జ్ఞానమార్గానికి స్మృతిచిహ్నం - భక్తి మార్గం.
ఈరోజు మధువనం యొక్క నదీతీరాన ఏ కలయిక జరుగుతుంది?
ఈరోజు అనేక నదులు మరియు సాగరుని యొక్క కలయిక. ప్రతి ఒక చిన్న - పెద్ద జ్ఞాన నది
పతితపావనుడైన బాబా సమానంగా పతితపావని. బాబా తన యొక్క సేవా సహయోగులను
చూస్తున్నారు. దేశం నుండి విదేశం వరకు కూడా పతితపావని నదులు చేరుకున్నాయి. దేశ,
విదేశాలలోని ఆత్మలు పావనంగా అయ్యి మహిమ యొక్క పాట పాడుతున్నారు! ఈ మనస్సు యొక్క
పాటే భక్తిమార్గంలో నోటి యొక్క పాటగా అవుతుంది. ఇప్పుడు బాబా, శ్రేష్టాత్మల
యొక్క శ్రేష్ట కార్యం, శ్రేష్ట జీవితం యొక్క కీర్తన చేస్తారు. అదే తిరిగి
భక్తిమార్గంలో కీర్తన అవుతుంది. ఇప్పుడు అతీంద్రియసుఖం యొక్క ప్రాప్తి కారణంగా
సంతోషంలో ఆత్మల మనస్సు నాట్యం చేస్తుంది. అందువలనే భక్తి మార్గంలో ఇప్పుడు
శ్రేష్టాత్మల పదాలతో నాట్యం చేస్తారు. ఇప్పుడు శ్రేష్టాత్మల గుణాల యొక్క మాల
స్మరణ చేస్తున్నారు లేక వర్ణన చేస్తున్నారు. వారు భక్తిమార్గంలో మణుల యొక్క మాల
స్మరణ చేస్తారు. ఇప్పుడు మీరు స్వయంగా బాబాకి భోగ్ (నైవేద్యం) చేస్తున్నారు.
దీనికి బదులుగా భక్తిలో మీ అందరికీ భోగ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏ పదార్థం అయినా
బాబాకి స్వీకరింపచేయకుండా, మీరు స్వీకరించరు. మొదట బాబా అనే స్నేహం మనస్సులో సదా
ఉంటుంది. అదేవిధంగా భక్తిలో దేవాత్మలైన మీకు స్వీకరణ చేయకుండా స్వయం వారు కూడా
స్వీకరించడం లేదు. మొదట దేవత, తర్వాత మేము అని భావిస్తారు. మీరు అంటారు కదా -
మొదట బాబా తర్వాత మేము అని ఇలా .... అన్నీ కాపీ చేసేసారు. మీరు స్మృతిస్వరూపంగా
అవుతున్నారు, వారు స్మృతిచిహ్న స్వరూపంగా ఉంటున్నారు. మీరందరు తెగిపోని
అవ్యభివారి అంటే ఒకని స్మృతిలోనే ఉంటున్నారు, మిమ్మల్ని ఎవరు
చలింపచేయలేకపోతున్నారు, మార్చలేకపోతున్నారు. అదేవిధంగా ఎవరైతే బాగా మొండి
భక్తులు, సత్యమైన భక్తులు, ఆదిలోని భక్తులు ఉంటారో వారికి తమ ఇష్టదేవతపై నిశ్చయం
తెగిపోదు, స్థిరమైన నిశ్చయబుద్ధిగా ఉంటారు. హనుమంతుని భక్తులు ఉన్నారనుకోండి,
వారికి రాముడు లభించినా వారు హనుమంతుని భక్తులుగానే ఉంటారు. అటువంటి స్థిరమైన
విశ్వాసం ఉంటుంది. మీ యొక్క ఒకే బలం, ఒకే నమ్మకాన్ని వారు కాపీ చేసారు.
మీరందరు ఇప్పుడు ఆత్మిక యాత్రికులుగా అవుతున్నారు.
మీది స్మృతియాత్ర మరియు వారిది స్మృతిచిహ్నయాత్ర. మీరు వర్తమాన సమయంలో జ్ఞాన
స్థంభంగా, శాంతి స్థంభంగా అయ్యి నలువైపుల శిక్షణ యొక్క స్మృతి స్వరూపంగా అయ్యి
మహావాక్యం కారణంగా చక్రం తిరుగుతున్నారు, అందరినీ త్రిప్పిస్తున్నారు. మీరు
శిక్షణ కారణంగా చక్రం తిరుగుతున్నారు. ఒకవైపు కూడా వదలటం లేదు. ఎప్పుడైతే
నలువైపుల చక్రం తిరిగి సంపన్నం అయిన తర్వాత అన్నీ చూసాము, అనుభవం చేసుకున్నాము
అని భావిస్తున్నారు. భక్తులు మీ యొక్క స్మృతిచిహ్నాల యొక్క చక్రం తిరగటం
ప్రారంభించారు. ఎప్పటివరకు అయితే అవన్నీ తిరగరో అప్పటివరకు భక్తి సంపన్నం
అయినట్లు భావించరు. అందరి అన్ని కర్మలు, గుణాలు సూక్ష్మ రూపాన్ని, స్థూల రూపంలో
భక్తులు కాపీ చేసారు. అందువలనే బాప్ దాదా సర్వ దేవాత్మలకు సదా ఇదే శిక్షణ
ఇస్తున్నారు - సదా ఒకనిపై స్థిరమైన నిశ్చయబుద్ధి కలిగి ఉండండి అని. ఒకవేళ మీరు
ఇప్పుడు ఒకని స్మృతిలో ఏకరసంగా ఉండటం లేదు, ఏకాగ్రంగా ఉండటం లేదు, స్థిరంగా
అవ్వటం లేదు అంటే మీ భక్తులు కూడా స్థిరమైన నిశ్చయబుద్ధి కలిగి ఉండరు. ఇక్కడ మీ
బుద్ధి భ్రమిస్తుంది, అక్కడ మీ భక్తులు స్థూలంగా భ్రమిస్తారు. అప్పుడప్పుడు
ఒకరిని దేవతగా చేసుకుంటారు, అప్పుడప్పుడు మరొకరిని చేసుకుంటారు. ఈరోజు రాముని
భక్తులుగా ఉంటారు, రేపు కృష్ణుని భక్తులుగా అయిపోతారు. సర్వప్రాప్తులు ఒకని
ద్వారానే అనే స్థితి మీకు లేకపోతే భక్త ఆత్మలు కూడా ప్రతి ప్రాప్తి కోసం
వేర్వేరు దేవతల దగ్గరకి భ్రమిస్తారు, అలా చేయటం ద్వారా మీరు మీ శ్రేష్టగౌరవం
నుండి వేరు అయిపోతారు, మీ భక్తులు అలజడి అయిపోతారు. మీరు ఇక్కడ స్మృతి ద్వారా
అలౌకిక అనుభవాలు చేసుకోవడానికి బదులు మీ బలహీనతల కారణంగా ప్రాప్తికి బదులు
నిందలు వేస్తున్నారు. బలహీనం అయ్యి నిందించినా, స్నేహంతో నిందించినా మీ భక్తులు
కూడా నిందలు వేస్తూ ఉంటారు. నిందల గురించి అయితే అందరికీ మంచిగా తెలుసు, కనుక
చెప్పటం లేదు.
బాబా చెప్తున్నారు - దయాహృదయులుగా అవ్వండి, సదా దయా
భావన పెట్టుకోండి అని. కానీ దయా భావనకి బదులు అహంభావం లేదా భ్రమ
పెట్టుకుంటున్నారు. కనుక భక్తులలో కూడా ఆవిధంగా ఉంటుంది. భ్రమ అంటే ఇది చేద్దామా,
ఇలా అవుతుందా, అవ్వదా, ఇలా అయితే అవ్వదు కదా ..... ఇలా దీనిలో దయాభావం
మర్చిపోతున్నారు. స్వయం పట్ల కూడా దయాభావన ఉండాలి, ఇతరుల పట్ల కూడా దయాభావన
ఉండాలి. స్వయం పట్ల కూడా భ్రమ మరియు ఇతరుల పట్ల కూడా భ్రమ ఉంటుంది. ఒకవేళ ఈ
భ్రమ రోగం పెరిగిపోతే క్యాన్సర్ రోగి వలె అయిపోతారు. మొదటి స్టేజ్ లో ఉన్న
క్యాన్సర్ రోగిని బ్రతికించవచ్చు. కానీ లాస్ట్ స్టేజ్ కి వచ్చినవారిని
బ్రతికించడం కష్టం అవుతుంది. జీవించలేరు, చనిపోలేరు. అలాగే ఇక్కడ కూడా పూర్తిగా
అజ్ఞానిగా కాలేరు, జ్ఞానీగా కాలేరు. వారికి గుర్తు ఒక సూక్తి ఉంటుంది - నేను
ఇలాగే ఉంటాను అంటారు, ఇతరుల గురించి - వీరు ఇలానే ఉంటారు అంటారు. ఎంత
మార్చడానికి ప్రయత్నించినా వీరు ఇంతే అంటారు. క్యాన్సర్ రోగులు చాలా మంచిగా
తింటారు, త్రాగుతారు బయటి రూపం చాలా మంచిగా కనిపిస్తుంది కానీ లోపల శక్తిహీనంగా
ఉంటారు. అదేవిధంగా వీరు కూడా బయటికి తమనితాము చాలా బాగా నడిపించుకుంటారు, బయటికి
ఏ లోపం ఉంచుకోరు, ఇతరులు లోపం చెప్పినా దానిని స్వీకరించరు. కానీ లోలోపలే ఆత్మ
అసంతుష్టం అయిన కారణంగా సంతోషం మరియు సుఖం యొక్క ప్రాప్తిలో బలహీనం అయిపోతారు.
అదేవిధంగా రెండవది అహంభావం. దయాభావనకి గుర్తు - ప్రతి మాట, ప్రతి సంకల్పంలో ఒక
బాబా తప్ప ఇంకెవ్వరు ఉండరు. దయాభావం ఉన్నవారికి ఎక్కడ చూసినా బాబాయే బాబా
కనిపిస్తారు మరియు అహంభావం ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ చూసినా నేను -
నేను అనేదే కనిపిస్తుంది. వీరు నేను - నేను అనే మాల త్రిప్పేవారు, వారు బాబా
యొక్క మాల త్రిప్పేవారు. నేను అనే భావం బాబాలో కలిసిపోవాలి దీనినే ప్రేమలో
లీనమైపోవటం అంటారు. కనుక వీరు లవలీన ఆత్మ మరియు వారు నేను -నేను అనే దానిలో
లీనమయ్యే ఆత్మలు. ఇప్పుడు అర్ధమైందా! మిమ్మల్ని కాపీ చేసేవారు మొత్తం కల్పంలో
ఉన్నారు. భక్తులకు మాస్టర్ భగవంతులు, సత్యయుగం, త్రేతాయుగంలో ప్రజలకు ప్రజాపతులు,
సంగమయుగంలో బాప్ దాదా యొక్క పేరు మరియు కర్తవ్యాన్ని ప్రత్యక్షం చేసే
ఆధారమూర్తులు. మీ యొక్క శ్రేష్టకర్మ ద్వారా పేరు ప్రత్యక్షం చేయాలన్నా, సాధారణ
నడవడిక ద్వారా చెడు పేరు తీసుకురావాలన్నా రెండూ పిల్లల చేతుల్లోనే ఉన్నాయి.
ఇక వినాశన సమయంలో విశ్వం కొరకు మహాన్ కళ్యాణకారిగా,
మహావరదానిగా, మహాదానిగా, మహాన్ పుణ్మాత్మల స్వరూపంలో ఉంటారు. కనుక అన్ని సమయాలలో
ఎంత ఉన్నతమైనవారు. ప్రతి సమయం ఆధారమూర్తులు. ఈ విధంగా మిమ్మల్ని మీరు
భావిస్తున్నారా! ఆదిలో కూడా, మధ్యలో కూడా, అంతిమంలో కూడా మూడుకాలాల యొక్క పరిచయం
స్కృతిలోకి వచ్చిందా! మీరు ఒకరు కాదు, మీ వెనుక అనేక మంది కాపీ చేసేవారు ఉన్నారు.
అందువలన ప్రతి సంకల్పంలో కూడా ధ్యాసతో ఉండాలి.
ఈవిధంగా మూడుకాలాలలో మహాన్ గా ఉండేవారికి, సదా ఒకే
బాబా స్మృతి యొక్క సమర్థ స్వరూపులకు, సదా దయాహృదయులకు, ప్రతి సెకను
ప్రాప్తిస్వరూపం మరియు ప్రాప్తి యొక్క దాతలకు, బాబా సమానంగా సదా సంపన్న స్వరూప
ఆత్మలకు బాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్స్ తో అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు -
టీచర్స్ యొక్క వాస్తవిక స్వరూపమే నిరంతర సేవాధారి. ఇది బాగా తెలుసుకుంటున్నారా?
సేవాధారి యొక్క విశేషత ఏమి ఉంటుంది? సేవాధారి ఏ విషయం ఆధారంగా సఫలం అవుతారు?
సేవలో నిమగ్నమైన సేవాధారి యొక్క విశేషత ఇదే ఉంటుంది - నేను సేవ చేస్తున్నాను,
నేను సేవ చేసాను ఇలా నేను అనే దానిని త్యాగం చేస్తారు. దీనినే మీరు త్యాగాన్ని
కూడా త్యాగం చేయటం అంటారు. నేను సేవ చేసాను అంటే సేవ సఫలం అవ్వదు. నేను చేయలేదు,
నేను చేసేవాడిని, చేయించేవాడు బాబా అనే స్మృతి ఉండాలి. అప్పుడు బాబా యొక్క మహిమ
వస్తుంది. ఎక్కడైతే నేను సేవాధారిని, నేను చేసాను, నేను చేస్తాను ఇలా నాది అనే
భావన సేవాధారి యొక్క లెక్కలో ఎప్పుడైతే వచ్చిందో ఆ సేవ సఫలత పొందదు. ఎందుకంటే
సేవలో నాది అనే భావన కలిసినప్పుడు స్వార్థంతో కూడిన సేవ అవుతుంది. త్యాగం యొక్క
సేవ అవ్వదు. ప్రపంచంలో రెండు రకాలైన సేవాధారులు ఉంటారు - 1. స్వార్థంతో సేవ చేసే
సేవాధారులు 2. స్నేహంతో త్యాగమూర్తిగా ఉండే సేవాధారులు. కనుక మీరు ఏ సేవాధారులు?
చెప్పాను కదా - నాది అనే భావాన్ని త్యాగం చేసి బాబా యొక్క ప్రేమలో లవలీనం అయ్యి
సేవ చేసేవారిని సత్యమైన సేవాధారి అంటారు. నేను మరియు నీవు అనే భాషని సమాప్తి
చేయాలి. చేయించేవాడు బాబా మరియు మనం నిమిత్తం. ఎవరు నిమిత్తం అయిన నాది అనేది
వచ్చినప్పుడు నాది అనేది ఏమి చేస్తుంది? మే, మే (మై, మై) అని ఎవరు అంటారు? (మేక)
నేను, నేను అనటం ద్వారా కోరిక వచ్చేస్తుంది. మేక తల ఎప్పుడు ఒంగి ఉంటుంది, సింహం
యొక్క తల ఎప్పుడు పైకి ఉంటుంది. ఎప్పుడైతే నాది అనేది వస్తుందో అక్కడ ఏదోక
కోరిక కారణంగా తలవంచవలసి వస్తుంది. సదా నషాలో తల పైకి ఎత్తి ఉంచలేరు. ఏదోక
విఘ్నం కారణంగా మేక సమానంగా తల క్రిందకి ఉంటుంది. గృహస్థ జీవితం కూడా మేక
సమానమైన జీవితం ఎందుకంటే ఒంగి ఉంటారు కదా! నిర్మాణతతో తలవంచటం ఇది వేరే విషయం,
అక్కడ మాయ వంచింపచేయదు. కానీ ఇక్కడ మాయ మేకగా తయారుచేస్తుంది. బలవంతంగా
తలవంచేటట్లు చేస్తుంది, కళ్ళను క్రిందకి దించేస్తుంది. సేవలో నాది అనే భావన
కలవటం అంటే కోరిక కలిగిన వారిగా అవ్వటం. వ్యక్తి యొక్క కోరిక అవ్వనివ్వండి,
పాత్ర యొక్క కోరిక అవ్వనివ్వండి, వస్తువుల యొక్క వాయుమండలం యొక్క ఏదోక కోరిక
కలిగినవారిగా అవుతున్నారు. కోరిక అంటే పరవశం అయిపోతున్నారు. సేవాధారులలో ఈ
సంస్కారమే ఉండకూడదు. సేవాధారి అంటే ప్రతిజ్ఞ చేసేవారిగా ఉంటారు. ప్రతిజ్ఞ
ఎప్పుడు తల పైకి ఎత్తి చేస్తారు. మాయకి, విశ్వాత్మలకు మరియు బాబాకి కూడా
ప్రతిజ్ఞ చేసేవారు. ఎవరైతే స్వయం పాత సంస్కారాలతో ప్రతిజ్ఞ చేస్తారో వారే
ఇతరులకు ప్రతిజ్ఞ చేయగలరు. మొదట మీ సంస్కారాలకు ప్రతిజ్ఞ చేయాలి తర్వాత
సాధారణంగా వచ్చే విఘ్నాలకు ప్రతిజ్ఞ చేయాలి. విఘ్నాలు ఎప్పుడు ఇటువంటి
సేవాధారులను ఆపలేవు. ప్రతిజ్ఞ చేసేవారు మాయ యొక్క పర్వత రూపాన్ని కూడా సెకనులో
రాయిగా చేసుకుంటారు. మీరు మాయ గురించి డ్రామా చూపిస్తారు కదా - పర్వతాన్ని కూడా
రాయిగా చేసేస్తారు. కనుక సత్యమైన సేవాధారి అంటే బాబా సమానమైనవారు. ఎందుకంటే బాబా
మొట్టమొదట అందరికీ ఏమి చెప్తారు? - నేను విశ్వసేవాధారిని అని. సేవాధారిగా అవ్వటం
అంటే బాబా సమానంగా అవ్వటం. ఒక జన్మ యొక్క సేవ, అనేక జన్మల కొరకు కిరీటధారులుగా,
సింహాసనాధికారిగా చేస్తుంది. సంగమయుగం సేవా యుగం కదా! అది కూడా ఎంత సమయం?
సంగమయుగం యొక్క ఆయుష్షు ఎలా అయితే చిన్నదో అదేవిధంగా దానిలో సేవ యొక్క అవకాశం
కూడా కొద్ది సమయమే లభిస్తుంది. ఎవరైనా 50 - 60 సంవత్సరాలు సేవ చేసారనుకోండి
5000 సంవత్సరాలలో 60 సంవత్సరాలు తీసేస్తే మిగిలినదంతా ప్రాప్తియే. సేవ 60
సంవత్సరాలు, మిగిలినదంతా ఫలమే. ఎందుకంటే సంగమయుగం యొక్క పురుషార్థం అనుసరించి
పూజ్యులుగా అవుతారు. పూజ్యులుగా కూడా నెంబర్ వన్‌గా అవుతారు, పూజారులలో కూడా
నెంబర్ వన్‌గా అవుతారు. చివరి జన్మలో కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నారు! ఎవరైతే
మంచి పురుషార్థులు ఉంటారో వారికి చివరి జన్మ కూడా ఇంత మంచిగా ఉంది అంటే ఇక ముందు
ఎలా ఉంటుంది! బాగా సుఖం యొక్క లెక్కతో దు:ఖం అంటారు. ఎవరైనా ధనవంతులు బికారీగా
అయిపోయినా ధనవంతులు అని అంటారు కదా! ఉన్నతమైన వ్యక్తులు ఎవరికి అయినా సగం డిగ్రీ
జ్వరం వచ్చినా ఫలానా వారికి జ్వరం వచ్చింది అని చెప్పుకుంటారు కానీ ఒకవేళ
బీదవారికి 5 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం వచ్చినా ఎవరూ అడగరు. మీరు కూడా అతి
దు:ఖిగా అవ్వటంలేదు కానీ అతి సుఖం యొక్క లెక్కతో దు:ఖీలే అంటారు. చివరి జన్మలో
కూడా దు:ఖీగా అవ్వలేదు కదా! శంఖం ఊది రెండు రొట్టెలు అడుక్కునే వారిగా లేరు కదా!
అందువలనే చెప్పాను - పురుషార్ధం యొక్క సమయం చాలా తక్కువ మరియు ప్రాప్తి యొక్క
సమయం చాలా ఎక్కువ. ప్రాప్తి ఎంత ఉన్నతమైనది, ఎంత సమయం లభిస్తుంది - ఇది స్మృతిలో
ఉంటే స్థితి ఏవిధంగా ఉంటుంది? శ్రేష్టంగా అయిపోతుంది కదా! కనుక సేవాధారిగా
అవ్వటం అంటే మొత్తం కల్పం ఫలం తినడానికి అధికారిగా అవ్వటం. సంగమయుగం అంతా సేవ
చేస్తూనే ఉండాలా అని ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకంటే ఫలం తినే సమయంలో మొత్తం
అంతా ఫలం తింటూనే ఉండాలా అనరు కదా! ఇప్పుడైతే లభిస్తుంది అని స్మృతి ఉంది కదా!
ఒకటికి లక్ష రెట్లు తయారవుతుంది అంటే లెక్క కూడా ఉంటుంది కదా! సేవాధారిగా అవ్వటం
అంటే మొత్తం కల్పానికి సదా సుఖీగా అవ్వటం. టీచర్స్ అనండి లేక సేవాధారులు అనండి
వీరికి తక్కువ భాగ్యం కాదు, ఎందుకంటే శ్రమకు వేలరెట్లు ఫలం లభిస్తుంది. మరియు
ఇది కూడా శ్రమయా ఏమిటి? ఇక్కడ కూడా విద్యార్థులకు దాదీ, దీదీ అయిపోతున్నారు,
బిరుదు అయితే లభిస్తుంది కదా! 10 సంవత్సరాల నుండి ఉన్న విద్యార్థి అయినా కానీ
రెండు సంవత్సరాలలో టీచర్ అయిన వారిని దాదీ, దీదీ అంటారు. ఇక్కడ కూడా ఉన్నత
స్థితిలో చూస్తున్నారు కదా! గౌరవం ఇస్తున్నారు కదా! ఒకవేళ సత్యమైన సేవాధారి
అయితే ఇక్కడ కూడా గౌరవం లభించడానికి యోగ్యంగా అవుతారు. ఒకవేళ కల్తీ కలిస్తే
ఈరోజు దాదీ, దీదీ అంటారు, రేపు మరలా మీ స్థితి గురించి చెప్తారు కూడా. సేవ కల్తీ
అయ్యి చేస్తే గౌవరం కూడా కల్తీ అయినదే లభిస్తుంది. అందువలన సేవాధారి అంటే బాబా
సమానంగా ఉండాలి. మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కం అన్నింటిలో పూర్తి స్టాంప్
వేయించుకునేవారు. పూర్తిగా అడుగుపై అడుగు వేసేవారు. కనుక ఏమని భావిస్తున్నారు?
ఈవిధమైన గ్రూప్ కదా? టీచర్స్ సదా సహజయోగులు కదా! టీచర్సే శ్రమ యొక్క అనుభవం
చేసుకుంటే విద్యార్ధుల పరిస్థితి ఏవిధంగా ఉంటుంది?