శుభాకాంక్షలు మరియు వీడ్కోలు ఇవ్వండి.
అవ్యక్త బాప్ దాదా అలౌకిక జన్మధారి విశేష ఆత్మలతో
మాట్లాడుతున్నారు -
ఈరోజు విశ్వకళ్యాణకారి బాప్ దాదా విశ్వంలో నలువైపుల
ఉన్న పిల్లలను ఎదురుగా చూస్తున్నారు. పిల్లలందరూ తమ స్మృతి శక్తి ద్వారా
ఆకారరూపంలో మధువనానికి చేరుకున్నారు. ప్రతీ ఒక్కరిలో బాబాని కలుసుకోవాలనే
శుభసంకల్పం ఉంది. బాప్ దాదా పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే
ప్రతి ఒక్క బిడ్డ యొక్క విశేషత తెలుసు. ఆ విశేషత ఆధారంగానే ప్రతీ ఒక్కరు తమ తమ
విశేష పాత్ర అభినయిస్తున్నారు. బ్రాహ్మణాత్మల యొక్క లేదా బ్రాహ్మణ పరివారం
యొక్క నవీనత - ఒక్క బ్రాహ్మణాత్మ కూడా విశేషత లేకుండా సాధారణంగా ఉండదు.
బ్రాహ్మణులు అందరూ అలౌకిక జన్మ తీసుకున్న అలౌకిక ఆత్మలు. అందువలన అందరూ
అలౌకికమైన వారు అంటే ఏదో ఒక విశేషత కారణంగా విశేష ఆత్మలు. విశేషతయే అలౌకికత.
అందువలన పిల్లలను చూసి బాప్ దాదాకి గర్వంగా ఉంది. అందరూ విశేష ఆత్మలు. ఇదేవిధంగా
మీరు కూడా ఈ అలౌకిక జన్మ యొక్క అలౌకికత యొ క్క ఆత్మీయతయొక్క మాస్టర్
సర్వశక్తివాన్ స్థితి యొక్క నషాను మీలో అనుభవం చేసుకుంటున్నారా? ఈ నషా అన్ని
రకాల బలహీనతలను సమాప్తి చేస్తుంది. సదాకాలికంగా సర్వ బలహీనతలకు వీడ్కోలు
ఇచ్చేటందుకు ముఖ్య సాధనం - సదా స్వయాన్ని మరియు సర్వులను సంగమయుగీ విశేష ఆత్మగా
భావించి విశేష పాత్రకు శుభాకాంక్షలు చెప్పండి. విశేష రోజులలో లేదా విశేష కార్యం
చేసేటప్పుడు ఏమి చేస్తారు? ఆ కార్యానికి లేదా పరస్పరం శుభాకాంక్షలు చెప్తారు కదా!
అయితే మొత్తం కల్పంలో సంగమయుగం అంటేనే ప్రతీ రోజు విశేషమైన రోజు మరియు మీరు
విశేషయుగం యొక్క విశేష పాత్రధారులు. అందువలన విశేష ఆత్మలైన మీ ప్రతి కర్మ
అలౌకికమైనది మరియు విశేషమైనది కూడా! సదా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇది
డబల్ విదేశీయుల సీజన్. ఈ సీజన్ యొక్క సారం ఇదే - సదా శుభాకాంక్షల ద్వారా
వీడ్కోలు ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిందే వీడ్కోలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడానికి.
సదా ఈ రెండు మాటలను స్మృతిలో ఉంచుకోండి. వీడ్కోలు ఇవ్వాలి అని అనటం కాదు,
వీడ్కోలు ఇచ్చేశాం అనాలి. వరదాన భూమికి రావటం అంటే బలహీనతలకు సదాకాలికంగా
వీడ్కోలు ఇవ్వటం. రావణుడిని కాల్చేస్తున్నారు కానీ రావణుని వంశం మిమ్మల్ని నాశనం
చేస్తుంది. మీ సాకార ప్రపంచంలో ఎవరైనా ధనవంతులు శరీరం వదిలేస్తే వారి
ఎక్కడెక్కడి దూర సంబంధీకులు కూడా వచ్చేస్తారు కదా! (ఆస్తి పంచుకోవడానికి)
అదేవిధంగా మీరు రావణుడిని చంపేస్తున్నారు. కానీ, అతని వంశం తమ హక్కుని
తీసుకోవడానికి మిమ్మల్ని ఎదుర్కొంటున్నాయి. లోభం యొక్క అంశం - అవసరం. లోభం కాదు
కానీ ఇవన్నీ అవసరం అంటారు. కానీ, అవసరానికి కూడా హద్దు ఉంటుంది. అవసరానికి హద్దు
లేకపోతే అది కూడా లోభం యొక్క అంశం అయిపోతుంది.
అదేవిధంగా కామ వికారం లేదు, సదా బ్రహ్మచారిగా
ఉంటున్నారు. కానీ ఏ ఆత్మ పట్ల అయినా విశేష తగుల్పాటు రూపంలో సూక్ష్మ స్నేహం
ఉంటుంది. ఈ ఎగస్ట్రా స్నేహం అనేది కామం యొక్క అంశం. స్నేహం అనేది సరైనదే కానీ
ఎగస్ట్రాగా ఉండటం అనేది అంశం.
అదేవిధంగా క్రోధాన్ని కూడా జయించేశారు. కానీ, ఏ ఆత్మ
యొక్క సంస్కారాన్ని అయినా చూసి, స్వయం జ్ఞాన స్వరూప స్థితి నుండి క్రిందకి
వచ్చేసి ఆ ఆత్మ నుండి వేరుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారిని చూసి
లేదా వారి సంప్రదింపుల్లో ఉండటం ద్వారా స్థితి అలజడి అవుతుంది. అందువలన
స్వభావాన్ని చూసి వేరు చేస్తున్నారు. ఇది కూడా అసహ్యం యొక్క అంటే క్రోధం యొక్క
అంశమే. క్రోధం అనేది అగ్ని వలె కాల్చేస్తుంది. అందువలన దూరంగా ఉంటున్నారు.
అదేవిధంగా ఈ సూక్ష్మ అసహ్యభావన కూడా క్రోధాగ్నితో సమానం. రాయల్ గా ఏమి అంటారు
అంటే మన స్థితిని పాడుచేసుకోవటం దేనికి? దీని కంటే వేరుగా ఉంటే మంచిది అంటారు.
అతీతం అవ్వటం అనేది వేరే విషయం, వేరు చేయటం అనేది వేరే విషయం. ప్రియంగా ఉంటూ
అతీతంగా ఉండటం అనేది సరైన విషయం. కానీ వీరు ఇంతే, వీరు మారేవారు కాదు - ఇది
సూక్ష్మ అసహ్య భావన. ఈ భావన ద్వారా వారిని మీరు సదా కాలికంగా, సూక్ష్మంగా
శాపితుల్ని చేస్తున్నారు. మీరు రక్షణగా ఉండండి కానీ వారికి ఫైనల్ సర్టిఫికేట్
ఇవ్వకండి. విశేషతను చూస్తూ సదా సర్వుల పట్ల శ్రేష్టభావన మరియు శ్రేష్ట కామన
ఉంచుకుంటూ ఈ అంశానికి వీడ్కోలు ఇచ్చేయండి. మీ శ్రేష్ట భావనను మరియు శ్రేష్ట
కామనను, వదలకండి. మిమ్మల్ని మీరు రక్షించుకునేటందుకు ఇతరాత్మలను పడవేసి
మిమ్మల్ని మీరు రక్షించుకోకండి. అసహ్యపడటం అంటే వారిని పడవేయటం. ఇతరులను పడవేసి
స్వయాన్ని రక్షించుకోవటం బ్రాహ్మణుల విశేషత కాదు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి
మరియు ఇతరులను కూడా రక్షించండి. దీనినే విశేషంగా అవ్వటం మరియు విశేషతను చూడటం
అంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు నడుస్తూ నడుస్తూ రెండు రూపాలను ధరిస్తాయి.
1. మనస్సుని బలహీనం చేసేస్తాయి. 2. నిర్లక్ష్యాన్ని తీసుకువస్తాయి. ఇప్పుడు ఈ
రావణుని అంశానికి సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేటందుకు ఈ రెండు రూపాలను వీడ్కోలు
ఇవ్వండి. బాబా ద్వారా లభించిన మీలో ఉన్న విశేషతను సదా చూడండి. నా విశేషత అని
భావించకూడదు, బాబా ద్వారా లభించిన విశేషత అని భావించాలి. నా విశేషత అని
ఆలోచించారంటే అహంకారం యొక్క అంశం వచ్చేస్తుంది. నా విశేషతను ఎందుకు
ఉపయోగించుకోవటం లేదు, నా విశేషతను తెలుసుకోవటమే లేదు.... ఇలా నాది అనే భావం
ఎక్కడి నుండి వచ్చింది? విశేషత అనేది విశేష జన్మ యొక్క కానుక. ఆ విశేషతను
జన్మదాత కానుకగా ఇచ్చారు. అయితే నాది అనేది ఎక్కడి నుండి వచ్చింది? నా విశేషత,
నా స్వభావం, నా మనస్సు ఇలా చెపుతుంది లేదా నా హృదయం ఇలా అంటుంది..... ఇలా నాది
అనే భావన వస్తే అదే చింత. అర్ధమైందా! ఈ అంశాన్ని సమాప్తి చేయండి మరియు సదా బాబా
ద్వారా లభించిన స్వయంలోని విశేషతను మరియు సర్వుల విశేషతలను చూడండి అంటే సదా
స్వయానికి మరియు ఇతరులకి శుభాకాంక్షలు ఇచ్చుకోండి, అన్నింటి యొక్క అంశం గురించి
విన్నారు కదా! ఇప్పుడు మోహం యొక్క అంశం ఏమిటి? నష్టోమోహ అవ్వలేదా? మోహం యొక్క
సూక్ష్మ రూపం - ఏదైనా వస్తువు లేదా వ్యక్తి ఇష్టంగా అనిపించటం. ఈ.... ఈ.....
వస్తువులు నాకు ఇష్టం, మోహం లేదు కానీ ఇష్టంగా అనిపిస్తాయి అంటారు. ఏ వస్తువు
లేదా వ్యక్తి ఇష్టంగా అనిపించటం అంటే అన్ని మరియు అందరూ ఇష్టం అనిపించాలి. అంటే
చిరిగిన బట్టలు ఇష్టం అనిపించాలి మరియు ఖరీదైన బట్టలు కూడా ఇష్టం అనిపించాలి.
36 రకాల భోజనం ఇష్టం అనిపించాలి, ఎండిపోయిన రొట్టె, బెల్లం కూడా ఇష్టం
అనిపించాలి. ప్రతీ వస్తువు ఇష్టం లేదా ప్రతీ వ్యక్తి ఇష్టం అనిపించాలి. వీరు
లేదా ఇది ఎక్కువ ఇష్టం అని అనకూడదు. ఈ వస్తువంటే నాకు చాలా ఇష్టం అని అనకూడదు.
భోజనం అంటే మందు. మందుగా చేసుకుని తినండి. అంతేకానీ ఇష్టం అనిపించి తినటం కాదు.
మంచిగా లేదా ఇష్టంగా అనిపిస్తే ఆకర్షణ వస్తుంది. ఇది మోహం యొక్క అంశం, తినండి,
త్రాగండి, మజాగా ఉండండి. కానీ అంశానికి వీడ్కోలు ఇచ్చేసి అతీతంగా అయ్యి
ఉపయోగించటంలో ప్రియంగా అవ్వండి. అర్థమైందా! బాప్ దాదా యొక్క భండారాలో సర్వుల
కొరకు సర్వ ప్రాప్తి సాధనాలు స్వతహాగానే తయారై ఉన్నాయి. బాగా తినండి కానీ బాబాతో
పాటు తినండి, వేరుగా తినకండి. బాబాతో పాటు తింటూ మరియు బాబాతో మజా జరుపుకుంటూ
ఉంటే స్వతహాగానే మర్యాద రేఖలో అశోకవాటికలో ఉంటారు. అక్కడికి రావణుని వంశం రాలేదు.
తినండి, త్రాగండి, మజాగా ఉండండి. కానీ మర్యాద రేఖలో ఉంటూ, బాబాతో పాటు
జరుపుకోండి. అప్పుడు ఏ విషయం కష్టం అనిపించదు. ప్రతి విషయం మనోరంజనంగా అనుభవం
అవుతుంది. అర్థమైందా ఏమి చేయాలో? సదా మనోరంజనం జరుపుకోండి. మంచిది. డబల్
విదేశీయులకి మనోరంజనం యొక్క విధి అర్థమైంది కదా! కష్టంగా అనిపించటం లేదు కదా!
బాబాతో పాటు కూర్చోండి.. అప్పుడు ఏ కష్టం ఉండదు. ప్రతి ఘడియ మనోరంజనంగా
అనిపిస్తుంది. ప్రతి సెకను స్వయం పట్ల మరియు సర్వుల పట్ల శుభాకాంక్షల యొక్క
మాటలు వస్తుంటాయి. అయితే వీడ్కోలు ఇచ్చి వెళ్ళాలి కదా! వెంట అయితే తీసుకు
వెళ్ళరు కదా! సర్వ వంశానికి వీడ్కోలు ఇచ్చే శుభాకాంక్షలు ఇచ్చుకోండి. డబల్
విదేశీయులు అందరూ తయారే కదా! మంచిది! బాప్ దాదా కూడా ఈ విధంగా సదాకాలికంగా
వీడ్కోలు ఇచ్చేవారికి శుభాకాంక్షలు చెపుతున్నారు. వీడ్కోలు యొక్క పదమపదాల
శుభాకాంక్షలు.
ఈ విధంగా సదా మన్మనాభవ అంటే సదా మనోరంజనం చేసుకునే
వారికి, సదా ఒకే శివబాబాలో మొత్తం ప్రపంచాన్ని అనుభవం చేసుకునే వారికి,
విశేషతలను చూసే విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.