ప్రపంచానికి వెలుగునిచ్చే వారి యొక్క సభ.
ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డను చూసి
హర్షిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క బిడ్డ ఎంత శ్రేష్ట ఆత్మయో బాప్ దాదాకి
తెలుసు. ప్రతి ఒక్క బిడ్డ ప్రపంచానికి వెలుగు, కంటి వెలుగు. అనగా బాప్ దాదా నయన
సితారలు. పిల్లలను నయనాలలో కూర్చోపెట్టుకునే నడుస్తున్నారు అంటే నయనాలలో నిండి
ఉన్నారు. నయనాలకి చాలా మహిమ ఉంది. మానవ జీవితంలో నయనాలు లేకపోతే ప్రపంచమే లేదు.
ఎలాగైతే శరీరంలో నయనాలకి గొప్పతనం ఉందో అదేవిధంగా పిల్లలైన మీరు ప్రతి ఒక్కరు
ప్రపంచానికి వెలుగు. కంటి వెలుగు అయిన మీరు లేకుండా ప్రపంచానికి ఏ విలువ లేదు.
ప్రపంచానికి వెలుగు అయిన మీరు ఈ స్థితిలో స్థితులైతే ప్రపంచం కూడా సుఖమయం
అయిపోతుంది మరియు శ్రేష్టంగా అయిపోతుంది. ప్రపంచానికి వెలుగు అయిన మీరు మీ
శ్రేష్ట స్థితి నుండి క్రిందకి వచ్చేస్తే ప్రపంచం కూడా సారం లేనిదిగా అయిపోతుంది.
మీపై ఇంతగా ఆధారపడి ఉంది. మీరు మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుంది, మీరు నిద్రపోతే
ప్రపంచం నిద్రపోతుంది అని అంటూంటారు కదా! ఆవిధంగా మీరు ప్రపంచానికి ఆధారమూర్తులు.
మీ వృద్ధి కళతో సర్యుల వృద్ధికి సంబంధం ఉంది. మీ పడిపోయే కళతో విశ్వం యొక్క
పడిపోయే కళకి సంబంధం ఉంది. ప్రతి ఒక్కరిపై ఇంత భాద్యత ఉంది. ఇలా భావించి
నడుస్తున్నారా? ఇటువంటి స్మృతి ఉంటుందా? బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డ యొక్క
వర్తమాన స్థితిని చూస్తున్నారు. ప్రపంచానికి వెలుగు అయిన ప్రతి ఒక్కరు
ప్రపంచానికి ఎంత వెలుగునిస్తున్నారు? కళ్ళనే జీవనజ్యోతులు అని అంటారు. మీరందరు
జగత్తుకి జ్యోతులు. జగత్తు జ్యోతి అయిన మీరే కదులుతూ ఉంటే ప్రపంచ పరిస్థితి ఎలా
ఉంటుంది? ఇక్కడ కూడా హద్దులోని లైట్ లేకపోతే లేదా మినుకుమినుకు అని అంటుంటే ఏమి
అనుభవం చేసుకుంటారు? బావుంది అనిపిస్తుందా? అదేవిధంగా ప్రపంచ జ్యోతులైన మీరు
అలజడిలోకి వస్తే విశ్వాత్మల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రపంచానికి సితారలు
లేదా జ్యోతులు అయిన మీపైనే అందరి దృష్టి ఉంది. అందరూ వేచి చూస్తున్నారు. ఏ విషయం
గురించి? భక్తిమార్గంలో ఒక శంకురుని గురించే చెప్పారు - కన్ను తెరవగానే
పరివర్తన అయిపోయిందని, కానీ ఈ మహిమ శివవంశీ ప్రపంచ జ్యోతులైన మీది. ప్రపంచ
నయనాలైన మీరు ఎప్పుడైతే సంపూర్ణ స్థితికి చేరుకుంటారో అంటే సంపూర్ణత అనే నేత్రం
తెరుచుకోగానే సెకండులో పరివర్తన అయిపోతుంది. కనుక ప్రపంచ జ్యోతులూ చెప్పండి!
సంపూర్ణత అనే నేత్రాన్ని ఎప్పుడు తెరుస్తారు? నేత్రం అయితే ఇప్పుడు కూడా
తెరుచుకునే ఉంది. కానీ మధ్యమధ్యలో మాయ యొక్క దుమ్ము పడిపోతుంది. అందువలన కన్ను
రెపరెపలాడుతుంది. స్థూల కంటిలో కూడా దుమ్ము పడితే కన్ను పరిస్థితి ఎలా ఉంటుంది?
ఏకాగ్రంగా చూడలేరు కదా! మా ఇష్ట దేవీదేవతల యొక్క దృష్టి మాపై ఎప్పుడు పడుతుందో
అని ప్రపంచమంతా ప్రపంచజ్యోతులైన మీయొక్క ఒక్క సెకండు దృష్టిని తీసుకునేటందుకు
ఎదురుచూస్తున్నారు. ఆ దృష్టి ద్వారా అద్భుతం జరుగుతుందని చూస్తున్నారు. ఇలా
దృష్టి ద్వారా అద్భుతం చేసే మీరే మీ కన్నుని నలుపుకుంటూ ఉంటే దృష్టి ద్వారా
అద్భుతం ఎలా చేయగలరు? దృష్టి ద్వారా అద్భుతం జరగవలసిన వారి క్యూ పెద్దది.
అందువలన సదా సంపూర్ణత అనే నేత్రం తెరుచుకుని ఉండాలి. బాప్ దాదా ప్రపంచ జ్యోతుల
యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నారు. ప్రపంచ జ్యోతులు తమ నయనాలను ఏకాగ్రంగా
నిలపలేకపోతున్నారు. కొంతమంది అద్భుతం చేస్తూ చేస్తూ మధ్యమద్యలో గుటకలు
మ్రింగుతున్నారు. గుటకలు మ్రింగేవారు దృష్టి ద్వారా అద్భుతం ఎలా చేయగలరు?
సంకల్పాలే గుటకలు. మీ భక్తులు మిమ్మల్ని చూస్తున్నారు, దర్శనీయ మూర్తులు గుటకలు
మ్రింగుతున్నారు. అప్పుడు భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? అందువలన కళ్ళు
నలుపుకోవటం, గుటకలు మ్రింగడాన్ని సమాప్తి చేసుకోవాలి. అప్పుడే దర్శనీయమూర్తిగా
కాగలరు.
అమృతవేళ బాప్ దాదా ప్రపంచ జ్యోతులను చూస్తారు -
కదులుతున్నారా లేక ఏకాగ్రంగా ఉన్నారా? అని. అనేకరకాల రూపురేఖలను చూస్తారు. అవి
ఏమిటో మీకు తెలుసు కదా? ఇక ఏమి చెప్పను, జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు
మీ గొప్పతనాన్ని తెలుసుకుని సదా జాగృతి జ్యోతియై ఉండండి. సెకనులో స్వ పరివర్తన
నుండి విశ్వ పరివర్తన చేయగలరు. ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే కర్మాతీత
స్థితి దీనిని అభ్యాసం చేయండి. పాత ప్రపంచంలో తాబేలు ఉదాహరణ చెప్తారు కదా! మీ
రచన అయిన తాబేలు సెకనులో అవయవాలన్నింటినీ మలుచుకుంటుంది, మలుచుకునే శక్తి రచనలో
కూడా ఉంది. కానీ మాస్టర్ రచయితలు అయిన మీరు మలుచుకునే శక్తితో సెకండులో
సంకల్పాలన్నింటినీ మలుచుకుని ఒకే సంకల్పంలో స్థితులు కాగలుతున్నారా?
నలువైపులా అలజడికరమైన పరిస్థితులు ఉన్నా కానీ అలజడిలో
ఉంటూ కూడా సెకండులో అచంచలం అయిపోండి. బిందువు పెట్టడం వస్తుందా? బిందువు
పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? బిందువు పెట్టడం ఎంత సహజం అంటే చిన్న పిల్లలు
కూడా పెట్టగలరు. ప్రశ్నార్థకం పెట్టలేరు కానీ బిందువు పెట్టగలరు. కనుక వర్తమాన
సమయం అలజడులు పెరిగే సమయం. ప్రకృతి అలజడిగా ఉన్నా కానీ ప్రకృతిపతులు అచంచలంగా
ఉండాలి. ఇప్పుడైతే ప్రకృతి చిన్న చిన్న పరీక్షలు పెడుతుంది కానీ అంతిమ పరీక్షలో
పంచతత్వాలు విరాఠ రూపంలో ఉంటాయి. ఒకవైపు ప్రకృతి యొక్క విరాఠ రూపం, రెండవవైపు
పంచ వికారాలు అంతం అయిపోతాయి. కనుక అవి కూడా అతి విరాఠ రూపంలో ఉంటాయి. అంతిమ
యుద్ధం ప్రకటించేవిగా ఉంటాయి. మూడవవైపు సర్వాత్మలు రకరకాలుగా ఉంటారు. ఒకవైపు
తమోగుణి ఆత్మల యొక్క యుద్ధం, రెండవవైపు భక్తాత్మల యొక్క రకరకాల పిలుపులు. ఇక
నాల్గవ వైపు ఏమి ఉంటుంది? పాత సంస్కారాలు. అంతిమ సమయంలో అవి కూడా తమ అవకాశాన్ని
తీసుకుంటాయి. ఒకసారి వచ్చి ఇక సదాకాలికంగా విడ్కోలు తీసుకుంటాయి. సంస్కారాల
స్వరూపం ఎలా ఉంటుంది? కొంతమంది దగ్గరికి కర్మభోగం రూపంలో వస్తుంది, కొంతమంది
దగ్గరకి కర్మ సంబంధాల బంధన రూపంలో వస్తుంది. కొంతమంది దగ్గరకి వ్వర్థ సంకల్పాల
రూపంలో వస్తుంది. కొంతమంది దగ్గరికి విశేషంగా సోమరితనం మరియు నిర్లక్ష్యం రూపంలో
వస్తుంది. ఇలా నాలుగువైపులా అలజడికర వాతారణం ఉంటుంది. రాజ్య శక్తి, ధర్మ శక్తి,
విజ్ఞాన శక్తి మరియు అనేక రకాల బాహుబలాలు అన్ని అలజడిలో ఉంటాయి. ఇటువంటి సమయంలో
బిందువు పెట్టడం వస్తుందా లేక ప్రశ్నార్థకం ఎదురుగా వస్తుందా? ఏమవుతుంది?
మలుచుకునే శక్తిని ఇంతగా అనుభవం చేసుకుంటున్నారా? చూస్తూ కూడా చూడకండి, వింటూ
కూడా వినకండి. ప్రకృతి యొక్క అలజడి చూస్తూ ప్రకృతి పతులై ప్రకృతిని
శాంతింపచేయండి. బిందువు పెట్టే మీ స్థితి ద్వారా ప్రకృతి యొక్క అలజడిని ఆపండి.
తమోగుణి నుండి సతో గుణి స్థితిలోకి పరివర్తన చేయండి. ఇటువంటి అభ్యాసం ఉందా?
ఇలాంటి సమయాన్ని ఆహ్వానిస్తున్నారు కదా? మీ దగ్గర మలుచుకునే శక్తిని బాగా జమ
చేసుకోండి. దీని కొరకు విశేష అభ్యాసం కావాలి. ఇప్పుడిప్పుడే సాకారి,
ఇప్పుడిప్పుడే ఆకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి. ఈ మూడు స్థితులలో స్థితులవ్వటం
ఎంత సహజం అవ్వాలంటే సాకార రూపంలో ఎంత సహజంగా స్థితులు అవ్వగలుగుతున్నారో
అదేవిధంగా ఆకారి మరియు నిరాకారి స్థితిలో సితులవ్వటం కూడా సహజం అవ్వాలి. సాకార
రూపంలో ఒక వస్త్రాన్ని మార్చి మరో వస్త్రాన్ని ఎలా అయితే ధరిస్తారో అదేవిధంగా
మీ స్వరూపం మరియు స్థితిని పరివర్తన చేయగలగాలి. సాకార స్వరూపం యొక్క స్మృతిని
వదిలి ఆకారి ఫరిస్తా స్వరూపం అయిపోండి. సెకండులో ఫరిస్తా స్వరూపం యొక్క
దుస్తులను ధరించండి. దుస్తులు మార్చుకోవటం రావటం లేదా? ఇటువంటి అభ్యాసం చాలా
సమయం నుండి కావాలి. అప్పుడే అటువంటి సమయంలో పాస్ అవ్వగలరు. సమయం యొక్క వేగం ఎంత
విరాఠ రూపం తీసుకోనున్నదో అరమైందా! ఇటువంటి సమయం కోసం తయారేనా? లేక తారీఖు
చెప్తే తయారవుతారా? తారీఖు తెలిస్తే ఆత్మాభిమాని అవ్వడానికి బదులు తారీఖు
అభిమానిగా అయిపోతారు. అప్పుడు పూర్తిగా పాస్ అవ్వలేరు. అందువలన తారీఖు చెప్పరు,
కానీ ఆ తారీఖు మీకు మీకే ప్రేరణ వస్తుంది. కళ్ళ ఎదురుగా జరిగే దృశ్యాన్ని ఎంత
స్పష్టంగా చూడగలరో అంత స్పష్టంగా అనుభవం చేసుకోగలరు. ఇలా ముందుగానే భవిష్యత్తుని
స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. కానీ దీని కొరకు ప్రపంచ జ్యోతుల యొక్క నేత్రం సదా
తెరుచుకుని ఉండాలి. మాయ యొక్క దుమ్ము పడితే స్పష్టంగా చూడలేరు. ఏ అభ్యాసం చేయాలో
అర్థమైందా? దుస్తులను మార్చుకునే అభ్యాసం చేయండి.
ఈవిధంగా బాప్ దాదా యొక్క కోరికలన్నింటినీ పూర్తి
చేసేవారికి, శ్రేష్ట శుభ ఆశాదీపాలకు, సదా బిందువు పెట్టేవారికి, సదా ఎవరెడీగా,
చాలా కాలం యొక్క అభ్యాసిగా ఉండేవారికి, స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన
చేసేవారికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.