సత్యమైన వైష్ణవులు అనగా సదా గుణగ్రాహకులు
ఈరోజు బాప్ దాదా మాలను తయారుచేస్తున్నారు. ఏ మాల?
శ్రేష్ట ఆత్మలైన ప్రతి ఒక్కరి శ్రేష్ట గుణాల మాలను తయారుచేస్తున్నారు -
ఎందుకంటే శ్రేష్టమైన తండ్రికి చెందిన శ్రేష్టమైన పిల్లలు ప్రతి ఒక్కరిలో వారి
వారి విశేషతలు ఉన్నాయి అన్నది బాప్ దాదాకు తెలుసు. వారి వారి గుణాల ఆధారముతో
సంగమయుగములో శ్రేష్ట ప్రాలబ్ధమును పొందుతున్నారు. బాప్ దాదా ఈరోజు విశేషంగా
కాల్బలము గ్రూప్ లోని వారి గుణాలను చూస్తున్నారు. పురుషార్థములో చివరి గ్రూప్
అని అన్నా గానీ వారిలో కూడా తప్పకుండా విశేష గుణాలు ఉన్నాయి మరియు ఆ విశేష
గుణాలే ఆ ఆత్మలు బాబాకు చెందినవారిగా అవ్వటానికి విశేష ఆధారము. కనుక బాప్ దాదా
మొదటి నంబర్ నుండి చివరి నంబర్ వరకు వెళ్ళలేదు. కానీ చివరినుండి మొదిటి వరకు
గుణాలను చూసారు. పూర్తి చివరి నంబర్ లో కూడా గుణవంతులు ఉన్నారు. పరమాత్మ
సంతానమైన వారిలో ఎటువంటి గుణాలు లేకుండా ఉండటము, ఇలా ఉండజాలదు. ఆ గుణము
ఆధారముతోనే బ్రాహ్మణ జన్మలో జీవిస్తున్నారు అనగా బ్రతికి ఉన్నారు. డ్రామా
అనుసారంగా ఆ గుణమే ఉన్నతోన్నతుడైన తండ్రికి చెందిన సంతానముగా తయారుచేసింది. ఆ
గుణము కారణంగానే ప్రభు పసందులుగా అయ్యారు, కనుక గుణాల మాలను తయారుచేస్తూ ఉన్నారు.
అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మలోని గుణాన్ని చూడటం ద్వారా శ్రేష్ట ఆత్మ అనే భావము
సహజంగా మరియు స్వతహాగా ఉంటుంది. ఎందుకంటే గుణమునకు ఆధారముగా ఉన్నదే శ్రేష్ట
ఆత్మ. చాలామంది ఆత్మలు గుణాన్ని తెలిసియుండి కూడా జన్మజన్మలుగా మురికినే చూసే
అభ్యాసులుగా ఉన్న కారణంగా గుణాన్ని చూడకుండా అవగుణాన్నే చూస్తారు. కానీ
అవగుణాన్ని చూడటము, అవగుణాన్ని అలవరచుకోవటము ఎటువంటి తప్పంటే, స్థూలములో అశుద్ధ
భోజనమును తినటం లాంటిది. స్థూలమైన భోజనములో ఒకవేళ ఏదైనా అశుద్ధమైన ఆహారాన్ని
స్వీకరించినట్లయితే అది తప్పని భావిస్తారు కదా. ఆహారపానీయాలను తీసుకునే
విధానములో బలహీనునిగా ఉన్నాను అని వ్రాస్తారు కదా. కనుక అలా స్వీకరించటము తప్పని
అనుకుంటారు కదా! అలాగే ఒకవేళ ఎవరిలోని అవగుణాన్నైనా లేక బలహీనతనైనా స్వయములో
ధారణ చేసినట్లయితే అశుద్ధమైన భోజనాన్ని తినేవారు అని భావించండి. సత్యమైన
వైష్ణవులు కారు, విష్ణు వంశీయులు కారు కానీ రామ సేనగా అయిపోతారు. కనుక సదా గుణ
గ్రహణ చేసే గుణమూర్తులుగా అవ్వండి.
బాప్ దాదా ఈరోజు పిల్లల చతురత యొక్క ఆటను చూస్తున్నారు.
గుర్తుకొస్తుంది కదా - మీ ఆట! అన్నిటికంటే పెద్ద విషయము, ఇతరుల అవగుణాన్ని
చూడటము, తెలుసుకోవటము. దీనిని చాలా తెలివైనదిగా భావిస్తారు. దీనినే నాలెడ్జ్
ఫుల్ గా భావిస్తారు. కానీ తెలుసుకోవటము అనగా మారటము. ఒకవేళ తెలుసుకున్నా కూడా,
రెండు క్షణాల కొరకు నాలెడ్డ్ ఫుల్ గా కూడా అయ్యారు, కానీ నాలెడ్జ్ ఫుల్ అయ్యి
ఏం చేసారు? నాలెడ్జ్ ను లైట్ మరియు మైట్ అని అంటారు. ఇది అవగుణము అని అనైతే
తెలుసుకున్నారు కానీ నాలెడ్జ్ యొక్క శక్తి ద్వారా స్వయములోని మరియు ఇతరులలోని
అవగుణాలను భస్మము చేసారా? పరివర్తన చేసారా? మారి చూపారా లేక మార్చి చూపారా లేక
ప్రతీకారము తీర్చుకున్నారా! ఒకవేళ నాలెడ్జ్ యొక్క లైట్ - మైట్లను కార్యములోకి
తేనట్లయితే మరి దానిని తెలుసుకోవటము అంటారా, నాలెడ్జ్ ఫుల్ అని అంటారా? జ్ఞానము
లేకుండా లైట్ - మైట్లను ఉపయోగించటము ద్వాపర యుగములోని శాస్త్రవాదుల
శాస్త్రజ్ఞానము వంటిది. ఇలా తెలుసుకునే వారికంటే అవగుణాలను తెలుసుకోనివారే చాలా
మంచివారు. బ్రాహ్మణ పరివారములో పరస్పరములోని అటువంటి ఆత్మలను తమాషాకు
బుద్ధు(మూర్ఖులు) అని భావిస్తారు. నువ్వు తెలివితక్కువవాడివి, ఏమీ తెలియదు అని
పరస్పరము అంటారు. కానీ ఈ విషయములో బుద్ధుగా అవ్వటము మంచిది. అవగుణాలను చూడరు,
వాటిని అనుసరించరు, వాణిద్వారా వాటిని వర్ణన చేస్తూ పరచింతన చేసేవారి లిస్ట్
లోకీ రారు. అవగుణాలైతే బురద కదా! ఒకవేళ చూసినా కూడా మాస్టర్ జ్ఞాన సూర్యులుగా
అయ్యి చెత్తను మండించే శక్తి ఉన్నట్లయితే శుభచింతకులుగా అవ్వండి. బుద్ధిలో ఏ
కొంచెమైనా చెత్త ఉన్నట్లయితే శుద్ధమైన బాబా స్మృతి నిలవజాలదు. ప్రాప్తి
చెయ్యలేరు. చెత్తను ధారణ చేసే అలవాటు ఒకసారి అయిందంటే ఇక పదే-పదే బుద్ధి చెత్త
వైపుకు, కోరుకోకపోయినాగానీ పోతూ ఉంటుంది. మరి దాని రిజల్టు ఏమవుతుంది? అది
నేచురల్ సంస్కారమైపోతుంది. మరల ఆ సంస్కారాన్ని మార్చుకోవటంలో శ్రమ
పడాల్సివస్తుంది మరియు సమయము కూడా పడుతుంది. ఇతరుల అవగుణాన్ని వర్ణన చెయ్యటము
అనగా స్వయము కూడా పరచింతనకు చెందిన అవగుణానికి వశీభూతులవ్వటమని అర్థము. ఇతరుల
బలహీనతను, లోపాలను వర్ణించటము అనగా తమ ఇముడ్చుకునే శక్తిలోని బలహీనతను స్పష్టము
చెయ్యటము అని భావించరు. ఏ ఆత్మనైనా సదా గుణమూర్తులై చూడండి. ఒకవేళ ఎవరిలోనైనా
లోపము ఉన్నా కూడా, మర్యాదకు విపరీతమైన కార్యము చేసినా కూడా బాప్ దాదాచే
నిమిత్తమైయున్న సుప్రీం కోర్ట్ కు తీసుకురండి. స్వయమే వకీలు మరియు జడ్జిలుగా
అవ్వకండి. భాయి - భాయి సంబంధాన్ని మర్చిపోయి వకీలులుగా, జడ్జిలుగా అవుతారు.
కనుక భాయి - భాయి దృష్టి నిలవలేకపోతుంది. కేసును దాఖలు చెయ్యటంలో అభ్యంతరము లేదు
కానీ కల్తీ మరియు మోసమును చెయ్యకండి. ఎంత వీలైతే అంతగా శుభ భావనతో సూచించండి.
మీ మనసులో ఉంచుకోకండి మరియు ఇతరులు మన్మనాభవగా అవ్వటంలో విఘ్నరూపులుగా అవ్వకండి.
మరి చతురతతో కూడిన ఏ ఆటను ఆడతారు? ఏ విషయాన్నైతే ఇముడ్చుకునేది ఉందో దానిని
వ్యాపింపచేస్తారు మరియు ఏ విషయన్నైతే వ్యాప్తి చెయ్యాలో దానిని ఇదైతే అందరిలో
ఉంది అని ఇముడ్చుకుంటారు. కనుక సదా స్వయమును అశుద్ధత నుండి దూరంగా ఉంచండి.
మనసులో, వాణిలో, కర్మలో మరియు సంబంధ - సంపర్కములోని అశుద్ధి, సంగమయుగము యొక్క
శ్రేష్టప్రాప్తి నుండి వంచితముగా చేసేస్తుంది. సమయము గడచిపోతుంది. మరల ''పొందేది
ఉంది'' అన్న ఈ లిస్ట్ లో నిలబడవలసి ఉంటుంది. ప్రాప్తి స్వరూపపు లిస్ట్ లో ఉండరు.
సర్వ ఖజానాలకు యజమానులైన బాలకులు కానీ అప్రాప్తి ఉన్నవారి లిస్ట్ లో ఉన్నారు,
ఇది మంచిగా అనిపిస్తుందా? కనుక మీ ప్రాప్తులలో మునిగిపోండి. శుభచింతకులుగా
అవ్వండి. ఏవిధమైన వికారానికైనా వశీభూతులై తమ మూర్ఖపు తెలివిని చూపించవద్దు. ఈ
మూర్ఖపు తెలివి ఇప్పుడు అల్పకాలికము కొరకు మిమ్మల్ని సంతోషపరుస్తుంది మరియు
ఇటువంటి సహచరులు కూడా మీ తెలివిని గురించి గానం చేస్తూ ఉంటారు కానీ కర్మల గతిని
కూడా స్మృతిలో ఉంచుకోండి. మూర్ఖపు తెలివి తలక్రిందులుగా వ్రేలాడదీస్తుంది.
ఇప్పుడు అల్పకాలము కొరకు పనిని నడిపించే తెలివిని చూపిస్తారు, కాని ఏదో
నడిపించేందుకు బదులుగా అంతగానే తరువాత అరవవలసి వస్తుంది. కొంతమంది బాప్ దాదా,
దీదీ, దాదీలను కూడా నడిపించొచ్చులే అని భావిస్తారు, ఈ విధానాలన్నీ వచ్చు,
అల్పకాలిక తప్పుడు ప్రాప్తుల కొరకు వారిని ఒప్పించినా కూడా, నడిపించినా కూడా
పొందింది ఏమిటి, పోగొట్టుకున్నది ఏమిటి! రెండు, మూడు సంవత్సరాలు పేరును కూడా
పొందుతారు కానీ అనేక జన్మలకొరకు శ్రేష్ట పదవినుండి పేరును పోగొట్టుకున్నారు. మరి
అది పొందటమా లేక పోగొట్టుకోవటమా?
మరో చతురతను వినిపించాలా? ఇప్పుడు ప్రత్యక్ష ఫలమునైతే
పొందండి, భవిష్యత్తులో చూసుకుందాము అని ఇటువంటి సమయములో మళ్ళీ జ్ఞాన పాయింట్లను
కూడా ఉపయోగిస్తారు. కానీ ప్రత్యక్షఫలమైన అతీంద్రియ సుఖము సదాకాలమునకు చెందినది,
అల్పకాలమునకు చెందినది కాదు. ప్రత్యక్షఫలాన్ని తినే ఛాలెంజ్ ను ఎంత చేసినాగానీ
అల్పకాలమునకు చెందిన పేరు నుండి మరియు సంతోషముతో పాటుగా తోడుతోడుగా మధ్యలో
అసంతుష్టత అనే ముళ్లను పండ్లతో పాటు తప్పకుండా తింటూ ఉంటారు. మనసు యొక్క
ప్రసన్నత మరియు సంతుష్టతలను అనుభవము చెయ్యలేకపోతారు. కనుక పడిపోయే కళకు చెందిన
ఇటువంటి గారడీ విద్యను చెయ్యకండి. ఏమవ్వాలని వచ్చారు మరియు ఏమవుతున్నారు అని
ఇటువంటి ఆత్మలపై బాప్ దాదాకు దయ కలుగుతుంది. నేను ఏ కర్మనైతే చేస్తున్నానో అది
ప్రభువుకు నచ్చిన కర్మనేనా? అన్నదానిపై సదా ఈ లక్ష్యమును పెట్టుకోండి. బాబా
మిమ్మల్ని ఇష్టపడ్డారు కనుక పిల్లల పని ఏమిటంటే బాబా పసంద్, ప్రభు పసంద్
అయినదానినే ప్రతి కర్మగా చెయ్యటము. బాబా ఏవిధంగా గుణమాలను వేస్తారో అలా గుణమాలను
ధరించండి, రాళ్ళ మాలను ధరించవద్దు. రత్నాల మాలను ధరించండి. అచ్ఛా.
ఇలా సదా గుణమూర్తులు, సదా ప్రభు పసంద్ లు, సదా సత్యమైన వైష్ణవులు, విష్ణువు
యొక్క రాజ్య అధికారులు, సదా శుభ భావన ద్వారా భాయి - భాయి దృష్టితో సహజ స్థితి
కలిగే వారు, సదా గుణ గ్రాహక దృష్టి కలిగినవారు అయిన ఇటువంటి సదా బాబా సమానంగా
అయ్యే, సమీపరత్నాలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో:-
1. ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు, మట్టిలో
ఆడుకునేందుకు బదులుగా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగండి.
సదా స్వయమును సర్వ ప్రాప్తి స్వరూపులుగా అనుభవము
చేసుకుంటున్నారా? ప్రాప్తి స్వరూపము అనగా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగేవారు. సదా
ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు... అన్న సామీప్యతను అనుభవము చేస్తారు. బాబా
సర్వ సంబంధాలతో మనవారిగా అయినప్పుడు సదా బాబా తోడు కావాలి కదా! ఎంత పెద్ద
పరిస్థితి అయినా గానీ, పర్వతములాంటిదైనా గానీ మీరు బాబాతో పాటుగా పైన ఎగురుతూ
ఉన్నట్లయితే ఎప్పుడూ ఆగరు. విమానమును పర్వతము ఏవిధంగా ఆపలేదో అలా! పర్వతాలను
ఎక్కేవారు చాలా కష్టపడవలసి ఉంటుంది కానీ ఎగిరేవారు దానిని సహజంగానే దాటివేస్తారు.
అలా ఎటువంటి పెద్ద పరిస్థితి అయినా గానీ, బాబాతో పాటు ఎగురుతూ ఉన్నట్లయితే
క్షణములో దాటివేస్తారు. ఎప్పుడూ ఊయల నుండి క్రిందకు రాకండి, లేదంటే మురికిగా
అయిపోతారు, మురికి పట్టాక మళ్ళీ బాబాతో ఎలా కలవగలరు! బహుకాలము వేరుగా ఉన్నారు,
ఇప్పుడు కలిసారు. కనుక మిలనమును జరుపుకునేవారు మైలగా ఎలా అవుతారు! బాప్ దాదా
పిల్లలు ప్రతి ఒక్కరినీ కులదీపకులుగా, నంబర్ వన్ పిల్లలుగా చూడాలనుకుంటారు.
ఒకవేళ పదే - పదే మురికి చేసుకున్నట్లయితే మరలా స్వచ్ఛంగా అయ్యేందుకు ఎంత సమయము
వేస్ట్ అవుతుంది! కనుక సదా మేళాలో ఉండండి. మట్టిలో కాళ్ళు ఎందుకు పెడ్తారు! ఇంత
శ్రేష్టమైన తండ్రి పిల్లలు కానీ మురికి ఉంటుందా! మరి వీరు ఆ ఉన్నతమైన తండ్రి
పిల్లలు అని ఎవరు ఒప్పుకుంటారు, కనుక గడిచినదేదో గడిచిపోయింది. రెండో
క్షణమేదైతే గడిచిందో అది సమాప్తము. ఎటువంటి చిక్కులలోనూ చిక్కుకోకండి.
స్వచింతన చెయ్యండి, పరచింతనను వినకండి, చెయ్యవద్దు, ఇవే మైలపరుస్తాయి.
ఇప్పటినుండి ప్రశ్నార్థకమును సమాప్తము చేసి బిందువును పెట్టండి. బిందువుగా అయ్యి
బిందువైన బాబాతో ఎగరండి. అచ్ఛా.
2. తీరుబాటుగా ఉండే ఆత్మల సేవను కూడా తీరుబాటుగా
చేసినట్లయితే సఫలత లభిస్తుంది-
వానప్రస్థులు, ఎవరికైతే ఎప్పుడూ తీరిక ఉంటుందో, ఎవరైతే రిటైర్డ్ అయ్యారో, వారి
సేవ కొరకు కాస్త శ్రమ పడవలసి ఉంటుంది - కేవలము కార్డు పంపించినంత మాత్రాన వారు
రారు. తీరిక కలవారి సేవను కూడా తీరికతో అనగా సమయాన్ని చూసి చెయ్యవలసి ఉంటుంది.
ఎందుకంటే వారు స్వయమును వానప్రస్థులుగా అనుకున్న కారణంగా అనుభవీలుగా
భావించుకుంటారు. వారికి అనుభవమునకు చెందిన అభిమానము ఉంటుంది. కనుక వారి సేవ
కొరకు కాస్త ఎక్కువ సమయమునే ఇవ్వవలసి వస్తుంది మరియు విధానము కూడా మిత్రత,
స్నేహ మిలనములకు చెందినదిగా ఉండాలి. అర్థం చేయించేటట్లుగా ఉండకూడదు. మిత్రతా
సంబంధము ద్వారా వారిని కలవండి. ఈ విషయము మీకు తెలియదు, మాకు తెలుసు అన్నట్లుగా
వినిపించకండి. అనుభవాలను షేర్ చేసుకోండి. వారి మాటలను విన్నట్లయితే వీరు మాకు
గౌరవమునిస్తున్నారు అని అనుకుంటారు. ఎవరినైనా సమీపంగా తీసుకువచ్చేందుకు వారి
విశేషతలను వర్ణించండి, మరలా వారికి మీ అనుభవమును వినిపించి సమీపంగా తీసుకురండి.
కోర్సు చెయ్యండి, జ్ఞానమును వినండి అని అన్నట్లయితే వినరు కనుక అనుభవాన్ని
వినిపించండి. బాప్ దాదాకు ఇప్పుడు అటువంటి వానప్రస్థుల పుష్పగుచ్ఛాన్ని బహుమతిగా
ఇవ్వండి. వారిని మిత్రత సంబంధముతో సహయోగులుగా చేసుకుని పిలవండి.
3. నిర్మానులుగా అయినట్లయితే నవ నిర్మాణము యొక్క
కర్తవ్యము ముందుకు పోతూ ఉంటుంది -
సదా స్వయమును సేవకు నిమిత్తముగా అయి ఉన్న సేవా
అలంకారములుగా భావించుకుని నడుస్తున్నారా? సేవాధారుల ముఖ్య విశేషత ఏంటి? సేవాధారి
అనగా నిర్మాణము చేసే సదా నిర్మానులు. నిర్మాణము చేసేవారు మరియు నిర్మానంగా
ఉండేవారు. నిర్మానతయే సేవా సఫలతకు సాధనము. నిర్మాణులుగా అవ్వటం ద్వారా సదా సేవలో
తేలికగా ఉంటారు. నిర్మానము కాదు, పేరు పైన కోరికతో ఉన్నట్లయితే భారమైపోతుంది.
బరువు కలిగినవారు ఎప్పుడూ ఆగుతుంటారు. వేగంగా వెళ్ళలేరు కనుక నిర్మానముగా
ఉన్నామా-లేమా అన్నదాని గుర్తు - వారు తేలికగా ఉంటారు. ఒకవేళ ఏదైనా భారము
అనుభవమైనట్లయితే నిర్మానులుగా లేరని భావించండి.
4. సత్యమైన ఆత్మిక సేవాధారి అనగా సర్వ సంబంధాల
అనుభూతి ఒక్క బాబాతో చెయ్యటము మరియు చేయించటము
అన్ని సంబంధాలు ఒక్క బాబాతో ఉన్నాయి, బాబా సదా
సమ్ముఖములో హాజరైయున్నారు... ఇటువంటి అనుభవము ఉంటుందా? నీతోనే తింటాను, నీతోనే
కూర్చుంటాను, నీతోనే వింటాను.....అన్న ఈ అనుభవము ఉంటుందా? బాబాయే సత్యమైన
మిత్రుడైపోయినట్లయితే ఇతరులను మిత్రులుగా చేసుకునే అవసరము ఉండదు. ఏ సంబంధము
కావాలంటే ఆ సంబంధముతో బాప్ దాదా సదా ఎదురుగా హాజరైయున్నారు. కనుక శిక్షకులు అనగా
సర్వ సంబంధాల రసమును ఒక్క బాబాతో అనుభవము చేసేవారు. వీరినే సత్యమైన సేవాధారులు
అని అంటారు. స్వయములో ఉన్నట్లయితే ఇతరులకు కూడా అనుభూతిని చేయించగలరు. ఒకవేళ
నిమిత్తంగా అయిన ఆత్మలలో ఏదైనా అనుభవములో లోటు ఉన్నట్లయితే వచ్చే ఆత్మలలో కూడా
ఆ లోటు మిగిలిపోతుంది. కనుక సర్వ అనుభవాలనూ అనుభవము చేయండి మరియు చేయించండి.
అచ్ఛా. ఓం శాంతి.