బాప్ దాదా యొక్క సంభాషణ.
బాప్ దాదా తన యొక్క సర్వ అధికారి పిల్లలను
చూస్తున్నారు. శ్రేష్ట ఆత్మలైన మీకు మహిమ ఉంది - రాజ్యశక్తి మరియు ధర్మశక్తి
రెండు శక్తులు ఒకరి చేతిలోనే ఉంటాయి. ఇది మీపై భవిష్య ప్రాలబ్ద రూపం యొక్క మహిమ.
కానీ భవిష్య ప్రాప్తికి ఆధారం - వర్తమానం యొక్క శ్రేష్టజీవితం. ధర్మశక్తి మరియు
రాజ్యశక్తి ఎంత వరకు పొందారు అని బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలను
చూస్తున్నారు. సంస్కారాలు అన్నీ ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. ఇప్పటి రాజులే
భవిష్యత్తులో రాజ్యాధికారిగా అవుతారు. ఇప్పటి ధారణా స్వరూప ఆత్మలే ధర్మశక్తిని
పొందగలరు. అయితే ప్రతి ఒక్కరు మీలో ఈ రెండు శక్తులు ఎంత వరకు ధారణ చేసారు?
రాజ్యశక్తి అంటే అధికారి, అథార్టీ స్వరూపం. రాజ్యశక్తి కలిగిన ఆత్మ తన అధికారం
ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, తన యొక్క స్థూల, సూక్ష్మ
శక్తులను నడిపించగలుగుతుంది. ఈ అధికారం రాజ్యశక్తికి గుర్తు. రెండవ గుర్తు -
రాజ్యశక్తి కలిగినవారు ప్రతి కార్యాన్ని లా అండ్ ఆర్డర్ ద్వారా నడిపించగలరు.
రాజ్యశక్తి అంటే తల్లి, తండ్రి రూపంలో తమ ప్రజలను పాలన చేసే శక్తి కలిగినవారు,
రాజ్యశక్తి అంటే స్వయం కూడా సదా అన్నింటిలో సంపన్నంగా మరియు ఇతరులను కూడా
సంపన్నతలో ఉంచేవారు. రాజ్యశక్తి అంటే విశేష సర్వప్రాప్తులు ఉంటాయి - సుఖం, శాంతి,
ఆనందం, ప్రేమ, సర్వగుణాల యొక్క ఖజానాలతో నిండుగా ఉంటారు. ప్రజలను తయారు చేసుకునే
వారే కానీ స్వయంగా ప్రజలుగా అయ్యేవారు కాదు కదా. అయితే స్వయాన్ని రాజ్యశక్తి,
ధర్మశక్తి యొక్క అధికారి ఆత్మగా తయారుచేసుకోండి. రాజ్యవంశం యొక్క గుర్తులు ఏమిటో
అర్థమైందా?
ఈవిధంగా రాజ్యశక్తి మరియు ధర్మశక్తి యొక్క అధికారి
ఆత్మలకు, సదా సంపన్నంగా అయ్యి ఇతరులను సంపన్నంగా చేసేవారికి, పరివర్తనా శక్తి
ద్వారా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన చేసే శ్రేష్ట ఆత్మలకు, కల్పం అంతా
మహిమ మరియు పూజకి యోగ్యంగా అయ్యే పవిత్ర ఆత్మలకు, సదా తమ పవిత్రతా గుణం ద్వారా
సర్వులను గుణవంతులుగా చేసే గుణమూర్తి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.