విస్తారమును బిందువులో ఇమడ్చండి.
అందరినీ ఈ దేహము మరియు ప్రపంచము నుండి దూరంగా తీసుకుని
వెళ్ళేందుకు బాప్ దాదా ఈ సాకారీ దేహము మరియు ప్రపంచములోకి వస్తారు. దూరదేశవాసి
అందరినీ దూరదేశ నివాసులుగా చేసేందుకు వస్తారు. దూరదేశములో ఈ దేహము పనికిరాదు.
పావన ఆత్మ తన దేశములోకి బాబాతోపాటుగా వెళ్తుంది. మరి వెళ్ళేందుకు తయారయ్యారా
లేక ఇప్పటివరకు సర్దుకోవటంలో ఉండిపోయారా? ఒక స్థానము నుండి మరొక స్థానమునకు
పోతున్నప్పుడు విస్తారమును సర్దుకుని పరివర్తన చేస్తారు. మరి దూరదేశము లేక మీ
స్వీట్ హోముకు వెళ్ళేందుకు ఏ ఏర్పాట్లను చేసుకోవలసి ఉంటుంది? విస్తారమునంతటిని
బిందువులో ఇమడ్చవలసి ఉంటుంది. నింపుకునే శక్తి, సర్దుకునే శక్తిని అంతగా ధారణ
చేసారా? ఇప్పుడు క్షణములో నాతో రండి అని సమయప్రమాణంగా బాప్ దాదా నుండి
డైరెక్షన్ లభించినట్లయితే క్షణములో విస్తారమును ఇమడ్చగలరా? శరీర ప్రవృత్తి,
లౌకిక ప్రవృత్తి, సేవ ప్రవృత్తి, మీలో ఉండిపోయిన బలహీన సంకల్పాల మరియు
సంస్కారాల ప్రవృత్తి, అన్నిరకాల ప్రవృత్తుల నుండి అతీతులుగా మరియు బాబాతోటి
వెళ్ళే ప్రియమైనవారిగా అవ్వగలరా? లేక ఏదైనా ప్రవృత్తి తనవైపుకు ఆకర్షితము
చేస్తుందా? అన్నివైపుల నుండి అన్ని ప్రవృత్తుల తీరాలను వదిలేసారా లేక ఏదైనా
తీరము అల్పకాలికమైన ఆధారంగా అయ్యి బాబా ఆధారము నుండి లేక తోడు నుండి దూరము
చేస్తుందా? వెళ్ళాలి అని సంకల్పము చేసినట్లయితే, ఇప్పుడు వెళ్ళాలి అని
డైరెక్షన్ లభించినట్లయితే డబల్ లైటుగా అయ్యి ఎగిరే ఆసనములో స్థితులై ఎగరగలరా?
అటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని
ఆలోచిస్తారా? సర్దుకునే శక్తిని ఇప్పుడు కార్యములోకి తీసుకురాగలరా లేక నా సేవ,
నా సెంటరు, నా జిజ్ఞాసులు, నా లౌకిక పరివారము లేక లౌకిక కార్యము... ఈ
విస్తారమైతే గుర్తు రాదు కదా? ఈ సంకల్పమైతే రాదు కదా? ఇప్పుడు ఇటువంటి ఆలోచనలు
చెయ్యాలి, అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తారు... అని మీరు ఒక డ్రామాను చూపిస్తారు,
ఇలా డ్రామాలోలా తోడుగా వెళ్ళే సీటుని పొందే అధికారము నుండి వంచితులుగా అయితే
ఉండిపోరు కదా - ఇప్పుడైతే చాలా ఎక్కువ విస్తారములోకి పోతున్నారు, కానీ
విస్తారమునకు గుర్తు ఏమిటి? వృక్షము కూడా ఎప్పుడైతే అతి విస్తారమైపోతుందో,
విస్తారము తరువాత బీజములో ఇమిడిపోతుంది. మరి ఇప్పుడు సేవ విస్తారము చాలా
తీవ్రవేగంతో పెరుగుతూ ఉంది మరియు పెరిగేదే ఉంది, కానీ ఎంత విస్తారము వృద్ధిని
పొందుతుందో, అంతగా విస్తారము నుండి అతీతులు మరియు తోడుగా వెళ్ళే ప్రియమైనవారు,
ఈ విషయమును మర్చిపోవద్దు. ఏ తీరములోనూ ఆకర్షణ అనే త్రాడు ఉండిపోకూడదు. హద్దుకు
చెందిన త్రాళ్ళు అన్నీ వదిలిపోయి ఉండాలి అనగా అన్నింటి నుండి సెలవు తీసుకుని
ఉండండి. ఈరోజుల్లో మృత్యువు ఏర్పాట్లు ముందునుండే చేసుకుంటున్నారు కదా? మరి
సెలవు తీసుకున్నారు కదా! అలా అన్ని ప్రవృత్తుల బంధనాల నుండి ముందునుండే వీడ్కోలు
తీసుకోండి. సమాప్తి సమారోహమును చేసుకోండి. ఎగిరే కళ యొక్క విమాన ఆసనము సదా
సిద్ధముగా ఉండాలి. ఈరోజుల్లోని ప్రపంచములో కూడా యుద్ధము ప్రారంభమైనప్పుడు
అక్కడి రాజు కానీ లేక ప్రెసిడెంట్ కానీ, దేశమునుండి బయటపడేందుకు వారి కొరకు
ముందునుండే సాధనాలు తయారుగా ఉంటాయి. ఆ సమయములో ఈ ఏర్పాట్లు చెయ్యండి అని ఆర్డర్
ఇచ్చేందుకు కూడా మార్జిన్ ఉండదు. యుద్ధ సూచన రావడం మరియు పరిగెత్తడం... ఇలా
చేయనట్లయితే ఏమవుతుంది? ప్రెసిడెంట్ లేక రాజుకు బదులుగా జైలుపక్షిగా అయిపోతారు.
ఈరోజుల్లోని నిమిత్తంగా అయిన అల్పకాలిక అధికారీ ఆత్మలు కూడా ముందునుండే తమ
ఏర్పాట్లను చేసుకుంటారు. మరి మీరు ఎవరు? ఈ సంగమయుగ హీరో పాత్రధారులు అనగా విశేష
ఆత్మలు. మరి మీకందరికి కూడా ముందునుండే ఏర్పాట్లు ఉండాలా లేక ఆ సమయములో చేస్తారా?
మార్జిన్ కూడా క్షణంలోనే లభించేది ఉంది, మరేం చేస్తారు? ఆలోచించేందుకు కూడా
మార్జిన్ లభించదు. చేయాలా-వద్దా, ఇది చేయాలా-అది చేసేదా, ఇలా ఆలోచించేవారు
సహచరులకు బదులుగా గుంపులోనివారుగా అయిపోతారు కనుక అంతఃవాహక స్థితి అనగా
కర్మబంధన ముక్తము, కర్మాతీతము - ఇటువంటి కర్మాతీత స్థితియొక్క వాహనము అనగా
అంతిమ వాహనము, దీని ద్వారానే క్షణములో తోడుగా ఎగిరిపోతారు. వాహనము సిద్ధముగా
ఉందా? లేక సమయాన్ని లెక్కిస్తున్నారా? ఇప్పుడు ఇది అవ్వాలి, ఇది అవ్వాలి, దాని
తర్వాత అవుతుంది… ఇలా అయితే ఆలోచించటం లేదు కదా? అన్ని ఏర్పాట్లను చెయ్యండి.
సేవా సాధనాలను కూడా ఉపయోగించండి. క్రొత్త-క్రొత్త ప్లానులను కూడా తయారుచెయ్యండి,
ఫర్వాలేదు. కానీ తీరాలలో త్రాడును కట్టేసుకుని వదిలేయద్దు. ప్రవృత్తిలోకి వస్తూ
కమలముగా అవ్వాలన్నది మర్చిపోవద్దు. తిరిగి వెళ్ళేందుకు ఏర్పాట్లను మర్చిపోవద్దు.
సదా మీ అంతిమస్థితి యొక్క వాహనము - అతీతము మరియు ప్రియమైనవారిగా అయ్యే శ్రేష్ఠ
సాధనమును సేవా సాధనాలలో పడి మర్చిపోవద్దు. సేవ బాగా చెయ్యండి కానీ అతీతత్వము అనే
విశేషతను వదలద్దు. ఇప్పుడు ఈ అభ్యాసము యొక్క ఆవశ్యకత ఉంది. అయితే పూర్తిగా
అతీతంగా అన్నా అయిపోతారు, లేదంటే పూర్తిగా ప్రియమైనవారుగా అన్నా అయిపోతారు,
కనుక అతీతము మరియు ప్రేమల బ్యాలెన్స్ పెట్టండి. సేవ చెయ్యండి కానీ మేరేపన్(నాది
అనే భావన)నుండి అతీతులై చెయ్యండి. ఏం చెయ్యాలో అర్థమైందా? ఇప్పుడు
క్రొత్త-క్రొత్త త్రాళ్ళను కూడా తయారుచేసుకుంటున్నారు. పాతవి వదిలిపోయాయి.
తెలిసినా కూడా క్రొత్త త్రాళ్ళతో బంధించుకుంటున్నారు ఎందుకంటే అవి మెరుస్తున్న
త్రాళ్ళు. మరి ఈ సంవత్సరములో ఏం చెయ్యాలి? బాప్ దాదా సాక్షిగా అయ్యి పిల్లల ఆటను
చూస్తారు. త్రాళ్ళతో బంధించుకునే రేసులో ఒకరికంటే మరొకరు చాలా ముందుకు
పోతున్నారు కనుక విస్తారములోకి పోతూ సదా సారరూపములో ఉండండి.
వర్తమాన సమయపు సేవ రిజల్టులో క్వాంటిటీ చాలా బాగుంది
కానీ ఇప్పుడు ఆ క్వాంటిటీలో క్వాలిటీని నింపండి. స్థాపనా కార్యములో క్వాంటిటీ
కూడా అవసరము కానీ వృక్షములో ఆకుల విస్తారము ఎక్కువగా ఉండి ఫలాలు లేకపోతే
ఇష్టపడతారా? ఆకులు కూడా ఉండాలి మరియు ఫలాలు కూడా ఉండాలా లేక కేవలము ఆకులే ఉండాలా?
ఆకులు వృక్షానికి అలంకారము మరియు ఫలాలు సదాకాలపు జీవితమునకు ఆధారము కనుక ప్రతి
ఆత్మను ప్రత్యక్షఫల స్వరూపునిగా తయారుచెయ్యండి అనగా విశేష గుణాల, శక్తుల
అనుభవీమూర్తులుగా తయారుచెయ్యండి. వృద్ధి బాగుంది కానీ విఘ్నవినాశకులు, శక్తిశాలీ
ఆత్మగా అయ్యే విధిని నేర్పించేందుకు విశేష అటెన్షన్ ఇవ్వండి. వృద్ధితోపాటు
విధిని నేర్పించేందుకు, సిద్ధి స్వరూపులుగా తయారుచేసేందుకు కూడా విశేష అటెన్షన్.
స్నేహీలు, సహయోగులుగా యథాశక్తి అయ్యేదే ఉంది కానీ శక్తిశాలీ ఆత్మ. వీరు
విఘ్నాలను, పాత సంస్కారాలను ఎదిరించి మహావీరులుగా అవ్వాలి, దీనిపై ఇంకా
విశేషమైన అటెన్షన్. స్వరాజ్య అధికారుల నుండి విశ్వ రాజ్య అధికారులు, ఇటువంటి
వారసత్వ క్వాలిటీ కలిగినవారిని పెంచండి. సేవాధారులుగా చాలామంది అయ్యారు కానీ
సర్వ శక్తులు కల ఇటువంటి విశేషతా సంపన్న ఆత్మలను విశ్వ స్టేజ్ పైకి తీసుకురండి.
ఈ సంవత్సరము ప్రతి ఆత్మపట్ల విశేష అనుభవీమూర్తులుగా
అయ్యి, విశేష అనుభవాల గనిగా అయ్యి, అనుభవీమూర్తులుగా తయారుచేసే మహాదానము
చెయ్యండి, దీని ద్వారా ప్రతి ఆత్మ అనుభవము ఆధారముతో అంగద సమానంగా అయిపోతుంది.
నడుస్తున్నారు, చేస్తున్నారు, వింటున్నారు, వినిపిస్తున్నారు... ఇలా కాదు కానీ
అనుభవాల ఖజానాను పొందాము - ఇటువంటి పాటను పాడుకుంటూ సంతోషపు ఊయలలో ఊగుతూ ఉండండి.
ఈ సంవత్సరము - సేవ ఉత్సవాలతోపాటు ఎగిరే కళయొక్క
ఉత్సాహము పెరుగుతూ ఉండాలి. కనుక సేవ ఉత్సవముతోపాటుగా ఉత్సాహము అవినాశిగా ఉండాలి,
ఇటువంటి ఉత్సవమును కూడా జరుపుకోండి. అర్థమైందా? సదా ఎగిరేకళ యొక్క ఉత్సాహములో
ఉండాలి మరియు సర్వుల ఉత్సాహమును పెంచాలి.
ఈ సంవత్సరము ప్రతి ఒక్కరూ - భిన్న-భిన్న వర్గాలలోని
ఆత్మల సేవ చేసి వెరైటీ వర్గాలలోని ప్రతి ఆత్మను బాబాకు చెందిన వారిగా తయారుచేసి
వెరైటీ వర్గముతో కూడిన పుష్పగుచ్ఛాన్ని తయారుచేసి బాబా ముందుకు తీసుకురావాలి
అన్న ఈ లక్ష్యమును పెట్టుకోవాలి. కానీ అందరూ ఆత్మిక గులాబీలుగా ఉన్నారు. వృక్షము
వెరైటీదిగా ఉన్నా, వి.ఐ.పి.లు ఉన్నారు, వేరువేరు వృత్తులు కలవారు కూడా ఉన్నారు,
సాధారణులు కూడా ఉన్నారు, పల్లెటూరి వారు కూడా ఉన్నారు కానీ అందరినీ అనుభవాల
గనిద్వారా అనుభవీమూర్తులుగా తయారుచేసి ప్రాప్తి స్వరూపులుగా తయారుచేసి ఎదురుగా
తీసుకురండి - వీరినే ఆత్మిక గులాబీలు అని అంటారు. పుష్పగుచ్ఛాన్ని తయారుచేయాలి
కానీ మేరాపన్(నాది అన్న భావనను) తీసుకురావద్దు. నా పుష్పగుచ్ఛము అన్నింటికంటే
బాగుంది - ఇలా అంటే ఆత్మిక గులాబిగా అవ్వలేరు. ''మేరాపన్(నాది అన్న భావన)ను
తెచ్చినట్లయితే పుష్పగుచ్ఛము వాడినట్లు'' కనుక తెలుసుకోండి - బాబా పిల్లలు, నా
వారు అన్నదానిని మర్చిపోండి. ఒకవేళ నావారుగా చేసుకున్నట్లయితే ఆ ఆత్మలను కూడా
అనంతమైన అధికారము నుండి దూరము చేస్తారు. ఆత్మ ఎంత గొప్పదైనాగానీ సర్వజ్ఞమనైతే
అనరు. సాగరము అని అనరు కనుక ఏ ఆత్మను కూడా అనంతమైన వారసత్వమునుండి వంచితులుగా
చెయ్యకూడదు. లేదంటే ఆ ఆత్మలే ముందు ముందు మమ్మల్ని ఎందుకు వంచితులుగా చేసారు అని
ఫిర్యాదు చేస్తారు. వారి ఏడుపును ఆ సమయములో సహించలేకపోతారు. దుఃఖమయ మనస్సుతో
అంతగా ఏడుస్తారు, కనుక ఈ విశేష విషయమును విశేషమైన అటెన్షనుతో అర్థం
తెలుసుకోవాలి. విశేష సేవ ఎంతైనా చెయ్యండి. తనువు శక్తి, మనసు శక్తి, ధన శక్తి,
సహయోగమును ఇచ్చే శక్తి, ఏ శక్తులు ఉన్నా, సమయముది కూడా శక్తే - వీటన్నింటినీ
సమర్థ కార్యములో పెట్టండి. ముందు గురించి ఆలోచించకండి. ఎంత పెడితే అంత జమ
అవుతుంది. మరి ఏం చెయ్యాలో అర్థమైందా! సర్వ శక్తులను పెట్టండి. స్వయమును సదా
ఎగిరే కళలో ఎగిరింపచెయ్యండి మరియు ఇతరులను కూడా ఎగిరే కళలోకి తీసుకుపోండి.
ఉత్సాహమునకు చెందిన స్లోగన్ కూడా లభించింది కదా!
ఈ సంవత్సరము డబల్ ఉత్సవమును జరుపుకోవాలి మరియు ఆత్మిక
ఆత్మలతో కూడిన పుష్పగుచ్ఛమును ప్రతి ఒక్కరూ తయారుచెయ్యాలి. ఈరోజు వచ్చినవారు
కూడా వెరౖటీ పుష్పగుచ్ఛమే. నలువైపుల నుండి వచ్చారు కదా. దేశ-విదేశములకు చెందిన
వెరౖటీ పుష్పగుచ్ఛమైంది కదా! డబల్ విదేశీయులు కూడా చివరి సమయములో భాగాన్ని
తీసుకున్నారు. వచ్చినందుకు బాప్ దాదా కూడా అభినందనలను ఇస్తారు. అభినందన కూడా
అందరికీ లభించింది కనుక కలవటమైపోయింది కదా! అందరూ కలిసారు. అభినందనలను
తీసుకున్నారు, ఇంకేం మిగిలి ఉంది? టోలీ. మరి అందరూ లైనులో రావాలి, టోలీ
తీసుకుని వెళ్ళాలి. అటువంటి సమయము వచ్చేది ఉంది. ఇంత పెద్ద హాలును
తయారుచేస్తున్నప్పుడు అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి? ఎప్పుడూ ఒకే
పద్ధతిలో అయితే నడవదు కదా! ఈసారి విశేషంగా భారతవాసి పిల్లల ఫిర్యాదును పూర్తి
చేసారు. ప్రతి సీజనుకు దాని-దాని పద్ధతులు, వ్యవహారాలు ఉంటాయి. రాబోయే
సంవత్సరములో ఏమవుతుందో అప్పుడు చూడండి. ఇప్పుడే చెప్పినట్లయితే ఇక మజా రాదు.
అందరూ పుష్పగుచ్ఛాల సహితంగా వస్తారు కదా. క్వాలిటీని తయారుచేసుకుని రావాలి -
ఎందుకంటే క్వాలిటీ సహితమైన క్వాలిటి టీముకే నంబర్ లభిస్తుంది. మామూలుగా అయితే
గుంపును తయారుచెయ్యటంలో నేతలు కూడా చాలా తెలివిగా ఉంటారు. క్వాంటిటీ ఉండాలి కానీ
అది క్వాలిటీ సహితంగా ఉండాలి. అటువంటి పుష్పగుచ్ఛాన్ని తీసుకురావాలి. కేవలము
ఆకులతో కూడిన పుష్పగుచ్ఛాన్ని తీసుకురావద్దు. అచ్ఛా!
ఇలా సదా అంతిమ వాహనమునకు ఎవర్ రెడీలు, సర్వ ఆత్మలను
అనుభవీలుగా తయారుచేసే మహాదానులు, సదా వరదాతలు, విధాతలు, అనంతమైన తండ్రి నుండి
అనంతమైన వారసత్వమును ఇప్పించేందుకు నిమిత్తముగా అయిన ఆత్మలు, సదా
సేవాధారులతోపాటుగా శక్తిశాలి ఆత్మలుగా తయారుచేసేవారు, వృద్ధితో పాటు విధిపూర్వక
ప్రాప్తుల సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు, ఇలా బాబా సమానమైన సేవ చేస్తూ, సేవలో
అతీతము మరియు బాబాతో వెళ్ళే ప్రియమైనవారు అయిన ఇటువంటి సమీప మరియు సమాన ఆత్మలకు
బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవాధారులతో - ఆత్మలకు బాబా పరిచయమును ఇచ్చి బాబా
వారసత్వమునకు అధికారులుగా తయారుచేసేందుకు నిమిత్తమైన సేవాధారులు ఒక రకం, మరొక
రకం వారు యజ్ఞ సేవాధారులు. మరి ఈ సమయములో మీరందరూ యజ్ఞ సేవ యొక్క పాత్రను
అభినయించేవారు. యజ్ఞ సేవ యొక్క మహత్వము ఎంత పెద్దది! దీనిని గురించి మీకు బాగా
తెలుసు. యజ్ఞములో ఒక్కొక్క పైసాకు ఎంత మహత్వము ఉంది? ఒక్కొక్క పైసా ఒక్కొక్క
బంగారు నాణెముతో సమానము. ఒకవేళ ఎవరైనా పైసా అంత సేవ చేసినా బంగారు నాణేలతో
సమానమైన సంపాదన జమ అయిపోతుంది. కనుక సేవ చెయ్యలేదు కానీ జమ చేసుకున్నారు.
సేవాధారులకు వర్తమాన సమయములో ఒకటేమో మధువన వరదానీ భూమిలో ఉండే అవకాశమనే భాగ్యము
లభించింది, రెండు- సదా శ్రేష్ఠ వాతావరణముయొక్క భాగ్యము, మూడు-సదా సంపాదనను జమ
చేసుకునే భాగ్యము. మరి ఎన్నిరకాలైన భాగ్యాలు సేవాధారులకు స్వతహాగనే
ప్రాప్తిస్తాయి! మేము ఇంత భాగ్యవంతులమైన సేవాధారీ ఆత్మలము అని భావించి సేవ
చేస్తున్నారా? ఇంత ఆత్మిక నషా స్మృతిలో ఉంటుందా లేక సేవ చేస్తూ-చేస్తూ
మర్చిపోతారా? సేవాధారులు తమ శ్రేష్ఠ భాగ్యము ద్వారా ఇతరులకు కూడా
ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించేందుకు నిమిత్తులుగా అవ్వవచ్చు. సేవాధారులందరూ, ఎంత
సమయము ఏ సేవలో ఉన్నాగానీ నిర్విఘ్నలుగా ఉండాలి. మనసులో కూడా నిర్విఘ్నము.
ఏవిధమైన విఘ్నము లేక అలజడి ఎప్పుడూ రాకూడదు, ఇటువంటి వారినే సేవలో
సఫలతామూర్తులు అని అంటారు. ఎలాంటి సంస్కారాలు కానీ, ఎలాంటి పరిస్థితులు కానీ
కిందపైన చేస్తున్నాకానీ ఎవరైతే సదా బాబాతోటి ఉంటారో, తోడుగా ఫాలో ఫాదర్ చేస్తారో,
సదా సీ ఫాదరుగా ఉంటారో అటువంటివారు సదా నిర్విఘ్నులుగా ఉంటారు. ఒకవేళ ఎక్కడైనా,
ఏ ఆత్మనైనా చూసినా, ఆత్మలను ఫాలో చేసినా అలజడిలోకి వచ్చేస్తారు. కనుక
సేవాధారులు సేవలో సఫలతను పొందేందుకు ఆధారము - సీ ఫాదర్ లేక ఫాలో ఫాదర్. మరి
అందరూ సత్యమైన మనసుతో సేవ చేసారు కదా? సేవ చేస్తున్నప్పుడు స్మృతి చార్టు ఎలా
ఉండింది! అచ్ఛా, మీ శ్రేష్ఠ భాగ్యమును తయారుచేసుకున్నారు. రిజల్టు మంచిగా ఉంది.
యజ్ఞ సేవ అవకాశము లభించిన పెద్ద భాగ్యవంతులైన ఆత్మలు. మీ స్మృతిచిహ్నము
ఉండేటట్లుగా అటువంటి కర్తవ్యమును చేసి వెళ్ళండి, మరల ఎప్పుడైనా అవసరము
ఉన్నప్పుడు పిలిపించటం జరుగుతుంది. అలసిపోనివారుగా అయ్యి ఎవరైతే సేవ చేస్తారో
వారికి వర్తమానము మరియు భవిష్యత్తు రెండింటిలో జమ అయిపోతుంది. అందరూ తమ-తమ
పాత్రను చాలా మంచిగా అభినయించారు.