ఈ సహజమార్గంలో శ్రమకి కారణం మరియు నివారణ.
ఈరోజు డబుల్ విదేశీ పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు.
డబుల్ విదేశీయులు డబుల్ భాగ్యశాలి ఆత్మలు ఎందువలన? 1. బాప్ దాదాను
తెలుసుకున్నారు మరియు వారసత్వానికి అధికారిగా అయ్యారు 2. చివరిలో వచ్చినా వేగంగా
వెళ్ళి మొదట వచ్చే నమ్మకధారులు. చివరిలో వచ్చినవారు ఎందుకు భాగ్యశాలురు అంటే
అన్ని తయారైపోయిన తర్వాత వచ్చారు. మొట్టమొదటి పిల్లలు మననం చేసారు, శ్రమ చేసారు,
వెన్న తీసారు మరియు మీరందరు వెన్న తినే సమయంలో వచ్చారు. మీకు చాలా, చాలా సహజం
ఎందుకంటే మొదటి పిల్లలు మార్గాన్ని దాటుతూ అనుభవీగా అయిపోయారు మరియు మీరందరు
అనుభవీల యొక్క సహయోగం ద్వారా సహజంగానే గమ్యానికి చేరుకున్నారు. కనుక డబుల్
భాగ్యశాలురు కదా? డబుల్ భాగ్యం అయితే డ్రామానుసారం లభించింది, ఇప్పుడు ఇక ఏమి
చేయాలి?
ఎలా అయితే మహారథి నిమిత్త ఆత్మలు అనుభవాల ద్వారా మీ
అందరికీ సేవ చేసారో అదేవిధంగా మీరందరు కూడా అనుభవాల ఆధారంగా అనేకులను అనుభవిగా
చేయాలి. అనుభవం వినిపించటం అన్నింటికంటే సహజమైనది. జ్ఞానం యొక్క పాయింట్స్ ఏవైతే
ఉన్నాయో అవి కేవలం పాయింట్స్ గా కాదు కానీ ప్రతి పాయింట్ యొక్క అనుభవిగా అవ్వాలి.
ప్రతి పాయింట్ యొక్క అనుభవం వినిపించడం ఎంత సహజం? ఇంత సహజంగా అనుభవం
చేసుకుంటున్నారా లేదా కష్టం అనిపిస్తుందా? 1. అనుభవం ఆధారంగా సహజం అనిపిస్తుంది.
2. ఆది నుండి అంతిమం యొక్క ఙ్ఞానం బాప్ దాదా ఒక కథ రూపంలో వినిపిస్తారు. కనుక
కథ వినిపించడం మరియు వినటం చాలా సహజంగా అనిపిస్తుంది. 3. బాబా ఇప్పుడు మీకు
ఏదైతే వినిపిస్తున్నారో అవి సర్వాత్మలు మొదటిసారి వినలేదు కానీ అనేకసార్లు
విన్నారు, దానిని మరలా రిపీట్ చేస్తున్నారు. ఏ విషయం అయినా రిపీట్ చేయడంలో,
వినడంలో, వినిపించడంలో చాలా సహజంగా ఉంటుంది. క్రొత్త విషయం కష్టం అనిపిస్తుంది,
కానీ అనేకసార్లు విన్న విషయం వినిపించడంలో చాలా సహజంగా ఉంటుంది. స్మృతిలో చూడండి
- ఎంత సమీపమైన, ప్రియమైన స్మృతి. సమీప సంబంధీకులను స్మృతి చేయటం కష్టం అనిపించదు.
అవసరం లేనప్పటికీ స్మృతి వస్తూ ఉంటారు. అలాగే ప్రాప్తిని చూడండి - ప్రాప్తి
ఆధారంగా స్మృతి చేయటం కూడా చాలా సహజం. జ్ఞానం కూడా చాలా సహజం మరియు స్మృతి కూడా
చాలా సహజం. అతి గారాబ పిల్లలైన మీ కోసం ఇప్పుడు జ్ఞాన -యోగాలు ఇంకా సహజం
అయిపోయాయి - జ్ఞానం 7 రోజులలో పూర్తి అయిపోతుంది మరియు యోగశిబిరం 3 రోజులలో
పూర్తి అయిపోతుంది అంటే సహజమే కనుక సాగరాన్ని బిందెలోకి ఇమిడ్చేసారు. సాగరాన్ని
ఎత్తటం కష్టం కానీ బిందెను ఎత్తడం కష్టం కాదు. మీకైతే సాగరాన్ని బిందెలో ఇమిడ్చి
కేవలం బిందె ఇచ్చారు. అంతే, రెండు మాటలలో జ్ఞానం మరియు యోగం రెండు వచ్చేస్తాయి.
మీరు మరియు బాబా, కనుక యోగం కూడా వచ్చింది మరియు జ్ఞానం కూడా వచ్చింది. రెండు
మాటలు ధారణ చేయటం ఎంత సహజం! అందువలనే మీ యొక్క బిరుదు - సహజరాజయోగి, ఏవిధమైన
పేరు ఉందో ఆవిధమైన అనుభవం చేసుకుంటున్నారా? లేక దీనికంటే ఇక ఏదైనా సహజంగా
ఉంటుందా? కష్టంగా ఎందుకు అనిపిస్తుంది. అంటే దానికి కారణం మీ యొక్క బలహీనతయే.
ఏదోక పాత సంస్కారం సహజమార్గంలో బంధనగా అయ్యి విఘ్నం వేస్తుంది మరియు శక్తి లేని
కారణంగా రాయిని తొలగించాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అలా తొలగిస్తూ -
తొలగిస్తూ ఇంకా బలహీనంగా అయిపోతున్నారు. కానీ సహజమైన పద్దతి ఏమిటి? రాయిని
తొలగించడం కాదు, దానిని దాటేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇది ఎందుకు జరిగింది? ఇలా
జరగకూడదు? చివరికి ఇది ఎంతవరకు ఉంటుంది? ఇది చాలా కష్టం ఇలా ఎందుకు? ఇలా
వ్యర్థసంకల్పాల యొక్క రాళ్ళను తొలగించాలి. ఒకే మాట స్మృతిలో ఉండాలి - డ్రామా. ఈ
ఒక్క మాట స్మృతి వస్తే హైజంప్ చేయగలరు. దానిలో అయితే కొన్ని రోజులు, నెలలు
పడుతుంది. కానీ దీనిలో ఒక సెకను పడుతుంది. కనుక ఇది మీ యొక్క బలహీనత కానీ
జ్ఞానానిది కాదు.
రెండవ బలహీనత - సమయానికి ఆ పాయింట్ టచ్ అవ్వటం లేదు.
పాయింట్స్ బుద్ధిలో లేదా డైరీలలో చాలా ఉంటాయి. కానీ సమయం అనే డైరీలో ఆ సమయంలో ఆ
పాయింట్ కనిపించట్లేదు. దీని కొరకు జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్స్ రోజు రివైజ్
చేసుకుంటూ ఉండండి. అనుభవంలోకి తీసుకువస్తూ ఉండండి, పరిశీలన చేసుకుంటూ ఉండండి
మరియు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటూ పరివర్తన చేసుకోండి. అప్పుడు ఇక సమయం
వ్యర్థం అవ్వదు మరియు కొద్ది సమయంలోనే చాలా అనుభవాలు చేసుకుంటారు. సదా మిమ్మల్ని
మీరు మాస్టర్ సర్వశక్తివాన్గా అనుభవం చేసుకుంటారు అర్థమైందా! ఎప్పుడు కూడా
వ్యర్థసంకల్పాలు అనే సుత్తితో సమస్యలనే పర్వతాలను పగులగొట్టకండి. చక్రవర్తులుగా
అవ్వండి, నిశ్చింతా చక్రవర్తులుగా అవ్వండి. ఇక సమస్య అనే మాటే ఉండదు. సమస్య
యొక్క పరిష్కారంలో సమయం వ్యర్థం అవ్వదు. ఈ పాత సంస్కారమే మీకు దాసీగా అయిపోతుంది,
యుద్ధం చేయదు. కనుక చక్రవర్తిగా అవ్వండి - సింహాసనాధికారి అవ్వండి - కిరీటధారి
అవ్వండి తిలకధారి అవ్వండి.
ప్రశ్న - బాప్ దాదా ప్రతి స్థానం యొక్క ఫలితం దేని
ఆధారంగా చూస్తారు?
జవాబు - ఆ స్థానం యొక్క వాయుమండలం లేదా పరిస్థితి
ఏవిధంగా ఉంది? దీని ఆధారంగా బాప్ దాదా ఫలితం చూస్తారు. ఒకవేళ ఎండిపోయిన భూమి
నుండి లేదా ఎడారి భూమి నుంచి రెండు పువ్వులు వచ్చినా కాని 100 పూలకంటే ఎక్కువ.
బాబా రెండు అని చూడటం లేదు. రెండు కూడా 100 పూలతో సమానంగా చూస్తున్నారు. అంటే
ఎంత చిన్న సెంటర్ అయినా, చిన్నదిగా భావించకూడదు. అక్కడక్కడ క్వాలిటి (లక్షణాలు
కల ఆత్మలు) ఉంటుంది - అక్కడక్కడ క్వాంటిటీ (సంఖ్యలో ఎక్కువ ఆత్మలు) ఉంటుంది.
పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సఫలత మీ యొక్క జన్మసిద్ధ అధికారం.
ప్రశ్న - ఏ రెండు స్వరూపాలతో సేవ చేయటం ద్వారా సేవ
వృద్ధి అవుతూ ఉంటుంది?
జవాబు- రూపం మరియు గుణం రెండు స్వరూపాలతో సేవ చేయండి.
దృష్టి ద్వారా మరియు వాచా ద్వారా కూడా సేవ చేయండి. ఒకే సమయంలో రెండు రూపాల
ద్వారా సేవ చేయటం ద్వారా డబుల్ ఫలితం వస్తుంది.