సంకల్పాల గతి ఓర్పు(నెమ్మది)గా ఉంటే కలిగే లాభాలు.
ఈరోజు బాప్ దాదా 'నాకు ఒక్క బాబా తప్ప మరి ఎవ్వరూ లేరు'
అని భావించే ఇటువంటి ఏకనామీలు, ఏకరస స్థితిలో స్థితులై ఉండే స్మృతి
స్వరూపులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరి మరజీవా
జన్మ యొక్క శ్రేష్ట రేఖలను బాప్ దాదా చూస్తున్నారు. ఈనాటి ప్రపంచంలో విశేషంగా
హస్త రేఖలను చూడడం ద్వారా ఆత్మ యొక్క భాగ్యమును వర్ణన చేస్తారు లేక గుణాలు,
కర్తవ్యము యొక్క శ్రేష్టతను వర్ణిస్తారు. కాని బాప్ దాదా హస్త రేఖలను చూడరు.
పిల్లలు ప్రతి ఒక్కరి ముఖం, నయనాలు మరియు మస్తకము ద్వారా ప్రతి ఒక్కరి వేగము
మరియు స్థితి యొక్క రేఖలను చూస్తున్నారు. ముఖ కవళిక ద్వారానే మనుష్యులు ఆత్మలను
పరిశీలించి గుర్తించే ప్రయత్నం చేస్తారు. వారు దేహ అభిమానము ఉన్న కారణంగా స్థూల
విషయాలను పరిశీలిస్తారు. బాప్ దాదా మస్తకము ద్వారా స్మృతి స్వరూపమును చూస్తారు,
నయనాల ద్వారా జ్వాలారూపమును చూస్తారు, ముఖంలోని మందహాసము ద్వారా అతీతముగా మరియు
ప్రియముగా ఉండే కమలపుష్ప సమాన స్థితిని చూస్తారు. ఎవరైతే సదా స్మృతి స్వరూపులుగా
ఉంటారో వారి రేఖలు, సదా మస్తకములో సంకల్పాల గతి అనుసారముగా ఓర్పుగా, మెల్లగా
ఉంటాయి. ఏవిధమైన భారం, వత్తిడి ఉండదు. ఒక్క నిమిషంలో ఒక్క సంకల్పం చేస్తూ అనేక
సంకల్పాలకు జన్మనివ్వరు. శరీరంలో ఉన్న ఏదైనా రోగమును నాడి ద్వారా ఏ విధముగా
పరిశీలిస్తారో అలాగే సంకల్పాల గతి ఈ మస్తక రేఖలకు గుర్తు. సంకల్పాల గతి చాలా
తీవ్రగతిలో ఉన్నట్లయితే ఒకదాని తర్వాత మరొకటి ఒకదాని నుండి మరొకటి కొనసాగుతూనే
ఉంటే, సంకల్పాల వేగము చాలా తీవ్రముగా ఉండడం ఇది కూడా భాగ్యపు శక్తిని వ్యర్ధం
చేసుకోవడమే! మాటల ద్వారా అతి తీవ్ర వేగముతో మరియు సదా మాట్లాడుతూనే ఉన్నట్లయితే
శారీరక శక్తి వ్యర్థమవుతుంది కదా! కొందరు సదా మాట్లాడుతూనే ఉంటారు, చాలా
ఎక్కువగా మాట్లాడుతారు, గట్టిగా... అప్పుడు వారితో ఏమంటారు? మెల్లగా మాట్లాడండి,
తక్కువగా మాట్లాడండి అని అంటారు కదా! అలాగే సంకల్పాల గతి ఆత్మిక ఎనర్జీని
వ్యర్ధం చేస్తుంది. పిల్లలందరూ అనుభవజ్ఞులే... వ్యర్థ సంకల్పాలు కలిగినప్పుడు
సంకల్పాల గతి ఎలా ఉంటుంది? ఎప్పుడైతే జ్ఞాన మననము జరుగుతుందో అప్పుడు సంకల్పాల
గతి ఎలా ఉంటుంది? అక్కడ ఎనర్జీ వ్యర్థమవుతుంది, ఇక్కడ ఎనర్జీ తయారవుతుంది.
వ్యర్ధ సంకల్పాల గతి తీవ్రంగా ఉన్న కారణముగా తమను తాము ఎప్పుడూ శక్తి స్వరూపముగా
అనుభవం చేసుకోరు. ఏవిధముగా శారీరక శక్తి తక్కువయినప్పుడు ఈరోజు నా బుర్ర చాలా
చాలా ఖాళీగా ఉంది అన్ని వర్ణన చేస్తారో, అలాగే ఇక్కడ కూడా ఆత్మ సర్వ ప్రాప్తుల
నుండి తనను తాను ఖాళీగా అనుభవం చేసుకుంటుంది. ఏవిధంగా శారీరక శక్తి కొరకు
ఇంజెక్షన్ ఇచ్చి శక్తిని నింపుతారో లేక గ్లూకోస్ ను ఏ విధంగా ఎక్కిస్తారో అలాగే
ఆత్మికతలో బలహీనంగా ఉన్న ఆత్మ పురుషార్ధం యొక్క విధిని - నేను మాస్టర్
సర్వశక్తివంతుడను అంటూ స్మృతిలోకి తెచ్చుకుంటుంది. ఈరోజు మురళిలో బాప్ దాదా ఏయే
పాయింట్లను వినిపించారు! వ్యర్ధ సంకల్పాల బ్రేక్ ఏమిటి! బింధువు దిద్దే ప్రయత్నం
చేయడం... ఇవన్నీ ఇంజెక్షన్ వేయడం లాంటిదే. కావున ఈ విధంగా పురుషార్ధపు విధి
యొక్క ఇంజెక్షన్ ద్వారా కొంత సమయం శక్తిశాలిగా అయిపోతారు లేక విశేష స్మృతి
యొక్క ప్రోగ్రాముల ద్వారా లేక విశేష సంఘటన మరియు సాంగత్యము ద్వారా గ్లూకోజ్
ఎక్కించుకుంటారు. కానీ సంకల్పాల గతి తీవ్రంగా ఉన్న అభ్యాసకులు కొద్ది శక్తిని
నింపుకోవడం ద్వారా కొద్ది సమయం వరకు తమను తాము శక్తివంతంగా అనుభవం చేసుకుంటారు,
మళ్ళీ ఇంకా బలహీనముగా అయిపోతారు. కావున బాప్ దాదా మస్తకము యొక్క రేఖల ద్వారా
ఫలితాలను చూస్తూ - సంకల్పాల గతిని అతి తీవ్రతరం చెయ్యకండి అని పిల్లలకు మళ్ళీ
ఇదే శ్రీమతమును ఇస్తున్నారు. పది మాటలకు బదులుగా రెండు మాటలు మాట్లాడండి, ఆ
రెండు మాటల్లో వంద మాటల కార్యాన్ని సిద్ధింపచేసే సామర్ధ్యత ఉండాలి అని ముఖం
యొక్క మాటల గురించి వర్ణన చేస్తారు కదా! అలాగే సంకల్పాల వేగం, సంకల్పాలు కూడా
అవసరమైనవే ఉండాలి, సంకల్పాలరూపి బీజము సఫలత అనే ఫలముతో సంపన్నముగా ఉండాలి.
బీజము ఖాళీగా ఉండకూడదు దాని ద్వారా ఫలము వెలువడకుండా ఉండకూడదు. దీనినే సదా
సమర్ధ సంకల్పాలు చేయడం అని అంటారు. వ్యర్ధము ఉండకూడదు, సమర్ధ సంకల్పాల సంఖ్య
స్వతహాగా తక్కువగా ఉంటాయి కాని శక్తి శాలిగా ఉంటాయి మరియు వ్యర్థము యొక్క సంఖ్య
ఎక్కువగా ఉంటాయి కాని ప్రాప్తి ఏ మాత్రము ఉండదు. వ్యర్ధ సంకల్పాలు వెదురు
అడవిలాంటివి, అవి ఒక దాని నుండి అనేకం స్వతహాగానే ఉత్పన్నమవుతుంటాయి మరియు
పరస్పరంలో ఘర్షణ పడి తగలబడిపోతాయి మరియు స్వతహాగానే తమ అగ్నిలో తామే భస్మం
అయిపోతాయి. అలాగే వ్యర్ధ సంకల్పాలు కూడా ఒకదానితో ఒకటి సంఘర్షణ పడి ఏదో ఒక
వికారపు అగ్నిని ప్రజ్వలింపచేస్తాయి మరియు స్వయమే స్వయమును వ్యాకులపర్చుకుంటారు.
కావున సంకల్పాల వేగమును నెమ్మది చెయ్యండి.
ఈ మరజీవా జన్మ యొక్క ఖజానా అనండి లేక విశేష ఎనర్జీ
అనండి, అవి సంకల్పాలే. మరజీవగా అయ్యే ఆధారము శుద్ధ సంకల్పాలే. 'నేను శరీరమును
కాను ఆత్మను', ఈ సంకల్పము గవ్వ నుండి వజ్ర సమానముగా చేసేసింది కదా! నేను
కల్పపూర్వపు బాబా సంతానమును, వారసుడిని, అధికారిని, ఈ సంకల్పము మాస్టర్ సర్వ
శక్తివంతునిగా తయారుచేసింది. కావున ఖజానా కూడా ఇదే, ఎనర్జీ కూడా ఇదే, కావున
సంకల్పము కూడా ఇదే. విశేష ఖజానాలను ఏవిధంగా ఉపయోగిస్తారో అలా తమ సంకల్పాల ఖజానా
లేక ఎనర్జీని గుర్తించి ఇలా కార్యములో వినియోగించండి. అప్పుడే సర్వ సంకల్పాలు
సిద్ధిస్తాయి మరియు సిద్ధి స్వరూపులుగా అయిపోతారు. కావున ఈరోజు ఏ రకాలను చూసారో
అర్థమయ్యిందా! కావున తక్కువగా అలోచించండి అనగా సిద్ధిస్వరూప సంకల్పాలను చెయ్యండి.
ఇటువంటి రేఖలు కలవారు సదా దుఃఖరహితపురపు యజమానులుగా ఉంటారు. నోటి నుండి
ఎల్లప్పుడు మహావాక్యాలనే ఉచ్ఛరించండి, మహావాక్యలు లెక్కించదగినవిగా ఉంటాయి.
మహానాత్మలు కూడా లెక్కించేంతగా ఉంటారు కదా! ఆత్మలు అనేక మంది ఉంటారు, పరమాత్మ
ఒక్కరే ఉంటారు. కావున సంకల్పాలు మరియు వాణి రెండు శక్తులను వ్యర్ధముగా ఖర్చు
చేయకండి, మహావీరులు, మహారథులు అనగా నోటి ద్వారా మహావాక్యాలను మాట్లాడేవారు.
బుద్ధి ద్వారా సిద్ధి స్వరూప సంకల్పాలను చేసేవారు - ఇవే మహావీరులు లేక మహారథుల
చిహ్నాలు. ఎటువంటి మహారథులుగా అవ్వలాంటే మీ ముందుకు ఎవరు వచ్చినా ఈ మహాన్ ఆత్మ
నా గూర్చి ఏవైనా శ్రేష్ట సంకల్పాలు వినిపించాలి, అశీర్వచనాలతో ఉన్న రెండు
మాటలైనా వినిపించాలి అన్న కోరికను కలిగి ఉండాలి. అశీర్వాదాలతో ఉన్న మాటలు సదా
తక్కువగా ఉంటాయి. కావున మహారథులు, మహావీరులు, దేవాత్మాలైన మీరు భక్తుల యొక్క
పూజ్య ఆత్మలు, సదా సంకల్పాలు మరియు మాల ద్వారా అశీర్వాదయుక్తమైన మాటలే
మాట్లాడాలి, అమృతవాణినే పలకాలి గాని, లౌకిక వాణిని కాదు అచ్ఛా!
సదా మహాన్ సంకల్పము ద్వారా స్వయమును మరియు సర్వులను
శీతలముగా చేసే, వాణి ద్వారా సదా అశీర్వాదయుక్తమైన వచనాలను పలికే, ఇటువంటి
శ్రేష్ట రేఖలు గల సదా శ్రేష్ట ఆత్మలకు, మహాన్ ఆత్మలకు, దైవ ఆత్మలకు, పూజ్య
ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
విదేశీ పిల్లలతో అవ్యక్త బాప్ దాదాల మిలనము:-
బాప్ దాదాల సదా స్నేహులు, సదా సహయోగులు, సదా
సేవాధారులైన సర్వీసబుల్ రత్నాలే కదా! రత్నాలు ప్రతి ఒక్కరూ ఎంత అమూల్యమైనవారు!
విశ్వంలోని షోకేస్‌లో మధ్యలో ఉంచనున్నారు. ఎంత ఎత్తైన అనేక రకాల గోడలను దాటి
బాబాకు చెందినవారిగా అయ్యారో బాప్ దాదాకు తెలుసు. ధర్మము అనే గోడలను, ఆచార
వ్యవహారాలనే గోడలను... ఇలా ఎన్ని గోడలను దాటేసారు! కాని బాబా సహయోగము కారణముగా
ఇంత ఎత్తయిన గోడలను కూడా ఏదో ఒక్క అడుగు వేసినట్లుగా దాటివేసారు. ఎటువంటి కష్టమూ
లేదు, ఎంత సహజముగా అనిపించిందంటే మేము ముందే బాబాకు చెందినవాళ్ళము అని భావించారు.
మీరందరూ బాబాకు చెందినవారు అవ్వకపోతే విదేశాలలో ఇన్ని సెంటర్లు ఎలా తెరువబడేవి!
సేవార్ధము తమ తమ స్థానలకు చేరుకున్నారు, మళ్ళీ బాబా వచ్చి తమ వారిగా
చేసుకున్నారు. కావున ఇప్పుడు ఏమని భావిస్తున్నారు? మధువన నివాసులుగానే
భావిస్తున్నారు కదా! మీ అందరి ఓట్లు మధువనములోనే ఉన్నాయి. మధువన నివాసులమైన
మేము సేవార్ధము కొరకే వెళ్ళాము అన్ని భావిస్తున్నారా? ఏ విధంగా భారతవాసులైన
పిల్లలు కూడా విభిన్న స్థానాలకు వెళ్ళారో అలా మీరు కూడా వెళ్ళారు. పిల్లలు ప్రతి
ఒక్కరికి భిన్నభిన్న సేవా పాత్రలు ఉంటాయి. తమ సహచరులను మేల్కొల్పేందుకు ఎంత
సహజమైన సేవకు నిమిత్తమైపోయారు! బాప్ దాదా వెరౖటీ స్థానాలలోని వెరౖటీ పుష్పాలను
చూసి ఎంతో సంతోషిస్తున్నారు. వేరౖటీ పుష్పాలన్నీ ఒక్క వృక్షంగా అయిపోయే ఇటువంటి
వృక్షాన్ని ఎప్పుడైనా చూసారా? ఒకే వృక్షానికి భిన్నభిన్న రకాల గులాబీలు,
పుష్పాలు..... మీరు సదా సిద్ధి స్వరూపులు. ఎందుకంటే బాప్ దాదా ద్వారా వరదాని
ఆత్మలుగా అయిపోయారు. మూడు పదాలను సదా గుర్తించుకోండి, ఒకటి - సదా బ్యాలెన్స్ ను
ఉంచడము, రెండవది - సదా ఆనందంగా ఉండడం, మూడవది - సర్వులకు దీవెనలను ఇవ్వాలి. సేవ
మరియు స్వయం యొక్క సేవ రెండింటి బ్యాలెన్స్ సదా ఉండాలి. బ్యాలెన్స్ ద్వారా ఎన్ని
కళలు చూపిస్తారు! అలాగే మీరు కూడా బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సదా 16 కళా
సంపన్న స్వరూపముగా అయిపోతారు. మీ ప్రతి కర్మ కళగా అయిపోతుంది. చూడడం కూడా కళయే,
ఎందుకంటే ఆత్మగా అయి వింటారు కదా! ఇలా మాట్లాడడం, నడవడములో ప్రతి అగుడులోను,
ప్రతి కర్మలోను ఇది ఉండాలి, కాని వీటన్నింటికి ఆధారము బుద్ధి యొక్క బ్యాలెన్స్.
ఇలా సదా పీస్ ఫుల్ అనగా అనంద స్వరూపం. అనంద సాగరుని పిల్లలు సదా అనంద స్వరూపులే
అచ్చా!
ఇప్పుడు ఇంకా కలుస్తూనే ఉంటాము, సంగమయుగమే ఒక మేళ.
కావున సదా కలుస్తూనే ఉంటాము. ఒక్క రోజు కూడా బాబా మరియు పిల్లల మిలనము జరగకుండా
ఉండడమన్నది జరగజాలదు... ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా! సదా బాబా తోడుగా
కంబైన్డ్ రూపంగా ఉన్నారు కదా! కంబైన్డ్ రూపముతో వేరు చేసే ధైర్యము కూడా
ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ ఆ శక్తి లేదు. అచ్ఛా!