సత్యమైన హోలీ ఏవిధంగా జరుపుకోవాలి?
ఈరోజు నిశ్చింతరాజ్యం యొక్క చక్రవర్తి తన
నిశ్చింతరాజ్యంలోని యజమానులను కలుసుకునేటందుకు వచ్చారు. ఈ యజమానులను చూసి బాప్
దాదా కూడా సంతోషిస్తున్నారు - ప్రతి ఒక బిడ్డ యజమానిగా అయ్యారు. సంగమయుగానికి,
మూలవతనానికి, స్వర్గానికి మూడింటికి యజమానులు. బాప్ దాదా ఈ యజమానులకు ఈరోజు హోలీ
శుభాకాంక్షలు ఇస్తున్నారు. రంగులు చల్లుకునే హోలీ శుభాకాంక్షలు కాదు. కాని హాలి
అంటే (అయిపోయారు), అందరు బాబా వారిగా అయిపోయారు. అయిపోయారు కదా? ఏమి పాట
పాడుతున్నారు? బాబా వారిగా అయిపోయాము అనే పాట ఎవరైతే బాబా వారిగా అయిపోయారో
వారికే హోలీ శుభాకాంక్షలు. అవుతారా లేక అయిపోయారా? ఏమంటారు? ఎప్పుడైతే హోలీ అంటే
జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి బాబా వారిగా అయిపోతారో అప్పుడే సంతోషం
యొక్క పిచికారీ చేసుకోగలరు. రంగులు పిచికారీ చేసుకుంటారు కదా! మీ పిచికారీతో
ఎన్ని ధారలు వస్తాయి? ఈరోజులలో ఒకే పిచికారితో రకరకాల రంగులు కూడా వేస్తున్నారు.
ఆ రంగు అయితే అంటుకుంటుంది మరలా తొలగిపోతుంది. ఆ రంగులు అంటుకుంటే వస్త్రాలు
లేదా ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు కానీ మీ రంగు ఎంత శ్రేష్టమైనది మరియు
ప్రియమైనది. మీ సంతోషం యొక్క పిచికారి మానవులని ఎంతో పరివర్తన చేసి దేవాత్మగా
తయారుచేస్తుంది.
1. నేను శ్రేష్ఠాత్మను. ఇది ఒక సంతోష ధార. అలాగే నేను
విశ్వ యజమాని యొక్క సంతానాన్ని, నేను సృష్టి ఆది, మధ్య అంత్యం యొక్క
జ్ఞానసాగరుడిని, ఉన్నతోన్నతమైన బాబాతో పాటు వేదికపై నాకు కూడా ఉన్నతోన్నతమైన
పాత్ర ఉంది ... ఇలా మీ పిచికారిలో ఎన్ని సంతోషధారలు ఉన్నాయి? ఇలా సంతోషం యొక్క
పిచికారి ద్వారా రంగులు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు కదా!
2. సర్వప్రాప్తుల ధార యొక్క పిచికారి. ఆత్మ మరియు
పరమాత్మ కలయిక యొక్క ఆత్మిక ప్రేమ ఇలా ఇంకా ఆలోచించండి. ఇవి సాధారణమే.
3. సర్వశక్తుల యొక్క పిచికారి, విదేశీయులు పిచికారి
ఎప్పుడైనా చూసారా? జ్ఞానం యొక్క అలౌకిక పిచికారి అయితే చూసారు కదా! మంచిది
4. జ్ఞానం యొక్క ముఖ్యమైన పాయింట్స్ అనే పిచికారితో
హోలీ జరుపుకోవటం అంటే దేవాత్మగా అవ్వటం. గోపీవల్లభుడు గోప గోపికలతో ఒకరోజు హోలీ
జరుపుకోవటం లేదు, సంగమయుగం యొక్క ప్రతి రోజు హోలీయే. సంగమయుగంలో హోలీ మరియు
సత్యయుగంలో హాలిడే. ఇప్పుడు హాలిడే జరుపుకోకూడదు. ఇప్పుడు శ్రమ కూడా ప్రేమతో
చేస్తున్న కారణంగా హాలిడే యొక్క అనుభూతి చేయిస్తుంది, బాప్ దాదా పిల్లల యొక్క
ఒక దృశ్యాన్ని పై నుండి చూసారు. శ్రమ యొక్క దృశ్యాన్ని చూసారు. (క్రొత్త హాల్
తయారు అవుతుంది. అక్కడ అన్నయ్యలు రోజు రాళ్ళు ఎత్తుతున్నారు) మందిరంలో
పూజింపబడేవారు, ప్రకృతి కూడా దాసీ అయ్యి వారికి సేవ చేస్తుంది, అటువంటి వారు
ఇప్పుడు రాళ్ళు ఎత్తుతున్నారా అని బాబా కూడా పిల్లల యొక్క మాల స్మరణ
చేస్తున్నారు. బాబాపై ప్రేమ కారణంగా శ్రమ అని అనిపించదు. ఇది మా పని, మా ఇంటి
పని, యజ్ఞ సేవ అని భావించాలి. బాప్ దాదాపై ప్రేమ ఉంది కనుక శ్రమ కూడా ఒక ఆటలా
అనిపిస్తుంది కదా! సంగమయుగంలో ఎంత శ్రమ చేస్తే అంత స్వతంత్రంగా ఉంటారు. ఎందుకంటే
శరీరం మరియు బుద్ధి ఎంత బిజీగా ఉంటాయో అంత వ్యర్థసంకల్పాల నుండి ముక్తిగా ఉంటారు.
అందువలనే సంగమయుగంలో శ్రమ చేయడమే హాలిడే అని చెప్పాను. పిల్లలను చూసి బాప్ దాదా
పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. ఇప్పుడు హాల్ తయారు చేయడానికి రాళ్ళు
ఎత్తుతున్నారు. ఒక రాయి వేల రెట్లు వృద్ధి అయ్యి వజ్రాలు, రత్నాలుగా అవుతాయి.
మీ మహల్ లో ఈ వజ్రాలు, రత్నాలు ఎంతగా అలకరించబడి ఉంటాయి! అక్కడ మహల్ తయారు
చేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు చేసిన శ్రమకి అక్కడ తయారైపోయిన మహల్ లభిస్తుంది.
బాప్ దాదా చూస్తున్నారు - పిల్లలు చాలా, చాలా సంలగ్నతతో సేవ యొక్క సంలగ్నతలో
నిమగ్నం అయ్యి ఉన్నారు. ఇప్పుడు హోలీ ఏవిధంగా జరుపుకోవాలో అర్థమైందా!
మొదట కాల్చాలి తర్వాత జరుపుకోవాలి. ఒక రోజు కాలుస్తారు,
రెండవరోజు జరుపుకుంటారు. మీరు కూడా ఒకరోజు హోలీ అంటే జరిగిపోయిందేదో
జరిగిపోయింది అంటున్నారు. అంటే వెనుకటివన్నీ కాల్చేస్తున్నారు. ఆ తర్వాతే మేము
బాబా వారిగా అయిపోయాము అనే పాట పాడుతున్నారు. ఇదే సంతోషంలో జరుపుకోవటం.
స్మృతిచిహ్నం యొక్క హోలిలో కూడా దేవీదేవతలను చాలా సంపూర్ణంగా తయారుచేస్తారు.
అన్నింటికంటే విశేషంగా మస్తకంలో లైట్ వెలుగుతున్నట్లు చూపిస్తారు. ఇది మీ స్మృతి
చిహ్నం. ఎప్పుడైతే మస్తకం యొక్క జ్యోతి వెలుగుతుందో అప్పుడు దేవతగా అయిపోతారు.
బాబా వారిగా అయిపోయారు అంటే దేవతగా అయిపోతారు. మీకు ఇది అనుభవం, వారు మీ
అనుభవాన్ని స్మృతిచిహ్న రూపంలో జరుపుకుంటున్నారు. కనుక మీరు హోలీ ఏవిధంగా
జరుపుకున్నారు మరియు వారు ఏమి చేస్తారు? యదార్థం ఏమిటి మరియు స్మృతిచిహ్నం ఏమిటి
అనేది అర్థమైందా! (పెద్ద, పెద్ద వారు కూడా మహామూర్ఖ సమ్మేళనం జరుపుకుంటారు) ఇది
కూడా సత్యమే. ఎందుకంటే బాబా వచ్చారు అయినా కానీ పెద్ద, పెద్ద వారు మహామూర్ఖులుగా
ఉన్నారు. ఎంత గొప్పవారో అంత మూర్ఖులుగా ఉన్నారు అంటే బాబానే తెలుసుకోవటం లేదు
అంటే మహామూర్ఖులుగా అయినట్లే కదా! చూడండి పెద్ద - పెద్దనేతలు (అధికారులు) బాబాని
తెలుసుకుంటున్నారా? అంటే మహామూర్ఖులు అయ్యారు కదా!ఇప్పుడు కల్పపూర్వం యొక్క తమ
మహామూర్ఖత్వానికే స్మృతిచిహ్నం జరుపుకుంటున్నారు. మొత్తం వ్యతిరేక కార్యం
చేస్తున్నారు. నన్ను తెలుసుకోండి అని బాబా చెప్తుంటే, వారు బాబాయే లేరు అని
చెప్తున్నారు. కనుక వ్యతిరేకం అయ్యింది కదా! మీరు బాబా వచ్చారు అని చెప్తున్నారు,
వారు అది జరగదు అంటున్నారు. వ్యతిరేకిస్తున్నట్లే కదా! ఇలా ఈ పండుగ గురించి చాలా
విస్తారం చేసేసారు. కానీ సారం ఏమిటంటే - బాబా మరియు పిల్లల యొక్క మంగళ కలయిక
యొక్క స్మృతిచిహ్నం. సంగమయుగమే మంగళ కలయిక యొక్క యుగం. భారతదేశంలో ఉండే
పిల్లలకైతే ఈ విషయాల గురించి తెలుసు, ఈరోజు విదేశం నుండి వచ్చిన పిల్లలకు
చెప్తున్నాను. ఎందుకంటే రాజ్యం అయితే భారతదేశంలోనే చేయాలి కదా! అమెరికాలో చేయరు
కదా! భారతదేశం యొక్క విషయాలు తప్పకుండా వింటారు, అర్థం చేసుకుంటారు కదా! మీ
విషయాలను ఎలా తయారు చేసేశారో, చాలా తేడా వచ్చింది కదా!
ఈ విధంగా హోలీ చేసుకుని హోలీ యొక్క పాట పాడేవారికి సదా
భిన్న, భిన్న పిచికారీల ద్వారా ఆత్మిక రంగు వేసుకునేవారికి, సదా బాబాతో మంగళ
కలయిక జరుపుకునే బ్రాహ్మణుల నుండి దేవతగా అయ్యే నిశ్చింతా చక్రవర్తులకు బాప్
దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
మురళీలు అయితే చాలా విన్నారు. ఇక వినడానికి ఏమైనా
ఉన్నాయా? ఇప్పుడు కలయిక మరియు జరుపుకోవటం. వినటం మరియు వినిపించడం చాలా
అయిపోయింది. సాకార రూపంలో వినిపించారు, అవ్యక్తరూపంలో ఎన్నో వినిపించారు, ఒక
సంవత్సరం కాదు 13 సంవత్సరాలు వినిపించారు. చిన్న పిల్లలు జరుపుకున్నటువంటి
దృశ్యం కూడా చూసాను. చాలా ఎక్కువగా నవ్వుకున్నారు, ఆడుకున్నారు. బాప్ దాదా
నవ్వుతూ ఉన్నారు. సదా అలాగే నవ్వుతూ, నాట్యం చేస్తూ ఉండండి. కానీ అవినాశిగా
ఉండాలి. బాప్ దాదా సదా పిల్లలు సంతోషంగా ఉండటం చూసి వరదానం ఇస్తున్నారు -
అవినాశి భవ. కాళ్ళు అయితే అలసిపోతాయి. కానీ బుద్ధితో సంతోషంగా నాట్యం చేస్తూ
ఉంటారు. అవ్యక్త వతనవాసీ అయ్యి ఫరిస్తా డ్రెస్సులో నాట్యం చేస్తూ ఉంటే అవినాశిగా
మరియు నిరంతరం చేయగలరు. ఇది కూడా సంగమయుగం యొక్క స్వతంత్రత. మరలా ఇంకెప్పుడు
ఉండదు. అందువలన చాలా సంతోషంగా ఆడుకోండి, తినండి, ఆనందంగా ఉండండి కానీ అవినాశిగా
ఉండాలి అనే మాట కూడా స్మృతి ఉంచుకోండి.
మురళీ యొక్క సారం -
1. బాప్ దాదా స్థూలమైన రంగుల హోలీ యొక్క శుభాకాంక్షలు ఇవ్వటం లేదు, కానీ బాబా
వారిగా అయిపోయాము అనే దానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు.
2. సంతోషం యొక్క, ప్రాప్తుల యొక్క, సర్వశక్తుల యొక్క,
జ్ఞానం యొక్క, ముఖ్య పాయింట్స్ యొక్క పిచికారీ ద్వారా మీరు ఆడుకుంటూ దేవాత్మగా
అవుతున్నారు.
3. సీ ఫాదర్ (తండ్రిని చూడండి) మరియు ఫాలోఫాదర్ (తండ్రిని
అనుసరించండి). దీని ద్వారా ఎగిరేకళ యొక్క అనుభవం చేసుకుంటారు.