బాప్ దాదా ద్వారా దేశ విదేశముల సమాచారము.
ఈరోజు బాప్ దాదా పిల్లలతోటి షికారు చేసేందుకు వెళ్ళారు.
మొత్తము సృష్టిని చుట్టిరావడానికి బాప్ దాదాకు ఎంత సమయము పట్టి ఉండవచ్చు? ఎంత
సమయములో కావాలంటే అంత సమయములో పరిక్రమణను పూర్తి చెయ్యగలరు. విస్తారముతోనైనా
చెయ్యండి, సారములోనైనా చెయ్యండి. ఈరోజు డబల్ విదేశీయులను కలిసే రోజు కదా, కనుక
షికారు చేసిన సమాచారాన్ని వినిపిస్తారు. విదేశములో ఏం చూసారు మరియు దేశములో ఏం
చూసారు?
కొద్ది సమయము ముందు విదేశము యొక్క విశేషతకు చెందిన అల
భారతదేశమునకు చేరింది - అది ఏది? విదేశాలలో అల్పకాలికమైన సుఖ సాధనాల నషాలో సదా
మస్త్ గా ఉండేవారు, అలా భారతవాసులు కూడా విదేశీ సుఖ సాధనాలను చాలా ఎక్కువగా తమ
కొరకు కార్యములో వినియోగించారు. చాలా ఎక్కువ విదేశీ సాధానాల ద్వారా అల్పకాలిక
సుఖాలలో మస్త్ అయిపోయిన అనుభూతిని చేసారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు.
భారతదేశమువారు అల్పకాలిక సాధనాలను కాపీ చేసారు మరియు కాపీ చేసిన కారణంగా తమ
అసలైన శక్తిని పోగొట్టుకున్నారు. ఆత్మికతను దూరం చేసారు మరియు విదేశీ సుఖ
సాధానాలను ఆధారం చేసుకున్నారు. మరి విదేశీయులు ఏం చేసారు? వివేకవంతమైన పని
చేసారు. భారతదేశమునకు చెందిన అసలైన ఆత్మిక శక్తి వారిని విదేశములో ఆకర్షితము
చేసింది. దీని పరిణామంగా నామధారీ ఆత్మికశక్తి కలిగిన ప్రతి ఒక్కరి వద్ద మరియు
నిమిత్త గురువుల వద్ద విదేశీ ఫాలోయర్స్ ను ఎక్కువగా చూడవచ్చు. విదేశీ ఆత్మలు
నకిలీ సాధనాలను వదిలి అసలు వైపుకు, ఆత్మికత వైపుకు ఎక్కువగా
ఆకర్షితమవుతున్నారు మరియు భారతవాసులు నకిలీ సాధానాలలో మస్త్ అయిపోయారు. తమదానిని
వదిలి పరాయిదానివైపుకు వెళ్తున్నారు మరియు విదేశీ ఆత్మలు అసలు వస్తువును
వెతికేందుకు, పరిశీలించేందుకు మరియు పొందేందుకు కోరిక కలిగి ఉన్నారు.
మరి ఈరోజు బాప్ దాదా దేశవిదేశముల షికారు చేసారు. ఆ
షికారులో భారతవాసులు ఏం చేస్తున్నారు మరియు విదేశీయులు ఏం చేస్తున్నారు అన్న
దానిని చూసారు. భారతవాసులను చూసిన బాప్ దాదాకు వీరు ఇంత ఉన్నతమైన కులమునకు
చెందిన నంబర్ వన్ ధర్మము యొక్క ఆత్మలు, తరువాత ధర్మము వారు వదిలిన వస్తువును
సొంతం చేసుకోవటంలో ఎంత మునిగిపోయారంటే తమ విశేష వస్తువును మర్చిపోయారు అని దయ
కలుగుతుంది. ఈ కారణంగా భారతదేశమనే ఇంటిలో కూర్చుని, భారతదేశమనే ఇంటికి వచ్చిన
శ్రేష్ట అతిథి అయిన బాబాను కూడా తెలుసుకోలేదు మరియు విదేశమునకు చెందిన ఆత్మలు
దూరములో కూర్చుని ఉన్నా కూడా కేవలము సందేశమును వినగానే తెలుసుకుని చేరుకున్నారు.
డబల్ విదేశీ పిల్లల పరిశీలనా నేత్రాలు చాలా తీక్షణమైనవని బాప్ దాదా
చూస్తున్నారు. దూరము నుండే పరిశీలనా నేత్రాల ద్వారా, అనుభవము ద్వారా చూసారు
మరియు పొందారు. కానీ భారతవాసులు, వారిలో కూడా ఆబు నివాసులపై బాబాకు ఎక్కువ దయ
వస్తుంది, వీరు దగ్గరగా ఉన్నాగానీ పరిశీలించే కళ్ళు లేవు. పరిశీలనా నేత్రాలు
లేక అంధులైపోయారు కదా! అటువంటి పిల్లలను చూస్తే దయ అయితే కలుగుతుంది కదా! మరి
బాబా డబల్ విదేశీ పిల్లల అద్భుతమును చూస్తున్నారు.
రెండో విషయము ఏం చూసారు - ఈరోజుల్లో భారతదేశము ఏవిధంగా
పేదగా ఉందో అలా ఇప్పుడు చివరి సమయము దగ్గరగా ఉన్న కారణంగా విదేశీయులలో కూడా
సంపన్నత తక్కువైంది. వృక్షము పచ్చపచ్చగా ఉన్నప్పుడు ఫలపుష్పాలతో
కళకళలాడుతుంటుంది. కానీ వృక్షము ఎండిపోవటం మొదలుపెట్టినప్పుడు ఫలాలు, పుష్పాలు
కూడా ఎండిపోవటం మొదలవుతుంది. మరి ఈ దేశము యొక్క ప్రాప్తి రూపీ విశేషత ఏదైతే
ఉందో దానివలన ప్రజలు సుఖంగా ఉన్నారు, శాంతి వాతావరణము ఉండింది, ఆ ఫల పుష్పాలు
ఎండిపోవటము ప్రారంభమైంది. ఇప్పుడు విదేశములో కూడా ఉద్యోగము సులభంగా లభించదు.
మొదట్లో విదేశాలలో ఎప్పుడూ ఈ ప్రాలబ్ధం ఉండేది కాదు? కనుక సుఖ సాధానాలు మరియు
శాంతి అనే ఫలాలు ఎండిపోతున్నాయి అన్నదానికి ఇది కూడా గుర్తు. భారతరూపీ ముఖ్య
కాండము ఎండిపోతుంది, దాని ప్రభావము ముఖ్య శాఖలపై పడటము కూడా ప్రారంభమైంది. ఈ
క్రిస్టియన్ ధర్మము చివరిలోని ముఖ్యమైన పెద్ద శాఖ. వృక్షము చిత్రములో
క్రిస్టియన్ ధర్మము ఏ శాఖగా ఉంది? ఏ ముఖ్య శాఖలనైతే చూపిస్తారో వాటిలో కూడా
చివర్లో ఉంది కదా! ఆ శాఖ వరకు సంపన్నత యొక్క ప్రాప్తికి చెందిన పచ్చదనము
ఎండిపోయింది. మొత్తము వృక్షము యొక్క జడజడీ భూతావస్థకు ఇది గుర్తు. కనుక మొత్తము
వృక్షములో అల్పకాలిక ప్రాప్తిరూపీ ఫలపుష్పాలు ఎండిపోయి ఉండటమును చూసారు. ఇకపోతే,
కేవలము రెండు విషయాలు ఉన్నాయి
ఒకటి మనసుతో, నోటితో అరవటము మరియు రెండవది ఎలా అయినా
సరే కష్టంగా అయినా, జీవితాన్ని, దేశాన్ని నడిపించటము. చిల్లానా (అరవటము) మరియు
కార్యమును చలానా(నడిపించటము). ఈ రెండు పనులు మిగిలిపోయి ఉన్నాయి. సంతోషంగా
సంతోషంతో నడిపించటం అనేది సమాప్తమైపోయింది. ఎలాగైనా సరే నడిపించాలి, ఇది
ఉండిపోయింది. విదేశములో కూడా ఈ రూపురేఖలు తయారయ్యాయి. మరి ఇది కూడా దేనికి
గుర్తు? కష్టంగా నడిపించటము అనేది ఎంతవరకు నడుస్తుంది! ఇప్పుడు ఎవరైతే
అరుస్తున్నారో అటువంటి వారు కలిగిన విశ్వమునకు ఏం చెయ్యాలి? కష్టంగా
నడిపించేవారికి ప్రాప్తి అనే రెక్కలను ఇచ్చి ఎగిరింపచెయ్యాలి. ఎవరు ఎగిరించగలరు?
ఎవరైతే స్వయం ఎగిరే కళలో ఉంటారో వారు ఎగిరించగలరు. మరి మీరు ఎగిరే కళలో ఉన్నారా?
ఎగిరే కళ మరియు ఎక్కే కళ - ఏ కళలో ఉన్నారు? ఎక్కే కళ కూడా కాదు, ఇప్పుడు ఎగిరే
కళ కావాలి. ఎంతవరకు చేరుకున్నారు? డబల్ విదేశీయులు ఏమని భావిస్తారు? మెజారిటీ
అయితే బాబా సమానంగా శిక్షక క్వాలిటీవారు కదా! కనుక టీచర్ అనగా ఎగిరేకళ
కలిగినవారు. అటువంటి వారే కదా? అచ్ఛా
ఈరోజు కేవలము షికారు చేసిన సమాచారాన్ని వినిపించారు.
ఇప్పుడు దేశ-విదేశములలోనివారు ప్రాక్టికల్ గా స్పష్టంగా గుర్తులను చూస్తున్నారు.
ఈరోజుల్లో ఏదన్నా విషయము జరిగినట్లయితే 100 సంవత్సరాల క్రితం జరిగింది కదా అని
అంటారు. అన్నీ విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ విచిత్ర తండ్రిని
ప్రత్యక్షము చేస్తాయి. అందరి నోటినుండి ఇప్పుడు ఏమవుతుంది? అన్న మాటలే
వెలువడుతున్నాయి. ఈ ప్రశ్నార్థకము అందరి బుద్ధిలో స్పష్టమైపోయింది. ఏది జరిగేది
ఉందో అది జరిగింది అని ఇప్పుడు ఈ మాటలే వెలువడుతాయి. బాబా వచ్చారు ఈ
ప్రశ్నార్థకము సమాప్తమై, ఫుల్స్ టాప్ పడిపోతుంది. ఏవిధంగా మజ్జిగ చిలికే కుండ
నుండి వెన్నను వేరుచేసినప్పుడు ముందు అలజడి ఉంటుంది తరువాత వెన్న వెలువడుతుంది.
కనుక ఈ ప్రశ్నార్థకరూపీ అలజడి తరువాత ప్రత్యక్షత అనే వెన్న వెలువడుతుంది.
ఇప్పుడు అలజడి చాలా ఎక్కువగా ప్రారంభమైపోయింది. నలువైపుల ఇప్పుడు
ప్రత్యక్షతరూపీ వెన్న విశ్వము ముందు కనిపిస్తుంది. కానీ ఈ వెన్నను తినేవారు ఎవరు?
తినేందుకు తయారుగా ఉన్నారు కదా? ఫరిస్తాలైన మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు.
అచ్ఛా –
అప్రాప్తి ఆత్మలందరికి సర్వ ప్రాప్తులను చేయించేవారు,
సర్వులకు పరిశీలించే నేత్రాలను దానము చేసే మహాదానులకు, సర్వులకు సంతుష్టత అనే
వరదానమును ఇచ్చే వరదానీ సంతుష్ట ఆత్మలకు, సదా స్వయము యొక్క ప్రాప్తి అనే రెక్కల
ద్వారా ఇతర ఆత్మలను ఎగిరింపచేనేవారు, సదా ఎగిరే కళ కలిగినవారికి, సదా స్వయము
ద్వారా బాబాను ప్రత్యక్షము చేసేవారికి, విశ్వము ముందు ప్రఖ్యాతమయ్యే శ్రేష్ట
ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దాదాల వ్యక్తిగత మిలనము:-
సదా స్వయమును సర్వ ప్రాప్తి సంపన్నులుగా అనుభవము చేస్తున్నారా? సర్వ ప్రాప్తుల
అనుభూతి ఉందా? ఏ ఆత్మకైతే సర్వ ప్రాప్తుల అనుభూతి ఉంటుందో దానికి గుర్తుగా ఏం
కనిపిస్తుంది? వారు సదా సంతుష్టంగా ఉంటారు. వారి ముఖముపై సదా ప్రసన్నతా గుర్తులు
కనిపిస్తాయి. వీరు అన్నింటినీ పొందిన ఆత్మ అని వారి ముఖము ద్వారా కనిపిస్తుంది.
మామూలుగా కూడా చూడండి, లౌకికరీతిలో రాజకుమారులు, రాజకుమారీలు ఎవరైతే ఉంటారో లేక
ఉన్నత కులమునకు చెందినవారెవరైతే ఉంటారో వారిని చూస్తే వీరు నిండుగా ఉన్న ఆత్మలు
అని ముఖము ద్వారా తెలిసిపోతుంది. అలా ఆత్మిక కులానికి చెందిన ఆత్మలైన మీ ముఖము
ద్వారా ఇది కనిపించాలి - ఎవరికీ లభించనిది వీరికి లభించింది. మా నడవడిక మరియు
ముఖము మారిపోయాయి, ముఖముపై ప్రాప్తికి చెందిన మెరుపు వచ్చింది అన్న అనుభవము మీకు
కలుగుతుందా? డబల్ విదేశీయులకు డబల్ చాన్స్ లభించింది. కనుక సేవ కూడా డబల్ గా
చెయ్యాలి. డబల్ సేవ ఎలా చేస్తారు? కేవలము వాణి ద్వారానే కాదు కానీ నడవడిక ద్వారా
కూడా మరియు ముఖము ద్వారా కూడా. ఏవిధంగా స్వయం దీపపు పురుగులయ్యారో అలా అనేక
దీపపు పురుగులను దీపము వద్దకు తీసుకువచ్చే ఆత్మలు. మరి మీరు ఎగరటము చూడటంతోనే
ఇతర దీపపు పురుగులు కూడా మీ వెనక వెనకనే ఎగరటం మొదలుపెట్తారు. ఏవిధంగా మీరు
ప్రతి విషయములో లోతులోకి వెళ్తారో, అలా ప్రతి గుణమునకు చెందిన అనుభూతి యొక్క
లోతులలోకి వెళ్ళండి. ఎంత లోతుగా వెళ్తారో అంతగా ప్రతిరోజూ నూతన అనుభవమును
చెయ్యగలరు. ఏవిధంగా శాంత స్వరూప అనుభవమును ప్రతిరోజూ చేస్తారో అలా ప్రతిరోజు
నవీనతకు చెందిన అనుభవమును చెయ్యండి. ఏకాంతవాసులుగా ఉన్నప్పుడే నూతన అనుభవము
కలుగుతుంది. ఏకాంతవాసి అనగా సదా స్థూలమైన ఏకాంతముతో పాటుగా ఒక్కరి అంతములో సదా
ఉండటము.
ఎవరైతే ఒక్క ''బాబా'' అన్న మాటను పదేపదే అంటారో,
వారికి ప్రతిసారీ నూతన అనుభవము ఉండాలి. మొదట్లో వచ్చినప్పుడు, అప్పుడు కూడా బాబా
అన్న మాటను అనేవారు, మధువనమునకు వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు మరియు ఇప్పుడు
వెళ్తున్నప్పుడు కూడా బాబా అన్న మాటనే మాట్లాడ్తారు కానీ మొదట అనటంలో మరియు
ఇప్పుడు అనటంలో ఎంత తేడా ఉంది! ఈ అనుభవమైతే ఉంది కదా! బాబా అన్న పదమైతే అదే,
కాని లోతైన ప్రాప్తుల ఆధారముపై ఆ అనుభవము పెరుగుతూ పోయింది! కావున తేడా ఉంటుంది
కదా! ఇలా అన్ని గుణాలలో కూడా ప్రతిరోజు నూతన అనుభవమును చెయ్యండి.
శాంతస్వరూపులుగా అయితే ఉన్నారు. కానీ శాంతి అనుభూతి ఏ పాయింట్ ఆధారంతో ఉంటుంది
అన్న దానిని చూడండి, ఏవిధంగా అయితే నేను ఆత్మను, పరంధామ నివాసిని అన్న దీనితో
కూడా శాంతి యొక్క అనుభూతి ఉంటుంది మరియు నేను ఆత్మను, సత్యయుగములో సుఖశాంతి
స్వరూపముగా ఉంటాను, దీనిని అనుభవము చూసినట్లయితే అది మరొకరకంగా ఉంటుంది, అలాగే
కర్మ చేస్తూ, అశాంతి వాతావరణములో ఉన్నాకూడా నేను ఆత్మను, శాంత స్వరూపమును అన్న
అనుభూతిని చేసినట్లయితే దాని అనుభవము వేరేగా ఉంటుంది. మూడింటిలో తేడా అయితే ఉంది
కదా! ఉన్నదైతే శాంత స్వరూపముగా. అలా ప్రతిరోజు శాంత స్వరూపపు అనుభూతిలో కూడా
ప్రోగ్రెస్ ఉండాలి. ఒకసారి ఒక పాయింట్ తో శాంత స్వరూపపు అనుభూతిని చేస్తే,
మరొకసారి మరొక పాయింట్ తో చేసినట్లయితే ప్రతి రోజూ నూతన అనుభవము ఉంటుంది మరియు
కొత్తకొత్తవి లభించాలి అని ఎల్లప్పుడూ ఇందులోనే బిజీగా ఉంటారు. లేదంటే
ఏమవుతుందంటే నడుస్తూ - నడుస్తూ స్మృతి యొక్క విధి, అదే మురళిని వినే మరియు
వినిపించే విధి, మరల అదే విషయము అప్పుడప్పుడు సాధారణ అనుభవము అనిపిస్తుంది.
కనుక మరల ఉల్లాసము కూడా ఏవిధంగా ఎప్పుడూ ఉంటుందో అలాగే ఉంటుంది, ముందుకు వెళ్ళరు.
మరియు దీనికి రిజల్ట్ గా మరల ఎప్పుడో అప్పుడు నిర్లక్ష్యము కూడా వస్తుంది.
ఇదైతే నాకు రానే వస్తుంది, ఇదైతే తెలుసు! కనుక ఎగిరే కళకు బదులుగా ఆగే కళ
అయిపోతుంది. కనుక స్వయం మరియు ఏ ఆత్మలకైతే నిమిత్తులుగా అవుతారో వారికి సదా
నవీనతను అనుభవము చేయించేందుకు ఈ విధి తప్పనిసరిగా కావాలి. అర్థమైందా! మీరందరూ
మెజారిటీ సేవకు నిమిత్తులైన ఆత్మలు కదా, కనుక ఈ విశేషతను తప్పకుండా ధారణ
చెయ్యాలి. ప్రతిరోజూ ఏదో ఒక పాయింట్ ను తియ్యండి - శాంత స్వరూప అనుభూతికి
చెందిన పాయింట్లు ఏమిటి? అలాగే ప్రేమ స్వరూపము, ఆనంద స్వరూపము, అన్నింటి విశేష
పాయింట్లు బుద్ధిలో ఉంచుకుంటూ ప్రతిరోజూ కొత్త కొత్త అనుభవమును చెయ్యండి. ఈరోజు
కొత్త అనుభవమును చేసి ఇతరులకు కూడా ఆ అనుభవమును చేయించాలి అని సదా అనుకోండి.
అప్పుడు మరల అమృతవేళ కూర్చోవటంలో కూడా చాలా రుచి ఉంటుంది. లేనట్లయితే
అప్పుడప్పుడు సోమరితనమునకు చెందిన అల వస్తుంది. ఎక్కడైతే కొత్త వస్తువు
లభిస్తుందో అక్కడ సోమరితనము ఉండదు. అదే అదే విషయము అయినట్లయితే సోమరితనము రావటం
మొదలు పెడుతుంది. మరి ఏం చెయ్యాలో అర్థమైందా? విధి అర్థమైందా? ఇప్పుడు ఏదైనా
ప్రశ్నను అడగాలంటే అడగండి - విదేశీయులకు మామూలుగా కూడా వెరైటీ మంచిగా
అనిపిస్తుంది. పిక్నిక్ లో స్వీటూ కావాలి, హాటూ కావాలి. ఇంకా వెరైటీ రకాలు కూడా
కావాలి. కనుక అనుభవము చెయ్యాలని ఎప్పుడు కూర్చున్నా ఇప్పుడు బాప్ దాదాతో వెరైటీ
పిక్నిక్ చెయ్యటానికి వెళ్తున్నాము అని భావించండి. పిక్ నిక్ అన్న పేరును
వినటంతోనే హుషారైపోతారు. సోమరితనము పారిపోతుంది. మామూలుగా కూడా మీకు పిక్నిక్
చెయ్యటము, బయటకు వెళ్ళటము మంచిగా అనిపిస్తుంది కదా! మరి బయటకు వెళ్ళండి,
ఒక్కోసారి పరంధామానికి వెళ్ళండి, ఒక్కోసారి స్వర్గములోకి వెళ్ళండి, ఒక్కోసారి
మధువనములోకి రండి, ఒక్కోసారి లండన్ సెంటర్ కు వెళ్ళండి, ఒక్కోసారి ఆస్ట్రేలియాకు
చేరుకోండి. వెరైటీ ఉన్న కారణంగా రమణికతలోకి వస్తారు. అచ్ఛా –