ఆత్మిక గులాబి యొక్క విశేషత - సదా ఆత్మికవృత్తి.
ఈరోజు తోటమాలి తన యొక్క ఆత్మిక గులాబీ పిల్లలను
చూస్తున్నారు. నలువైపుల ఉన్న ఆత్మిక గులాబీ పిల్లలు బాప్ దాదా ఎదురుగా ఉన్నారు.
సాకారంలో ఎక్కడ కూర్చున్నా కానీ (ఈరోజు సగం మంది అన్నయ్యలు, అక్కయ్యలు క్రింద
మురళి వింటున్నారు) కానీ బాప్ దాదా వారిని కూడా తన నయనాల ఎదురుగానే చూస్తున్నారు,
ఇప్పుడు కూడా బాప్ దాదా పిల్లల యొక్క సంకల్పాన్ని వింటున్నారు. అందరూ ఎదురుగా
కూర్చుని మురళి వినాలని అనుకుంటున్నారు, క్రింద ఉన్నప్పటికీ కూడా బాప్ దాదా
పిల్లలను తన ఎదురుగా చూస్తున్నారు. ప్రతి ఒక ఆత్మికగులాబీ యొక్క సువాసన బాప్
దాదా దగ్గరికి వస్తుంది. అందరు నెంబర్వారీ కానీ ఈ సమయంలో అందరూ ఒక బాబా తప్ప
మరెవ్వరూలేరు అనే ఆత్మిక సువాసనలో నెంబర్ వన్ స్థితిలో స్థితులై ఉన్నారు.
అందువలనే ఆత్మిక సువాసన వతనం వరకు కూడా చేరుకుంటుంది. ఆత్మిక గులాబీ యొక్క
విశేషతలు తెలుసా? దేని ఆధారంగా ఆత్మిక సువాసన, సదాకాలికంగా, ఏకరసంగా మరియు
దూరాతిదూరం వరకు వ్యాపిస్తుంది అంటే ప్రభావం వేస్తుంది? దీనికి ముఖ్య ఆధారం
ఆత్మికవృత్తి. వృత్తిలో ఆత్మ, ఆత్మనే చూస్తున్నాను, ఆత్మతోనే మాట్లాడుతున్నాను,
ఆత్మయే తన పాత్రను అభినయిస్తుంది. నేను ఆత్మను, సదా సుప్రీమ్ ఆత్మ (ఉన్నతమైన
బాబా) యొక్క ఛత్రఛాయలో నడుస్తున్నాను. నేను ఆత్మను - నా యొక్క ఒక సంకల్పం కూడా
సుప్రీమ్ ఆత్మ యొక్క శ్రీమతానికి విరుద్ధంగా నడవదు. ఆత్మనైన నాచే చేయించేది -
సుప్రీమ్ ఆత్మ. చేయించేవారి ఆధారంగా నేను నిమిత్తంగా చేస్తున్నాను. వారు
నడిపిస్తున్నారు నేను నడుస్తున్నాను. ప్రతి సంకల్పం, మాట, కర్మలో ప్రతి సలహాపై
నడవడానికి ఆత్మనైన నేను హాజరై ఉన్నాను. అందువలనే యజమాని ముందు ఆత్మను సదా హాజరు
చేస్తున్నాను. ఆత్మనైన నేను మరియు సుప్రీమ్ ఆత్మ సదా కంబైండ్ గా ఉన్నాము.
సుప్రీమ్ ఆత్మ నేను లేకుండా ఉండలేరు మరియు నేను సుప్రీమ్ ఆత్మ లేకుండా ఉండలేను.
ఈ విధంగా ప్రతి సెకను అనుభవం చేసుకునేవారు సదా ఆత్మిక సువాసనలో అవినాశిగా మరియు
ఏకరసంగా ఉంటారు. ఇదే నెంబర్ వన్ సువాసన గల ఆత్మికగులాబీ యొక్క విశేషత.
అదేవిధంగా దృష్టిలో కూడా సుప్రీమ్ ఆత్మ నిండి ఉంటారు.
బాబా యొక్క దృష్టిలో వారు మరియు వీరి దృష్టిలో బాబా సదా ఉంటారు. ఇటువంటి ఆత్మిక
గులాబీలకు దేహం, దేహ ప్రపంచం, లేదా పాత దేహం యొక్క వస్తువులు, వ్యక్తులను చూస్తూ
కూడా కనిపించవు. దేహం ద్వారా మాట్లాడుతున్నా కానీ ఆత్మను చూస్తున్నాను, ఆత్మతో
మాట్లాడుతున్నాను అనే భావన ఉంటుంది ఎందుకంటే వారి నయనాలలో సదా ఆత్మిక ప్రపంచం,
ఫరిస్తాల ప్రపంచం, దేవతల ప్రపంచం ఉంటుంది. సదా ఆత్మిక సేవలో ఉంటారు. రాత్రి
అయినా, పగలు అయినా కానీ వారు సదా ఆత్మిక సేవలో ఉంటారు. ఇలాంటి ఆత్మిక గులాబీలకు
సదా ఆత్మిక భావన ఉంటుంది సర్వ ఆత్మలు మా సమానంగా వారసత్వానికి అధికారులుగా
కావాలి అని. పరవశ ఆత్మలకు బాబా ద్వారా లభించిన శక్తులను సహయోగం ఇచ్చి వారిని
కూడా అనుభవీగా చేయాలి అని. ఎవరి యొక్క బలహీనతలు మరియు లోపాలను చూడరు. తాము ధారణ
చేసిన శక్తులను, గుణాలను సహయోగం ఇచ్చే దాతగా ఉంటారు. బ్రాహ్మణాత్మలకు సహయోగిగా,
ఇతర ఆత్మలకు మహాదానిగా ఉంటారు. వీరు ఈ విధంగా ఉన్నారు అనే భావన ఉండదు. కానీ
వీరిని కూడా బాబా సమానంగా చేయాలనే శుభభావన ఉంటుంది. వెనువెంట ఇదే శ్రేష్ట కామన
ఉంటుంది - ఈ సర్వ ఆత్మలు దు:ఖం, అశాంతి నుండి ముక్తి అయ్యి సదా శాంతి, సుఖాలతో
సంపన్నంగా అవ్వాలి అని, సదా స్మృతిలో ఇదే ధ్యాస ఉంటుంది విశ్వ పరివర్తన త్వర
త్వరగా ఏవిధంగా అవుతుంది అని. వీరినే ఆత్మిక గులాబీ అంటారు.
ఈరోజు మహారాష్ట్ర వారి అవకాశం. మహారాష్ట్ర వారు సదా
ఒకే మహా శబ్దాన్ని స్మృతి ఉంచుకుంటే మహాన్ అంటే నెంబర్ వన్ అయిపోతారు.
మహారాష్ట్ర వారి లక్ష్యం ఏమిటి? మహాన్ గా అవ్వటం. స్వయాన్ని కూడా మహాన్ గా
చేసుకోవటం మరియు విశ్వాన్ని కూడా మహాన్ గా చేయటం. ఇదే స్మృతిలో ఉంటున్నారు కదా!
కర్ణాటక వారు సదా నాటకంలో హీరో పాత్ర అభినయించేవారు.
హీరోగా అవ్వాలి మరియు హీరోగా తయారుచేయాలి. ఆంధ్ర అంటే అంధకారం తొలగించేవారు.
అన్ని రకాలైన అంధకారం తొలగించాలి. ఆంధ్రాలో బీదవారి యొక్క అంధకారం కూడా చాలా
ఉంది. బీదవారిని సంపన్నంగా తయారుచేయాలి. కనుక ఆంధ్రావారు విశ్వాన్ని సదాకాలిక
ధనవంతంగా చేసేవారు. తనువు యొక్క బీదతనం ఉండకూడదు, ధనం యొక్క బీదతనం ఉండకూడదు,
మనస్సు యొక్క శక్తుల యొక్క బీదతనం ఉండకూడదు. తనువు, మనస్సు, ధనం మూడింటి యొక్క
బీదతనం తొలగించేవారు, ఈ అంధకారాన్ని తొలగించి సదా వెలుగుని తీసుకువచ్చేవారు.
కనుక ఆంధ్రానివాసీలు మాష్టర్ జ్ఞానసాగరులుగా అయిపోయారు. మద్రాస్ అంటే సదా రాస్
లో నిమగ్నం అయ్యి ఉండేవారు. సంస్కారాల కలయిక యొక్క రాస్ కూడా మరియు సంతోషం
యొక్క రాస్ కూడా మరియు స్థూలంగా కూడా రాస్ చేసేవారు. ఈ రాస్ లో నిమగ్నం అయి
ఉండేవారు. కనుక అందరి యొక్క వృత్తి ఏమిటో అర్థమైందా! ఇప్పుడైతే అందరితో కలిసాను
కదా, కలుసుకోవటం అంటే తీసుకోవటం. కనుక తీసుకున్నారు కదా! చివరికి నయనాల కలయిక
వరకు చేరుకోవాలి. బాప్ దాదాకి అయితే క్రింద కూర్చున్నవారు మరియు పైన
కూర్చున్నవారు అందరూ వి.ఐ.పిలే.