మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క అధికారియే
వరదాని మూర్తి.
ఈరోజు వరదాత మరియు విధాత బాబా తన యొక్క మహాదాని మరియు
వరదాని పిల్లలను చూస్తున్నారు. వర్తమాన సమయంలో మహాదాని యొక్క పాత్ర అందరు
శక్తిననుసరించి అభినయిస్తున్నారు. కానీ ఇప్పుడు అంతిమ సమయం సమీపంగా వస్తుంది.
కనుక వరదాని యొక్క పాత్ర ప్రత్యక్షంలో అభినయించవలసి వస్తుంది. మహాదాని విశేషంగా
వాణీ ద్వారా సేవ చేస్తారు. కాని వెనువెంట మనస్సు యొక్క శాతం తక్కువగా ఉంటుంది.
వాణీ యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది మరియు మనస్సు యొక్క శాతం దాని కంటే తక్కువగా
ఉంటుంది. కాని వరదాని రూపంలో వాణీ తక్కువగా, మనస్సు యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది.
అంటే సంకల్పం ద్వారా శుభభావన మరియు శుభకామన ద్వారా కొద్ది సమయంలో ఎక్కువ సేవ
యొక్క ప్రత్యక్షఫలం చూస్తారు.
వరదాని రూపం ద్వారా సేవ చేయడానికి మొదట స్వయంలో శుద్ధ
సంకల్పం కావాలి మరియు ఇతర సంకల్పాలను సెకనులో కంట్రోల్ చేసే విశేష అభ్యాసం
ఉండాలి. మొత్తం రోజంతా శుద్ద సంకల్పాల యొక్క సాగరంలో తేలుతూ ఉండాలి మరియు ఏ
సమయంలో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాల సాగరం యొక్క లోతులోకి వెళ్ళి శాంతి
స్వరూపం అయిపోవాలి అంటే బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. వెనువెంట ఆత్మ యొక్క
విశేషమైన మిగిలిన రెండు శక్తులు బుద్ధి మరియు సంస్కారం, మొత్తం మూడు మీ యొక్క
అధికారంలో ఉండాలి. మూడు శక్తులలో ఒకవేళ ఒక శక్తిపై అధికారం తక్కువ అయినా వరదాని
స్వరూపం యొక్క సేవ ఎంత చేయాలో అంత చేయలేరు.
ఈ సంవత్సరం ఎంతగా మహాకార్యం, మహాయజ్ఞం రచించారో
అంతగానే ఈ మహాయజ్ఞంలో మహాదాని యొక్క విశేషపాత్ర కూడా అభినయించాలి. వెనువెంట
ఆత్మ యొక్క మూడు శక్తులపై సంపూర్ణ అధికారంలో ఏదైతే లోపం ఉందో దానిని కూడా ఈ
మహాయజ్ఞంలో స్వాహా చేయాలి. ఎంతగా విశాలకార్యం చేస్తున్నారో అంతగానే విశాలకార్యం
తర్వాత స్వచింతకులుగా, శుభచింతకులుగా, సర్వశక్తుల యొక్క మాస్టర్ విధాత, శ్రేష్ట
సంకల్పాల ద్వారా మాస్టర్ వరదాత, సదా సాగరం యొక్క లోతులకి వెళ్ళి మధురమైన శాంతి
స్వరూపం యొక్క లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అయ్యి ఈ స్వరూపం యొక్క సేవ చేయాలి.
ఎంతగా సాధనాల ద్వారా సేవ యొక్క వేదికపైకి వస్తున్నారో
అంతగానే సిద్ధిస్వరూపంగా అయ్యి శాంతిస్వరూపం యొక్క అనుభూతి చేయించాలి. సేవ
యొక్క సాధనాలు చాలా మంచిగా తయారుచేస్తారు. ఎంతగా విశాల సేవ యొక్క యజ్ఞం
రచిస్తున్నారో అదేవిధంగా సంఘటితంగా జ్వాలారూపం యొక్క శాంతికుండం యొక్క మహాయజ్ఞం
రచించాలి. విశ్వం యొక్క ఆత్మలలో భూమిని దున్నటం - ఇది సేవ యొక్క యజ్ఞం. భూమిని
దున్నటం ద్వారా అలజడి వస్తుంది, దాని తర్వాత బీజం వేసి దానికి శీతలరూపంతో,
శాంతిశక్తితో నీరు వేయటం ద్వారా శీతలత యొక్క నీరు పడగానే ఫలం వచ్చేస్తుంది.
మహాయజ్ఞం చేసాము దీని ద్వారా సేవ యొక్క పాత్ర సమాప్తి అయిపోయింది అని భావించకండి.
ఇది భూమిని దున్నటం మాత్రమే తర్వాత బీజం వేయాలి. దీనిలోనే ఎక్కువగా శ్రమ ఉంటుంది.
దీని తర్వాత ఫలం రావాలంటే మహాదాని తర్వాత వరదాని యొక్క సేవ చేయాలి. వరదానిమూర్తి
అంటే స్వయం సదా వరదానాలతో సంపన్నంగా అవ్వటం. అన్నింటికంటే మొదటి వరదానం ఏమిటి?
వరదానం అంటే దానిలో శ్రమ ఉండదు. సహజంగా లభించే వరదానం ఏమి లభించింది? ప్రతి
ఒక్కరికీ వేరు వేరు వరదానాలు లభించాయా లేదా ఒకటే లభించిందా? వినిపించటంలో అయితే
వేరు వేరు వరదానాలు వినిపిస్తున్నారు కదా! అందరికీ ఒకే వరదానం శ్రమ లేకుండా,
ఆలోచించకుండా లభించింది. బాబా ఎలాంటి బలహీన ఆత్మని అయినా, ధైర్యహీన ఆత్మని అయినా
తన వారిగా స్వీకరించారు. ఎవరు ఎలా ఉన్నా నావారు అని అన్నారు. ఇలా సెకనులో
వారసత్వానికి అధికారిగా అయ్యే వరదానం అనండి లేక లాటరీ అనండి, లేక భాగ్యం అనండి
బాబా స్వయంగా ఇచ్చారు. స్మృతి యొక్క స్విచ్ ఆన్ చేసారు నీవు నావాడిని అని.
ఇలాంటి భాగ్యం లభిస్తుంది అని ఆలోచించలేదు కూడా! కానీ భాగ్యవిధాత బాబా భాగ్యం
యొక్క వరదానం ఇచ్చారు. ఈ సెకను యొక్క వరదానమే జన్మ జన్మాంతరాల యొక్క
వారసత్వానికి అధికారిగా చేసింది. ఈ వరదానాన్ని స్మృతిలోకి తీసుకురావటం అంటే
వరదానిగా అవ్వటం. బాబా అందరికీ ఒకే విధంగా, ఒకే సెకనులో వరదానం ఇచ్చారు. చిన్న
పిల్లవాడైనా, వృద్ధులైనా, పెద్దవృత్తి కలిగిన వారికైనా, సాధారణమైన వారైనా,
ఆరోగ్యంతో ఉన్నా లేక అనారోగ్యంగా ఉన్నా, ఏ ధర్మం వారైనా, ఏ దేశం వారైనా,
చదువుకున్నా లేక చదువుకోకపోయినా అందరికీ ఒకే వరదానం ఇచ్చారు. ఈ వరదానాన్ని
జీవితంలోకి తీసుకురావటంలో, స్మృతి స్వరూపంగా అవ్వటంలో నెంబరు తయారవుతుంది.
కొందరు నిరంతరం తయారుచేసుకుంటున్నారు కొందరు అప్పుడప్పుడు తయారు చేసుకుంటున్నారు.
ఈ తేడా కారణంగానే రెండు మాలలు తయారయ్యాయి. ఎవరైతే సదా వరదానం యొక్క స్వరూపంగా
ఉంటారో వారి యొక్క మాల కూడా సదా స్మరిస్తూ ఉంటారు. మరియు ఎవరైతే అప్పుడప్పుడు
జీవితంలోకి తీసుకువస్తారో, స్కృతి స్వరూపంలోకి వస్తారో వారి యొక్క మాల కూడా
అప్పుడప్పుడు స్మరిస్తూ ఉంటారు. వరదాని స్వరూపం అంటే సదా ఈ మొదటి వరదానంలో సదా
స్మృతి స్వరూపంగా ఉంటారు. ఎవరైతే సదా బాబా వారిగా ఉంటారో వారు సదా ఇతరులను కూడా
సదా బాబా వారిగా చేస్తారు. ఈ వరదానం తీసుకోవటంలో ఎవరు శ్రమ చేయలేదు. బాబా
స్వయంగా తనవారిగా చేసుకున్నారు. ఈ ఒక్క వరదానాన్ని సదా స్మృతి ఉంచుకుంటే శ్రమ
నుండి విడిపించుకుంటారు. వరదానాన్ని మర్చిపోతే సదా శ్రమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు
వరదానిమూర్తి ద్వారా సంకల్ప శక్తి యొక్క సేవ చేయండి. ఈ సంవత్సరం స్వయం శక్తుల
ద్వారా, స్వయం యొక్క గుణాల ద్వారా నిర్భల ఆత్మలను బాబాకి సమీపంగా తీసుకురండి.
వర్తమాన సమయంలో చాలా మందికి ఇదే శుభకోరిక ఉత్పన్నం అవుతుంది - ఆధ్యాత్మిక శక్తి
ఏదైతే చేస్తుందో అది ఇంకెవ్వరు చేయటంలేదు అని. కానీ ఆధ్యాత్మికత వైపు నడవడానికి
తమని తాము ధైర్యహీనంగా భావిస్తున్నారు. వారికి కోరిక అనే ఒక కాలు అయితే ఉంది
కానీ ఇప్పుడు మీరు మీ శక్తి ద్వారా ధైర్యం అనే రెండవ కాలుని ఇవ్వండి. అప్పుడు
బాబా దగ్గరకి నడుచుకుంటూ రాగలరు. ఇప్పుడైతే దగ్గరకి రావడానికి కూడా ధైర్యహీనంగా
ఉన్నారు. మొదట మీ యొక్క వరదానాల ద్వారా వారిని ధైర్యంలోకి తీసుకురండి. మీరు కూడా
తయారవుతారు అని ఉత్సాహంలోకి తీసుకురండి. అప్పుడు నిర్భల ఆత్మలు మీ యొక్క సహయోగం
ద్వారా వారసత్వానికి అధికారిగా అవుతారు. అప్పుడు మీ యొక్క వరదానిమూర్తికి మాటి
మాటికి ధన్యవాదాలు చెప్తారు. కొంతమంది ప్రజలుగా అవుతారు. కొంతమంది భక్తులుగా
మరియు కొంతమంది లాస్ట్ నుండి ఫస్ట్ గా కూడా వెళ్ళిపోతారు. కనుక ఈ సంవత్సరంలో ఏమి
చేయాలో అర్థమైందా!
ఎలా అయితే మహాయజ్ఞం యొక్క సేవ యొక్క ధ్వని నలువైపులా
వ్యాపింపచేసారో అదేవిధంగా ఈ మహాకార్యంతో పాటు వెనువెంట శాంతికుండం యొక్క
వాయుమండలం, వైబ్రేషన్స్ - వీటి యొక్క ధ్వని కూడా నలువైపుల వ్యాపింపచేయండి.
మహాయజ్ఞానికి క్రొత్త చిత్రాలు తయారుచేస్తున్నారు. ప్రదర్శనీలు
తయారుచేస్తున్నారు, ఉపన్యాసం తయారుచేస్తున్నారు,స్టేజ్ తయారుచేస్తున్నారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరు బ్రహ్మాబాబా సమానంగా చైతన్య చిత్రంగా అయ్యి, లైట్హౌస్,
మైట్హౌస్ అయ్యి, సంకల్పశక్తి యొక్క శాంతి శక్తి యొక్క ఉపన్యాసం తయారుచేయాలి
మరియు కర్మాతీత స్టేజీపై వరదానిమూర్తి యొక్క పాత్ర అభినయించాలి, అప్పుడే
సంపూర్ణత సమీపంగా వస్తుంది. ఈ సంవత్సరంలోనే అతి విశాల సేవ యొక్క కార్యం ఏదైతే
చేయాలో అది కూడా సంఘటిత రూపంలో ప్రత్యక్షత యొక్క ఒకే బలం, ఒకే నమ్మకం యొక్క
ప్రత్యక్షత, సేవ యొక్క స్టేజ్ పైకి తీసుకురావాలి. సర్వ బ్రాహ్మణాత్మల వ్రేలుతో
కార్యం సంపన్నం చేయాలి. అలాగే ఈ సంవత్సరంలో సర్వుల యొక్క ఒకే సంకల్పం ద్వారా
వరదాని రూపం యొక్క విశాలకార్యం కూడా ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఏమి
చేయాలో అర్ధమైందా!
ఈవిధంగా ధ్వనిలోకి వస్తూ కూడా ధ్వనికి అతీతంగా
ఉండేవారికి, తమ యొక్క ధైర్యం ద్వారా ఇతరులకు ధైర్యం ఇప్పించేవారికి, మీ యొక్క
సమీపత ద్వారా ఇతరులను సమీపంగా తీసుకువచ్చేవారికి, కుంటి ఆత్మలను కూడా పరుగు
యొక్క పందెంలోకి తీసుకువెళ్ళేవారికి, ఈవిధంగా వరదాని మరియు మహాదాని, బాప్ దాదాకి
సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.