విశ్వరాజ్యాధికారిగా ఏవిధంగా తయారవుతారు?
ఈ రోజు బాప్ దాదా తన యొక్క కుడి భుజాలను చూస్తున్నారు.
బాబా యొక్క ఎన్ని భుజాలు అలసిపోని సేవలో నిమగ్నం అయ్యి ఉన్నారు అని చూస్తున్నారు.
ఒక్కొక్క భుజానికి ఎవరి విశేషత వారికి ఉంది. కుడి భుజాలు అంటే బాప్ దాదా యొక్క
సలహా ప్రకారం ప్రతి సంకల్పం, ప్రతి అడుగు వేసేవారు. బాబా యొక్క భుజాలుగా అయ్యారు.
అందువలనే బాప్ దాదా కూడా తన భుజాలను చూసి సంతోషిస్తున్నారు. కుడిభుజాలైన వారి
చేతిలో ఏమి ఉంది? రాజ్యభాగ్యం యొక్క గ్లోబ్ ఉంది. కృష్ణుని చేతిలో గ్లోబ్
ఉన్నట్లు చూపించిన చిత్రం కూడా చూసారు కదా! కుడి చేతిలో గ్లోబ్ చూపించారు. ఒక
కృష్ణుడే రాజ్యం చేస్తాడా ఏమిటీ! మీరందరు కూడా వెంట ఉంటారు కదా! కనుక అది మీ
అందరి చిత్రం. ఎందుకంటే ఇప్పుడే అధికారిగా అవుతున్నారు. ఇప్పటి అధికారి స్థితి
యొక్క సంస్కారం 21 జన్మలు నడుస్తుంది. ఇప్పుడు కూడా రాజుగా మరియు భవిష్యత్తులో
కూడా రాజుగా అవుతున్నారు. ఇప్పటి రాజ్యాధికారులే భవిష్యత్తులో రాజ్యాధికారిగా
అవుతారు. కనుక ఇప్పటి రాజ్యాధికారిగా అయ్యారా? రాజ్య పరివారం అందరు మంచిగా
నడుస్తున్నారా? మీ అందరి రాజ్యం యొక్క పరిస్థితి ఏవిధంగా ఉంది? అందరి
రాజ్యపరివారం లా అండ్ ఆర్డర్లో (నియమం మరియు ఆజ్ఞ) నడుస్తుందా? ఇక్కడే ఒకవేళ
అప్పుడప్పుడు రూలర్స్ గా (పరిపాలకులుగా) అయితే ఇక అక్కడ ఏమి చేస్తారు? అక్కడ
కూడా ఒకటి, రెండు జన్మలకు రాజుగా అవుతారు. 21 జన్మలకు రాజుగా అవ్వాలి మరి ఇక్కడ
అప్పుడప్పుడు రాజ్యం చేసేవారిగా ఎందుకు అవుతున్నారు? ఇక్కడి సంస్కారమే అక్కడ
నడుస్తుంది. అందువలన సదా రాజులుగా కావాలి. ఆస్ట్రేలియా నివాసీయులు అందరితో పరుగు
పెడుతున్నారు కదా? ఏ నెంబర్ వరకు చేరుకున్నారు? (హృదయసింహాసనం వరకు) దానిలో కూడా
ఏ నెంబర్ లో ఉన్నారు? అయినప్పటికీ పురుషార్థం బాగా చేస్తున్నారు.
మర్యాదాపురుషోత్తములుగా అయ్యే సంస్కారాన్ని నింపుకునే లక్ష్యంలో మంచిగా ఉన్నారు.
సత్యమైన సీతలుగా అయ్యి రేఖ లోపల ఉండే లక్ష్యంలో మంచి ధైర్యవంతులుగా ఉన్నారు.
రావణుని యొక్క ఆకర్షణలోకి రావటం లేదు, రావణుని యొక్క బహురూపాలు బాగా తెలిసాయా?
రావణుని యొక్క జ్ఞానసాగరులుగా కూడా అయిపోయారా? ఙ్ఞానం తక్కువగా ఉంటేనే రావణుడు
తనవారిగా చేసుకుంటాడు. ఙ్ఞానవంతుల ఎదురుగా మరియు దగ్గరకు కూడా రావణుడు రాలేడు.
స్వర్ణిమ రూపంలోనైనా, వజ్రతుల్యరూపంలోనైనా రాలేడు. ఆస్ట్రేలియాలో రావణుడు
వస్తున్నాడా? యుద్ధం చేయడానికి కాదు కాని నేర్పించడానికి వస్తున్నాడు కదా!
రావణుడికి కూడా అర్ధకల్పం నుండి మిత్రులైన మీరంటే చాలా ఇష్టం. అందువలననే
వదలాలనుకోవటం లేదు. మరి ఏం చేస్తారు? అతని యొక్క మితృత్వం నిలబెట్టుకుంటారా? (నిలబెట్టుకోము)..
ఇప్పుడు రావణుడు 10 భుజాలతో మీకు 10 రకాలుగా సేవ
చేస్తాడు. ఇన్ని భుజాలు సేవ కొరకే కదా! 10 భుజాలతో వేగంగా, చాలా త్వర త్వరగా
మరియు చాలా సుందరాతి సుందరంగా మీ కొరకు రాజ్యాన్ని తయారుచేస్తాడు. ఎందుకంటే
రావణుడికి కూడా అర్థమైంది - ఇప్పుడు నేను రాజ్యం చేయలేను కానీ రాజ్యం తయారుచేసి
ఇవ్వాలని అని. ఏదైనా కష్టమైన పని ఉంటే పది వ్రేళ్ళ బలంతో ఈ పని చేయాలి అంటారు
కదా! అలాగే ప్రకృతి యొక్క పంచతత్వాలతో పాటు, పంచవికారాలు కూడా పరివర్తన అయ్యి
పంచవిశేష దివ్యగుణాల రూపంలో మీ సేవకు ఉపయోగపడతాయి. అయితే రావణునికి ధన్యవాదాలు
చెప్పాలి కదా! రావణుని యొక్క చాలా పెద్ద సేన మీ కోసం కష్టపడుతున్నారు. ఎంత మందో
చూసారా? విదేశాలలో విజ్ఞానం ద్వారా ఎన్ని తయారీలు చేస్తున్నారు? అవన్నీ ఎవరికోసం?
మా కోసమే అని చెప్పండి..
ఆస్ట్రేలియా వారు ధైర్యం అనే గుణాన్ని చాలా మంచిగా
చూపించారు. అందువలనే బాప్ దాదా విశేషంగా ఆస్ట్రేలియా వారితో విహారయాత్ర
చేస్తున్నారు. ప్రతి ఒక్క స్థానానికి ఒక విశేషత ఉంటుంది. ఎవరైతే ఇతరులకు అవకాశం
ఇచ్చారో అలా అవకాశం ఇచ్చినవారికి బాప్ దాదా విశేషంగా ఒక బహుమతి ఇస్తున్నారు. అది
ఏమిటి? విశేషంగా ఒక అలంకరణ ఇస్తున్నారు - సదా శుభచింతకులుగా ఉండండి అనే చందనం
పెడుతున్నారు. కిరీటంతో పాటు ఈ చందనం తప్పనిసరిగా ఉంటుంది. ఎలాగైతే ఆత్మ బిందువు
మెరుస్తూ ఉంటుందో అదేవిధంగా మస్తకం మధ్యలో ఈ చందనం యొక్క బిందువు కూడా మెరుస్తూ
ఉంటుంది. ఈ గ్రూప్ అంతా శుభచింతక గ్రూప్ కదా! పరచింతనకు వీడ్కోలు ఇచ్చేవారే
శుభచింతకులు. ఎప్పుడైనా ఏదైనా విషయం ఎదురుగా వచ్చినా శుభచింతక మణి యొక్క బహుమతి
సదా స్మృతి ఉంచుకోండి. అప్పుడు ఆస్ట్రేలియాలో సదా శక్తిశాలి తరంగాలు, శక్తిశాలి
సేవ మరియు సదా ఫరిస్తాల సభ కనిపిస్తుంది. శక్తులు మరియు పాండవుల యొక్క సంఘటన
కూడా బావుంది. సేవ యొక్క ఉత్సాహం కూడా బావుంది. సేవ అయితే అందరు చేస్తున్నారు
కానీ సఫలతా స్వరూప సేవ అంటే ఆ సేవలో ఏవిధమైన సంస్కారం, సంకల్పం యొక్క విఘ్నం
ఉండకూడదు. ఈ విషయాల వలనే సేవ యొక్క వృద్ధిలో సమయం పడుతుంది. అందువలన సదా
నిర్విఘ్న సేవాధారిగా అవ్వండి. ఆస్ట్రేలియా నివాసీలు ఎన్ని సేవాకేంద్రాలు
తెరిచారు? భలే ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ సేవ యొక్క ఉత్సాహం మంచిగా ఉంది. మా
సేవ అని భావించి చేయండి. ఇది జర్మనీ వారి సేవ, ఇది ఆస్ట్రేలియా వారి సేవ అని
కాదు. బాబా యొక్క సేవ లేదా విశ్వం యొక్క సేవ మాది అని భావించండి. దీనినే బేహద్
వృత్తి అంటారు. బేహద్ వృత్తి కలిగిన ఆత్మలు కదా! ఎక్కడికి వెళ్ళినా మీదే సేవ.
విశ్వకళ్యాణకారులు కదా! ఆస్ట్రేలియాలో లేదా పరస్పరంలో సేవ చేసేవారు కాదు.
నిమిత్తంగా సేవ యొక్క వృద్ధి అయిన కారణంగా నియమం తయారు చేసుకున్నారు. మంచిగా
బాబా యొక్క సేవ సంభాళించడానికే నిమిత్తంగా చేసారు. ఇప్పుడు ఇక ముందు ఏమి చేయాలి?
సేవాకేంద్రాలు కూడా తెరిచారు, గీతాపాఠశాలలు కూడా తెరిచారు. ఇప్పుడు ఏమి చేస్తారు?
(సూక్ష్మసేవ) సూక్ష్మ సేవతో పాటు ఇప్పుడు ఇంకొక కార్యం కూడా చేయాలి. ఇప్పటి వరకు
ఆస్ట్రేలియా నుండి ఏ విధమైన వి.ఐ.పిని తీసుకురాలేదు. ఏవిధమైన వి.ఐ.పిని తీసుకు
రావాలంటే భారతదేశం యొక్క ప్రభుత్వం వారిని స్వాగతం చేయాలి. గవర్నమెంట్ వరకు
ధ్వని వెళ్ళడం అంటే ధ్వని ప్రసిద్ది అవ్వటం. ఇప్పుడు విదేశంలో ఏ స్థానమైనా ఈ
విధమైన సేవ చేయాలి. వద్దనుకున్నా కానీ జబర్దస్తీగా అయినా భారతవాసీయులకు ధ్వని
చేర్చాలి. కుంభకర్ణుని యొక్క చిత్రంలో చెవిలో అమృతం పోస్తున్నట్లు చూపిస్తారు
కదా! కనుక ఈ విధమైన సేవ జరిగినప్పుడే విదేశం యొక్క ధ్వని భారతదేశం వరకు
చేరుకున్నట్లు. ఇప్పుడు చిన్న చిన్న పాటల వరకు చేరుకుంది ఇప్పుడు ఈల మ్రోగించాలి.
అప్పుడు బాప్ దాదా మీ అందరికీ చాలా మంచి బహుమతి ఇస్తారు. అప్పుడే జయ - జయకారాల
యొక్క బాజాలు మ్రోగుతాయి లేకపోతే భారతదేశం యొక్క కుంభకర్ణులు అంత సహజంగా
మేల్కొనరు. కనుక ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా! విదేశాలలో ప్రతి స్థానంలో ఇంత
ధైర్యం కలిగిన వారు ఉన్నారు. ఈసారి నైరోబీ పార్టీ వారు చాలా బాగా ప్రయత్నం
చేసారు, శ్రమ బాగా చేశారు. అఫీషియల్ ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు మంచిగా ధ్వని
వ్యాపిస్తుంది. వ్యక్తిగతమైన ప్రోగ్రామ్ తయారుచేస్తే ధ్వని వ్యాపించదు. మీరు
ఎప్పుడైతే ఈ విధంగా సేవ చేస్తారో అప్పుడే మహాయజ్ఞం యొక్క సమాప్తి సమారోహం
చేయగలరు. ఇప్పుడైతే ప్రారంభం చేసారు.
శక్తిసేన తయారైపోయినట్లు కనిపిస్తున్నారు. ముఖం మరియు
నడవడిక శక్తిరూపంగా కనిపిస్తున్నాయి. యూనిఫాం కూడా మంచిగా ఉంది. అందరి బ్యాడ్జీ
కూడా బాగా మెరుస్తుంది. శ్రమ చాలా బాగా చేసారు. ఆస్ట్రేలియా వారికి ఆదిలో ఎంతగా
స్వతంత్రత యొక్క సంస్కారం ఉండేదో ఇప్పుడు అంతగానే మర్యాదలలో కూడా మంచిగా
ఉంటున్నారు. ఇప్పుడు బాబా యొక్క మధురమైన బంధనలోకి వచ్చేసారు. అందరు బాగున్నారు.
నగ పూర్తిగా తయారైన తర్వాత దానిని స్వరూపంలోకి తీసుకువస్తారు. అదేవిధంగా ఇక్కడ
కూడా నగ మంచిగా మారిపోయింది, పాలిష్ కూడా అయిపోయింది. పాండవులు కూడా మంచి
సేవాధారులుగా ఉన్నారు. గౌరవం ఇవ్వాలి మరియు గౌరవం తీసుకోవాలి. ఈ మంత్రం ద్వారా
సహజంగా సేవ యొక్క వృద్ధి జరుగుతుంది. ఇప్పుడు గౌరవం ఇవ్వటం కూడా నేర్చుకున్నారు.
తీసుకోవటం కూడా నేర్చుకున్నారు. గౌరవం ఇవ్వడమే తీసుకోవటం. సదా ఇది స్మృతి
ఉంచుకోండి గౌరవం అనేది కేవలం తీసుకోవటం ద్వారా లభించదు, ఇవ్వటం ద్వారానే
లభిస్తుంది. అప్పుడే పరస్పరం స్నేహం మరియు ఐక్యత మంచిగా ఉంటాయి. ఈ మంత్రం
పక్కాగా స్మృతి ఉంది కదా!
ఈ మురళీ యొక్క సారం -
1. ఇప్పటి అధికారిస్థితి యొక్క సంస్కారం 21 జన్మల వరకు
నడుస్తుంది. ఇప్పటి రాజ్యా ధికారియే విశ్వరాజ్యాధికారిగా అవుతారు.
2. ఏవిధంగా అయితే రాత్రి పగలు కలిసి ఉండవో అదేవిధంగా
మాస్టర్ ఙ్ఞానసాగరులు మరియు బంధన కలిసి ఉండవు. జ్ఞానస్వరూపం యొక్క శక్తితో
బంధనను తొలగించుకోండి.