియు పూజారులుగా అయ్యే
రహస్యము తెలుసు కదా. మంచిది. భక్తుల పిలుపులు, ఆక్రందనలు ఎప్పుడైనా
అనుభవమవుతున్నాయా? పాండవులకు కూడా అవుతున్నాయా లేక కేవలం శక్తులకు మాత్రమే
అవుతాయా? సాలిగ్రామాలైతే అనేకమంది ఉంటారు. లక్షల సంఖ్యలో ఉంటారు. కానీ దేవతలు
లక్షల సంఖ్యలో ఉండరు. దేవీ దేవతలు వేల సంఖ్యలో ఉంటారు, లక్షల మంది ఉండరు. మంచిది.
ఈ రహస్యము కూడా మళ్ళీ ఎప్పుడైనా వినిపిస్తాము. డబల్ విదేశీయులు కూడా ఎవరైతే
ప్రారంభములో వచ్చారో, ఎవరైతే ప్రారంభంలో ఉదాహరణగా అయ్యారో, శక్తులు కావచ్చు లేక
పాండవులు కావచ్చు, వారికి కూడా విశేషతలున్నాయి కదా. అందరికంటే మొట్టమొదటి విదేశి
'తండ్రి'. అందరికంటే ఎక్కువ సమయం విదేశములో ఎవరుంటారు? తండ్రే కదా.
ఇప్పుడు రోజురోజుకు సమయం ఎంత సమీపానికి వస్తోందో అంత
భక్తులు ఆహ్వానించే శబ్ధాలు, వారి భావనలు అన్నీ మీకు స్పష్ట రూపములో
అనుభవమవుతాయి. ఇష్ట దేవీదేవతలు ఎవరో కూడా తెలుస్తుంది. కొంచెం పక్కాగా అవ్వండి.
అప్పుడు ఇవన్నీ దివ్యదృష్టి ద్వారా స్పష్టంగా చూచినట్లు దివ్యబుద్ధికి టచ్
అవుతాయి. ఇప్పుడింకా అలంకరించుకుంటున్నారు, అందువలన ప్రత్యక్షతా పర్దా
తెరుచుకోవడం లేదు. అలంకరింపబడినప్పుడు పర్దా తెరుచుకుంటుంది, స్వయాన్ని కూడా
చూస్తారు. అప్పుడు అందరి నోటి నుండి ఫలానా దేవి కూడా వచ్చేసింది, ఫలానా దేవత
కూడా వచ్చేశాడు అని వెలువడ్తుంది.
సదా భోళానాథుని సరళ చిత్తులు, సహజ స్వభావము గలవారు,
భోళా పిల్లలు, సదా బిందువు మరియు బూంద్ల రహస్యాన్ని జీవితంలో ధారణ చేయువారు,
ధారణా స్వరూప ఆత్మలు, సదా మనసా, వాచా, కర్మణాలో దృఢ సంకల్పమనే వ్రతము తీసుకునే
జ్ఞానయుక్త ఆత్మలు, సదా తమ పూజ్య స్వరూపంలో స్థితమై ఉండే పూజ్య ఆత్మలకు,
భోళానాథుడు, వరదాత, విధాత అయిన తండ్రి యాద్ ప్యార్ మరియు నమస్తే.
జెండా ఎగిరేసిన తర్వాత బాప్దాదా వినిపించిన మధుర
మహావాక్యాలు -
పిల్లల జెండా సదా మహోన్నతమెనది. పిల్లలు లేకుంటే
తండ్రి కూడా ఏం చేయగలరు. మీరు '' తండ్రి జెండా సదా మహాన్'' అని అంటారు.... (పాట
వినిపిస్తూ ఉంది) తండ్రి '' పిల్లల జెండా సదా మహాన్'' అని అంటారు. సదా
పిల్లలందరి మస్తకంలో విజయ పతాకము ఎగురుతూ ఉంది. అందరి కనులలో, అందరి మస్తకంలో
విజయ పతాకం ఎగుర వేయబడి ఉంది,...... ఎగుర వేయబడింది,.... ఈ జెండా ఒక్కటే కాదు,
అందరి మస్తకాలలో అవినాశి విజయపతాకము ఎగరవేయబడి ఉండుట,..... బాప్దాదా
చూస్తున్నారు.
తండ్రి మరియు పిల్లల అద్భుతమైన పుట్టిన రోజు
శుభాకాంక్షలు
నలువైపులా వున్న అతిస్నేహీ, సేవలో సాథీలు, సదా అడుగులో
అడుగు వేసే పిల్లలకు ఈ అలౌకిక బ్రాహ్మణ జీవితము పుట్టిన రోజు శుభాకాంక్షలు.
పిల్లల ప్రియస్మృతులు మరియు శుభాకాంక్షలకు బదులుగా పిల్లలందరికి బాప్దాదా
స్నేహభరిత బాహువుల మాలను సదా ధరింపజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పిల్లలందరి ఈ అలౌకిక పుట్టిన రోజును విశ్వములోని ప్రతి ఆత్మ స్మృతిచిహ్న రూపంలో
జరుపుకుంటూనే వస్తోంది. ఎందుకంటే తండ్రితో పాటు పిల్లలు కూడా బ్రాహ్మణ జీవితంలో
సర్వ ఆత్మలకు చాలా చాలా చాలా సుఖము-శాంతి, ఖుషీ, శక్తుల సహయోగం ఇచ్చారు. ఈ
సహయోగం కారణంగా అందరూ హృదయపూర్వకంగా శివుడు మరియు సాలిగ్రాములు, ఇరువురి
పుట్టిన రోజు అయిన శివజయంతిని ఆచరిస్తారు. ఇటువంటి సాలిగ్రామ పిల్లలకు శివబాబా
మరియు బ్రహ్మాబాబా ఇరువురి పదమారెట్ల అభినందనలు, అభినందనలు. సదా అభినందనలు. సదా
వృద్ధి జరగాలి, సదా విధి పూర్వక సిద్ధి ప్రాప్తి జరగాలి అచ్ఛా.
వీడ్కోలు సమయం -
గుడ్ మార్నింగ్ అని అందరూ చెప్తారు. కావీ మీ మార్నింగ్
గాడ్ తో, గాడ్లీ మార్నింగ్అయిపోయింది కదా. గాడ్ తో రాత్రి గడుపుతారు, గాడ్ తో
మార్నింగ్ జరుపుకుంటున్నారు. కనుక సదా గాడ్ మరియు గుడ్ రెండూ గుర్తుండాలి. గాడ్
స్మృతియే గుడ్ గా చేస్తుంది. గాడ్ స్మృతిలో లేకుంటే గుడ్ గా అవ్వలేరు. మీ అందరి
జీవితాలు గాడ్లీ జీవితాలు. అందువలన ప్రతి సెకండు, ప్రతి సంకల్పము 'గుడ్హీ
గుడ్'(మంచిదే మంచిది) అని అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు జీవితమే గుడ్ గా ఉంది.
ఎందుకంటే జీవితమంతా గాడ్ తో కలిసి, ప్రతి కర్మ తండ్రి జతలో చేస్తున్నారు కదా.
ఒంటరిగా చేయరు కదా. భుజించునప్పుడు తండ్రితో పాటు తింటున్నారా లేక ఒంటరిగా
తింటున్నారా. సదా గాడ్ మరియు గుడ్ ఇరువురి సంబంధాన్ని గుర్తించుకోండి, జీవితంలో
తీసుకు రండి. అర్థమయ్యిందా - అచ్ఛా అందరికీ అమృతవేళలో బాప్దాదా యాద్ ప్యార్
మరియు నమస్తే.