బ్రాహ్మణ జీవిత విశేషత - పవిత్రత
ఈరోజు బాప్ దాదా తన పావన పిల్లలను చూస్తున్నారు,
బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు పావనంగా అయ్యారు - అందరి లెక్కాపత్రాన్ని
చూస్తున్నారు. బ్రాహ్మణుల విశేషతయే పవిత్రత. బ్రాహ్మణులు అనగా పావన ఆత్మ.
పవిత్రతను ఎంతవరకు అనుసరించారు, దీనిని పరిశీలించే మంత్రము ఏంటి? ''పవిత్రులుగా
అవ్వండి'', ఈ మంత్రమును అందరికీ గుర్తు తెప్పిస్తారు కానీ శ్రీమతము ప్రమాణంగా ఈ
మంత్రమును ఎంతవరకు జీవితములోకి తీసుకువచ్చారు? జీవితము అనగా సదాకాలము. జీవితములో
సదా ఉంటారు కదా! కనుక జీవితములోకి తీసుకురావటము అనగా సదా పవిత్రతను స్వీకరించటము.
దీనిని తెలుసుకునే మంత్రము తెలుసా? అందరికీ తెలుసు మరియు పవిత్రత సుఖశాంతుల జనని
అని అంటారు కూడా. అనగా ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతుల అనుభూతి తప్పకుండా
ఉంటుంది. ఈ ఆధారముపై స్వయమును చెక్ చేసుకోండి - మనసా సంకల్పాలలో పవిత్రత ఉందా!
ఇందుకు గుర్తు - మనసులో సదా సుఖ స్వరూపపు, శాంత స్వరూపపు అనుభూతి ఉంటుంది.
ఒకవేళ ఎప్పుడైనా మనసులో వ్యర్థ సంకల్పము వచ్చినట్లయితే శాంతికి బదులుగా అలజడి
ఉంటుంది. ఎందుకు మరియు ఏమి లాంటి అనేక ప్రశ్నల కారణంగా సుఖ స్వరూపపు స్థితి
అనుభవమవ్వదు. ఎప్పుడూ తెలుసుకోవాలన్న ఆశ ఎక్కువవుతూ ఉంటుంది, ఇది జరగాలి, ఇది
జరగకూడదు, ఇది ఎలా, అది ఇలా. వీటిని పరిష్కరించడములోనే మునిగి ఉంటారు. కనుక
ఎక్కడ శాంతి ఉండదో అక్కడ సుఖము ఉండదు. కనుక, ఏ రకమైన చిక్కులైనా సుఖము, శాంతి
యొక్క ప్రాప్తిలో విఘ్నరూపముగా అయితే అవ్వటము లేదు కదా అన్న దానిని ప్రతి సమయము
పరిశీలించుకోండి. ఒకవేళ ఏమి, ఎందుకు లాంటి ప్రశ్నలు కూడా ఉన్నట్లయితే సంకల్ప
శక్తిలో ఏకాగ్రత ఉండదు. ఎక్కడ ఏకాగ్రత ఉండదో, అక్కడ సుఖశాంతుల అనుభూతి కలగజాలదు.
వర్తమాన సమయ ప్రమాణంగా ఫరిస్తాతనపు సంపన్న స్థితికి మరియు బాబా సమాన స్థితికి
సమీపంగా వస్తున్నారు, దాని ప్రమాణంగా పవిత్రత యొక్క నిర్వచనము కూడా అతి
సూక్ష్మమని భావించండి. కేవలము బ్రహ్మచారిగా అవ్వటము సంపూర్ణ పవిత్రత కాదు కానీ
బ్రహ్మచారితో పాటుగా బ్రహ్మా ఆచారిగా కూడా కావాలి. శివ ఆచార్యగా కూడా కావాలి
అనగా బ్రహ్మాబాబా ఆచరణపై నడిచేవారు. ఫస్ట్ స్టెప్ అనగా బ్రహ్మాబాబా ప్రతి
కర్మరూపీ అడుగులో అడుగు వేసేవారు, వీరినే బ్రహ్మా ఆచార్యులు అని అంటారు. కనుక
సదా పవిత్రతా ప్రాప్తి, సుఖశాంతుల అనుభూతి కలుగుతూ ఉందా అని ఇటువంటి
సూక్ష్మరూపములో పరిశీలించుకోండి. సుఖశయ్యపై ఎల్లప్పుడు విశ్రాంతిగా అనగా శాంతి
స్వరూపములో విరాజమానులై ఉంటారా? ఇది బ్రహ్మా ఆచార్యుల చిత్రము.
సదా సుఖశయ్యపై పడుకుని ఉన్న ఆత్మల కొరకు ఈ వికారాలు
కూడా ఛత్రఛాయగా అవుతాయి. శత్రువు మారిపోయి సేవాధారిగా అవుతాడు. మీ చిత్రము
చూసారు కదా! కనుక శేషశయ్య కాదు కానీ సుఖశయ్య. సదా సుఖము మరియు శాంతులకు గుర్తు
- సదా హర్షితంగా ఉండటము. పరిష్కారము కలిగిన ఆత్మ స్వరూపము సదా హర్షితంగా ఉంటుంది.
చిక్కులలో ఉన్న ఆత్మ ఎప్పుడూ హర్షితంగా కనిపించదు. ఎప్పుడూ ఏదో
పోగొట్టుకున్నట్లుగా వారి ముఖము కనిపిస్తుంది మరియు వారు అన్నింటినీ పొందినవారి
ముఖములా కనిపిస్తారు. ఏదైనా వస్తువును పోగొట్టుకున్నట్లయితే చిక్కులకు గుర్తుగా
ఏమి, ఎందుకు, ఎలా అన్నవే ఉంటాయి. మరి ఆత్మిక స్థితిలో కూడా పవిత్రతను ఎవరు
కోల్పోయినాగానీ, వారి లోపల ఏమి, ఎందుకు మరియు ఎలా అన్న చిక్కులు ఉంటాయి, మరి ఎలా
పరిశీలించుకోవాలి అన్నది అర్థమైందా! సుఖశాంతుల ప్రాప్తి స్వరూపపు ఆధారముపై మనసా
పవిత్రతను పరిశీలించుకోండి.
రెండవ విషయము - ఒకవేళ మీ మనసు ద్వారా ఇతర ఆత్మలకు
సుఖము మరియు శాంతుల అనుభూతి లేనట్లయితే అనగా పవిత్ర సంకల్పాల ప్రభావము ఇతర
ఆత్మల వరకు చేరుకోనట్లయితే దానికి కారణమును పరిశీలించుకోండి. ఏ ఆత్మలోని
కాస్తంత బలహీనత అయినా అనగా అశుద్ధి మీ సంకల్పాలలో ధారణ జరిగినట్లయితే ఆ అశుద్ధి
ఇతర ఆత్మలకు సుఖాశాంతుల అనుభూతిని చేయించలేదు, ఆ ఆత్మ పట్ల వ్యర్థమైన మరియు
అశుద్ధమైన భావములు ఉన్నట్లయితే, మీ మనసా పవిత్రతా శక్తి శాతములో లోపము ఉన్నట్లు.
ఈ కారణంగా ఇతరుల వరకు ఈ పవిత్రత యొక్క ప్రాప్తి ప్రభావము పడజాలదు, స్వయము వరకు
ఉంది, కానీ ఇతరుల వరకు ప్రభావము పడజాలదు. లైట్ ఉంది, కానీ సెర్చ్ లైట్ గా లేదు.
కనుక పవిత్రత యొక్క సంపూర్ణతకు నిర్వచనము ''సదా స్వయములో కూడా సుఖశాంత స్వరూపము
మరియు ఇతరులకు కూడా సుఖశాంతుల ప్రాప్తి యొక్క అనుభవమును చేయించేవారు''. ఇటువంటి
పవిత్ర ఆత్మ తన ప్రాప్తి ఆధారముతో ఇతరులపై కూడా సదా సుఖము మరియు శాంతి, శీతలతా
కిరణాలను వ్యాపింపచేసేవారుగా ఉంటారు. మరి సంపూర్ణ పవిత్రత అంటే ఏంటో అర్థమైందా?
పవిత్రతా శక్తి ఎంత గొప్పదంటే వారు తమ పవిత్ర మనసు ద్వారా అనగా శుద్ధ వృత్తి
ద్వారా ప్రకృతిని కూడా పరివర్తన చేసేస్తారు. మనసా పవిత్రతా శక్తికి ప్రత్యక్ష
ప్రమాణము - ప్రకృతి కూడా పరివర్తన. స్వ పరివర్తన ద్వారా ప్రకృతి యొక్క పరివర్తన.
ప్రకృతికన్నా ముందు వ్యక్తి. కనుక వ్యక్తి పరివర్తన మరియు ప్రకృతి పరివర్తన.
మనసా పవిత్రతాశక్తికి ఇంత ప్రభావము ఉంది. ఈరోజు మనసా పవిత్రతను స్పష్టముగా
వినిపించాము, మరలా వాచా మరియు కర్ణణాల అనగా సంబంధము మరియు సంపర్కములో సంపూర్ణ
పవిత్రతల నిర్వచనము ఏంటి అన్నదానిని ముందు వినిపిస్తాము. ఒకవేళ పవిత్రతా శాతములో
16 కళల నుండి 14 కళలు కలవారిగా అయిపోయినట్లయితే ఎలా అవ్వవలసి ఉంటుంది? 16 కళల
పవిత్రత లేనట్లయితే అనగా సంపూర్ణత లేనట్లయితే సుఖశాంతుల సాధనాల ప్రాప్తి ఎలా
ఉంటుంది! యుగం మారటం ద్వారా మహిమయే మారిపోతుంది. దానిని సతోప్రధానమని, దీనిని
సతో అని అంటారు. సూర్యవంశి అనగా సంపూర్ణ స్థితి, 16 కళలు అనగా ఫుల్ స్టేజ్. అలా
అన్ని ధారణలలో సంపన్నము అనగా ఫుల్ స్టేజ్ ను ప్రాప్తి చేసుకోవటము సూర్య వంశీయుల
గుర్తు. కనుక ఇందులో కూడా ఫుల్ గా అవ్వవలసి ఉంటుంది, ఒక్కోసారి సుఖశయ్యపై,
ఒక్కోసారి చిక్కుల శయ్యపై, వీరిని సంపన్నులు అనైతే అనరు కదా!
ఒక్కోసారి బిందువు తిలకాన్ని పెట్టుకుంటే, ఒక్కోసారి
ఎందుకు, ఏమి తిలకమును పెట్టుకుంటారు. తిలకమునకు కల అర్థమే స్మృతి. మూడు
బిందువుల తిలకాన్ని సదా పెట్టుకోండి. మూడు బిందువుల తిలకమే సంపన్న స్వరూపము.
దీనిని పెట్టుకోవటము రాదా! పెట్టుకుంటారు కానీ అటెన్షన్ రూపీ చెయ్యి కదులుతుంది.
మీపై మీకే నవ్వు వస్తుంది కదా! లక్ష్యము శక్తిశాలిగా ఉన్నట్లయితే లక్షణాలు
సంపూర్ణంగా, సహజంగా అయిపోతాయి. శ్రమ నుండి కూడా విడుదల అవుతారు. బలహీనంగా ఉన్న
కారణంగా ఎక్కువ శ్రమ చేయవలసివస్తుంది. శక్తి స్వరూపులుగా అయినట్లయితే శ్రమ
సమాప్తము. అచ్ఛా!
సదా సఫలత మా జన్మసిద్ధ అధికారము అన్న ఈ అధికారమును
ప్రాప్తి చేసుకున్న ఆత్మలకు, సదా సంపూర్ణ పవిత్రత ద్వారా స్వయమునకు మరియు
సర్వులకు సుఖశాంతుల అనుభూతిని చేయించేవారికి, అనుభూతి చేసే మరియు చేయించే
మంత్రము ద్వారా సదా పవిత్రులుగా అవ్వండి - ఈ మంత్రమును జీవితములో
తీసుకువచ్చేవారికి, ఇలా సంపూర్ణ పవిత్రత, సుఖశాంతుల అనుభవాలలో స్థితులై
ఉండేవారికి, బాబా సమానమైన ఫరిస్తా స్వరూప ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు
మరియు నమస్తే.
పార్టీలతో:-
సదా ఆత్మికతకు చెందిన సుగంధాన్ని వ్యాపింపచేసే సత్యాతి
సత్యమైన ఆత్మిక గులాబీలు:-
పిల్లలందరూ సదా ఆత్మిక నషాలో ఉండే సత్యమైన ఆత్మిక గులాబీలేనా? ఆత్మిక గులాబీ
పేరు చాలా ప్రసిద్ధమైనది, అలా మీరందరూ ఆత్మిక గులాబీలు. ఆత్మిక గులాబీ అనగా
నలువైపుల ఆత్మికతకు చెందిన సుగంధాన్ని వ్యాపింపచేసేవారు. ఇలా మీకు మీరు ఆత్మిక
గులాబీలుగా భావిస్తారా? సదా ఆత్మను చూస్తూ మరియు ఆత్మల యజమానితో పాటు ఆత్మిక
సంభాషణ చేస్తారు, ఇదే ఆత్మిక గులాబీల విశేషత. శరీరమును చూస్తూ సదా రూహ్ ను అనగా
ఆత్మను చూసే పాఠము పక్కాగా ఉంది కదా! ఈ రూహ్ ను చూసే అభ్యాసీలైన ఆత్మిక
గులాబీలుగా అయ్యారు. బాబా తోటలోని విశేషమైన పుష్పాలు ఎందుకంటే అన్నింటికంటే
నంబర్ వన్ ఆత్మిక గులాబీలు. సదా ఒక్కరి స్మృతిలోనే ఉండేవారు అనగా ఒక నంబర్లో
రావాలి, ఈ లక్ష్యమునే ఎల్లప్పుడూ పెట్టుకోండి.
(దీదీగారు - ఢిల్లీ మేళ ఓపనింగ్ కోసం వెళ్ళేందుకు
సెలవు తీసుకుంటున్నారు)
అందరినీ ఎగిరింపచేసేందుకు వెళ్తున్నారు కదా! స్మృతిలో, స్నేహములో, సహయోగములో,
అన్నింటిలో ఎగిరింపచేసేందుకు వెళ్తున్నారు. ఇది కూడా డ్రామాలో బెస్ట్ ప్లాన్.
మంచిది, ఆత్మయే ప్లైన్ గా అయింది. విమానములో పోవటము, రావటము ఎలా కష్టమనిపించదో
అలా ఆత్మయే ఎగిరే పక్షిగా అయిపోయింది. కనుక రావటము, పోవటము సహజమైపోతుంది.
కొద్ది సమయములో ఎక్కువ భావనను ఇవ్వటము, వీరిది కూడా డ్రామాలో హీరో పాత్ర. హీరో
పాత్రను పోషించేందుకు వెళ్తున్నారు. అచ్ఛా - అందరికీ ప్రియస్మృతులను ఇవ్వండి
మరియు సదా సఫలతా స్వరూపపు శుభ సంకల్పమును పెట్టుకుంటూ ముందుకు పోతుండండి -
స్మృతి స్వరూపులుగా తయారుచేసి రావాలి. శబ్దము ఢిల్లీ నుంచే వెలువడుతుంది. అందరి
మైకులు ఢిల్లీకే చేరుకుంటాయి. ఎప్పుడైతే గవర్నమెంట్ నుండి శబ్దము వెలువడుతుందో
అప్పుడు సమాప్తి అయిపోతుంది. భారతదేశములోని నేతలు కూడా మేల్కొంటారు. వారి తయారీ
కొరకు వెళ్తున్నారు కదా! అచ్ఛా. ఓం శాంతి.