కర్మాతీత స్థితి యొక్క పరిభాష
సదా కర్మబంధనముక్తుడైన శివబాబా మాట్లాడుతున్నారు-
ఈ రోజు బాప్ దాదా రాజ్యసభను చూస్తున్నారు. ప్రతి ఒక్క
పిల్లవాడు స్వరాజ్యాధికారి, తమ యొక్క నెంబర్ అనుసరించి కర్మాతీత స్థితి యొక్క
సింహాసనాధికారులు. వర్తమానం సంగమయుగీ స్వరాజ్యాధికారి ఆత్మల యొక్క ఆసనం అనండి
లేదా సింహాసనం అనండి. అదే కర్మాతీత స్థితి. కర్మాతీతం అంటే కర్మ చేస్తూ కూడా
కర్మబంధనాలకు అతీతంగా ఉండాలి. కర్మలకు వశీభూతం కాకూడదు కానీ కర్మేంద్రియాల
ద్వారా ప్రతి కర్మ చేస్తూ అధికారిస్థితి యొక్క నషాలో ఉండాలి. బాప్ దాదా ప్రతి
పిల్లవాని యొక్క నెంబర్ వారి రాజ్యాధికారం యొక్క లెక్కతో నెంబర్ వారీ సభను
చూస్తున్నారు. సింహాసనం కూడా నెంబర్ వారీ మరియు అధికారం కూడా నెంబర్ వారీ.
కొంతమంది సర్వ అధికారులు మరియు కొంతమంది అధికారులు. భవిష్యత్తులో విశ్వమహారాజుకి
మరియు మహారాణి తేడా ఉంటుంది కదా! అదేవిధంగా ఇక్కడ కూడా సర్వకర్మేంద్రియాలకు
అధికారి అంటే సర్వ కర్మబంధనాల నుండి ముక్తి అయినవారినే సర్వ అధికారి అంటారు.
రెండవవారు. సర్వ కాదు కానీ అధికారిగా ఉంటారు. రెండు రకాల సింహాసనాధికారుల సభను
చూస్తున్నారు. ప్రతి ఒక్క రాజ్యాధికారి మస్తకంలో రంగు రంగుల మణులు
మెరుస్తున్నాయి. కొంతమందికి ఎక్కువగా మరియు కొంతమందికి తక్కువగా మెరుస్తున్నాయి.
మెరుపు కూడా ఎవరిది వారిది. జ్ఞానమనే దర్పణంలో మీ రాజ్యసభ యొక్క రాజ్యాధికారి
చిత్రం కనిపిస్తుందా? అందరి దగ్గర దర్పణం అయితే ఉంది. కర్మాతీత చిత్రాన్ని
చూసుకుంటున్నారా? మీ చిత్రం చూసుకుంటున్నారా? ఎంత సుందరమైన రాజ్యసభ! కర్మాతీత
స్థితి యొక్క సింహాసనం ఎంత శ్రేష్టమైన సింహాసనం. ఈ స్థితికి అధికారి ఆత్మలు అనగా
సింహాసనాధికారి ఆత్మలు విశ్వం ముందు ఇష్టదేవతల రూపంలో ప్రత్యక్షం అవుతారు.
స్వరాజ్యాధికారి సభ అంటే ఇష్టదేవతల యొక్క సభ. ఈవిధంగా అందరు మిమ్మల్ని మీరు
ఇష్టదేవతగా భావిస్తున్నారా? పరమ పవిత్రులు, సర్వుల పట్ల దయాహృదయులు, సర్వులకు
మాస్టర్ వరదాతలు, సర్వుల పట్ల మాస్టర్ ఆత్మిక ప్రేమ సాగరులు, సర్వుల పట్ల శుభ
భావన యొక్క సాగరులు అయిన పూజ్య ఇష్టదేవాత్మగా అవ్వండి. బ్రాహ్మణాత్మలందరిలోకి
నెంబర్ వారీగా ఈ సంస్కారాలు నిండి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రత్యక్ష రూపంలో
తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇష్టదేవత యొక్క సంస్కారాలను ప్రత్యక్షం చేయండి.
వర్ణన చేయటంతో పటు స్మృతి స్వరూపం నుండి సమర్ధస్వరూపంగా అయ్యి స్టేజ్ పైకి రండి.
ఈ సంవత్సరంలో సర్వ ఆత్మలు ఇదే అనుభవం చేసుకోవాలి - ఎవరినైతే మనం వెతుకుతున్నామో,
ఏయే శ్రేష్ట మనస్సుతో లేదా నోటితో వారు వీరే అనే మాట రావాలి. వీరిని కలుసుకుంటే
చాలు బాబాని కలుసుకున్నట్లే అనే అనుభవం అవ్వాలి. ఏది లభించాలన్నా వీరి ద్వారానే
లభించాలి. వీరే మాస్టర్, గైడ్, దేవదూతలు, సందేశవాహకులు. ఇలా వీరే - వీరే, వీరే
వారు అనే ఈ మాట అందరి నుండి రావాలి. వీరే వారు అనే ఈ రెండు మాటలు రావాలి.
లభించింది, లభించింది..... అనే సంతోషం యొక్క చప్పట్లు మ్రోగించాలి. ఈ విధమైన
అనుభవం చేయించండి. ఈ అనుభూతి చేయించడానికి విశేషంగా అష్టశక్తి స్వరూపం మరియు
అలంకారి స్వరూపం కావాలి. కానీ శక్తి స్వరూపం మరియు మాత స్వరూపంలో కూడా ఉండాలి.
ఈ రోజులలో కేవలం శక్తిస్వరూపంతో సంతుష్టం అవ్వరు. కానీ శక్తిమాతగా అవ్వాలి.
ప్రేమ మరియు పాలన ఇచ్చిన బాబా యొక్క ప్రతి పిల్లవాడిని సంతోషం యొక్క ఊయలలో ఊపాలి.
అప్పుడు వారు బాబా యొక్క వారసత్వానికి అధికారిగా కాగలరు. బాబాని కలుసుకునే
యోగ్యంగా చేయడానికి మీరు నిమిత్తంగా, శక్తి రూపంలో ఈ విధమైన పవిత్ర ప్రేమ మరియు
మీ యొక్క ప్రాప్తులతో శ్రేష్టపాలన ఇవ్వండి. యోగ్యంగా చేయండి మరియు యోగిగా చేయండి.
మాస్టర్ రచయితగా అవ్వటం అందరికీ వస్తుంది. అల్పకాలిక ప్రాప్తినిచ్చే నామధారి
మహాన్ ఆత్మలు కూడా చాలా రచన రచిస్తారు, ప్రేమ కూడా ఇస్తారు. కానీ పాలన ఇవ్వలేరు.
అందువలన వారు వారికి శిష్యులుగా అవుతారు. కానీ పాలన ఇచ్చి పెద్దవారిగా చేసి
బాబాతో కలపలేరు. అంటే పాలన ద్వారా బాబా యొక్క అధికారి లేదా యోగ్య ఆత్మలుగా
చేయలేరు. అందువలన శిష్యులుగానే ఉండిపోతారు. కానీ పిల్లలుగా కాలేరు. బాబా యొక్క
వారసత్వానికి అధికారిగా అవ్వరు. అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీరు కూడా రచన చాలా
త్వరగా రచిస్తున్నారు అంటే నిమిత్తంగా అవుతున్నారు. కానీ ప్రేమ మరియు పాలన
ద్వారా ఆ ఆత్మలను అవినాశి వారసత్వానికి అధికారిగా చేయటంలో చాలా తక్కువ మంది
యోగ్యాత్మలుగా ఉన్నారు. ఏవిధంగా అయితే లౌకిక జీవితంలో తల్లి శక్తిశాలి పాలన
ద్వారా పిల్లలను శక్తిశాలిగా చేస్తుంది. దాని ద్వారా సదా వారు ఏ సమస్యనైనా
ఎదుర్కోగలరు. సదా ఆరోగ్యవంతంగా ఉండాలి, ధనవంతంగా ఉండాలి అనుకుంటారు. అదేవిధంగా
శ్రేష్టత్మలైన మీరు కూడా జగన్మాత అయ్యి, ఒకరు లేదా ఇద్దరికి మాతగా కాదు,
జగత్తుకి మాతగా అయ్యి, బేహద్ మాతగా అయ్యి మనస్సు ద్వారా ఆ ఆత్మలను ఎంత
శక్తిశాలిగా చేయాలంటే సదా ఆ ఆత్మలు తమని తాము విఘ్నవినాశకులుగా, శక్తి సంపన్నంగా,
ఆరోగ్యంగా మరియు ధనవంతంగా అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలన అవసరం. ఈవిధమైన
పాలన ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉన్నారు. పరివారం యొక్క అర్ధం - ప్రేమ మరియు
పాలన యొక్క అనుభూతి చేయించడం. ఈ పాలన కొరకు దాహంగా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం ఏమి
చేయాలో అర్థమైందా?
అందరి నోటి నుండి ఇదే మాట రావాలి - మా సమీప సంబంధీకులు
మాకు లభించారు. మొదట సంబంధం యొక్క అనుభూతి చేయించండి. తర్వాత కనెక్షన్ స్వతహాగా
ఏర్పడుతుంది. మా వారు మాకు లభించారు - ఈ విధమైన అల నలువైపుల వ్యాపింపచేయండి.
అప్పుడే ఎవరిని పొందాలో వారిని పొందాము అనే మాట వస్తుంది. ఏవిధంగా అయితే అధికారి
ఆత్మలైన మీరు బాబాని రకరకాల సంబంధాలతో అనుభవం చేసుకుంటున్నారో అదేవిధంగా తపనలో
ఉన్న ఆత్మలు ఏది లభించాలి అనుకున్నామో, ఏది పొందాలో అది వీరి ద్వారా లభించాలి.
వీరి ద్వారా పొందాలి అనే అనుభవం చేసుకుంటారు. తర్వాత రకరకాల పేర్లు
తయారుచేస్తారు. ఈవిధమైన వాయుమండలాన్ని తయారు చేయండి. పిల్లలకు తండ్రి యొక్క
పరిచయం తల్లి ఇస్తుంది. తల్లియే పిల్లలను తండ్రితో కలుపుతుంది. మీ వరకు
ఉంచుకోకూడదు కానీ బాబాతో సంబంధం జోడించే విధంగా, యోగ్యంగా చేయాలి. కేవలం అమ్మ,
అమ్మ అనే చిన్న పిల్లలుగా చేయకూడదు. కానీ బాబా, బాబా అని నేర్పించాలి.
వారసత్వానికి అధికారిగా చేయాలి. అర్థమైందా?
ఏవిధంగా అయితే బాబా గురించి అందరి నోటి నుండి ఒకే మాట
వస్తుంది కదా - నా బాబా, అదేవిధంగా శ్రేష్టాత్మలు అయిన మీ అందరి నుండి ప్రతి
ఒక్కరికి భావన లేదా అనుభూతి కలగాలి. మా మాత అని వారు భావించాలి. ఇది బేహద్ పాలన.
ప్రతి ఒక్కరికీ నావారు అనే భావన రావాలి. ప్రతి ఒక్కరు అనుకోవాలి - వీరు మా
యొక్క శుభచింతకులు, సహయోగి, సేవా సహయోగులు. దీనినే బాబా సమానమైన స్థితి అంటారు.
ఈ స్థితినే కర్మాతీత స్థితి యొక్క సింహాసనాధికారి స్థితి అని అంటారు. సేవ యొక్క
కర్మబంధనలోకి కూడా రాకండి. మా స్థానం, మా సేవ, మా విద్యార్ధులు, మా సహయోగి
ఆత్మలు ...... ఇలా భావించడం కూడా సేవ యొక్క కర్మబంధన. ఈ కర్మబంధన నుండి
కర్మాతీతంగా అవ్వాలి. కనుక ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్థమైందా? కర్మాతీతంగా
అవ్వాలి మరియు వీరు వారు, వారే అన్నీ అనే అనుభవం చేయించి ఆత్మలను సమీపంగా
తీసుకురావాలి, గమ్యానికి తీసుకురావాలి. మీ గురించి కూడా చెప్పాను మరియు సేవ
గురించి కూడా చెప్పాను. మంచిది - అందరికీ సంకల్పం ఉంది కదా, ఇప్పుడేమి చేయాలి?
ఏ అల వ్యాపింపచేయాలి! మంచిది.
ఈ విధమైన స్వరాజ్యాధికారి ఆత్మలకు, కర్మాతీత స్థితి
యొక్క సింహాసనాధికారి ఆత్మలకు, సర్వులకు సమీప సంబంధం యొక్క అనుభవం చేయించేవారికి,
బేహద్ ప్రేమ నిండిన పాలన ఇచ్చేవారికి ఈవిధమైన ఇష్టదేవతలకు బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు నమస్తే