శాంతి స్వరూపం యొక్క అయిస్కాంతంగా అయ్యి
నలువైపుల శాంతి కిరణాలను వ్యాపింపచేయండి.
ఈరోజు హోలియస్ట్ (పవిత్రమైన) బాబా, హోలీహంసలను
కలుసుకోవడానికి వచ్చారు. అతీతమైన, ప్రియమైన ఈ మేళాను కేవలం శ్రేష్టాత్మలైన మీరే
అనుభవం చేసుకోగలరు మరియు ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నారు కూడా. పిల్లల యొక్క
స్నేహానికి, బదులు ఇవ్వడానికి బాబా వచ్చారు. పిల్లలు తమ స్నేహానికి రుజువుగా
సంఘటిత రూపంగా సహయోగం ఇచ్చారు. బాప్ దాదా స్నేహరూపి సంఘటనను చూసి
సంతోషిస్తున్నారు. సంలగ్నతతో ప్రకృతి మరియు కలియుగీ ఆసురీ సంప్రదాయాల యొక్క
విఘ్నాలను దాటుతూ నిర్విఘ్నంగా కార్యాన్ని సమాప్తి చేసారు. ఈ సహయోగం మరియు
సంలగ్నతకు బదులుగా బాప్ దాదా పిల్లలపై శుభకాంక్షల యొక్క పూలవర్షం
కురిపిస్తున్నారు. బాబా యొక్క కార్యమే నా కార్యం అనే సంలగ్నతతో సఫలత పొందారు
కనుక శుభకాంక్షలు ఇస్తున్నారు. సంఘటన శక్తి యొక్క మొదటి కార్యం ఇప్పుడు
ప్రారంభించారు. ఇప్పుడు ఉదాహరణ రూపంలో చేసారు. మీ యొక్క రచన ఇంకా వృద్ధి పొందుతూ
ఇంకా విశాలకార్యానికి నిమిత్తంగా చేస్తుంది. అనుభవం కూడా చేసుకున్నారు - సంఘటిత
శక్తి ముందు రకరకాల విఘ్నాలు ఏవిధంగా సమాప్తి అవుతాయి అని. అందరికీ ఒకే శ్రేష్ట
సంకల్పం ఉంది - సఫలత మా యొక్క జన్మ సిద్ద అధికారం అని. ఈ సంకల్పమే కార్యాన్ని
సఫలం చేసింది. పిల్లల యొక్క ధైర్యం, ఉల్లాసం, శ్రమ మరియు ప్రేమ చూసి బాప్ దాదా
కూడా సంతోషిస్తున్నారు.
ఈ సంఘటన విశేషంగా ఏ పాఠం నేర్పింది? తెలుసా? ఏదైనా
కార్యం జరిగితే అది ఇక ముందు కొరకు పాఠం కూడా నేర్పిస్తుంది. కనుక మీరు ఇప్పుడు
ఏ పాఠం చదువుకున్నారు? (సహించే పాఠం) ఈ పాఠం ఇప్పుడు ఇంకా చదువుకోవాలి. ఈ కార్యం
ముందు - ముందు సమయం కొరకు పాఠం చదివించింది - సదా డబుల్ లైట్ అయ్యి ఎవరెడీగా ఎలా
ఉండాలి అని. ఎవరైతే సదా డబుల్ లైట్ గా ఉంటారో వారు స్వయాన్ని ప్రతి విషయంలో
సఫలతామూర్తిగా తయారు చేసుకుంటారు. ఏవిధమైన సమయమో, ఏవిధమైన పరిస్థితియో ఆవిధంగా
తమని తాము సరళరీతితో నడిపించుకుంటారు. మనస్సు ద్వారా సదా మగ్నస్థితిలో ఉంటారు.
ఈరోజు కేవలం, పిల్లల యొక్క శ్రమకి శుభాకాంక్షలు
ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు ఇంకా విశాలకార్యం చేస్తూ వెళ్ళండి, పెంచుకుంటూ
వెళ్ళండి. బాప్ దాదా మీ కంటే ఎక్కువగా అన్ని కార్యాలు చూసారు. మీరు స్థూల
సాధనాల కారణంగా అప్పుడప్పుడు వెళ్ళగలరు, అప్పుడప్పుడు వెళ్ళలేరు. బాప్ దాదాకి
ప్రతి స్థానానికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఏవైతే మీరు చూడలేదో అవి బాప్
దాదా చూసారు. బాబా యొక్క స్నేహమే మీ పాదాలను నొక్కుతుంది. నిమిత్తంగా ఢిల్లీ
వారు అయ్యారు కానీ సర్వ బ్రాహ్మణాత్మల యొక్క సహయోగం ద్వారా ఏ పిల్లలైతే సేవ
యొక్క మైదానంలోకి వచ్చారో, సేవ యొక్క పర్వతానికి వేలు ఇచ్చారో ఆ పిల్లలందరినీ
బాప్ దాదా తన స్నేహం మరియు సదా తోడు యొక్క ఛత్రఛాయలో ఉంచుకుని ప్రియస్మృతులతో
పాదాలు నొక్కుతున్నారు. అలసిపోలేదు కదా! నిమిత్తంగా అనటంలో అయితే విదేశీయులు
అంటారు కానీ మీరు స్వదేశీయులే. వారు కూడా చాలా మంచి సంలగ్నతతో అలసిపోనివారిగా
అయ్యి భారతదేశం యొక్క కుంభకర్ణులను మేల్కొల్పడానికి సఫలతాపూర్వకమైన కార్యం
చేసారు. అందువలనే బాప్ దాదా అందరికీ నెంబర్ వన్ అనే బిరుదు ఇస్తున్నారు.
విదేశీయులు విన్నారా? విదేశంలో కూడా ఇంత పెద్ద కార్యం జరిగే రోజు వస్తుంది.
అందరు సంతోషంలో నాట్యం చేస్తున్నారు.
ఈరోజు యొక్క ఈ విశేష మేళా విశేషంగా స్మృతిచిహ్నంగా
అవుతుంది. బాప్ దాదాకి కూడా ఈ విశేష మేళా అతి ప్రియమైనది. దూర -దూరాల నుండి
శ్రమ చేసి సంలగ్నతతో చేరుకున్న పిల్లలందరికీ బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులు
ఇస్తున్నారు. స్నేహం దూరాన్ని సమీపంగా తీసుకువస్తుంది. భారతదేశంలో కూడా
అందరికంటే దూరంగా ఉన్నవారు స్నేహం యొక్క బంధనలో సహయోగం యొక్క సంలగ్నతలో సమీపంగా
అనుభవం చేసుకుంటున్నారు. అందువలన భారతవాసీయులలో కూడా దేశం యొక్క లెక్కతో దూరంగా
ఉండే పిల్లలకు బాప్ దాదా విశేషంగా స్నేహం ఇస్తున్నారు. చాలా అమాయకులు మరియు చాలా
ప్రియమైనవారు. అందువలనే భోళానాధ్ బాబా యొక్క విశేషమైన దృష్టి ఆవిధమైన పిల్లలపై
ఉంది. అందరు ఈ విధంగా మిమ్మల్ని మీరు పదమాపదమ్ భాగ్యశాలిగా భావిస్తున్నారా?
మంచిది!
ఇప్పుడు తర్వాత సంవత్సరంలో ఏమి చేయాలి? ఏదైతే చేసారో
చాలామంచిగా చేసారు, ఇప్పుడు ఇక ముందు ఏమి చేయాలి? వర్తమాన సమయంలో విశ్వంలో
ఎక్కువ మంది ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువ అవసరమైనది - సత్యమైన శాంతి. అశాంతి
యొక్క అనేక కారణాలు రోజు - రోజుకి పెరిగిపోతున్నాయి. ఇక ముందు ఇంకా పెరిగిపోతాయి.
ఒకవేళ స్వయం అశాంతిగా లేకపోయినా ఇతరుల యొక్క అశాంతి యొక్క వాయుమండలం, అశాంతి
యొక్క వైబ్రేషన్స్ వారిని కూడా తమ వైపు ఆకర్షితం చేసుకుంటాయి. నడవడికలో, ఉండటంలో,
తినటంలో, కార్యం చేయటంలో అన్నింటిలో అశాంతి యొక్క వాతావరణం శాంతి స్థితిలో
కూర్చోనివ్వదు అంటే ఇతరుల అశాంతి యొక్క ప్రభావం కూడా ఆత్మపై పడుతుంది. అశాంతి
లాగుతున్నట్లుగా అనుభవం అవుతుంది. అలాంటి సమయంలో శాంతి సాగరుని పిలలైన మీ యొక్క
సేవ ఏమిటి ? ఎక్కడైనా నిప్పు అంటుకుంటే శీతలత యొక్క నీరు ద్వారా అగ్నిని ఆర్పి
వేడి వాతావరణాన్ని శీతలంగా చేస్తారు. అదేవిధంగా ఈ రోజుల్లో మీ అందరి యొక్క
విశేష స్వరూపం - మాస్టర్ శాంతి సాగరులుగా అవ్వాలి. ఇది ప్రత్యక్షంగా ఉండాలి.
మనసా సంకల్పాల ద్వారా, శాంతి స్వరూపం యొక్క స్థితి ద్వారా నలువైపుల శాంతి యొక్క
కిరణాలు వ్యాపింపచేయండి.
ఈ విధమైన శక్తిశాలి స్వరూపం తయారు చేసుకోండి - మొత్తం
విశ్వం యొక్క కోనలో ఈ కొద్ది ఆత్మలే శాంతి యొక్క దానం ఇచ్చే మాస్టర్
శాంతిసాగరులు అని అశాంతి ఆత్మలందరు అనుభవం చేసుకోవాలి. నలువైపుల అంధకారం ఉండి
ఒకవైపు వెలుగు ఉంటే అందరి ధ్యాస స్వతహాగానే వెలుగు వైపే వెళ్తుంది. అదేవిధంగా
అందరు ఆకర్షితం అవ్వాలి - నలువైపుల అశాంతి మధ్యలో ఇక్కడి నుండి శాంతి యొక్క
ప్రాప్తి లభిస్తుంది అని. శాంతి స్వరూపం యొక్క అయిస్కాంతంగా అవ్వండి. దూరం నుండే
అశాంతి ఆత్మలను ఆకర్షించాలి. నయనాల ద్వారా శాంతి యొక్క వరదానం ఇవ్వండి, నోటి
ద్వారా శాంతి స్వరూపం యొక్క స్మృతి ఇప్పించండి, సంకల్పం ద్వారా అశాంతి యొక్క
సంకల్పాలను గుప్తం చేసి శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి. ఈ విశేష కార్యం
కొరకు స్మృతి యొక్క విశేష విధి ద్వారా సిద్ధిని పొందండి.
ఈ సంవత్సరం విశేషంగా భక్తులు - శాంతిదేవా! అని మీకు
ఏదైతే మహిమ చేస్తున్నారో ఆ స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అభ్యాసం చేయండి -
ఆత్మనైన నా యొక్క శాంతి స్వరూపం యొక్క తరంగాలు ఎంత వరకు కార్యం చేస్తున్నాయి?
శాంతి యొక్క వైబ్రేషన్స్ సమీప ఆత్మల వరకే చేరుకుంటున్నాయా? లేదా దూరం వరకు కూడా
చేరుకుంటున్నాయా? అశాంతి ఆత్మపై మీ శాంతి యొక్క వైబ్రేషన్స్ అనుభవం చేసి చూడండి.
ఏమి చేయాలో అర్థమైందా!
సదా స్నేహంలో ఉండేవారికి, ప్రతి కార్యంలో సదా సహయోగి,
ప్రేమతో శ్రమని సమాప్తి చేసుకునేవారికి, సదా అలసిపోకుండా, బాప్ దాదా యొక్క
ఛత్రఛాయలో ఉండేవారికి, సదా విఘ్నవినాశకులకు, ఈ విధమైన శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.