శ్రమని సమాప్తి చేసి నిరంతర యోగిగా అవ్వండి.
ఈరోజు మనోభిరాముడైన బాబా పిల్లల మనస్సు యొక్క సంలగ్నత
చూసి సంతోషిస్తున్నారు. ఈరోజు మనోభిరాముడు మరియు మనోహరమైన పిల్లల యొక్క కలయిక.
సన్ముఖంగా ఉన్నా, శరీరంతో దూరంగా ఉన్నా కానీ మనస్సుతో సమీపంగా ఉన్నారు. దూరంగా
ఉన్న పిల్లలు కూడా తమ మనస్సు యొక్క సంలగ్నతతో మనోభిరాముడికి సమీపంగా ఉన్నారు. ఈ
విధమైన మనోహరమైన పిల్లలు ఎవరైతే మనస్సుతో బాబా యొక్క పాట పాడుతూ ఉంటారో -
హద్దులేని పాట, హద్దు యొక్క పాట కాదు. ఆవిధమైన పిల్లలు ఇప్పుడు కూడా బాబా యొక్క
నయనాలలో ఇమిడి ఉన్నారు. వారికి కూడా బాప్ దాదా విశేషంగా స్మృతి యొక్క జవాబు
ఇస్తున్నారు.
పిల్లలందరు మనోభిరాముడైన బాబా యొక్క
హృదయసింహాసనాధికారులే అయినప్పటికీ నెంబర్ వారీ అని అంటారు కదా! మాలలో అందరు
పూసలే కానీ ఎక్కడ 8 రత్నాలు మరియు ఎక్కడ 16 వేల యొక్క చివరి పూస! తేడా ఉంది కదా!
ఇద్దరూ మణులే కానీ చాలా తేడా ఉంది. ఈ నెంబర్ కి ఆధారమైన ముఖ్య స్లోగన్ -
పవిత్రంగా మరియు యోగిగా అవ్వండి. 1. యోగం జోడించే యోగులు 2. సదా యోగంలో ఉండే
యోగులు 3. యోగం ద్వారా విఘ్నాలు, పాపాలు తొలగించుకునే శ్రమలో ఉండేవారు. ఎంత
శ్రమయో అంత ఫలం పొందేవారు. ఈరోజుల్లో ప్రపంచంలో చూస్తే - కొందరికి పూర్వజన్మలో
భక్తి ఆధారంగా చేసిన శ్రేష్ట కర్మల ఫలితంగా హద్దులోని రాజ్యవారసత్వం శ్రమ
లేకుండానే లభిస్తుంది. రాజ్యం అనేది వారికి వారసత్వంగా, అధికారికంగా లభిస్తుంది.
అందువలన రాజ్యస్థితి యొక్క నషా వారికి స్వతహాగా ఉంటుంది. నేను రాజకుమారుడిని,
నేను రాజుని అని స్మృతి చేయవలసిన అవసరం లేదు. స్వతహాగా స్మృతి ఉంటుంది మరియు
సంపత్తి ఉంటుంది. ఇది ఈ సమయంలో రాజుల యొక్క విషయం కాదు కానీ ద్వాపరయుగం యొక్క
ప్రారంభంలోని విషయం. సతోగుణీ భక్తి చేసే సమయంలోని విషయం. అదేవిధంగా నెంబర్ వన్
పిల్లలు స్వతహాగా యోగీజీవితంలో ఉంటారు. ప్రాప్తి యొక్క భండారా వారసత్వం ఆధారంగా
సదా నిండుగా ఉంటుంది. ఈరోజు సుఖం ఇవ్వాలి లేదా ఈ రోజు శాంతి ఇవ్వాలి అని శ్రమ
చేయరు. సంకల్పం యొక్క బటన్ నొక్కగానే ఖజానా తెరుచుకుంటుంది. సదా సంపన్నంగా
ఉంటారు అంటే యోగయుక్తంగా, యోగం జోడించే ఉంటారు.
రెండవ నెంబర్ వారు-యోగం జోడించేవారు. వారు ఎలా
ఉంటారంటే ఈరోజుల్లో వ్యాపారస్తులుగా ఉంటారు. అప్పుడప్పుడు చాలా సంపాదించుకుంటారు,
అప్పుడప్పుడు కొద్దిగా సంపాదించుకుంటారు. అయినప్పటికీ ఖజానా ఉంటుంది. సంపాదన
యొక్క సంతోషం మరియు నషా కూడా ఉంటుంది కానీ సదా ఏకరసంగా ఉండదు. అప్పుడప్పుడు
చూస్తే చాలా సంపన్న స్వరూపంగా ఉంటారు మరియు అప్పుడప్పుడు ఇప్పుడు ఇంకా కావాలి,
ఇప్పుడు ఇంకా కావాలి.... అనే సంకల్పం శ్రమలోకి తీసుకువస్తుంది. సదా సంపన్నంగా,
సదా ఏకరసంగా ఉండరు. సదా స్వయంతో సంతుష్టంగా ఉండరు. వీరు యోగం జోడించేవారు.
జోడించేవారు అంటే తెగిపోయిన దానిని జోడిస్తూ ఉంటారు.
మూడవవారు - ఈ రోజుల్లో ఉద్యోగస్తుల వలె ఉంటారు.
సంపాదించుకుంటారు, తినేస్తారు. ఎంత సంపాదించుకుంటారో అంత విశ్రాంతిగా తినేస్తారు.
కానీ స్టాక్ జమ అవ్వదు. అందువలనే సదా సంతోషంలో నాట్యం చేయలేరు. శ్రమ కారణంగా
అప్పుడప్పుడు బలహీనంగా, అప్పుడప్పుడు మనస్సు యొక్క సంతోషంతో ఉంటారు. ఇలా మూడు
రకాలైన పిల్లలు ఉన్నారు. బాబా చెప్తారు - అందరికీ వారసత్వంలో సర్వప్రాప్తుల
యొక్క ఖజానా లభించింది. అధికారులు, స్వతహాయోగులు. స్వతహా స్వ రాజ్యాధికారులు.
బాబా యొక్క పిల్లలు మరియు ఖజానాలకు యజమానులు. కనుక ఇంత శ్రమ ఎందుకు చేస్తున్నారు?
ఉద్యోగస్తులు 200 సంపాదించుకుంటే 200 తినేస్తారు. 2000 సంపాదించుకుంటే 2000
తినేస్తారు అదేవిధంగా 2 గంటలు యోగం జోడిస్తారు మరియు 2 గంటలు దాని యొక్క ఫలం
తీసేసుకుంటారు. ఈ రోజు 6 గంటలు యోగం చేశాను, ఈ రోజు 4 గంటలు యోగం చేశాను అంటారు.
ఎందుకు? సదా బాబా యొక్క పిల్లలు కనుక సదా బాబా యొక్క ఖజానాకు అధికారులు. అనటం
బాబా అంటున్నారు, స్మృతి యొక్క శ్రమ చేస్తున్నారు. ఈ రెండు విషయాలు వ్యతిరేకంగా
ఉన్నాయి. కనుక సదా ఒక స్లోగన్ స్మృతి ఉంచుకోండి - నేను ఒక శ్రేష్టాత్మను,
పిల్లవాడి నుండి యజమానిని సర్వఖజానాలకు అధికారిని అని. పోగొట్టుకోవటం - పొందారు,
పోగొట్టుకున్నారు - మరలా పొందారు ఇలా ఆట ఆడకండి. ఏదైతే పొందాలో అది పొందారు ఇక
మరలా పొందటం - పోగొట్టుకోవటం ఎందుకు? లేకపోతే ఈ పాటను మార్చేయండి. పొందుతున్నాము,
పొందుతున్నాము ..... అంటున్నారు అంటే ఇవి అధికారుల యొక్క మాటలు కావు. సంపన్న
బాబా యొక్క పిల్లలు, సాగరుని యొక్క పిల్లలు! ఇప్పుడు ఏమి చేస్తారు? నేనెవరు అంటే
నిరంతరయోగిగా అవ్వండి. మనం బ్రాహ్మణుల నుండి దేవతలు అవుతామా లేదా క్షత్రియల
నుండి దేవతలు అవుతామా? బాప్ దాదాకి పిల్లల యొక్క శ్రమ చూసి దయ వస్తుంది. రాజా
పిల్లలు, పని చేసేవారిగా ఉండటం శోభిస్తుందా? అందరు యజమానులుగా అవ్వండి.
ఈరోజు కేవలం పార్టీలనే కలుసుకోవాలి. కానీ మురళీ ఎందుకు
నడిపించారు దీనికి కూడా రహస్యం ఉంది. ఈరోజు చాలా మంది మహారథీ పిల్లలు బాబాని
ఆకర్షిస్తున్నారు. బాప్ దాదా ఈరోజు వారిని సన్ముఖంగా పెట్టుకుని మురళీ
నడిపిస్తున్నారు. దేశ - విదేశాలలో చాలా మంది మహావీర్ పిల్లలు స్మృతి
చేస్తున్నారు. బాప్ దాదా కూడా ఈ విధమైన సేవాధారి, ఆజ్ఞాకారి, స్వతహా యోగి
పిల్లలను విశేషంగా స్మృతి చేస్తున్నారు.
మధుబన్ నివాసీ విదేశీ పిల్లలు కూడా చాలా స్నేహంతో,
ఛాత్రకులు అయ్యి మురళీ వినడానికి చాలా అభిలాషతో ఉంటారు. ఈ విధమైన సేవాధారి,
ప్రేమస్వరూప మరియు లవలీన పిల్లలకు కూడా బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులు
ఇస్తున్నారు. మధుబన్ నివాసీలు కొంతమంది క్రింద కూర్చున్నారు కానీ బాప్ దాదా
యొక్క నయనాలలో సమీపంగా ఉన్నారు. ఇటువంటి అలసిపోని
సేవాధారి పిల్లలకు విశేషమైన ప్రియస్మృతులు ఇస్తున్నారు. వెనువెంట సన్ముఖంగా
కూర్చున్నటువంటి అదృష్ట సితారలకు కూడా విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే.