జనవరి 18 అనగా బాధ్యతా కిరీటధారణ మహోత్సవ రోజు.
అవ్యక్త బాప్ దాదా తనకంటి రత్నాలైన పిల్లలతో
మాట్లాడుతున్నారు -
విశ్వానికి వెలుగు అయిన బాప్ దాదా తన యొక్క
కంటిరత్నాలను కలుసుకునేటందుకు వచ్చారు. గారాబమైన బాబా యొక్క కంటిరత్నాలు, ఏ
విధంగానైతే శరీరంలో నయనాలు లేకపోతే ప్రపంచమే లేదు. అదే విధంగా ఆత్మిక వెలుగైన
మీరు లేకపోతే విశ్వంలో వెలుగు లేనే లేదు, అంధకారం ఉంటుంది. బాప్ దాదా యొక్క కంటి
వెలుగులు అంటే విశ్వానికి జ్యోతులు. స్మృతి దినోత్సవం అయిన ఈరోజు అమృతవేళ నుండి
అందరి యొక్క స్నేహ గీతాలు వతనంలో వినిపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరి గీతం ఒకరికంటే
ఒకరిది ప్రియంగా ఉంది.
మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణలు కూడా చాలా విన్నారు.
పిల్లల ప్రేమ యొక్క ముత్యాల మాలలు బాప్ దాదా యొక్క కంఠాన్ని అలంకరించాయి.
ఇటువంటి ముత్యాల మాలలు కల్పం మొత్తంలో ఇప్పుడే అలంకరిస్తాయి. అమూల్య స్నేహం
యొక్క ముత్యాల మాలలు ఇంకెప్పుడు అలంకరించవు. ఒక్కొక్క ముత్యంలో ఏమేమి దాగి
ఉన్నాయో? నా బాబా!... ఓహో బాబా!....ప్రతి ముత్యంలో ఈ మాటలే దాగి ఉన్నాయి. ఇలా
ఎన్ని మాలలు ఉండి ఉంటాయో చెప్పండి? ఈ మాలలతో బాప్ దాదా ఎంతగా అలౌకికంగా
అలంకరించబడి ఉంటారో కదా! స్థూలంగా కూడా స్నేహానికి గుర్తుగా మాలలతో అలంకరిస్తారు
కదా! అలాగే ఇక్కడ స్థూల అలంకరణను చేశారు కానీ వతనంలో అమృతవేళ నుండి బాప్ దాదాని
అలంకరించటం మొదలు పెట్టారు. ఒకదానిపై ఒకటి ఇలా మాలలు బాప్ దాదాని సుందరంగా
అలంకరించాయి. ఇప్పుడు అందరూ చిత్రాన్ని చూస్తున్నారు కదా!
ఈరోజు విశేషంగా పిల్లలందరి యొక్క కిరీటధారణ మహోత్సవ
రోజు. ఈ రోజు ఆదిదేవుడు అయిన బ్రహ్మాబాబా స్వయం సాకార బాధ్యతలను అంటే సాకార రూపం
ద్వారా సేవ అనే కరీటాన్ని, నయనాల యొక్క దృష్టి ద్వారా, చేతిలో చేయి కలిపి తన
యొక్కప్రియమైన పిల్లలకు అర్పణ చేశారు. అనగా ఈరోజు బ్రహ్మాబాబా తన సాకార రూపం
యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు ధారణ చేయించే - కిరీట మహోత్సవం. (దాదీతో)
ఒకప్పటి ఈ రోజు జ్ఞాపకం ఉంది కదా? ఈరోజు బ్రహ్మాబాబా బాప్ సమాన భవ అనే వరదానం
పిల్లలకు ఇచ్చిన రోజు.
బ్రహ్మాబాబా యొక్క అంతిమ సంకల్పం యొక్క మాటలు లేదా
నయనాల యొక్క భాష విన్నారా? ఏం చెప్పారు? నయనాల సైగ చేసిన మాటలు ఇవే - పిల్లలూ!
సదా బాబాకి సహయోగం అనే విధి ద్వారా వృద్ధి పొందుతూ ఉండండి. ఈ అంతిమ మాట లేదా
వరదాని మాట యొక్క ప్రత్యక్ష ఫలాన్ని మీరు చూస్తున్నారు. బ్రహ్మాబాబా యొక్క
అంతిమ వరదానానికి సాకార స్వరూపమే మీరందరు. వరదానం అనే బీజం ద్వారా వచ్చిన వెరైటీ
ఫలాలు. ఈరోజు శివబాబా, బ్రహ్మాబాబాకి తన వరదానం అనే బీజం ద్వారా వచ్చిన సుందర
విశాల వృక్షాన్ని చూపిస్తున్నారు. ఒకే వృక్షానికి రకరకాల ఫలాలు పండించాలని
విజ్ఞానశక్తి వారు ప్రయత్నిస్తున్నారు. కానీ, బ్రహ్మాబాబా యొక్క వరదాని వృక్షం,
సహజయోగం యొక్క పాలన ద్వారా ఫలం పొందిన వృక్షం ఎంతో విచిత్రమైనది మరియు మనస్సుని
సంతోషం చేసే వృక్షంలో, ఒకే వృక్షంలో వెరైటీ ఫలాలు ఉంటాయి, వేర్వేరు వృక్షాలు
లేవు. వృక్షం ఒకటే, ఫలాలు చాలా రకాలు. ఇటువంటి వృక్షాన్ని చూస్తున్నారా? ప్రతి
ఒక్కరు మిమ్మల్ని మీరు ఈ వృక్షంలో చూసుకుంటున్నారా? ఈ రోజు వతనంలో ఇటువంటి
విచిత్ర వృక్షం కూడా ప్రత్యక్షం అయ్యింది. ఇటువంటి వృక్షం సత్యయుగంలో కూడా ఉండదు.
విజ్ఞానశక్తి వారు ప్రయత్నిస్తున్నారు. కనుక దాని యొక్క ఫలితం మీరు ఎంతో కొంత
చూస్తారు. ఒకే ఫలంలో రెండు లేదా నాలుగు వేర్వేరు ఫలాల యొక్క రసం అనుభవం
చేసుకుంటారు, వారు శ్రమ చేస్తారు, తినేది మీరు. ఇప్పటి నుండే తింటున్నారా ఏమిటి?
ఈరోజు ఏ రోజో విన్నారా? ఆదిలో ఎలాగైతే బ్రహ్మాబాబా స్థూలధనాన్ని అంతటినీ పిల్లల
కొరకు అర్పణ చేశారో, అదే విధంగా అర్పణ చేసిన అలౌకిక సంపత్తిని పిల్లలకు అర్పణ
చేశారు. ఈ విధంగా అర్పణ చేసిన అలౌకిక సంపత్తి ఆధారంగానే కార్యంలో ముందుకు వెళ్ళే
విల్ పవర్ మీకు ప్రత్యక్ష ఫలంగా లభిస్తుంది. పిల్లలను నిమిత్తం చేసి విల్ పవర్
ను విల్ చేశారు. ఈరోజు విశేషంగా బాబా సమానంగా అయ్యే వరదానిగా అయ్యే రోజు. స్నేహం
మరియు శక్తి కంబైండ్ వరదానం యొక్క రోజు. రెండింటినీ ప్రాక్టికల్ గా అనుభవం
చేసుకున్నారు కదా! అతి స్నేహం మరియు అతి శక్తి. (దాదీతో) అనుభవం స్మృతి ఉంది కదా!
మంచిది. ఈ రోజు గొప్పతనాన్ని తెలుసుకున్నారు కదా! మంచిది.
ఈ విధంగా సదా బాబా యొక్క వరదానాలతో వృద్ధి పొందే
వారికి, సదా ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు అనే స్మృతి స్వరూపులకు, సదా బ్రహ్మాబాబా
సమానంగా ఫరిస్తా భవ అనే వరదానిలకు, సమాన మరియు సమీప పిల్లలకు సమర్ధ దినోత్సవమున
బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.