దూరదేశీ పిల్లలతో దూరదేశీ బాప్ దాదా యొక్క కలయిక.
దూరదేశీ అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా తన యొక్క లవ్లీ (ప్రియమైన) అంటే
లవలీన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. దూరదేశం నుండి వచ్చారు. దూరదేశం నుండి
వచ్చిన పిల్లలతో దూరదేశీ బాప్ దాదా కలుసుకునేటందుకు వచ్చారు. ఎంతగా పిల్లలు
మనస్సుతో బాప్ దాదాని స్మృతి చేసారో ఆ మనస్సు యొక్క స్మృతికి జవాబు ఇవ్వడానికి
మనోభిరాముడైన బాబా వచ్చారు. లవలీన ఆత్మలు ఒకొక్కరూ కనిపిస్తున్నారు. దూరదేశంలో
ఉంటూ కూడా తన యొక్క ప్రియస్మృతులు ఎవరైతే పంపించారో ఆ లవలీన ఆత్మలందరు ఆకారీ
రూపంలో ఈ సంఘటన మధ్యలో బాప్ దాదా ఎదురుగా ప్రత్యక్ష రూపంలో ఉన్నారు. బాప్ దాదా
ఎదురుగా చాలా పెద్ద సభ ఉంది. మీ అందరిలో ఎవరి యొక్క ప్రియస్మృతులు ఇమిడి ఉన్నాయో
ఆ యొక్క స్మృతి రూపం ఆకార రూపంలో అందరి ఎదురుగా ఉంది. బాప్ దాదా పిల్లలందరి
యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు మరియు సంతోషం యొక్క పాట వింటున్నారు. ఇంత ప్రేమ పాటలు,
సంతోష పాటలు పాడటం బాప్ దాదా కేవలం చూడటమే కాదు, చూడటంతో పాటు ఆ పాటలను
వింటున్నారు. అందరి పిల్లల లోపల, మనసులలో మరియు నయనాలలో ఒకే బాబా స్మృతి యొక్క
ఏకరసస్థితి యొక్క మెరుపు కనిపిస్తుంది.
ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు అనే స్థితిలో స్థితులైన
పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు మేళాకి వచ్చాను. వాణీ వినిపించడానికి రాలేదు.
అదృష్టవంతుల యొక్క చిత్రాన్ని చూడడానికి వచ్చాను. వికసించిన ఆత్మిక గులాబీల
యొక్క సువాసన తీసుకునేటందుకు వచ్చాను. పిల్లలందరు ధైర్యం ఆధారంగా, స్నేహానికి
ప్రత్యక్షఫలంగా సన్ముఖంగా కలుసుకుంటున్నారు. రకరకాల బంధనాలను దాటుకుంటూ మీ
యొక్క స్వీట్ హోమ్ కి (మధురమైన ఇల్లు) చేరుకున్నారు. ఇటువంటి బంధనముక్త పిల్లలకు
బాప్ దాదా కోట్లానుకోట్లరెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు..
చిన్న పిల్లల యొక్క అద్భుతం కూడా ఉంది. ఈ చిన్న
పిల్లలు సంగమయుగం యొక్క అలంకారం మరియు భవిష్యత్తులో ఏమి చేస్తారు? ఇప్పటి
అలంకారం మరియు భవిష్యత్తులో అధికారులు. అందరి చేతిలో స్వర్ణ స్వరాజ్యం యొక్క
గ్లోబ్ కనిపిస్తుంది కదా! ఏదైతే చిత్రం తయారు చేసారో అది ఒకరిది కాదు మీ అందరిది.
మీ యొక్క చిత్రం చూసారా? ఇది అందరి చిత్రం అని భావిస్తున్నారా లేక ఒక
శ్రీకృష్ణుని యొక్క చిత్రమేనా? ఎవరిది? మీ అందరిదీనా కాదా? ఈ రోజు బ్రాహ్మణులం
మరియు రేపు ఫరిస్తా నుండి దేవతగా అయిపోయినట్లే అని సదా స్మృతి ఉంటుందా? ఫరిస్తా
నుండి దేవత మీ యొక్క ఈ చిత్రం జ్ఞానం అనే దర్పణంలో సదా కనిపిస్తుందా? ఏవిధంగా
అయితే ఇప్పుడు మీ అందరి నోటినుండి ఒకే మాట వస్తుంది అది ఏమిటి? నా బాబా.
అదేవిధంగా జ్ఞానమనే దర్పణంలో మీ చిత్రం చూసుకుంటే ఇది నా చిత్రం అనే మాట
వస్తుందా? నా బాబా మరియు నా చిత్రం. ఎందుకంటే ఇప్పుడు మీ యొక్క రాజ్యం మరియు
రాజ్యాధికారి స్వరూపానికి చాలా సమీపంగా వస్తున్నారు. సమీపంగా వచ్చే వస్తువు
స్పష్టంగా అనుభవం అవుతుంది. ఈ విధంగా మీ యొక్క ఫరిస్తా స్వరూపం, దేవతా స్వరూపం
స్పష్టంగా అనుభవం అవుతుందా? మంచిది.
ఈరోజు విశేష పిల్లలు పిలిచారు మరియు బాప్ దాదా పిల్లల
ఆజ్ఞాకారి కనుక పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. విశేషంగా ఒకరిద్దరి ఆత్మల
వలన మొత్తం పిల్లలందరి యొక్క కలయిక జరిగింది. ఇదే సంలగ్నతకి జవాబు. మంచిది.
డబుల్ విదేశీయులకు సదా ఒకొక్కరు కలుసుకోవాలనే కోరిక
ఉంటుంది. ఏవిధంగా అయితే బాబా పిల్లల యొక్క మనస్సు చూస్తారో అదేవిధంగా బాబా కూడా
మనస్సుతో జవాబు ఇస్తారు. కనుక కలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు భగవంతుని తోటలోకి
చేరుకున్నారు. కలయిక జరుపుకుంటూనే ఉంటారు. మంచిది.
సదా స్నేహం యొక్క బంధనలో బంధించబడి ఉండేవారికి మరియు
బంధించేవారికి, సదా లవలీన ఆత్మలకు, సదా బాబా యొక్క గుణాలను పాడే సంతోషవంతమైన
పిల్లలకు, సదా సంతోషం యొక్క ఊయలలో ఊగే అదృష్టవంతులైన పిల్లలకు, సదా సంతోషంగా
ఉండే శుభాకాంక్షలతో పాటు వెనువెంట బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.