ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తిలో ఎలా ఉండాలి?
ఈ రోజు బాప్ దాదా తన కల్పపూర్వపు గారాబమైన, కోట్లలో
కొద్దిమంది బాబాని తెలుసుకుని మరియు వారసత్వం పొందే విశేష గ్రూపుని చూస్తున్నారు.
అది ఏ గ్రూపు? ఈ రోజు విశేషంగా ప్రవృత్తిలో ఉండే పిల్లలను చూస్తున్నారు.
నలువైపులా ఉన్న పిల్లల యొక్క ప్రవృత్తి స్థానాలను కూడా చూస్తున్నారు, వ్యవహారం
యొక్క స్థానాలు కూడా చూసారు, పరివారాన్ని కూడా చూసారు. ఈనాటి తమోగుణి ప్రకృతి
లేదా పరిస్థితుల యొక్క ప్రభావం ఎలా పడుతుందో, రాజ్యం యొక్క ప్రభావం ఎలా పడుతుందో
ఆ పరిస్థితిని చూస్తున్నారు. అలా చూస్తూండగా కొంతమంది పిల్లల అద్భుతాన్ని కూడా
చూసారు - వారు ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తిగా ఎలా ఉంటున్నారో! ప్రవృత్తి
మరియు నివృత్తి రెండింటినీ సమానంగా ఉంచుకుని చాలామంచి శ్రేష్ఠ పాత్రను
అభినయిస్తున్నారు. సదా బాబాని తోడు ఉంచుకుని సాక్షియై చాలామంచి పాత్ర
అభినయిస్తున్నారు మరియు విశ్వం ముందు ప్రత్యక్ష రుజువు అయ్యారు. సదా బాబా యొక్క
స్మృతి అనే ఛత్రఛాయలో ఏ రకమైన మాయా యుద్ధం నుండి అయినా లేదా మాయ యొక్క అనేక
ఆకర్షణల నుండి సదా రక్షణగా ఉంటున్నారు. ఈ విధంగా విశ్వానికి అతీతంగా ఉండే
అపూర్వ పిల్లలను చూసి బాబా వారి గుణగానం చేస్తున్నారు. కొంతమంది పిల్లలను ఎలా
చూసారంటే వారు ఉండేది ప్రవృత్తి స్థానంలో అయినా కానీ సత్యమైన పిల్లలు
అయినందువలన యజమాని వారికి రాజీ అయిపోతున్నారు. అతీతం మరియు అతి ప్రియం యొక్క
రహస్యం తెలుసుకున్న కారణంగా వారు తమతో తాము కూడా రాజీగా ఉంటారు, ప్రవృత్తిని
కూడా రాజీ చేసుకుంటారు. దాంతోపాటు బాప్ దాదా కూడా సదా వారిపై రాజీ అయిపోతారు.
ఇలా స్వయాన్ని మరియు సర్వులను రాజీ చేసుకునే రాజయుక్త పిల్లలకు ఎప్పుడూ కూడా తమ
గురించి కానీ, ఇతరుల గురించి కానీ ఎవరినీ న్యాయాధికారిగా నియమించుకోవలసిన అవసరం
ఉండదు. ఎందుకంటే కేసే లేనప్పుడు న్యాయాధికారి నియమించుకోవటం ఎందుకు? అనేకసార్లు
విన్నారు - భార్యాభర్తలు రాజీ అయిపోతే న్యాయాధికారి చేసేది ఏముంటుంది? మీ
సంస్కారాల కేసులే మీ దగ్గర చాలా ఉంటాయి. వాటి కోసం మీ లోపలే వాదన జరుగుతూ
ఉంటుంది. తప్పా? ఒప్పా? అవ్వాలా? వద్దా? ఎంత వరకూ అవ్వాలి?... ఇలా వాదన నడుస్తూ
ఉంటుంది. మీకు మీరు నిర్ణయం చేసుకోలేనప్పుడు ఇతరులని న్యాయాధికారిగా చేసుకోవలసి
ఉంటుంది. మరియు కొందరిది చిన్న విషయం, కొందరిది పెద్ద విషయం ఉంటుంది. బాబా మరియు
మీరు ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటే సెకనులో సమాప్తి అయిపోతుంది. అప్పుడు ఎవరినీ
న్యాయాధికారిగా లేదా న్యాయవాదిగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అగ్నిని వ్యాపింప
చేయరు, ఆర్పేస్తారు.
ప్రవృత్తిలో ఒక నియమం ఉంటుంది - ఒకవేళ ప్రవృత్తిలో
ఏదైనా విషయం జరిగితే తల్లితండ్రులు ఆ విషయాన్ని పిల్లల వరకు కూడా తీసుకెళ్ళరు.
అక్కడిక్కడే స్పష్టం చేసుకుని లోపల ఇముడ్చుకుంటారు. ఒకవేళ మూడవవారికి ఆ విషయం
వెళ్తే అది అందరికి వ్యాపించి పోతుంది. మరియు ఏ విషయం అయినా ఎంతగా వ్యాపిస్తుందో
అంతగా ఆ విషయం పెరిగిపోతుంది. ఎలాగైతే స్థూల అగ్ని ఎంతగా వ్యాపిస్తూ ఉంటుందో
అంతగా నష్టం జరుగుతుంది. అలాగే ఈ చిన్న చిన్న విషయాలనేవి రకరకాల వికారాల అగ్ని
వంటివి. అగ్నిని అక్కడే ఆర్పేసారు కానీ వ్యాపింప చేయరు. అదేవిధంగా ప్రవృత్తిలో
బాబా మరియు మీరు తప్ప ఇక మూడవ సమీప ఆత్మకి అనగా పరివారంలోని ఆత్మల వరకు కూడా
విషయం వెళ్ళకూడదు. భార్యాభర్తలు రాజీ అయిపోండి. కోపగించుకోవటం అంటే రహస్యాన్ని
తెలుసుకోకపోవటంతో సమానం. ఏదోకటి జ్ఞానం యొక్క రహస్యాన్ని మిస్ చేస్తున్నారు.
అందువలనే స్వయంతో అయినా లేదా ఇతరులతో అయినా క్రోధంలోకి వస్తున్నారు. వాదిస్తే
చిన్న విషయమే పెద్దది అయిపోతుంది. అలాగే మూడవవారికి చెప్పటం అంటే ఇంటి విషయాన్ని
బయట పెట్టినట్లు. ఈరోజుల్లో ఏదైనా పెద్ద కేసు ఉంటే అది పత్రికల వరకూ కూడా
వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా బ్రాహ్మణ పరివారం అనే పత్రికలో పడిపోతుంది.
కనుక పరస్పరంలో నిర్ణయం చేసుకుంటే సరిపోదా! బాబాకి తెలియాలి మరియు మీకు తెలియాలి,
మూడవ వారికి ఎవరికీ తెలియకూడదు. కొంతమందికి పిల్లల సంకల్పం చేరుతుంది -
భార్యాభర్తలు సరే కానీ భర్త నిరాకారుడు. భార్య సాకారి. అందువలన కలిసేది తక్కువ
అవుతుంది. ఒక్కోసారి మిలనం జరుగుతుంది, ఒక్కోసారి జరగటం లేదు, అలాగే ఆత్మిక
సంభాషణ కూడా ఒకసారి చేరుతుంది ఇంకోసారి చేరటం లేదు అంటే జవాబు లభించటం లేదు.
కానీ మీకు దొరికిన భర్త బహురూపి. ఏ రూపాన్ని మీరు కోరుకుంటే ఆతి రూపంలో ఆయన
హాజరు కాగలరు. అందువలన మీరు కూడా బాబా సమానంగా బహురూపీగా అవ్వండి.
ఎటువంటి దేశమో అటువంటి వేషం:-
బాబా అయితే ఒక్క సెకనులో మిమ్మల్ని ఎగిరింపచేసి
వతనానికి తీసుకువెళ్ళిపోగలరు. బాబా వతనం నుండి ఆకారంలోకి వస్తున్నారు. మీరు
సాకారం నుండి ఆకారంలోకి రండి. కలుసుకునే స్థానానికి చేరండి. స్థానం కూడా గొప్పది
ఉండాలి కదా? సూక్ష్మ వతనం లేదా ఆకారి వతనమే కలుసుకునే స్థానం. సమయం
నిర్ణయించబడింది, కలయిక నిర్ణయించబడింది, స్థానం కూడా నిర్ణయించబడింది, అయినా
కానీ ఎందుకు కలయిక జరగటం లేదు? ఏం పొరపాటు చేస్తున్నారంటే మట్టితో పాటూ అక్కడికి
రావాలనుకుంటున్నారు. దేహం అనేది మట్టి. మట్టితో (దేహం) పని చేయాల్సి
వచ్చినప్పుడు చేయండి. కానీ బాబాను కలుసుకునే సమయం వచ్చినప్పుడు దేహాభిమానాన్ని
వదలవలసి ఉంటుంది. బాబా దుస్తులనే మనమూ వేసుకోవాలి. అంటే సమానంగా ఉండాలి కదా?
ఎలాగైతే బాబా నిరాకారి నుండి ఆకారీ వస్త్రాన్ని ధరిస్తారో, ఆకారీ మరియు నిరాకారీ
కలిసి బాప్ దాదా అవుతారో అలాగే మీరు కూడా ఆకారీ దుస్తులు ధరించి రండి. మెరిసే
దుస్తులు వేసుకుని రండి. అప్పుడు కలయిక జరుగుతుంది. దుస్తులు ధరించటం రావటం లేదా?
దుస్తులు వేసుకోండి మరియు వెంటనే చేరిపోండి. ఈ దుస్తులు మాయ యొక్క నీటిని లేదా
అగ్నిని చేరనివ్వవు. ఈ పాత ప్రపంచం యొక్క వృత్తి మరియు తరంగాలు తాకవు. ఇంత
గొప్ప దుస్తులు మీకిచ్చారు. అయినా కానీ కలుసుకునే సమయానికి కూడా వేసుకోవటం లేదు.
ఈ పాత దుస్తులతో చాలా ప్రీతి ఉందా? ఇద్దరు సమానంగా మెరిసే దుస్తులు వేసుకుని
మెరిసే వతనంలో ఉంటే అప్పుడు బాగుంటుంది. ఒకరు పాత దుస్తులు ధరించి, మరొకరు
మెరిసే దుస్తులు ధరిస్తే జోడి కలవదు. అందువలన అనుభవం అవ్వటం లేదు. పాత తరంగాలు
అడ్డుపడుతున్నాయి. అందువలన పరస్పర ఆత్మిక సంభాషణకు జవాబు లభించుట లేదు.
స్పష్టంగా అర్థమవ్వటం లేదు. అందువలన ఇతరులను అల్పకాలికంగా తోడు తీసుకోవలసి
వస్తుంది. వాస్తవానికి భార్యాభర్తల సంబంధం ఎంత స్నేహీ మరియు సమీపమైనది అంటే సైగ
చేస్తే చాలు అర్థమైపోవాలి. సైగ కంటే కూడా సూక్ష్మ సంకల్పం ద్వారా అర్థం
చేసుకోవాలి. ఇది ఎంత ప్రీతికరమైన సంబంధం. మరలా మధ్యలో మూడవవారిని ఎందుకు
పెట్టుకుంటున్నారు? మూడవ వారిని పెట్టుకోవటం అంటే మీ శక్తిని మరియు సమయాన్ని
వ్యర్థం చేసుకోవటం. నేను బాబాని ఎలా కలుసుకున్నాను, ఏమి ఆత్మిక సంభాషణ చేశాను?
ఇలా అద్వితీయ సహయోగియైన ఒక సంభాషణ చేయండి, అంతే కాని న్యాయాధికారిని పెట్టుకుని,
కేసు పెట్టి ఆత్మిక సంభాషణ చేయకండి. మధ్యలో ఎవరినైనా పెట్టుకుంటే నడిరేవులో
చిక్కుకుపోతారు. మరలా మిమ్మల్ని అందించటానికి మీ భర్తయే శ్రమించవలసి ఉంటుంది.
అందువలన విశ్వకళ్యాణ కార్యం ఆగిపోతుంది. వినాశనం ఎప్పుడు అవుతుందని
అడుగుతున్నారు. భార్యలు ఇప్పటికి ఇంకా తయారవ్వకపోతే వినాశనం ఏమి చేయను? వినాశనం
ఎందుకు అవ్వటం లేదో అర్థమైందా? దుస్తులను మార్చుకోవటమే రాకపోతే విశ్వాన్ని ఎలా
మారుస్తారు? మంచిది. ప్రవృత్తిలోని వారి సమాచారం మరలా వినిపిస్తాను. ఇప్పుడు మీ
ప్రవృత్తి యొక్క సమాచారం వినిపించాను.
ఈవిధంగా సదా రాజయుక్తులకి, యుక్తియుక్తులకి, సదా సమీప
సంబంధంలో ఉండేవారికి, సదా రాజీగా ఉండేవారికి మరియు సర్వులనీ రాజీ చేసుకునేవారికి,
సదా కలయిక జరుపుకునేవారికి, సదా బాబాని తోడు చేసుకునే వారికి మరియు సాక్షి
పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.