విజయీమాలలో నెంబర్ రావడానికి ఆధారం.
అవ్యక్త బాప్ దాదా తన యొక్క విజయీరత్నాలైన పిల్లలతో
మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా తన గారబభమైన శ్రేష్ట ఆత్మలను తిరిగి
మరలా కలుసుకునేటందుకు వచ్చారు. ఇదే సమయంలో, ఇదే రూపంలో ఎన్నిసార్లు బాబాని
కలుసుకున్నారు - స్మృతి వస్తుందా? అనేక సార్లు బాబాని కలుసుకున్న స్పష్టమైన
స్మృతి అనుభవంలోకి వస్తుందా? జ్ఞానం ఆధారంగా లేదా సృష్టి చక్రం యొక్క లెక్కతో
అర్ధం చేసుకుంటున్నారా లేక అనుభవం చేసుకుంటున్నారా? ఎంత స్పష్టంగా అనుభవం
చేసుకుంటారో అంత శ్రేష్ట ఆత్మగా అవుతారు. వర్తమానంలో సర్వ ప్రాప్తులతో మరియు
భవిష్యత్తులో శ్రేష్ట ప్రాప్తికి అధికారి ఆత్మగా ఉంటారు. ఈ అనుభవం ఆధారంగా మీకు
మీరు తెలుసుకోవచ్చు - ఆత్మనైన నాకు విజయీమాలలో ఏ నెంబర్ ఉంది? వర్తమాన సమయంలో
బాప్ దాదా కూడా పిల్లల యొక్క పురుషార్ధం మరియు ప్రాప్తిననుసరించి నెంబరువారీగా
స్మృతి చేస్తున్నారు అంటే స్మరణ చేస్తున్నారు. వర్తమానంలో - స్మృతి లేదా స్మరణ
యొక్క మాల మరియు స్మృతిచిహ్నంలో - విజయీమాల అంటే వైజయంతీ మాల. ఈ రెండు మాలలలో
మీ నెంబరు ఏమిటో మీకు తెలుసా? మీ నెంబరు ఏమిటో మీకే తెలుసా లేక బాప్ దాదా
చెప్పాలి అంటారా? బాప్ దాదాకి అయితే తెలుసు మరియు మీకు కూడా తప్పకుండా తెలుసు
కదా! బయటికి వర్ణన చేసినా, చేయకపోయినా లోపల అయితే తెలుసు కదా? అవునంటారా,
కాదంటారా? ఇప్పుడు ఒకవేళ బాప్ దాదా నెంబర్ చెప్పమంటే మీ నెంబర్ ఇస్తారా లేదా?
సంకోచంతో చెప్పకపోవటం అనేది వేరే విషయం. ఒకవేళ మీకు తెలియకపోతే ఏమంటారు? ఇతరులకి
ప్రతిజ్ఞ చేసి చెప్తారు, నిశ్చయంతో గట్టిగా చెప్తారు కదా - మాకు 84 జన్మల యొక్క
జీవితకథ తెలుసు. ఇలా అందరూ చెప్తున్నారు కదా! 84 జన్మలలో ఈ వర్తమాన జన్న చాలా
శ్రేష్టమైనది కదా! దీనిని తెలుసుకోలేరా? నేనెవరు? అనేది ప్రశ్న గురించి మంచిగా
తెలుసుకున్నారు కదా? అలాగే ఇది కూడా ఏమిటి?నేనెవరు (నెంబరు) అనే ప్రశ్నే. దీనిని
తెలుసుకునే పద్ధతి చాలా సహజం. ఒకటి స్మృతి యొక్క మాల. ఎవరు, ఎంత స్నేహంతో, ఎంత
సమయం బాబాని స్మృతి చేస్తారో అంతగా మరియు అంత స్నేహంతోనే బాబా కూడా స్మృతి
చేస్తారు. అంటే మీరు బాబాని ఎంత స్మృతి చేస్తున్నారో ఆ లెక్కను బట్టి వర్తమాన
బాప్ దాదా యొక్క స్మృతి మాలలో మీ నెంబర్ ఏమిటో తెలుసుకోవచ్చు. ఒకవేళ సగం సమయం
స్మృతి ఉంటుంది. లేక 50% లేక 75% ఉంటే దాని ఆధారంగా ఆలోచిస్తే, 50% స్నేహం మరియు
సగం సమయం స్మృతి ఉంది, కనుక మాలలో కూడా సగం మాల సమాప్తి అయిపోయిన తర్వాత వస్తారు.
ఒకవేళ స్మృతి నిరంతరం మరియు సంపూర్ణ స్నేహంతో, బాబా తప్ప ఇంకెవ్వరు లేరు అనే
దృష్టితో, సదా బాబా మరియు మీరు ఈ విధంగా కంబైండ్ గా స్మృతి చేస్తే మాలలో కూడా
కంబైండ్ పూసతో పాటు మీరు కూడా వెనువెంట కంబైండ్ గా ఉంటారు. ఇలా మాలలో కూడా
నెంబరువారీగా ఉంటారు. ఏవిధంగా అయితే లౌకికచదువులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్
డివిజన్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా మహారుథులు, గుఱ్ఱపుసవారీలు మరియు కాలిబలం
అనే మూడు డివిజన్లు ఉన్నాయి.
మొదటి డివిజన్ - సదా ఫస్ట్ అంటే ఎగిరేకళలో ఉంటారు.
ప్రతి సెకను, ప్రతి సంకల్పంలో బాబా యొక్క తోడుని, సహయోగాన్ని, స్నేహాన్ని అనుభవం
చేసుకుంటారు. సదా బాబా యొక్క తోడు మరియు చేతిలో చేయి ఉన్నట్లు అనుభవం
చేసుకుంటారు. సహయోగం ఇవ్వండి అని బాబాని అడుగరు. సదా స్వయాన్ని సంపన్నంగా అనుభవం
చేసుకుంటారు.
రెండవ డివిజన్ - ఎక్కేకళను అనుభవం చేసుకుంటారు కానీ
ఎగిరేకళని అనుభవం చేసుకోరు. ఎక్కేకళలో వచ్చేటువంటి విఘ్నాలను దాటడానికి
అప్పుడప్పుడు ఎక్కువ, అప్పుడప్పుడు తక్కువ సమయాన్ని ఉపయోగిస్తారు. ఎగిరేకళలో
ఉండేవారు పై నుండి క్రాస్ చేస్తారు. అందువలన అసలు విఘ్నమే రాలేదు అన్నట్లుగా
అనుభవం చేసుకుంటారు. విఘ్నాలను విఘ్నాలుగా కాదు, మార్గమధ్య దృశ్యాలుగా అనుభవం
చెసుకుంటారు. ఎక్కేకళలో ఉండేవారు. ఆగిపోరు కానీ విఘ్నం వస్తుంది వాటిని దాటుతారు.
వీరు విఘ్నం యొక్క అనుభవం చేసుకుంటారు కనుక లేశమాత్రంగా అప్పుడప్పుడు ఆ
విఘ్నాలను దాటడంలో అలసట లేదా బలహీనంగా అయినట్లు అనుభవం చేసుకుంటారు.
మూడవ డివిజన్ - వీరి గురించి తెలిసిపోయి ఉంటుంది.
ఆగిపోవటం తిరిగి నడవటం మరియు అరవటం. అప్పుడప్పుడు నడుస్తారు, అప్పుడప్పుడు
అరుస్తారు. స్మృతి యొక్క శ్రమలో ఉంటారు. ఎందుకంటే సదా కంబైండ్ గా ఉండరు. సర్వ
సంబంధాలను నిలుపుకునే ప్రయత్నంలో ఉంటారు. సదా పురుషార్థంలోనే నిమగ్నమై ఉంటారు.
వీరు ప్రయత్నంలో ఉంటారు మరియు వారు (ఫస్ట్ నెంబరు) ప్రాప్తిలో ఉంటారు.
కనుక ఇప్పుడు దీని ద్వారా అర్థమైందా - నా నెంబరు ఏమిటి?
మాల యొక్క ఆదిలో ఉన్నానా అంటే ఫస్ట్ డివిజన్లో ఉన్నానా లేక మాల యొక్క మధ్యలో
అంటే రెండవ డివిజన్లో ఉన్నానా మాల యొక్క అంతిమంలో అంటే మూడవ డివిజన్లో ఉన్నానా
అనేది తెలుసుకున్నారు కదా? స్మృతి మరియు విజయం ఆధారంగా మిమ్మల్ని మీరు
తెలుసుకోవచ్చు. అయితే తెలుసుకోవటం కష్టమా లేక సహజమా? ప్రతి ఒక్కరి నెంబర్
తీయమంటే తీయగలరు కదా?
బాప్ దాదా సదా అమృతవేళ నుండి పిల్లల యొక్క మాలను
స్మరించటం మొదలు పెడతారు. ప్రతీ ఒక్క రత్నం యొక్క లేదా మణి యొక్క విశేషతను
చూస్తారు. అలాగే అమృతవేళ సహజంగానే మిమ్మల్ని మీరు కూడా పరిశీలించుకోగలరు. స్మృతి
శక్తి ద్వారా, బాబాతో సంబంధం యొక్క శక్తి ద్వారా స్పష్టంగా ఆత్మిక టీ.విలో
చూసుకోవచ్చు - బాప్ దాదా నన్ను ఏ నెంబర్ లో జ్ఞాపకం చేస్తున్నారు. దీని కొరకు
విశేషంగా - బుద్ది లైన్ చాలా స్పష్టంగా ఉండాలి. స్పష్టంగా లేకపోతే స్పష్టంగా
చూడలేరు.
ఇప్పుడు అయితే సమయం సమీపంగా ఉన్న కారణంగా స్వయాన్ని
బాబా సమానంగా అంటే సమానత ద్వారా సమీపతను తీసుకురండి. సంకల్పం, మాట, కర్మ,
సంస్కారం మరియు సేవ అన్నింటిలో బాబా సమానంగా అవ్వటం అంటే సమీపంగా రావటం. వెనుక
వచ్చిన వారు అయినా, ముందు వచ్చిన వారు అయినా సమానత ద్వారా సమీపంగా రాగలరు.
ఇప్పుడు అయితే అందరికీ అవకాశం ఉంది. సీట్లు నిర్ణయించబడలేదు మరియు ఈల మ్రోగలేదు.
అందువలన ఎవరు కావాలనుకుంటే వారు కావచ్చు. బాగా ఆలస్యం అయిపోయింది అనే బోర్డు
ఇప్పుడు ఇంకా పెట్టలేదు. అందువలన ఏం చేస్తారు? మంచిది.
ఈ విధంగా సదా బాబాతో పాటు ఉండేవారికి, ప్రతి సంకల్పం,
మాట, కర్మలో బాబా సమానంగా అంటే బాబాకి దగ్గరగా ఉండే రత్నాలకు, సదా సఫలతా
స్వరూపులకు, విజయీ మాలలోని సమీప రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
నమస్తే.