విశేషయుగం యొక్క విశేషఫలం.
సదా కళ్యాణకారి అయిన శివబాబా విశ్వకళ్యాణానికి
ఆధారమూర్తులైన పిల్లలతో మాట్లాడుతున్నారు -
ఈరోజు విశ్వకళ్యాణకారి బాబా, విశ్వకళ్యాణం యొక్క
కార్యానికి ఆధారమూర్తులైన తన పిల్లలను చూస్తున్నారు. ఈ ఆధారమూర్తులే
విశ్వపరివర్తన చేయటంలో విశేష ఆత్మలు. అటువంటి విశేష ఆత్మలను బాప్ దాదా కూడా సదా
విశేష దృష్టితో చూస్తారు. ప్రతి ఒక్క విశేష ఆత్మ యొక్క విశేషత - సదా బాప్ దాదా
ఎదురుగా స్పష్టంగా ఉంటుంది. ప్రతి ఒక పిల్లవాడు మహాన్ ఆత్మ మరియు పుణ్యాత్మ
మరియు పురుషోత్తములు అంటే దేవాత్మలు. విశ్వపరివర్తనకు నిమిత్త ఆత్మలు. ప్రతి
ఒక్కరు మిమ్మల్ని మీరు ఈ విధంగా భావించి నడుస్తున్నారా? ఎలా ఉండేవారు మరియు ఎలా
అయ్యారు? ఈ మహాన్ తేడా సదా ఎదురుగా ఉంటుందా? ఈ అంతరం (తేడా) యొక్క స్మృతి,
మహామంత్ర స్వరూపంగా సహజంగా తయారు చేస్తుంది. ఇలా అనుభవం చేసుకుంటున్నారా?
ఏవిధంగా అయితే బాబా ఎదురుగా ప్రతీ ఒక్క పిల్లవాడు విశేష ఆత్మగా ఉంటారు.
అదేవిధంగా మీరందరు కూడా మీ యొక్క విశేషత మరియు సర్వుల యొక్క విశేషతనే సదా
చూస్తున్నారా? మురికిలో ఉండే కమలాన్ని సదా చూస్తున్నారా? లేక మురికి మరియు కమలం
రెండూ చూస్తున్నారా? సంగమయుగం విశేషయుగం కనుక విశేషయుగంలో విశేష ఆత్మలైన మీకు
విశేషమైన పాత్ర ఉంది. ఎందుకంటే బాప్ దాదాకి సహయోగి ఆత్మలు. విశేష ఆత్మల యొక్క
కర్తవ్యం ఏమిటి? స్వయం యొక్క విశేషత ద్వారా విశేష కార్యంలో ఉండటం. అంటే మీ
యొక్క విశేషతను కేవలం మనస్సులో లేదా మాట ద్వారా వర్ణన చేయటం కాదు. కానీ విశేషత
ద్వారా విశేషకార్యం చేసి చూపించాలి. ఎంతగా మీ యొక్క విశేషతలను మనసా సేవ లేదా
వాచా, కర్మణా సేవలలో ఉపయోగిస్తారో అంతగా ఆ విశేషత వృద్ధి అవుతూ ఉంటుంది. సేవలో
ఉపయోగించటం అంటే ఒక బీజంతో అనేక ఫలాలు పొందటం. ఈ విధంగా స్వయాన్ని పరిశీలన
చేసుకోండి - ఈ శ్రేష్టజీవితంలో బాబా ద్వారా ఏదైతే విశేషత జన్మసిద్ధ అధికార
రూపంలో లభించిందో దానిని కేవలం బీజ రూపంలోనే ఉంచానా లేక సేవ యొక్క భూమిలో వేసి
విస్తారం పొందానా? అంటే మీ యొక్క స్వరూపం మరియు సేవ యొక్క సిద్ధి స్వరూపాన్ని
అనుభవం చేసుకున్నారా? బాప్ దాదా అయితే జన్మతోనే పిల్లలందరికీ అదృష్టరేఖను గీసారు.
జన్మతోనే ప్రతి ఒక్కరి మస్తకంలో అదృష్ట సితార మెరిసే ఉంది. ఏ పిల్లవాడు ఈ
అదృష్టం నుండి వంచితంగా లేరు. ఈ అదృష్టాన్ని మేల్కొల్పుకునే వచ్చారు.
అయినప్పటికీ తేడా దేనిలో వస్తుంది? చెప్పాను కదా - కొంతమంది ఈ వరదానం యొక్క
బీజాన్ని, అదృష్టం యొక్క బీజాన్ని, లేక జన్మసిద్ధ అధికారం యొక్క బీజాన్ని
విస్తారంలోకి తీసుకువస్తున్నారు, కొంతమంది బీజాన్ని కార్యంలోకి తీసుకురాని
కారణంగా శక్తిహీనంగా చేసుకుంటున్నారు. బీజాన్ని సమయానికి కార్యంలో ఉపయోగించకపోతే
ఆ బీజం ఫలం ఇవ్వదు. మరలా కొంతమంది ఏమి చేస్తున్నారు? బీజాన్ని సేవ యొక్క భూమిలో
వేస్తున్నారు. కానీ ఫలం వచ్చే ముందు ఉండే వృక్షాన్ని చూసి దానిలోనే సంతోషం
అయిపోతున్నారు, నేను బీజాన్ని కార్యంలో ఉపయోగించాను అని. దీని యొక్క ఫలితం
ఏమౌతుంది? వృక్షం పెరిగిపోతుంది, కొమ్మలు - రెమ్మలు, శాఖలు ఉపశాఖలు అన్నీ
వస్తాయి. వృక్షం పెరిగిపోతుంది కానీ ఫలం రాదు. చూడడానికి వృక్షం చాలా అందంగా
ఉంటుంది కానీ ఫలం రాదు. అంటే ఏదైతే జన్మసిద్ధ అధికార రూపంలో లభించిందో ఆ విశేషత
ద్వారా సఫలత రూపీ ఫలాన్ని స్వయం పొందలేరు, ఆ విశేషత ద్వారా ఇతరులను కూడా సఫలతా
స్వరూపులుగా చేయలేరు. విశేషత యొక్క బీజానికి అన్నింటికంటే శ్రేష్టఫలం -
సంతుష్టత. అందువలనే ఈరోజుల్లో భక్తులు ఎక్కువగా సంతోషిమాత యొక్క పూజ
చేస్తున్నారు. కనుక సంతుష్టంగా ఉండటం మరియు సర్వులను సంతుష్టం చేయటం ఇదే
విశేషయుగం యొక్క విశేషఫలం. కొంతమంది పిల్లలు ఇలా ఫలదాయకంగా అవ్వటంలేదు. వృక్షం
యొక్క విస్తారం అంటే సేవ యొక్క విస్తారం చేస్తున్నారు. కానీ సంతుష్టత యొక్క ఫలం
రాకపోతే ఆ వృక్షం ఎందుకు పనికి వస్తుంది? కనుక విశేషత యొక్క వరదానాన్ని లేదా
బీజాన్ని సర్వశక్తులు అనే నీటితో తడపండి, అప్పుడు బీజం ఫలదాయకం అవుతుంది.
లేకపోతే విస్తారం పొందిన వృక్షం కూడా సమయానుసారంగా వచ్చే తఫానులకు చలిస్తూ -
చలిస్తూ అప్పుడప్పుడు ఒక కొమ్మ, అప్పుడప్పుడు మరో కొమ్మ అలా విరిగిపోతాయి.
అప్పుడు ఏమౌతుంది? వృక్షం ఉంటుంది కానీ ఎండిపోయిన వృక్షంలా ఉంటుంది. ఎండిపోయిన
వృక్షం అంటే వారిలో ముందుకు వెళ్ళాలనే ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం, ఆత్మిక నషా అనే
ఏ పచ్చదనం ఉండదు, బీజంలో ఉండదు, వృక్షంలో ఉండదు. ఒకవైపు ఇలా ఎండిపోయిన వృక్షం -
రెండవవైపు సదా పచ్చదనంతో ఫలదాయక వృక్షం ఉంటే ఏది బాగుంటుంది? అందువలనే బాప్ దాదా
విశేషత యొక్క వరదానం అనే శక్తిశాలి బీజాన్ని పిల్లలందరికీ ఇచ్చారు. కేవలం
విధిపూర్వకంగా ఫలదాయకంగా చేసుకోండి. ఇది స్వ విశేషత యొక్క విషయం . ఇప్పుడు -
విశేష ఆత్మల యొక్క సంబంధ, సంప్రదింపుల్లో సదా ఉంటున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ
పరివారం అంటే విశేష ఆత్మల యొక్క పరివారం. కనుక పరివారం యొక్క సంప్రదింపుల్లోకి
వస్తూ విశేషతనే చూడండి. విశేషతలను చూసే దృష్టిని ధారణ చేయండి. అంటే విశేషమైన
కళ్ళజోడు పెట్టుకోండి. ఈ రోజులల్లో కళ్ళజోళ్ళ ఫ్యాషన్ ఉంది. కనుక విశేషతను చూసే
కళ్ళజోడు పెట్టుకోండి. అప్పుడు ఇంకేది కనిపించదు. విజ్ఞాన సాధనం అయిన ఎర్ర
కళ్ళజోడు పెట్టుకుంటే పచ్చదనం కూడా ఎర్రగా కనిపిస్తుంది. అలాగే విశేషత దృష్టి
ద్వారా అన్ని విశేషతలే కనిపిస్తాయి. మురికిని చూడకుండా కమలాన్ని చూస్తారు మరియు
ప్రతి ఒక్కరు విశేషత ద్వారా విశ్వపరివర్తన యొక్క కార్యంలో విశేష కార్వానికి
నిమిత్తంగా అవుతారు. కనుక ఒక విషయం - మీ యొక్క విశేషతలను కార్యంలో ఉపయోగించండి,
విస్తారం చేసి ఫలం పొందండి, రెండవ విషయం - సర్వులలో విశేషత చూడండి, మూడవ విషయం
సర్వుల యొక్క విశేషతను కార్యంలో ఉపయోగించండి, నాల్గవ విషయం - విశేషయుగం యొక్క
విశేష ఆత్మలు సంకల్పం, మాట, కర్మ చేయాలి. అప్పుడు ఏమౌతుంది? విశేష సమయం
లభిస్తుంది. ఎందుకంటే విశేషంగా భావించని కారణంగా స్వయం ద్వారా, స్వయం యొక్క
విఘ్నాలు మరియు వెనువెంట సంద్రింపుల ద్వారా వచ్చే విఘ్నాలలో సమయం చాలా పోతుంది.
ఎందుకంటే స్వయం యొక్క బలహీనత లేదా ఇతరుల బలహీనత వీటి యొక్క కథ మరియు కీర్తన
రెండు చాలా పెద్దగా ఉంటాయి. మీ యొక్క స్మృతి చిహ్నంగా రామాయణం ఉంది కదా -
అదేవిధంగా ఈ కథ మరియు కీర్తన రెండూ మనస్సుకి ఇష్టమైనవిగా, పెద్దవిగా ఉంటాయి.
దానిలో ఏమి ఉంటుంది? విశేషతను చూడకుండా ఈర్ష్యలోకి రావటం వలన పెద్ద కథగా,
కీర్తనగా అయిపోయింది. అదేవిధంగా విశేషతను చూడటం లేని కారణంగానే లక్ష్మీనారాయణుల
యొక్క కథకి బదులు సీతారాముల యొక్క కథ అయిపోతుంది. మరియు ఈ కథ మరియు కీర్తనలో
స్వయం యొక్క మరియు సేవ యొక్క సమయాన్ని వ్యర్ధంగా పోగొట్టుకుంటున్నారు. ఇంకో మజా
విషయం ఏమిటంటే స్వయం ఒంటరిగా కీర్తన చేయటం లేదు, కీర్తనా మండలిని కూడా తయారు
చేస్తున్నారు. అందువలనే చెప్పాను - ఈ వ్యర్థ కీర్తనా కథల నుండి సమయం పొదుపు
అయిన కారణంగా విశేష సమయం లభిస్తుంది అని. కనుక ఏమి చేయాలో, ఏమి చేయకూడదో
అర్ధమైందా? ఈ రోజుల్లో మీరు ఎవరికైనా భక్తి యొక్క ఫలం పొందండి, సహజ రాజయోగి
అవ్వండి అంటే ఎక్కువ దేనిలో రుచి చూపిస్తున్నారు? భక్తి యొక్క కీర్తనలు, కథలలో
ఎక్కువ రుచి చూపిస్తున్నారు కదా? మనోరంజనంగా భావిస్తున్నారు. ఈ విధంగా కొంతమంది
విశేష ఆత్మలు కూడా వ్యర్ధం యొక్క రామకథా మండలిలో లేక కీర్తనామండలిలో చాలా
మనోరంజనం అనుభవం చేసుకుంటున్నారు. ఆ సమయంలో మీరు ఆ ఆత్మలకు ఈ కీర్తనను వదిలేయండి,
శాంతిగా ఉండండి అంటే అంగీకరించరు, ఎందుకంటే సంస్కారం అయిపోయింది కదా! ఇప్పుడు ఈ
కీర్తన మండలి చేయండి - విశేషతలు చూడండి, విశేషతలే మాట్లాడండి మరియు విశేష
సమాప్తి గల కార్యం చేయండి. అర్ధమైందా? విశేష ఆత్మల సభలో కూర్చున్నారు కదా?
గ్రూప్ కూడా విశేషమైనది.
ఈవిధంగా సదా విశేషతలు చూసేవారికి, విశేషతను కార్యంలో
ఉపయోగించే వారికి, విశేష సమయాన్ని సేవలో ఉపయోగించి సేవ యొక్క ప్రత్యక్షఫలం
తినేవారికి, సదా సంతుష్ట ఆత్మగా అయ్యి సంతుష్టత యొక్క కిరణాలు ద్వారా సర్వులను
సంతుష్టం చేసేవారికి, ఈ విధమైన విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు
మరియు నమస్తే.