బాబా మరియు పిల్లల యొక్క ఆత్మిక కలయిక.
అతి మధురాతి మధురమైన బాప్ దాదా, అతి మధురాతి మధురమైన
పిల్లలతో మాట్లాడుతున్నారు. -
ఆత్మిక తండ్రి ఆత్మికపిల్లలతో కలయిక జరుపుకుంటున్నారు. ఈ ఆత్మిక మేళా కేవలం
పిల్లలైన మీరే జరుపుకోగలరు. ఒకే తండ్రితో ఒకే సమయంలో ఈ మేళా జరుపుకోగలరు.
మీరందరు దీపావళి యొక్క మేళా జరుపుకోవడానికి వచ్చారు. మేళాలో 1. జరుపుకోవటం 2.
పరస్పరం కలుసుకోవటం 3. ఇచ్చి పుచ్చుకోవటం 4. ఆడుకోవటం. మీరందరు కూడా ఈ నాలుగు
విషయాలు చేసారు. మేళాకి అయితే వచ్చారు. కానీ జరుపుకోవటం అంటే సదా అవినాశి
ఉత్సాహ, ఉల్లాసాలతో నిండిన జీవితంలో సదా ఉండానికి ధృఢసంకల్పం చేయటం. ఈ
ఆత్మికమేళా జరుపుకోవటం అంటే అవినాశి ఉత్సవం జరుపుకోవటం, ఒకటి - రెండు రోజులకి
కాదు, సంగమయుగం అంటేనే సదా ఉత్సవం అంటే ఉత్సాహాన్ని పెంచేది. కనుక దీపావళి
వెళ్ళిపోయింది అని లేదు, సదా దీపావళి. అలాగే సదాకాలికంగా క్రొత్త సంవత్సరం.
ప్రతి ఘడియ మీకు క్రొత్తదే. క్రొత్త సంవత్సరం రోజు విశేషంగా క్రొత్త వస్త్రాలు,
క్రొత్త అలంకరణ చేసుకుంటారు మరియు విశేషంగా సంతోషంగా ఉండే రోజు అని భావించి
అందరికీ శుభాకాంక్షలు ఇస్తారు. నోటిని మధురంగా చేస్తారు, అదేవిధంగా ఆత్మిక
పిల్లలైన మీకు సంగమయుగం యొక్క ప్రతిరోజు సర్వులకు శుభాకాంక్షలు ఇచ్చే రోజు మరియు
సదాకాలికంగా సర్వుల నోటిని మధురంగా చేసే యుగం. ఈ విధంగా సదా ఉత్సాహంలో ఉండాలి
మరియు ఉత్సాహాన్ని ఇప్పించాలి. సదా నోటి ద్వారా మధురమైన మాట - ఇదే నోరు మధురంగా
ఉండటం మరియు ఇతరులకు కూడా మధురమైన మాట ద్వారా మధురమైన బాబా యొక్క స్మృతి
ఇప్పించి వారిని సంబంధంలోకి తీసుకురావాలి - ఇదే వారి నోటిని మధురంగా చేయడం, సదా
నోరు మధురంగా ఉంటుందా?మధురమైన మాట అనే మిఠాయి సదా మీ నోటిలో ఉందా? మరియు ఇతరులకు
తినిపిస్తున్నారా! ప్రతిరోజు శ్రేష్టస్థితి అంటే మీలో క్రొత్తదనాన్ని ధారణ
చేస్తూ ఉంటున్నారా! సెకను గడిచింది అంటే క్రొత్త స్థితి ఉండాలి. ఒక సెకను ముందు
ఉన్న స్థితి కంటే రెండవ సెకనులో పైకి ఎక్కుతూ ఉండే అనుభూతి ఉంటే అప్పుడు సదా
శ్రేష్టంగా క్రొత్తదిగా ఉంటుంది - ఈ స్థితిని ధారణ చేయడమే క్రొత్త వస్త్రాన్ని
ధరించటం. సత్యయుగంలో అయితే స్థూలంగా సదా క్రొత్త డ్రెస్ ధరిస్తారు,
విశ్వమహారాజులు లేదా రాజవంశీయులు ఒకసారి ధరించిన డ్రెస్ మరలా ధరించరు.
రాజ్యాధికారి ఆత్మలకి ఆ సంస్కారం ఇక్కడి నుండే నిండుతుంది. ఇక్కడ ప్రతి సమయం
క్రొత్త స్థితి ఉంటుంది మరియు బాప్ దాదా ద్వారా లభించిన జ్ఞానం - విజ్ఞానం
ద్వారా క్రొత్త అలంకరణ జరుగుతుంది. ఎలాగైతే అందరికంటే ధనవంతులు సదా క్రొత్త -
క్రొత్త అలంకరణలు చేసుకుంటే అదేవిధంగా సర్వశ్రేష్టుడైన, సంపన్నుడైన బాబా యొక్క
సంపన్న శ్రేష్ట పిల్లలైన మీకు రోజూ క్రొత్త అలంకరణ చేస్తున్నారు కదా! అంటే
ప్రతిరోజూ క్రొత్త సంవత్సరం అయ్యింది కదా! క్రొత్త వస్త్రాలు, క్రొత్త అలంకరణ,
క్రొత్త ఉత్సవం అంటే ఉత్సాహం మరియు సదా నోరు మధురంగా ఉండాలి. నిరంతరం నోటిలో
మధురత అనే మిఠాయి ఉండాలి. అందువలనే బాబా రోజు ఏమంటారు? (మధురాతి మధురమైన పిల్లలు.)
ఇది పక్కాగా స్మృతి ఉంది కదా? బాబా కూడా మధురమైన పిల్లలు అంటున్నారు మరియు
పిల్లలు ఏమంటున్నారు? (మధురాతి మధురమైన బాబా) అంటే నోటిలో ఏమి ఉన్నట్లు? ఇలా
రోజూ క్రొత్త సంవత్సరం అయ్యింది కదా! క్రొత్త సంవత్సరం ఏమిటి, క్రొత్త ఘడియ
అయ్యింది. ఇలా జరుపుకున్నారా? లేదా ఉత్సవం అయిపోయింది కదా అని ఉత్సాహం కూడా
అయిపోయిందా? ఇలా అల్పకాలికంగా జరుపుకోలేదు కదా? ఇక్కడ ఆత్మిక కలయిక అంటే అవినాశి
కలయిక. ఇక రెండవ విషయం - జరుపుకున్న తర్వాత కలుసుకోవటం. కలుసుకోవటం అంటే ఆత్మిక
కలయిక అంటే బాబా సమానంగా అవ్వటం, పరస్పరం కలుసుకోవటం అంటే ఆలింగనం చేసుకోవటం
కాదు, కానీ గుణాలతో కలవాలి, సంస్కారాలతో కలవాలి. కలుపుకోవటం అంటే సమానంగా అవ్వటం
అందువలన సాంగత్యం యొక్క రంగుకి మహిమ ఉంది. ఇలా ఆత్మిక కలయిక జరుపుకున్నారా? లేదా
కేవలం పరస్పరం చేతులు కలుపుకుని ఆలింగనం చేసుకున్నారా? గుణాల యొక్క కలయిక,
సంస్కారాల యొక్క కలయిక ఇది సదాకాలిక కలయిక కదా? రోజూ కలయిక జరుపుకోవాలి.
అందువలన మేళాకి వచ్చాము అంటే ఇలా కలయిక జరుపుకున్నామా? అని పరిశీలించుకోండి.
మూడవ విషయం - ఇచ్చి పుచ్చుకోవటం. లౌకికంలో కూడా ఏదైనా
మేళాకి వెళ్తుంటే ధనం ఇస్తారు, ఏదోక వస్తువు తీసుకుంటారు. ఏదోకటి తప్పకుండా
తీసుకుంటారు. మరియు తీసుకునే ముందు తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది కదా! అలాగే ఈ
ఆత్మిక కలయికలో కూడా ప్రతి సమయం తీసుకుంటూనే ఉన్నారు. బాబా నుండి సదా
తీసుకుంటున్నారు. పరస్పరంలో కూడా సదా గుణాలను లేదా విశేషతలను తీసుకుంటున్నారు.
సదా తీసుకుంటున్నారు కదా? తీసుకోవటం అంటే స్వయంలో ధారణ చేయడం. ఎప్పుడైతే
విశేషతలు ధారణ చేస్తారో అప్పుడు సాధారణత స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. గుణాలను
ధారణ చేస్తూ ఉంటే బలహీనతలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. కనుక ఇదే ఇవ్వటం
అవుతుంది. కనుక గుజరాత్ వారు తీసుకున్నారు మరియు ఇచ్చారు కదా? ఈ ఇవ్వటం
తీసుకోవటం అనేది సదా నడుస్తుంది మరియు నడుస్తూనే ఉంటుంది. ప్రతి సెకను
తీసుకుంటున్నారు మరియు ఇస్తున్నారు. ఎందుకంటే తీసుకోవటంలో, ఇవ్వటం అనేది
బందించబడి ఉంది. అయితే ఇవ్వటంలో కూడా విశాల హృదయులు అవుతున్నారా లేక పిసినారిగా
అవుతున్నారా? విశాలహృదయులు కదా? ఇచ్చేది కూడా ఏమిటి? బలహీన విషయాలే ఇస్తున్నారు.
పిల్లలు ఎప్పుడైతే పూర్తి ఖాళీ అయిపోతారో అప్పుడే బాబా
కూడా వస్తారు. తనువు యొక్క శక్తి లేదు. మనస్సు యొక్క శక్తి లేదు, ధనం యొక్క
శక్తి లేదు. తనువు యొక్క శక్తి సమాప్తి అయిన దానికి గుర్తుగా శివుని పెళ్ళి
గుంపుని ఎలా చూపించారు? మరియు మనస్సు యొక్క శక్తి సమాప్తి అయిన దానికి గుర్తుగా
సదా పిలుస్తున్నట్లు స్మృతిచిహ్నం చూపించారు. రోజు పిలుస్తూనే ఉంటారు కదా! ధనంతో
ఖాళీ అయిపోయిన దానికి గుర్తుగా - ఇప్పుడు చూడండి, కొద్దిగా బంగారం ఉన్నా కానీ
దానిపై కూడా ఈరోజు గవర్నమెంట్ వారి యొక్క దృష్టి ఉంటుంది. ఒకవేళ ధనం ఉన్నా దాని
పేరు ఏమిటి? నల్ల ధనం. ఎంత ధనవంతులు అని పేరు ఉన్నా దానిలో 90% నల్లధనమే. అంటే
కేవలం పేరుకి ధనం ఉందా లేక పనికి వచ్చేలా ఉందా? ఇలా అన్ని రకాలుగా ఖాళీ
అయిపోయారు. సుధాముని వలె ఎండిన అటుకులు ఉన్న సమయంలో బాబా వస్తారు. ఎండిన అటుకులు
తింటే అనారోగ్యం వస్తుంది కూడా. ఎలాంటి అటుకులు ఇస్తున్నారు అంటే అవి కూడా
ఎండిపోయినవి, కానీ ఏమి తీసుకుంటున్నారు? సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వ ఖజానాలు,
36 రకాల కంటే ఎక్కువ వెరైటీలు తీసుకుంటున్నారు. కనుక ఇది ఇవ్వటం అయ్యిందా? లేక
తీసుకోవటం అయ్యిందా? ఎండిపోయిన అటుకులు మట్టితో ఉన్నవి తీసుకువస్తున్నారు. మట్టి
యొక్క స్మృతే ఉంటుంది, మట్టిలో ఆడుకునేవారు, ఇప్పుడు ఏమి చేస్తున్నారు? ఇప్పుడు
రత్నాలతో ఆడుకుంటున్నారు. ఇలా ఇవ్వటం మరియు తీసుకోవటం ఇది కూడా సదా నడుస్తూనే
ఉంటుంది. ఇచ్చేవి మట్టితో ఉన్న ఎండిపోయిన అటుకులు కానీ ఆ ఇవ్వటంలో కూడా కొంతమంది
పిల్లలు చాలా ఒయ్యారాలు చూపిస్తున్నారు. ఈరోజు ఇచ్చేస్తాం అంటారు... కానీ
సుదామునిలా వారు కూడా చంకలో దాచుకుని ఉంచుకుంటున్నారు. బాబా అయితే తీసుకోగలరు
కానీ ఇచ్చేవారికి తయారవుతుందా? ఒకవేళ బాబా లాక్కుని తీసుకున్నా, ఇచ్చి
తీసుకున్నారు అంటే దానిలో లోపం వచ్చేస్తుంది కదా! ఒకటి ఇవ్వటం అంటే కోట్లు
పొందటం. కనుక మీ ఇష్టంతో అంటే ధృఢసంకల్పంతో ఒకటి ఇవ్వాలి మరియు కోట్లు పొందాలి.
కనుక మీరే ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవ్వటంలోనే కళ్యాణం ఉంటుంది. అయితే ఇచ్చి
పుచ్చుకోవటం ఏమిటో అర్థమైందా!
ఎప్పుడైతే ఇలా జరుపుకోవటం, కలుసుకోవటం మరియు ఇచ్చి
పుచ్చుకోవటం అయిపోయిన తర్వాత ఏమౌతుంది? సదా బాబాతో పాటు సంతోషంతో ఆడుకోవటం. సదా
అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగటం. ఈ విధమైన మేళా జరుపుకున్నారా? ఈ ఆత్మికమేళా
సదా జరుపుకుంటూ ఉండండి. ప్రతి రోజు మేళాయే. మంచిది.
ఈవిధంగా ప్రతి సెకను మేళా జరుపుకునే వారికి, సదా స్వయం
యొక్క మరియు సర్వుల యొక్క నోటిని మధురంగా చేసేవారికి, సదా క్రొత్త ఉత్సాహం
ఉంచుకునే వారికి, అంటే సదా ఉత్సవం జరుపుకునేవారికి, ప్రతి సెకను ఎగిరేకళ యొక్క
క్రొత్త స్థితి అంటే నూతన వస్త్రధారి, నూతన అలంకారధారులకు, సదా బాబా వెంట
సంతోషంతో ఆడుకునే వారికి, ఇటువంటి ఆత్మిక కలయిక జరుపుకునే శ్రేష్ట ఆత్మలకు బాప్
దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.