త్యాగి, మహాత్యాగిల వ్యాఖ్యానము
బాప్ దాదా బ్రాహ్మణ ఆత్మలందరిలో సర్వస్వ త్యాగి
పిల్లలను చూస్తున్నారు. మూడు రకాలైన పిల్లలు ఉన్నారు - ఒకరు త్యాగులు,
రెండవవారు మహా త్యాగులు, మూడవవారు సర్వ త్యాగులు. ముగ్గురూ త్యాగులే కానీ నంబర్
వారిగా ఉన్నారు.
త్యాగి - వారు జ్ఞానము మరియు యోగములద్వారా తమ పాత
సంబంధాలు, పాత ప్రపంచము, పాత సంపర్కముల ద్వారా ప్రాప్తించిన అల్పకాలికమైన
ప్రాప్తులను త్యాగము చేసి బ్రాహ్మణ జీవితమును అనగా యోగీ జీవితమును సంకల్పము
ద్వారా తమదిగా చేసుకున్నారు, అనగా పాత జీవితముకంటే ఈ యోగీ జీవితము శ్రేష్టమైనది
అని ఈ ధారణలన్నింటినీ చేసారు. అల్పకాలికమైన ప్రాప్తి కంటే ఈ సదాకాలికమైన
ప్రాప్తిని ప్రాప్తి చేసుకోవటము ఆవశ్యకము. మరియు దాని ఆవశ్యకతను అర్థం
చేసుకున్న ఆధారముపై జ్ఞానయోగాల అభ్యాసకులుగా అయ్యారు. బ్రహ్మకుమారీలు,
బ్రహ్మకుమారులు అని పిలిపించుకునేందుకు అధికారులుగా అయ్యారు. కానీ
బ్రహ్మకుమారీలు, బ్రహ్మకుమారులుగా అయిన తరువాత కూడా పాత సంబంధాలు, పాత సంకల్పాలు
మరియు పాత సంస్కారాలు సంపూర్ణంగా పరివర్తన కాలేదు కానీ పరివర్తన కావాలన్న
యుద్ధములో సదా తత్పరులై ఉంటారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ సంస్కారము,
ఇప్పుడిప్పుడే పాత సంస్కారాలను పరివర్తిన చేసుకునే యుద్ధ స్వరూపములో ఉంటారు.
త్యాగులుగా అయ్యారు అని వీరిని అంటారు కానీ సంపూర్ణ పరివర్తన చెయ్యలేదు. త్యాగము
చెయ్యటమే మహా భాగ్యవంతులుగా అవ్వటము అని కేవలము ఆలోచించి అర్థం చేసుకున్నవారిగా
అయ్యారు. కానీ చేసేందుకు ధైర్యము తక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యము యొక్క
సంస్కారము పదే-పదే ఇమర్జ్ అవ్వటం వలన త్యాగులుగా అవ్వడముతోపాటుగా విశ్రాంతి
అభిలాషకులుగా కూడా అవుతారు. అర్థం చేసుకుంటుంటారు కూడా, నడుస్తుంటారు కూడా,
పురుషార్థమును కూడా చేస్తుంటారు, బ్రాహ్మణ జీవితమును వదలనుకూడా వదలలేరు,
బ్రాహ్మణులుగానే అవ్వాలి అన్న సంకల్పము కూడా దృఢంగా ఉంటుంది. మాయ లేక మాయావీ
సంబంధాలు పాత జీవితము కొరకు తమవైపుకు ఆకర్షితము కూడా చేస్తుంటాయి, అయినాకూడా
బ్రాహ్మణ జీవితమే శ్రేష్టమైనది అన్న ఈ సంకల్పములో స్థిరంగా ఉంటారు. ఇందులో
నిశ్చయబుద్ధి చాలా దృఢంగా ఉంటుంది. కానీ సంపూర్ణ త్యాగిగా అయ్యేందుకు
రెండురకాలైన విఘ్నాలు ముందుకు పోనివ్వవు. అవి ఏవి? ఒకటేమో-సదా ధైర్యమును
ఉంచలేకపోతారు అనగా విఘ్నాలను ఎదిరించే శక్తి తక్కువగా ఉంటుంది.
రెండవది-నిర్లక్ష్యము యొక్క స్వరూపము. విశ్రాంతిగా, హాయిగా ఉండేందుకు ఇష్టపడి
నడవటము. చదువు, స్మృతి, ధారణ మరియు సేవ అన్ని సబ్జెక్ట్ లలో చేస్తున్నారు,
నడుస్తున్నారు, చదువుతున్నారు కానీ నిదానంగా! సంపూర్ణ పరివర్తన చేసుకునేందుకు
శస్త్రధారీ శక్తి స్వరూపము యొక్క లోటు ఉంటుంది. స్నేహులే కానీ శక్తి స్వరూపులు
కారు. మాస్టర్ సర్వ శక్తివంతుల స్వరూపములో స్థితులవ్వలేకపోతారు కనుక
మహాత్యాగులుగా అవ్వలేకపోతారు. వీరు త్యాగీ ఆత్మలు.
మహాత్యాగి - సంబంధాలు, సంకల్పాలు మరియు సంస్కారాలు
అన్నింటినీ పరివర్తన చేసుకునేందుకు సదా ధైర్యము మరియు ఉల్లాసములో ఉంటారు. పాత
ప్రపంచము, పాత సంబంధాలనుండి సదా అతీతముగా ఉంటారు. మహాత్యాగీ ఆత్మలు ఈ పాత
ప్రపంచము మరియు పాత సంబంధాలు అన్నీ మరణించే ఉన్నాయి అని మహాత్యాగీ ఆత్మలు సదా
అనుభవము చేస్తాయి. అందుకొరకు యుద్ధము చేయవలసిన అవసరము ఉండదు, సదా స్నేహులు,
సహయోగులు, సేవాధారీ శక్తి స్వరూపపు స్థితిలో స్థితులై ఉంటారు. ఇంకేం మిగిలి
ఉంటుంది! మహాత్యాగమునకు ఫలస్వరూపముగా త్యాగము యొక్క భాగ్యముగా - మహాదాని,
మహాయోగి, శ్రేష్ట సేవాధారిగా అవుతారు. ఈ భాగ్యము యొక్క అధికారమును అక్కడక్కడా
విరుద్ధ నషా రూపములో ఉపయోగిస్తారు. గత జీవితాన్ని సంపూర్ణ త్యాగము చేసారు కానీ
త్యాగమును కూడా త్యాగము చెయ్యలేదు. ఇనుప సంకెళ్ళనైతే త్రెంచేసుకున్నారు, ఇనుప
యుగమువారినుండి బంగారుయుగమువారిగా అయితే అయ్యారు, కానీ అక్కడక్కడా పరివర్తన
మనోహర జీవితము యొక్క బంగారు సంకెళ్ళలో బంధింపబడుతుంది. ఆ బంగారు సంకెళ్ళు ఏవి?
''నేను'' మరియు ''నాది''. నేను మంచి జ్ఞానిని, నేను జ్ఞాన స్వరూప ఆత్మను, యోగ
స్వరూప ఆత్మను. ఈ బంగారు సంకెళ్ళు అక్కడక్కడ సదా బంధనముక్తముగా అవ్వనివ్వవు.
మూడు రకాల ప్రవృత్తులు ఉన్నాయి - 1. లౌకిక సంబంధాలు మరియు కార్యముయొక్క
ప్రవృత్తి 2. తమ శరీర ప్రవృత్తి 3. సేవా ప్రవృత్తి.
త్యాగులు లౌకిక ప్రవృత్తి నుండి దూరమయ్యారు కానీ దేహ
ప్రవృత్తి అనగా తనను తానే నడిపించుకోవటము మరియు తయారుచేసుకోవటములో బిజీగా ఉండటము
మరియు దేహభానము యొక్క నేచర్ కు వశీభూతమై ఉండటము మరియు ఆ నేచర్ కారణంగానే
ధైర్యహీనులుగా అవుతుంటారు. తెలుసుకున్నాను కూడా, అనుకుంటాను కూడా కానీ నా నేచర్
ఇది అని వారు స్వయము కూడా వర్ణన చేస్తారు. ఇది కూడా దేహభానము యొక్క, దేహము
యొక్క ప్రవృత్తి. ఇందులో శక్తిస్వరూపులై ఈ ప్రవృత్తి నుండి కూడా నివృత్తులుగా
అయిపోవాలి - దానిని చెయ్యలేకపోతారు. త్యాగిని గురించిన విషయము వినిపించాము కానీ
మహాత్యాగులు లౌకిక ప్రవృత్తి, దేహ ప్రవృత్తి రెండింటి నుండి నివృత్తమైపోతారు -
కానీ సేవ ప్రవృత్తిలో అక్కడక్కడ నివృత్తిగా అయ్యేందుకు బదులుగా ఇరుక్కుపోతారు.
ఇటువంటి ఆత్మలకు తమ దేహ భానము కూడా విసిగించదు ఎందుకంటే రాత్రింబవళ్ళు సేవలో
తన్మయులై ఉంటారు. దేహ ప్రవృత్తినుండైతే దూరమైపోయారు. ఈ రెండింటి త్యాగముల
భాగ్యముగా జ్ఞాని మరియు యోగిగా అయ్యారు, శక్తుల ప్రాప్తి, గుణాల ప్రాప్తి
లభించింది. బ్రాహ్మణ పరివారములో ప్రసిద్ధ ఆత్మలుగా అయ్యారు. సేవాధారులలో
వి.ఐ.పి.లుగా అయ్యారు. మహిమలనే పుష్ప వర్షము మొదలైపోయింది. మాననీయ మరియు
గాయనీయ యోగ్య ఆత్మలుగా అయ్యారు కానీ ఈ సేవా ప్రవృత్తి యొక్క విస్తారమేదైతే ఉందో,
ఆ విస్తారములో చిక్కుకొనిపోతారు. ఈ సర్వ ప్రాప్తులను కూడా మహాదానిగా అయ్యి
ఇతరులకు దానము ఇచ్చేందుకు బదులుగా స్వయమే స్వీకరిస్తారు. కనుక నేను మరియు నాది
అనే శుద్ధ భావమనే బంగారు సంకెళ్ళు తయారౌతాయి. మేము మా గురించి చెప్పటం లేదు,
సేవ గురించి చెప్తున్నాము, నేను యోగ్య టీచర్ను అని నా గురించి చెప్పటం లేదు కానీ
లోకులు నన్ను కోరుకుంటున్నారు, మీరే సేవ చెయ్యండి అని జిజ్ఞాసులు అంటారు,
నేనైతే అతీతంగా ఉన్నాను కానీ ఇతరులు నన్ను ప్రియమైనవారిగా చేసుకుంటారు అని
భావము మరియు మాటలు చాలా శుద్ధంగా ఉంటాయి. దీనినేమంటారు? బాబాను చూసారా లేక
మిమ్మల్ని చూసారా? మీ జ్ఞానము మంచిగా అనిపిస్తుంది, మీ సేవ పద్ధతి మంచిగా
అనిపిస్తుంది, మరి బాబా ఎక్కడకు పోయారు? బాబాను పరంధామ నివాసిగా చేసేసారా! ఈ
భాగ్యమును కూడా త్యాగము చేయాలి. ఇందులో మీరు కనిపించకూడదు, బాబాయే కనిపించాలి.
మహానాత్మ ప్రియులుగా తయారుచెయ్యకండి, పరమాత్మ ప్రియులుగా తయారుచెయ్యండి. ఇతర
ప్రవృత్తిని దాటేసి, ఈ చివరి ప్రవృత్తిలో సర్వస్వ త్యాగులుగా అవ్వలేదు అని
వీరినే అంటారు. శుద్ధ ప్రవృత్తి యొక్క అంశము మిగిలిపోయింది. కనుక మహా
భాగ్యవంతులుగా అయితే అయ్యారు కానీ సర్వస్వత్యాగిగా అవ్వలేదు. మరి రెండవ నంబర్
లోని మహాత్యాగి గురించి విన్నారా! ఇక మిగిలింది సర్వస్వ త్యాగి.
ఇది త్యాగము యొక్క కోర్సులోని లాస్ట్ సో సంపన్న పాఠము.
చివరి పాఠము మిగిలిపోయింది. దానిని మరల వినిపిస్తాము ఎందుకంటే 83 లో
మహాయజ్ఞమునైతే చేస్తున్నారు మరియు మహా స్థానములో చేస్తున్నారు కనుక అందరూ ఏదో
ఒకటి ఆహుతినైతే వేస్తారు కదా లేక హాల్ ను తయారుచేసే ఏర్పాట్లనే చేస్తారా!
ఇతరుల సేవనైతే చేస్తారు. బాబా ప్రత్యక్షతా శబ్దమును ప్రసిద్ధము చేసేందుకు
పెద్ద-పెద్ద మైకులను కూడా తీసుకువస్తారు. ప్లాన్ నైతే తయారుచేసారు కదా! కానీ
బాబా ఒంటరిగా ప్రత్యక్షమవుతారా లేక శివ శక్తులతో కలిసి ఇరువురూ ప్రత్యక్షమవుతారా!
శక్తి సేనలో ఇరువురూ(మగవారు-ఆడవారు) వస్తారు. కనుక బాబా పిల్లల సహితంగా
ప్రత్యక్షమవుతారు. మైక్ ద్వారా శబ్దము ప్రసిద్ధమయ్యేందుకైతే ఆలోచించారు, కానీ
ఎప్పుడైతే విశ్వములో శబ్దము ప్రసిద్ధమైపోతుందో మరియు ప్రత్యక్షతా పరదా
తొలగించబడుతుందో అప్పుడు పరదా లోపల ప్రత్యక్షమయ్యే మూర్తులు కూడా సంపన్నంగా
ఉండాలి కదా, లేకపోతే పరదా తీసినప్పుడు కొందరు తయారవుతూ ఉంటారు, కొందరు
కూర్చుంటుంటారు, ఇలాటిం సాక్షాత్కారమైతే చేయించరు కదా! కొందరు శక్తి స్వరూపపు
ఢోలును తీసుకుంటూ ఉంటారు, కొందరు కత్తిని పట్టుకుంటూ ఉంటారు, ఇటువంటి ఫొటోనైతే
తియ్యకూడదు కదా. మరి ఏం చెయ్యవలసి ఉంటుంది? సంపూర్ణ స్వాహా! దీనికొరకు కూడా
ప్రోగ్రామ్ తయారుచేసుకోవలసి ఉంటుంది కదా. కనుక మహాయజ్ఞములో ఈ బంగారు సంకెళ్ళను
కూడా స్వాహా చెయ్యాలి. కానీ దానికి ముందు ఇప్పటి నుండే అభ్యాసము కావాలి. 1983
లో చేస్తాము అని అనడం కాదు. ఏవిధంగా మీరు సేవాధారులుగా అయితే ముందునుండే అవుతారు,
సమర్పణ సమారోహము అనేది తరువాత జరుగుతుంది. అలా ఇక్కడ కూడా సర్వ స్వాహా
సమారోహమును 1983 లో చెయ్యండి, కానీ బహుకాలపు అభ్యాసము కావాలి. అర్థమైందా! అచ్ఛా.
ఇటువంటి బాబా సమానమైన సర్వస్వ త్యాగులు, సదా బ్రహ్మా బాబా సమానముగా
ప్రాప్తించిన భాగ్యమును కూడా దానము చేసే మహాదానులకు, ఇటువంటి సదా బాబా యొక్క
విశ్వాసపాత్రులకు, ఆజ్ఞాకారులకు, బాబాను అనుసరించే శ్రేష్ట ఆత్మలకు, బాప్ దాదాల
ప్రియస్మృతులు మరియు నమస్తే....