స్వమానంలో స్థితులయ్యే ఆత్మ యొక్క లక్షణాలు.
బాప్ దాదా ప్రతీ ఒక్క బిడ్డని పదమాపదమ్ భాగ్యశాలి
ఆత్మగా చూస్తున్నారు. ప్రతీ ఒక్కరి శ్రేష్ఠ ప్రాలబ్దం బాప్ దాదా ఎదురుగా ఉంది.
అందువలనే బేహద్ తండ్రికి పిల్లలంటే గర్వంగా ఉంది. ఇంతమంది పిల్లలు విశ్వం ముందు
పరమ పూజ్యులు. నెంబర్‌వారీ పురుషార్థీలు అయినా కానీ చివరి బిడ్డ కూడా ప్రపంచం
ముందు మహిమా యోగ్యం మరియు పూజ్యనీయం. చివరి బిడ్డకి కూడా ఇప్పటి వరకు మహిమ లేదా
పూజ జరుగుతుంది. ఒక్క బేహద్ తండ్రి యొక్క పిల్లలే ఇంత యోగ్యులుగా అవుతారు.
ఇప్పుడు ఆలోచించండి - మీరు ఎంత పరమాపదమ్ భాగ్యశాలి ఆత్మలో? ఇప్పటి వరకూ కూడా
భక్తులు నెంబర్‌వారీ దేవతాధర్మ ఆత్మలైన మీ దర్శనం కోసం దప్పికతో ఉన్నారు. మీరు
చైతన్యంగా ఇంత భాగ్యవంతులుగా అయ్యారు. అంత యోగ్యంగా అయ్యారు. అందువలనే ఇప్పటి
వరకూ మీ దర్శనం కోసం దప్పికతో ఉన్నారు. అందువలన బాప్ దాదాకి 16,108 మాలలోని
చివరి పూస గురించి కూడా గర్వంగా ఉంది. ఎలా ఉన్నా కాని, పురుషార్థంలో సోమరి అయినా
కానీ, మధ్యమ పురుషార్థి అయినా లేక తీవ్ర పురుషార్థి అయినా బాబా వారిగా అయితే
అయ్యారు కదా! పూజ్యనీయంగా మరియు మహిమాయోగ్యంగా అయ్యారు. ఎందుకంటే పారసనాథుడైన
బాబా యొక్క సాంగత్యంతో లోహం కూడా బంగారంగా అయిపోయింది. పరుసవేదికి తప్పకుండా
విలువ ఉంటుంది. అందువలన ఎప్పుడు కూడా స్వమానంలో మిమల్ని మీరు తక్కువగా
భావించవద్దు. దేహాభిమానంలోకి రాకూడదు. స్వమానంలో ఉండేవారు ఎప్పుడు కూడా
దేహాభిమానంలోకి రారు. వారు సదా నిర్మాణంగా ఉంటారు. ఎంత గొప్ప స్వమానమో అంతగానే
అన్నింటిలో అలాగే అంటూ నిర్మాణంగా ఉంటారు. స్వమానంలో ఉండేవారు అందరికీ గౌరవాన్ని
ఇచ్చే దాతగా ఉంటారు. చిన్న - పెద్ద, జ్ఞాని - అజ్ఞాని, మాయాజీత్ - మాయకి వశం
అయినవారికి అయినా, గుణవంతులుగా అయ్యే పురుషార్థీలు అయినా కానీ, స్వమానంలో
ఉండేవారు అందరికీ గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటారు. అంటే స్వయం సంపన్నంగా ఉన్న
కారణంగా దయాహృదయులుగా ఉంటారు. దాతగా లేదా దయాహృదయులుగా ఉంటారు. ఎప్పుడూ ఏ
ఆత్మపట్ల అయినా కానీ సంకల్పమాత్రంగా కూడా అహంకారంలోకి రారు. ఉంటే దయ ఉంటుంది
లేదా అహం ఉంటుంది. ఇది ఇలా ఎందుకు? ఇలా చేయకూడదు? అవ్వకూడదు. జ్ఞానం ఇదే
చెప్తుందా అని అనటం కూడా సూక్ష్మ అహంకారం యొక్క అంశం. అందువలన దయాహృదయులు, దాతలు,
స్వమానంలో ఉండేవారు అందరికీ గౌరవం ఇస్తారు. గౌరవం ఇచ్చి పైకి లేవనెత్తుతారు.
ఒకవేళ ఏ పురుషార్థి అయినా తన బలహీనతలో లేదా సోమరితనం కారణంగా క్రిందికి
పడిపోయినా అనగా తన స్థితి నుండి క్రిందికి వచ్చేసినా కానీ మీరు స్వమానధారులు
పుణ్యాత్మలుగా ఉంటారు. పుణ్యాత్మల పని పడిపోయిన వారిని లేవనెత్తటం. సహయోగి
అవ్వాలి కానీ ఎందుకు పడ్డారు? అలాగే పడాలి, కర్మభోగం అనుభవిస్తున్నారు, చేశారు
కనుక తప్పక పొందుతారు. ఇలాంటి సంకల్పాలు స్వమానధారి ఆత్మలకి సంకల్పంలో లేదా
మాటలో కూడా రావు. పుణ్యాత్మ పరవశఆత్మను స్వతంత్రంగా తయారుచేస్తుంది. అహంకారం
అంశమాత్రంగా కూడా ఉండదు. స్వమానధారి అని ఇలాంటి వారినే అంటారు. ఇలాంటి వారికి
దేహాభిమానం ఎప్పుడూ రాలేదు. బాబా ప్రతీ బిడ్డను ఇలాంటి పుణ్యాత్మలనే దృష్టితో
చూస్తారు. కనుక తండ్రిని అనుసరించండి. బొంబాయి నివాసీయులు బాబాను అనుసరించటంలో
తెలివైనవారు కదా? బొంబాయి బాబాది కదా! కనుకే సాకార బాబా కూడా ఎక్కువగా బొంబాయి
వచ్చేవారు. ఎన్నిసార్లు సాకారంగా వచ్చారో అంతగా పాలన లభించింది. అలాంటి
పుణ్యాత్మ యొక్క భూమిలో నివసించేవారు కూడా. ఇంత పుణ్యాత్మగా అవ్వాలి. అంటే ఎవరి
పాపాన్ని అయినా పరివర్తన చేసేయాలి. ఎవరి లోపాలను చూడకుండా అద్భుతాన్ని చూడండి.
అప్పుడు ఆ లోపం కూడా అద్భుతంగా పరివర్తన అయిపోతుంది. పుణ్యభూమి యొక్క నివాసీయులు
ఇంత శ్రేష్ఠ ఆత్మలే కదా! బొంబాయి నివాసీయులు నెంబర్ వన్‌గా ఎవరెడీగా ఉంటారు. ఏ
ఘడియలో వినాశన జ్వాల ప్రజ్వలితం అయినా దాని కంటే ముందే సదా తయారు కదా? ఆ సమయంలో
తయారవ్వటం మొదలుపెట్టరు కదా? ఇప్పుడు ఇంకా సంపన్నం అవ్వలేదు అని ఆలోచించరు కదా?
ప్రజలను తయారు చేసుకోలేదు అనరు కదా? ముందు నుండే అన్నింటిలో సంపన్నంగా అవ్వాలి.
ప్రకృతి కూడా మీ కోసం ఎదురు చూస్తుంది - దాసి అయ్యి సేవ చేయటానికి. దాసి యజమాని
గురించే ఎదురుచూస్తారు కదా! అందువలన సదా యజమాని స్థితిలో ఉండండి. మంచిది.