''నా బాబా వచ్చేసారు'' - ఈ పదాలను ప్రసిద్ధము
చేసేందుకు నలువైపుల ఫరిస్తా రూపములో వ్యాపించండి.''
ఈరోజు బాప్ దాదా ఎక్కడకు వచ్చారు మరియు ఎవరిని
కలిసేందుకు వచ్చారు, తెలుసా? ఈరోజు గాడ్ గాడ్లీ ఫ్రెండ్ అయ్యి వచ్చారు. మరి
ఫ్రెండ్స్ పరస్పరములో ఏం చేస్తారు? పాడ్తారు, నవ్వుతారు, తింటారు, వినోదాలతో
గడుపుతారు. కనుక ఈరోజు బాప్ దాదా వినిపించేందుకు రాలేదు, మిలనము చేసేందుకు
వచ్చారు. ఎంతెంత దూరదూరాల నుండి, వెరౖటీ రకాలైన ఎంతమంది గాడ్లీ ఫ్రెండ్స్
చేరుకున్నారు అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. ఎంత మంచి గాడ్లీ ఫ్రెండ్స్!
ఒక్క గాడ్ ని ఫ్రెండ్ గా చేసుకున్న తరువాత - ఒకే గాడ్లీ ఫ్రెండ్, ఇతరులెవరూ లేరు.
కనుక ప్రతి ఒక్కరి ఫ్రెండ్ షిప్ యొక్క వారి వారి చిత్రాన్ని చూస్తున్నారు.
సదాకాలికమైన సత్యమైన ఫ్రెండ్ షిప్ లో మనసులో ఏ ఆలోచనలు వచ్చినా, వాటన్నింటినీ
ఫ్రెండ్ కి వినిపించటం జరుగుతుంది. మరి గాడ్ ని అటువంటి ఫ్రెండ్ గా చేసుకున్నారు
కదా? అవినాశీ ప్రీతి యొక్క సంబంధమును జోడించారు కదా? ఇప్పుడిప్పుడే జోడించారు,
ఇప్పుడిప్పుడే తెంచేసారు - ఇలా అయితే కాదు కదా! ఏమనుకుంటారు? అవినాశీ ఫ్రెండ్
షిప్ ఉందా? మొత్తము కల్పములో ఇటువంటి తండ్రి అనండి, ఫ్రెండ్ అనండి, ఏమైనా అనండి,
సర్వ సంబంధాలను నిర్వర్తించేవారు అనండి.... ఇలా ఎప్పుడైనా లభించారా? మొత్తము
కల్పపుచక్రమును త్రిప్పారు, లభించారా? మీ ఫ్రెండ్స్ ని, సర్వ సంబంధీకులను కూడా
బాబా వచ్చే వెతికారు, మీరు వెతకలేకపోయారు. అవినాశీ సర్వ సంబంధాలను జోడించేందుకు
ఆధారము మరియు విధి మంచిరీతిగా తెలుసా? ఎల్లప్పుడూ ఒకే మాట గుర్తు ఉండాలి - ''మేరా
బాబా''. మేరా బాబా అని అనటం ద్వారా అధికారీ ఆత్మగా అయిపోతారు. ఇదేమన్నా కష్టమా?
మేరా బాబా అని బాబా అన్నప్పుడు పిల్లలు మేరా బాబాను తెలుసుకోవటములో ఏం కష్టముంది!
మేరా (నా) అన్న ఈ మాట 21 జన్మల కొరకు తెగిపోని సంబంధమును జోడింపచేందుకు ఆధారము.
అటువంటి సహజ సాధనాన్ని మీదిగా చేసుకున్నారా? అనుభవీలైపోయారు కదా?
ఎంతమంది క్రొత్త క్రొత్త పిల్లలు తమ కల్పకల్పపు
అధికారాన్ని పొందేందుకు చేరుకున్నారు కూడా మరియు తమ అధికారాన్ని పొందుతున్నారు
కూడా అన్నదానిని ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు. అధికారీ పిల్లలను చూసి బాప్ దాదా
హర్షితులవుతున్నారు.
జపనీస్ డాల్స్(బొమ్మలు) బాగున్నారా? చాలా స్నేహముతో
చూస్తున్నారు. చూడండి, దేశము మరియు ధర్మములనే ముసుగులో ఉన్నాకూడా బాప్ దాదా తమ
పిల్లలను తనవారిగా చేసుకున్నారు. మరి జపనీస్ డాల్స్ ఏ పాటను పాడ్తారు? '' మై
బాబా'' (నా బాబా) అందరూ ఒకరికంటే మరొకరు ప్రియమైనవారు. అలాగే, చూడండి, ఫ్రాన్స్
పిల్లలు కూడా ఎంత ప్రియమైనవారో! భాష తెలియకపోయినా కూడా బాబానైతే
తెలుసుకున్నారు కదా! బ్రెజిల్, మెక్సికోలలోని గ్రూపులన్నీ చాలా బాగున్నాయి.
ఈసారి దూరదూరాలలో ఉన్న గ్రూప్ మంచి పురుషార్థము చేసి చేరుకున్నారు. లండన్,
అమెరికా, జర్మనీ వారైతే ముందు నుండీ ఉన్నారు. క్రొత్త క్రొత్త స్థానాలకు చెందిన
చాలా సుందరమైన పుష్పగుచ్ఛాన్ని చూస్తూ బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు.
అన్నింకంటే ఎక్కువ దూరమైనది ఏ స్థానము (పరంధామము), కరెక్ట్ గా చెప్తున్నారు.
కానీ ఎంత దూర స్థానమో, అక్కడినుండి చేరుకోవడానికి క్షణంలో చేరుకుంటారా లేక
ఆలస్యమౌతుందా?
హాంకాంగ్ (చైనీస్ భాషకు) చెందిన పిల్లలుకూడా
చేరుకున్నారు. గాడ్లీ పుష్పగుచ్ఛములోని అతి శోభనీయ పుష్పాలు! స్వయాన్ని ఈ
పుష్పగుచ్ఛమునకు చెందిన పుష్పాలుగా అనుభవము చేస్తున్నారు కదా? అచ్ఛా - ప్రతి
ఒక్క దేశమువారు తమ పేరు సహితంగా, అందరి పేర్లనైతే బాప్ దాదా తీసుకోరు కదా!
ప్రతి దేశమునుండి వచ్చిన పిల్లలందరూ అతి ప్రియమైనవారు. బాప్ దాదాతో మిలనము
జరుపుకునేందుకు వచ్చారు మరియు బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూసి పిల్లల
విశేషతలనే గీతాన్ని గానము చేస్తున్నారు. బార్బడోస్ వారు కూడా చాలా
సంతోషిస్తున్నారు. టినిడాడ్ ఆత్మలైతే చాలా బాగున్నారు. వారిని చూస్తేనే - చాలా
ఆనందముతో ఊగేవారు, సంతోషములో ఊయలలూగేవారు అని అనిపిస్తుంది. మారిషష్ కు చెందిన
కుమారీల పార్టీ కూడా చాలా మంచి పార్టీ. కుమారీలు ప్రతి ఒక్కరూ 100 మంది
బ్రాహ్మణుల కంటే ఉత్తమైనవారు. ఒకవేళ నలుగురు కుమారీలు వచ్చినా 400 మంది
బ్రాహ్మణులు వచ్చినట్లు. మా గ్రూప్ చాలా చిన్నది అని ఆలోచిస్తున్నారు, కానీ మీలో
400 మంది ఇమిడి ఉన్నారు, చిన్నది కాదు. మిగిలిన ఆస్ట్రేలియా మరియు లండన్ వారైతే
రేస్ చేస్తున్నారు మరియు జర్మనీ ప్రియమైనదిగా అయిపోయింది! దుబాయ్ వారు కూడా
ఒకరు లక్షమందితో సమానము. నైరోబీవారు అందరికంటే ఎక్కువ అద్భుతమును చేసారు. ఎవరూ
తయారు చెయ్యనటువంటి మినీ పాండవ భవన్ నైరోబీవారు తయారుచేసారు. మంచి వైట్ హౌసును
తయారుచేసారు. జర్మనీకి కూడా చాలా శాఖలు ఉన్నాయి. అమెరికావారికి కూడా చాలా శాఖలు
ఉన్నాయి. మొత్తము యూరప్ అంతా మంచి పురుషార్థము చేసి లండన్ మరియు ఆస్ట్రేలియాలకు
సమానంగా వృద్ధి పొందుతున్నారు.
అమెరికావారు ఏం చేస్తున్నారు? అమెరికా చాలా మంచి చతురతను చేసింది, అమెరికాలోని
అనేక మూలలో సేవాకేంద్రాలను తెరిచింది. ఇప్పుడు నలువైపుల సేవకు చెందిన మంచి
ముట్టడినైతే చేసింది, దీని ద్వారానే సమయము వచ్చినప్పుడు వైట్ హౌసుపై లైట్ హౌస్
విజయము జరుగుతుంది. ఎందుకంటే వినాశజ్వాల కూడా అమెరికా నుండే నిమిత్తమౌతుంది,
స్థాపన యొక్క విశేష కార్యములో కూడా అమెరికాకు చెందిన పాండవ గవర్నమంట్ అనండి,
పాండవ సేన అనండి, అదే నిమిత్తమౌతుంది. మరి అలా తయారుగా ఉన్నారా?(ఉన్నాము)
ఆర్డర్ఇవ్వాలా?
జపాన్ డాల్స్ ఏమి చేస్తారు? అన్నింకంటే పెద్దది,
అన్నింకంటే సుందరమైన పుష్పగుచ్ఛాన్ని బాప్ దాదాకు బహుమతిగా ఇస్తారు కదా? జర్మనీ
ఏం చేస్తుంది? జర్మనీవారు ఎటువంటి ప్రకాశమును వ్యాపింపచేస్తారంటే, ఆత్మిక బాంబ్
లేక సైలెన్స్ శక్తి బాంబ్స్ ద్వారా అంధులకు కూడా కళ్ళు లభించెయ్యాలి.
దుబాయ్ వారు ఏం చేస్తారు? అక్కడ దాగుకొని ఉన్న
బ్రాహ్మణులు తమ సత్తాను తప్పకుండా చూపిస్తారు. వేరే ధర్మము ఉన్నాకూడా బ్రాహ్మణ
ఆత్మలు దాగి ఉండజాలరు. కనుక వారు కూడా పెద్ద గ్రూపుని తయారుచేసి వస్తారు.
లోలోపల తయారవుతూ ఉన్నారు, బయటకు వచ్చేస్తారు. దూరములో ఉన్నవారు (బ్రెజిల్
మెక్సికోవారు) ఏమి ఆలోచిస్తున్నారు? దూరమునుండి ఎంత పెద్ద శబ్దమును
వ్యాపింపచెయ్యాలంటే అది నేరుగా దూరమునుండే భారతదేశములోని కుంభకర్ణుల వరకు
చేరుకోవాలి.
గయానా అయితే అమెరికా (న్యూయార్క్)కు పునాది. గయానా
వారు ఏదైతే చేసారో దానిని ఇప్పటివరకు మరెవరూ చెయ్యలేదు. వినిపించి ఉన్నాము కదా
- గయానావారి విశేషత ఏమిటంటే వి.ఐ.పి.లుగా ఉన్నాకూడా పూర్తి వారసత్వ క్వాలిటీ
కలవారు, కెనడా నుండి కూడా త్రిమూర్తులు వచ్చారు. త్రిమూర్తిలోనే మొత్తము
ప్రపంచము ఇమిడి ఉంది. కెనడా ఇప్పుడు గుప్తమునుండి ప్రత్యక్షతా రేసులో ముందుకు
పోతుంది, మంచి నంబర్ తీసుకుంటుంది.
మలేషియావారు కూడా మంచి శ్రమ చేసారు. నేను ఒంటరిగా
వచ్చాను అని ఎప్పుడూ భావించకండి. కానీ మీలో అన్ని ఆత్మలు ఇమిడి ఉన్నాయి. బాప్
దాదా ఒక్కరిని చూడటం లేదు. కానీ మీలో ఉన్న సమీప మరియు స్నేహీ ఆత్మల దృశ్యాన్ని
దూరము నుండి చూస్తున్నారు. ఆ ఆత్మల శబ్దము మీకు కూడా వస్తుంది కదా!
న్యూజిలాండ్ లో నిమిత్తమైన ఆత్మలు శక్తిశాలి అయినవి,
కనుక బాప్ దాదా తోట ఎల్లప్పుడూ వికసించే ఉంటుంది. స్థానము చిన్నదైనా సేవ
పెద్దది..
ఆస్ట్రేలియా మరియు లండన్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి.
పోలెండ్‌లో కూడా వృద్ధి జరుగుతుంది. వెలుగుతున్న ఒక్క దీపము నుండి దీపమాల
ఏర్పడుతుంది. చూడండి, ఇప్పుడైతే పేరు తీసుకుంటున్నారు కానీ తరువాత సంవత్సరము
వచ్చినప్పుడు ఎంత వృద్ధి జరుగుతుందంటే పేరు తీసుకోవటము కూడా కష్టమైపోతుంది.
ఇప్పుడు మసీదులపైకి, చర్చిల పైకి ఎక్కి వారి వారి పాటను పాడ్తారు. మసీదులో
అల్లాహ్ పేరును పెద్దగా అంటారు. చర్చీలో గాడ్ పేరును.....మందిరాలలో రండి, రండి
అని అంటారు. కానీ ఇప్పుడు ఎటువంటి సమయము వచ్చేదుందంటే మందిరాలు, మసీదులు,
గురుద్వారా, చర్చిలు మొదలైనవన్నీ కలిసి ఒకటే శబ్దము వస్తుంది- ''మేరా బాబా
ఆగయా''(నా బాబా వచ్చేసారు). తరువాత వారు ఎక్కడకు పోయారు అని ఫరిస్తాలైన
మిమ్మల్ని వెతుకుతారు. నలువైపుల వారికి ఫరిస్తాలే ఫరిస్తాలు కనిపిస్తారు.
మొత్తము ప్రపంచములో ఫరిస్తాలు ఎలా వ్యాపిస్తారంటే మబ్బులు వ్యాపించినట్లుగా
వ్యాపిస్తారు. అందరి దృష్టి ఏంజల్స్ అయిన మీ వైపుకు మరియు బాబా వైపుకు ఉంటుంది.
మరి అటువంటి స్టేజ్ పైకి చేరుకున్నారా- ఫరిస్తాల సాక్షాత్కారము చేయించేవారుగా
అయ్యారా? ఇప్పుడు ఒకవేళ కొద్దిగా కదిలినా కూడా సమయము వచ్చినప్పుడు ఇవన్నీ
అంతమైపోతాయి. ఎందుకంటే కల్పకల్పపు నిశ్చిత ఫరిస్తాలు మీరే కదా. మీరు తప్ప
మరెవరున్నారు? కనుక కాస్త కాస్త కదిలే పార్ట్ లేక ఆటనేదైతే చూపిస్తారో - అవన్నీ
త్వరగా సమాప్తమైపోతాయి. అప్పుడు అందరి నోటినుండి ఇదే మాట వెలువడుతుంది - మాయ
వెళ్ళిపోయింది, మేము మాయాజీతులుగా అయ్యాము. ఆ సమయము వస్తూ ఉంది. అచ్ఛా!
ఈరోజు అందరికీ పిక్నిక్. ఈరోజు పిక్నిక్ లో బాప్ దాదా
పిల్లలందరి నుండి గిఫ్ట్ తీసుకుటాంరు. ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారా? కేవలము
రెండు మాటల గిఫ్ట్ సదా క్లియర్ మరియు కేర్ ఫుల్ గా ఉండాలి. దీని రిజల్టుగా చియర్
ఫుల్ అవ్వనే అవుతారు. క్లియర్ గా ఉండరు కనుక సదా ఏకరసంగా ఉండరు. డిప్రెషన్,
డిప్రెషన్ అన్న మాటనేదైతే పదే-పదే అంటుంటారో, అది అప్పుడే వస్తుంది. కనుక ఏ
విషయము వచ్చినా దానిని క్లియర్ చేసుకోండి. బాప్ దాదా ద్వారానైనా, మీ
ద్వారానైనా, నిమిత్తమైన ఆత్మలనుండైనా సరే క్లియర్ చేసుకోండి. లోపల ఉంచుకోకండి.
ఏమి, ఎందుకు అనేవి లేవు. మీరు రెండు మాటలకు చెందిన గిఫ్ట్ ని ఇవ్వండి మరియు బాప్
దాదా నుండి త్రిమూర్తి బిందువు యొక్క గిఫ్ట్ తీసుకోండి. గిఫ్ట్ పోగొట్టుకోవద్దు.
గిఫ్ట్ ఎల్లప్పుడు బుద్ధి అనే ఇనప పెట్టెలో భద్రంగా ఉంచుకోవాలి.
ఇవ్వడము-తీసుకోవడము ఇష్టమేనా! అచ్ఛా! ఎప్పుడు ఏం జరిగినా గానీ తిలకాన్ని
పెట్టుకున్నట్లయితే సదా సేఫ్ గా ఉంటారు. తిలకం పెట్టుకోవటము వస్తుంది కదా?
శాన్ ఫ్రాన్సిస్కో గ్రూపుతో - బ్రహ్మాకుమారులు మరియు
బ్రహ్మాకుమారీలందరి విశేష కర్తవ్యము ఏంటి? బ్రహ్మాబాబా విశేష కర్తవ్యము ఏంటి?
బ్రహ్మా కర్తవ్యమే నూతన ప్రపంచ స్థాపన. మరి బ్రహ్మాకుమారులు మరియు
బ్రహ్మాకుమారుల విశేష కర్తవ్యము ఏంటి? స్ధాపన కార్యములో సహయోగము. అమెరికాలో
వినాశకారుల వినాశనపు స్పీడ్ ఏవిధంగా పెరుగుతూ ఉందో అలా స్ధాపనకు నిమిత్తమైన
పిల్లల స్పీడ్ కూడా తీవ్రంగా ఉందా? వారైతే చాలా తీవ్రగతితో వినాశనము కొరకు
తయారుగా ఉన్నారు. అలా మీరందరు కూడా స్ధాపన కార్యములో అంత ఎవర్రెడీలుగా
తీవ్రగతితో వెళ్తున్నారా? మీ స్పీడ్ ఎక్కువగా ఉందా లేక వారి స్పీడ్ ఎక్కువగా
ఉందా? వారు 15 క్షణాలలో వినాశనము కొరకు తయారుగా ఉన్నారు, మీరు ఒక్క క్షణములో
స్ధాపనకు తయారుగా ఉన్నారా? ఏ గతి ఉంది? క్షణములో స్ధాపన కార్యము అనగా క్షణములో
దృష్టిని ఇచ్చారు మరియు సృష్టి తయారైపోయింది - అంత స్పీడ్ఉందా? మా గతి
వినాశకారుల కంటే కూడా స్పీడ్ ఉండాలి అని సదా స్ధాపనకు నిమిత్తమైన ఆత్మలు
గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పాత ప్రపంచ వినాశనము యొక్క కనెక్షన్ కొత్త ప్రపంచ
స్ధాపనతో ఉంది. మొదట స్ధాపన జరగాలా లేక వినాశనమా? స్ధాపనా గతిని తీవ్రము
చేసేందుకు విశేష ఆధారము - సదా స్వయమును శక్తిశాలీ స్థితిలో ఉంచుకోండి. నాలెడ్జ్
ఫుల్ తో పాటుగా పవర్ ఫుల్ స్థితిలో ఉండండి. నాలెడ్జ్ ఫుల్ తో పాటుగా పవర్ ఫుల్,
రెండూ కంబైండ్ గా ఉండాలి, అప్పుడే స్ధాపనా కార్యము తీవ్రగతితో జరుగుతుంది. మరి
తీవ్రగతియొక్క పునాది ఎక్కడనుండి పడుతుంది? అమెరికా నుండి. అమెరికాలో కూడా చాలా
సేవాకేంద్రాలున్నాయి. మేమే నంబర్ వన్ లోకి వెళ్తాము అని అందరూ ఈ లక్ష్యమునే
ఉంచుకోవాలి. మరి మీ సెంటర్ ద్వా రా మొట్టమొదటి ఆత్మిక బాంబ్ పడుతుంది కదా?
దానివలన ఏమౌతుంది? అందరూ బాబా పరిచయమును తెలుసుకుంటారు. ఆ బాంబు ద్వారా
వినాశనమౌతుంది కదా, ఈ ఆత్మికబాంబు ద్వారా అంధకారము అర్ధకల్పము వినాశనమైపోతుంది.
మరి ఈ బాంబుని ఏ తారీఖున వదుల్తారు? ఈ తారీఖునాడు రిహార్సల్ జరుగుతుంది అని ఆ
గవర్నమంట్ వా రు కూడా తెలియజేస్తారు కదా, మరి మీ రిహార్సల్స్ ఎప్పుడవుతుంది?
అచ్ఛా!