పుణ్యాత్మల యొక్క లక్షణాలు.
ఈ రోజు బాప్ దాదా తన యొక్క సర్వ శ్రేష్ట మహాన్
పుణ్యాత్మలను చూస్తున్నారు.
1. పుణ్యాత్మ అనగా ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకండు
స్వయం పట్ల మరియు ఇతరాత్మల పట్ల పుణ్యఖాతాను జమ చేసుకునేవారిగా ఉంటారు. 2.
పుణ్వాత్మ అనగా సదా ఏదోక ఖజానాను మహాదానం చేసి పుణ్యాన్ని సంపాదించుకునేవారు.
3. పుణ్యాత్మ అనగా సదా వారి యొక్క నయనాలలో బాప్ దాదా యొక్క మూర్తి మరియు ముఖంలో
బాప్ దాదా యొక్క చిత్రం, స్మృతిలో బాబా సమానంగా సమర్ధంగా, నోటి ద్వారా సదా
జ్ఞానరత్నాలు అంటే సదా అమూల్య మాట, ప్రతి కర్మలో బాబా సమాన చరిత్ర, వృత్తిలో
బాబా సమానంగా విశ్వకళ్యాణకారిగా, ప్రతి సెకండు, ప్రతి సంకల్పం కళ్యాణకారిగా,
దయాహృదయం యొక్క కిరణాల ద్వారా నలువైపులా ఉన్న దుఃఖం, అశాంతి యొక్క అంధకారాన్ని
దూరం చేసేవారిగా ఉంటారు. 4. పుణ్యాతలు తమ పుణ్యరాశి నుండి అనేకమంది బీదవారిని
ధనవంతులుగా చేస్తారు. జ్ఞాన స్వరూప పుణ్యాత్మ యొక్క ఒక పుణ్యంలో కూడా చాలా శక్తి
ఉంటుంది. ఎందుకంటే స్వయంగా పరమాత్మ శక్తి ఆధారంగా పుణ్యాత్మలు వారు.
ద్వాపరయుగంలో పరోక్షంగా దానపుణ్యాలు చేసే అల్పకాలిక రాజులను చూసి ఉంటారు లేదా
వారి గురించి విని ఉంటారు కదా! ఆ రాజులలో రాజ్యశక్తి యొక్క పూర్తి అధికారం
ఉండేది. వారు ఏ ఆజ్ఞ ఆజ్ఞాపించినా దానిని ఎవరూ మార్చలేరు. ఎవరిని ఏమి చేసినా
కానీ అంటే ఎవరినైనా సంపన్నంగా చేయాలన్నా, ఎవరినైనా ఉరికంభం ఎక్కించాలన్నా
రెండింటికి అధికారం ఉండేది. ఇది పరోక్ష దానపుణ్యాల యొక్క శక్తి. దీనిని
ద్వాపరయుగం ఆదిలో యదార్థ రూపంలో ఉపయోగించేవారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ
రాజ్యశక్తియే అయదార్ధ రూపం అయిపోయింది. ఆ కారణంగానే చివరికి అది సమాప్తి
అయిపోయింది. పరోక్ష రాజ్యశక్తిలో కూడా ఎంత శక్తి ఉండేదంటే వారు తమ ప్రజలను
కుటుంబాన్ని అల్పకాలికంగా సుఖిగా, శాంతిగా తయారుచేసేవారు. అదేవిధంగా పుణ్యాత్మలు
లేదా మహాదాని ఆత్మలైన మీకు కూడా స్వయంగా బాబా ద్వారా ప్రకృతిజీత్, మాయాజీత్ అనే
విశేష శక్తులు లభించాయి. కనుక మీరు సర్వశక్తివంతులు. మీ సర్వశక్తుల అధికారం
ఆధారంగా అంటే మీ పుణ్యరాశి ఆధారంగా, శుద్ధ సంకల్పాల ఆధారంగా, ఏ ఆత్మకి అయినా
మీరు ఏది కావాలంటే అది ఇవ్వగలరు, తయారుచేయగలరు. మీ యొక్క ఒక్క సంకల్పంలో ఎంత
శక్తి ఉందంటే వారి సంబంధాన్ని బాబాతో జోడించి వారిని సంపన్నంగా చేయగలరు. వారిది
ఆజ్ఞ కానీ మీది సంకల్పం. వారు తమ ఆజ్ఞతో ఏది కావాలంటే అది చేయగలరు. అదేవిధంగా
మీరు మీ సంకల్పం ద్వారా ఆత్మలను ఎంతగా కావాలంటే అంత ఎత్తుకు తీసుకువెళ్ళగలరు.
ఎందుకంటే మీకు స్వయంగా పరమాత్మ ద్వారా అధికారం ప్రాప్తించింది. ఇటువంటి
శ్రేష్టాత్మలేనా? కానీ ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ఎందుకు జరగటం లేదు? అధికారం
ఉంది, సర్వశక్తివంత అధికారం ఉండి కూడా దానిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు?
కారణం ఏమిటి? ఈ శ్రేష్ట సేవ ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభం కాలేదు?
చరిత్ర మొత్తంలో ఏ శక్తిని అయినా ఎవరైనా
ఉపయోగించుకోకపోవడానికి కారణం దానిని వారు దుర్వినియోగం చేసుకోవటం. రాజులు
రాజ్యాన్ని పోగొట్టుకున్నా, నాయకులు తమ పదవులను పోగొట్టుకున్నా, వక్తలు తమ
శక్తిని పోగొట్టుకున్నారంటే వీటన్నింటికీ కారణం ఏమిటి? తమ యొక్క నిజ కార్యాన్ని
వదిలి భోగవిలాసాలలో నిమగ్నం అయిపోవటం. ఏదొక విషయానికి స్వయం ఆధీనం అయిపోతే
అధికారం పోతుంది. వశీభూతం అయిపోతారు. అందువలనే అధికారాన్ని దుర్వినియోగం
చేసుకుంటారు. అదేవిధంగా పుణ్యాత్మలైన మీకు బాబా ద్వారా ప్రతి సెకండు, ప్రతి
సంకల్పానికి శక్తి లభించింది, అధికారం లభించింది, సర్వాధికారాలు లభించాయి. వాటి
విలువ తెలిసి ఉండి కూడా వాటిని యదార్థ రూపంలో వినియోగించటం లేదు. చిన్న చిన్న
విషయాలలో, సోమరితనంతో భోగవిలాసాలతో లేదా వ్యర్ధం ఆలోచించటం మరియు మాట్లాడటంలో
వాటిని దుర్వినియోగం చేయటం వలన జమ అయిన పుణ్యరాశి లేదా ప్రాప్తించిన ఈశ్వరీయ
శక్తిని ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆవిధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు. లేకపోతే మీ
యొక్క ఒకొక్క సంకల్పం చాలా శక్తిశాలి. శ్రేష్ట బ్రాహ్మణుల యొక్క సంకల్పం ఆత్మ
యొక్క అదృష్ట రేఖను గీసే సాధనం. మీ యొక్క ఒక సంకల్పం ఒక స్విచ్ దానిని ఆన్ చేసి
సెకండులో అంధకారాన్ని తొలగించగలరు.
5. పుణ్యాత్మల యొక్క సంకల్పం ఒక ఆత్మిక అయస్కాంతం, ఇది
ఆత్మను ఆత్మీయత వైపు ఆకర్షిస్తుంది. 6. పుణ్యాత్మ యొక్క సంకల్పం లైట్హౌస్,
భ్రమించే అనేకాత్మలకు సరైన గమ్యాన్ని చూపించేది. 7. పుణ్యాత్మ యొక్క సంకల్పం అతి
శీతల స్వరూపం, వికారాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మను శీతలంగా తయారుచేస్తుంది. 8.
పుణ్యాత్మ యొక్క సంకల్పం శ్రేష్ట శస్త్రం, ఇది అనేక బంధనాలతో పరతంత్రంగా ఉన్న
ఆత్మను స్వతంత్రంగా చేస్తుంది. 9. పుణ్యాత్మ యొక్క సంకల్పంలో విశేష శక్తి
ఉంటుంది. ఎలాగైతే మంత్రతంత్రాల ద్వారా అసంభవ విషయాన్ని సంభవం చేసేస్తారో
అదేవిధంగా సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని సంభవం చేయగలరు. వశీకరణ మహామంత్రం
ద్వారా వశీభూత ఆత్మను రాకెట్ ఎగిరింపచేస్తారు. 10. ఈరోజుల్లో యంత్రాల ద్వారా
ఎడారి భూములను కూడా పచ్చగా చేస్తున్నారు, పర్వతాలపై కూడా పువ్వులు
పూయిస్తున్నారు. మరయితే పుణ్యాత్మలైన మీ శ్రేష్ట సంకల్పం ద్వారా నిరాశవాదులను
ఆశావాదులుగా చేయలేదా? ఈవిధంగా ప్రతి సెకండు పుణ్యరాశిని జమ చేసుకోండి. ప్రతి
సెకండు, ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకుని సెకండుని, సంకల్పాన్ని
ఉపయోగించండి. ఏ కార్యం అయితే ఈనాటి కోటానుకోటీశ్వరులు కూడా చేయలేరో అది మీ
యొక్క ఒక సంకల్పం ద్వారా ఆత్మలను కోటానుకోటీశ్వరులుగా చేయగలరు. మరయితే మీ
సంకల్పశక్తి ఎంత శ్రేష్టమైనది! జమ చేసుకోవటం మరియు చేయించటం లేదా పోగొట్టుకోవటం
అనేది మీపైనే ఆధారపడి ఉంది. పోగొట్టుకున్నవారు. పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. జమ
చేసుకున్నవారు సర్వప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతారు. ఒకసారి సుఖం యొక్క ఊయలలో,
ఒకసారి శాంతి యొక్క ఊయలలో, ఒకసారి ఆనందం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు.
పోగొట్టుకున్నవారు ఊయలలో ఊగేవారిని చూసి తమ జోలెను చూసుకుంటూ ఉంటారు. మీరందరు
ఊగేవారే కదా!
ఈవిధంగా శ్రేష్ట సంకల్పం యొక్క విధి ద్వారా ఆత్మలకు
సద్గతినిచ్చేవారికి, ఈశ్వరీయ శక్తి ద్వారా ఆత్మలను ప్రతి ఆపద నుండి ముక్తులు
చేసేవారికి, సదా పుణ్యరాశిని జమ చేసుకునేవారికి మరియు చేయించేవారికి, సదా విశ్వ
కళ్యాణం యొక్క ధృడ సంకల్పాన్ని ధారణ చేసేవారికి, ఇటువంటి సర్వ శ్రేష్ట
పుణ్యాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.