''స్వరాజ్యము '' మీ జన్మ సిద్ధ అధికారము. ''
ఈ రోజు బాప్‌దాదా రాజ్య అధికారుల సభను చూస్తున్నారు.
మొత్తం కల్పమంతటిలో అన్నిటికన్నా పెద్ద రాజ్య అధికారుల సభ ఈ సంగమ యుగంలోనే
జరుగుతుంది. బాప్‌దాదా మొత్తం విశ్వంలోని బ్రాహ్మణ పిల్లల సభను చూస్తున్నారు.
రాజ్య అధికారులందరూ నంబరువారిగా తమ సంపూర్ణ స్థితి అనే సీటు పై సెట్అయ్యి
స్వరాజ్యము యొక్క ఆత్మిక నషాలో ఏ విధంగా నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి కూర్చుని
ఉన్నారో, ప్రతి ఒక్కరి మస్తకము మధ్యలో మెరుస్తూ ఉన్న మణి ఎంత సుందరంగా
అలంకరించబడ్తూ ఉందో, అందరి శిరస్సు పైన నంబరువారీగా ప్రకాశిస్తున్న ప్రకాశ
కిరీటాన్ని బాబా చూస్తున్నారు. అందరూ కిరీటధారులే కాని నంబరువారీగా ఉన్నారు.
అందరి నయనాలలో బాప్‌దాదాల స్మృతి ఇమిడి ఉన్న కారణంగా నయనాలలో స్మృతి ప్రకాశము
నలువైపులా వ్యాపిస్తోంది. ఇలా అలంకరించి, అలంకరించబడిన సభను చూసి ''వాహ్నా
రాజ్య అధికారీ పిల్లలూ! వాహ్'' అని బాప్‌దాదా హర్షితమవుతున్నారు. ఈ స్వరాజ్యము
మాయాజీత్రాజ్యము, అందరికీ జన్మ సిద్ధ అధికారంగా లభించింది. విశ్వ రచయిత పిల్లలు
స్వతహాగానే స్వరాజ్య అధికారులు. స్వరాజ్యము మీ అందరికీ అనేకసార్లు లభించిన జన్మ
సిద్ధ అధికారము. ఇది ఇప్పటిది కాదు, ఎంతో పాతది. అనేకసార్లు ప్రాప్తించుకున్న
అధికారము గుర్తుందా? గుర్తుంది కదా! అనేకసార్లు స్వరాజ్యము ద్వారా
విశ్వరాజ్యాన్ని పొందారు. మీరు డబల్రాజ్యధికారులు. స్వరాజ్యము మరియు
విశ్వరాజ్యము. స్వరాజ్యము సదాకాలికంగా రాజయోగి నుండి రాజ్యఅధికారిగా తయారు
చేసేస్తుంది. స్వరాజ్యము త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా, మూడులోకాల జ్ఞాన
సంపన్నులుగా అనగా త్రిలోకనాథులుగా చేసేస్తుంది. స్వరాజ్యము మొత్తం విశ్వంలో
కోట్లాది మందిలో కొద్దిమంది, ఆ కొందరిలో కొన్ని విశేష ఆత్మలుగా చేసేస్తుంది.
స్వరాజ్యము తండ్రి కంఠహారంగా చేసేస్తుంది. భక్తుల స్మరణ మాలగా చేసేస్తుంది.
స్వరాజ్యము తండ్రి హృదయ సింహాసనాధికారిగా చేసేస్తుంది. స్వరాజ్యము సర్వ
ప్రాప్తుల ఖజానాకు యజమానులుగా చేస్తుంది. చలించని, అచంచలమైన, అఖండమైన సర్వ
అధికారాలను ప్రాప్తింపజేస్తుంది. మీరు ఇటువంటి స్వరాజ్య అధికారీ శ్రేష్ఠ ఆత్మలే
కదా!
''నేను ఎవరిని?'' అన్న ఈ చిక్కు ప్రశ్నను బాగా
తెలుసుకున్నారు కదా! '' నేను ఎవరిని '' అన్న టైటిల్స్మాల ఎంత పెద్దది! స్మృతి
చేస్తూ ఉండండి మరియు ఒక్కొక్క మణిని(పూసను) తిప్పుతూ ఉండండి. ఎంత సంతోషము
కలుగుతుంది! మీ మాలను స్మృతిలోకి తెచ్చుకుంటే ఎంత నషా ఉంటుంది! అటువంటి నషా
ఉంటుందా? డబల్విదేశీయులకు డబల్నషా ఉంటుంది కదా! అవినాశీ నషా ఉంది కదా! ఈ నషాను
ఎవరైనా తగ్గించగలరా! ఆల్మైటీ అథారిటీ(సర్వశక్తువంతుని) ముందు ఇక ఏ అథారిటీ ఉంది!
కేవలం నిర్లక్ష్యమనే గాఢ నిద్రలో నిదురించినట్లైతే మీ అథారిటీ యొక్క తాళంచెవిని
అనగా స్మృతిని మాయ దొంగిలించేస్తుంది. చాలామంది ఎటువంటి నిద్రలో నిద్రిస్తారంటే
వారికి ఏమీ తెలియదు. ఈ నిర్లక్ష్యమనే నిద్ర అప్పుడప్పుడు మోసం కూడా చేస్తుంది.
అయినా తాము నిదురించడం లేదు, మెలకువగానే ఉన్నామని అనుభవం చేస్తారు. కాని
తెలియకుండా దొంగతనం జరిగిపోతుంది. అది వారికి తెలియనే తెలియదు. జాగృతీ
జ్యోతులైన ఆల్మైటీ అథారిటీల (సర్వశక్తివంతుల) ముందు ఇక ఏ అథారిటీ లేనే లేదు.
స్వప్నంలో కూడా ఏ అథారిటీ కదిలించలేదు. అటువంటి స్వరాజ్య అధికారులు.
అర్థమయ్యిందా! మంచిది.
ఈ రోజు మిలనం చేసేందుకు సభలోకి వచ్చారు. ఎలాగైతే
పిల్లలు తాము కలుసుకునే టర్న్కోసం ఎదురుచూస్తూ ఉంటారో అలాగే తండ్రి కూడా
పిల్లలను కలుసుకునేందుకు ఆహ్వానిస్తారు. తండ్రికి అన్నిటికంటే ప్రియాతి
ప్రియమైన పని ఏదంటే, అవ్యక్త రూపంలో అయినా, వ్యక్త రూపంలో అయినా పిల్లలను
కలుసుకోవడమే. అపురూపమైన స్నేహీ పిల్లలను కలుసుకోవడమే తండ్రి దినచర్యలో విశేష
కార్యము. వారిని అలంకరించడం, పాలన చేయడం, సమానంగా తయారుచేసి విశ్వం ముందు
నిమిత్తంగా తయారుచేయడం, ఇదే వారి పని. ఇందులోనే బిజీగా ఉంటారు. సైన్సు వారిని
ప్రేరేపిస్తారు, అది కూడా పిల్లల కొరకే. భక్తులకు భావన యొక్క ఫలమునిచ్చునప్పుడు
కూడా పిల్లలనే ముందుంచుతారు. బిందువు గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. దేవీ
దేవతల గురించే తెలుసు. కావున భక్తుల ముందు కూడా పిల్లలనే ప్రత్యక్షం చేస్తారు.
అందరినీ ముక్తిలోకి తీసుకెళ్లేది కూడా పిల్లలైన మీకు సుఖ-శాంతిమయమైన
రాజ్యమునిచ్చేందుకే. మంచిది.
సదా స్వరాజ్య అధికారులకు, సదా కదలని అఖండమైన, అచంచల
స్థితిలో స్థితమై ఉండేవారికి, సదా ఆత్మిక నషాలో అవినాశిగా ఉండేవారికి,
డబల్రాజ్య అధికారులకు, బాప్‌దాదా నయనాలలో ఇమిడిపోయి ఉండే కంటిపాపలకు, బాప్‌దాదా
ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీ మద్రాసు, బెంగుళూరు, మైసూరు మరియు కలకత్తా
పరిక్రమణ చేసి మధువనము చేరుకున్నారు. దాదీజీని చూసి బాప్‌దాదా అన్నారు -
అడుగులలో పదమాల సేవ ఇమిడిపోయి ఉంది. చక్రవర్తిగా అయ్యి
పరిక్రమణ చేసి తమ స్మృతిచిహ్న స్థానాన్ని తయారు చేసుకున్నారు. ఎన్ని
తీర్థస్థానాలు తయారయ్యాయి! మహావీరులైన పిల్లలు పరిక్రమణ చేయడం అనగా
స్మృతిచిహ్నాలు తయారవ్వడం. ప్రతి పరిక్రమణలో తమ-తమ విశేషత ఉంటుంది. ఈ పరిక్రమణలో
కూడా చాలామంది ఆత్మల హృదయంలోని ఆశలను పూర్తి చేసే విశేషత ఉంది. ఈ హృదయంలోని
ఆశలను పూర్తి చెయ్యడం అనగా వరదానులుగా అవ్వడం. వరదానులుగా కూడా అయ్యారు మరియు
మహాదానులుగా కూడా అయ్యారు. డ్రామానుసారంగా ఏదైతే ప్రోగ్రామ్తయారవుతుందో అందులో
అనేక రహస్యాలు నిండి ఉంటాయి. రహస్యాలు ఎగిరింపజేసి తీసుకెళ్తాయి. మంచిది.
జానకీ దాదీతో - మీరు అందరికీ నామాన్ని దానంగా ఇస్తారు.
నామ దానము అంటే ఏమిటి? మీ పేరు ఏమిటి? నామమును(పేరును) దానం చేయడం అనగా
ట్రస్టీగా అయ్యి వరదానమునివ్వడం. మీ పేరును తలుచుకోగానే అందరికీ ఏమి
గుర్తుకొస్తుంది? సెకండులో జీవన్ముక్తి, ట్రస్టీగా అవ్వడం, ఇది మీ పేరుకు గల
విశేషత. కావున నామదానాన్ని కూడా ఇచ్చినట్లయితే ఎవరి నావ అయినా తీరం దాటుతుంది.
తండ్రి ఇప్పుడు మీ నిమిత్తత అనే విశేషతను మహిమ చేశారు. అదే జ్ఞాపకచిహ్నము, అదే
జానకి అనే పదము వారికి లభించి ఉండవచ్చు. ఒక్క జనకునికే రెండు కథలు ఉన్నాయి.
సెకండులో విదేహిగా అయిపోయిన జనకుడు ఒకరు, సెకండులో ట్రస్టీగా అయిపోయిన మరొక
జనకుడు. ''నాది కాదు నీది.'' త్రేతాయుగం నాటి జనకుని కూడా చూపిస్తారు. కాని
మీరైతే తండ్రికి చెందిన జనక్. సీత యొక్క జనకుడు కాదు. నామదానానికి మహత్వము
ఎందుకు ఉంది - దీని పైన క్లాసు చేయించండి. నామమనే నావ ద్వారా కూడా దాటిపోతారు.
ఇంకేమీ అర్థం కాకపోయినా శివబాబా శివబాబా అని అన్నట్లయితే స్వర్గం గేటులోకి
వెళ్లేందుకు పాసు అయితే లభిస్తుంది. మంచిది.
ఆస్ట్రేలియా పార్టీతో - బాప్‌దాదాకు ఆస్ట్రేలియా
నివాసులు అతిప్రియమైనవారు. ఎందుకు? ఆస్ట్రేలియా విశేషత ఏమిటి? స్వయంలో
ధైర్యాన్ని ఉంచుకొని సేవాధారులుగా అయ్యి నలువైపులా సేవాస్థానాలను తెరిచే వారి
విధి బాగుంది. ఇది ఆస్ట్రేలియా విశేషత. ఎక్కడ ధైర్యముందో అక్కడ తండ్రి
ధైర్యవంతులైన పిల్లలను చూసి విశేషంగా సంతోషిస్తారు. లండన్‌కు కూడా విశేషత ఉంది.
అక్కడ విశేష పాలన అనేక అనుభవీ రత్నాల ద్వారా లభిస్తూ ఉంటుంది. కాని
ఆస్ట్రేలియాకు అంతటి పాలనకు ఛాన్స్(అవకాశం) లభించదు. అయిన తమ కాళ్ల పై నిలబడి
సేవలో వృద్ధి మరియు సఫలం బాగా చేస్తున్నారు. అందరూ స్మృతి మరియు సేవ పట్ల మంచి
అభిరుచి కలిగి ఉన్నారు. స్మృతిలో మంచి ఆసక్తి ఉంచుతారు. అందుకే ముందుకు
వెళ్తున్నారు. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. మెజారిటీ నిర్విఘ్నంగా ఉన్నారు.
కొద్దిమంది మంచి మంచి పిల్లలు వెళ్లిపోయారు కూడా. అయినా వారు తండ్రిని ఇప్పుడు
కూడా స్మృతి చేస్తూ ఉంటారు. కావున వారి పట్ల కూడా సదా శుభ భావనను ఉంచి వారిని
కూడా మళ్లీ తండ్రి సమీపానికి తప్పకుండా తీసుకురావాలనే ఉత్సాహము వస్తుంది కదా!
అన్నో - ఇన్నో వృక్షము నుండి ఫలాలు రాలిపోతూనే ఉంటాయి. కొత్త విషయమేమీ కాదు.
అందువలన ఇప్పుడు స్వయాన్ని మరియు ఇతరులను ఎంత పక్కాగా చేయాలంటే వారు కూడా సఫలతా
స్వరూపులుగా అవ్వాలి. ఈ గ్రూపు వారు ఎవరైతే వచ్చారో వారు పక్కాగా ఉన్నారు కదా!
మాయ అయితే పట్టుకోదు కదా. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉండినా, ఇక్కడ మధువనంలో
సంపన్నంగా అయ్యి వెళ్లండి. మధువనం నుండి 'అమర భవ' అనే వరదానాన్ని తీసుకొని
వెళ్లండి. ఇటువంటి వరదానాన్ని సదా తమ వెంట ఉంచుకోండి. అంతేకాక ఇతరులను కూడా ఇదే
వరదానముతో జీవింపజేయండి. బాప్‌దాదాకు డబల్విదేశీ పిల్లల పై గర్వంగా ఉంది. మీకు
కూడా తండ్రి పై గర్వముంది కదా! మీకు కూడా మొత్తం విశ్వమంతటిలో మేమే తండ్రిని
గుర్తించామన్న నషా ఉంది కదా! సదా ఇదే నషా మరియు సంతోషంలో అవినాశిగా ఉండండి.
ఇప్పుడు బాప్‌దాదా అందరి ఫోటో తీసుకున్నారు. చూడండి, మీరు వచ్చారని తర్వాత ఫోటో
చూపిస్తారు. మాయ గురించి నాలెడ్జ్‌ఫుల్‌గా(జ్ఞాన సంపన్నులుగా) అయ్యి వెళ్లండి.
నాలెడ్జ్ఫుల్అయిన వారు ఎప్పుడూ మోసపోరు. ఎందుకంటే మాయ ఎప్పుడు వస్తుంది? ఎలా
వస్తుంది? అన్న జ్ఞానమున్న కారణంగా సదా సురక్షితంగా ఉంటారు. మాయ ఎప్పుడు
వస్తుందో తెలుసు కదా! ఎప్పుడైతే తండ్రి నుండి దూరమై ఒంటరిగా అవుతారో అప్పుడు
మాయ వస్తుంది. సదా కంబైండ్‌గా ఉండడం వలన మాయ ఎప్పుడూ రాజాలదు. ఎక్కువగా పాండవ
సైన్యం బాధ్యులుగా ఉండడం ఆస్ట్రేలియా విశేషత. లేకుంటే శక్తుల మెజారిటీయే ఉంటుంది.
ఇక్కడ పాండవులు అద్భుతం చేశారు. పాండవులు అనగా పాండవపతికి సదా తోడుగా ఉండేవారు.
ధైర్యం బాగా ఉంచారు. బాప్‌దాదా పిల్లల సేవకు అభినందనలను ఇస్తున్నారు. ఇప్పుడు
కేవలం 'అవినాశీ భవ' అనే వరదానాన్ని సదా తోడుగా ఉంచుకోండి. మంచిది.
బ్రెజిల్- స్నేహీ ఆత్మలు స్నేహసాగరంలో ఇమిడిపోయి
ఉంటారని బాప్‌దాదాకు తెలుసు. శరీరంతో ఎంత దూరంగా ఉన్నా గాని స్నేహీ పిల్లలు సదా
బాప్‌దాదా సన్ముఖంలో ఉన్నారు. లగ్నము విఘ్నములన్నిటినీ దాటిస్తూ తండ్రికి సమీపంగా
చేర్చడంలో సహాయకారిగా అవుతుంది. అందుకే బాప్‌దాదా పిల్లలకు శుభాకాంక్షలు
తెలుపుతున్నారు. ఎంతగా శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసి ఇక్కడి వరకు చేరుకుంటారో
బాప్‌దాదాకు తెలుసు. అందువలన స్నేహమనే చేతులతో బాప్‌దాదా పిల్లలను సదా ఒత్తుతూ
ఉంటారు. ఎవరైతే అతి స్నేహీ పిల్లలుగా ఉంటారో వారి తల్లి - తండ్రి ప్రేమతో సదా
మాలిష్చేస్తారు కదా! బాప్‌దాదా పిల్లల భాగ్యము యొక్క తారలను చూస్తూ ఉంటారు. మీరు
మెరుస్తున్న నక్షత్రాలు. దేశ పరిస్థితి ఏమైనా, తండ్రి పిల్లలు సదా తండ్రి
స్నేహంలో ఇమిడి ఉన్న కారణంగా సురక్షితంగా ఉంటారు. బాప్‌దాదా ఛత్రఛాయ సదా తోడుగా
ఉంటుంది. మీరు ఇటువంటి చాలాకాలం తర్వాత కలిసిన గారాబు, అపురూపమైన పిల్లలు.
పిల్లలు అనేక ఉత్తరాల మాలను బాప్‌దాదా మెడలో వేశారు. పిల్లలందరికీ దీనికి
రిటర్న్‌లో(బదులు) బాప్‌దాదా ప్రియస్మృతులనిస్తున్నారు. ఎంత ప్రేమతో ఉత్తరాలు
వ్రాశారో, సమాచారమునిచ్చారో, అంతే స్నేహంతో వాటిని స్వీకరించారు. పిల్లలు
ధైర్యముంచితే తండ్రి సహాయము సదా ఉంది, సదా ఉండనే ఉంటుంది. మాల లభించింది మరియు
మాలలోని మణులను బాప్‌దాదా ఇప్పుడు కూడా స్మరణ చేస్తున్నారు. తనువుతో భలే దూరంగా
ఉన్నా మనసుతో మధువన నివాసులుగా ఉన్నారని బాప్‌దాదాకు తెలుసు. మనసు ద్వారా సదా
మన్మనాభవగా ఉన్న కారణంగా తండ్రికి సమీపంగా మరియు సన్ముఖంగా ఉన్నారు. ఇలా సమీపంగా
మరియు సన్ముఖంగా ఉండే పిల్లలను బాప్‌దాదా సన్ముఖంగా చూస్తూ పేరు పేరునా ప్రతి
ఒక్కరికి ప్రియస్మృతులు తెలుపుతున్నారు మరియు శ్రేష్ఠంగా అయ్యి శ్రేష్ఠంగా తయారు
చేసే సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వరదానాన్ని చాలాకాలం తర్వాత కలిసిన
ప్రియమైన పిల్లలందరికీ ఇస్తున్నారు. అందరూ తమ నామ సహితంగా ప్రియస్మృతులను
స్వీకరించండి.