బెంగాల్, బీహార్, తమిళనాడు మరియు విదేశీ సోదరీ
సోదరుల సన్ముఖంలో మాట్లాడిన మహా వాక్యాలు.
ఈ రోజు నలువైపులా ఉన్న ప్రియమైన పిల్లల యొక్క స్నేహ
గీతాన్ని అమృతవేళ నుంచి బాప్ దాదా వింటున్నారు. స్నేహానికి బదులుగా బాప్ దాదా
దూరదేశవాసీ నుంచి, అవ్యక్త వతనవాసీ నుంచి పిల్లల సమానంగా సాకార వతన నివాసీగా
అయ్యారు. స్నేహానికి స్వరూపం సమానంగా అవ్వటం. కనుక బాప్ దాదా సమాన స్వరూపంగా
అయ్యి స్నేహానికి బదులిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏమి బదులివ్వాలి? తండ్రి
పిల్లల సమానంగా అవ్వగలిగారు. మరి పిల్లలు కూడా సమానంగా అవ్వాలి కదా! ఇదే
స్నేహానికి బదులివ్వడం.
ఈ సంవత్సరంలో విశేషంగా ఏ సమానత చూపిస్తారు. సమయం
యొక్క వేగం తీవ్రంగా వెళ్తూ ఉంది. సృష్టిలోని సర్వాత్మలు బాప్ దాదా మరియు
పరమపూజ్య ఆత్మలైన మీ అందరితో సంకల్పం ద్వారా రకరకాల రూపాల్లో ఒక కోరిక
కోరుకుంటున్నారు. ఆ కోరికలను పూర్తిచేసే మీరు వారి కోరిక యొక్క పిలుపును
వింటున్నారా?
అమృతవేళ యొక్క గొప్ప తనం..
అమృతవేళ నలువైపులా తమోగుణీ వాతావరణం లేదా తరంగాలు
వాయుమండలంలో ప్రాయలోప స్థితిలో ఉండే సమయం. అంటే తమోగుణం యొక్క ప్రభావం అణిగి
ఉంటుంది. అటువంటి సమయంలో సహజంగానే పిలుపు వినబడుతుంది మరియు ఉపకారం జరుగుతుంది,
పిలుపు వినడం కూడా సహజం, ఉపకారం చేయడం కూడా సహజం, వరదానం తీసుకోవడం కూడా సహజం
మరియు దానం చేయడం కూడా సహజం. ఎందుకంటే వాతావరణం వృత్తిని మార్చే విధంగా ఉంటుంది.
అటువంటి సమయంలో వరదానీ ఆత్మలైన మీ అందరి స్థితి కూడా బాబా యొక్క విశేష వరదానాల
ఛత్ర ఛాయ కారణంగా బాబా సమానంగా సంపన్నంగా మరియు దాత స్థితిలో ఉంటుంది.
బ్రహ్మలోక నివాసి బాబా విశేష రూపంలో జ్ఞాన సూర్యునిగా ప్రకాశం మరియు శక్తి
యొక్క కిరణాలను పిల్లలకు విశేష వరదాన రూపంలో ఇస్తారు. అందువలనే ఆ సమయాన్ని
బ్రహ్మ ముహూర్త సమయం అని అంటారు.
కనుక ఈ సమయంలో మీరు కూడా రోజంతటి శ్రేష్ఠ స్థితి లేదా
కర్మ కోసం ముహూర్తం పెట్టుకుంటున్నారా? ఎలాంటి ముహూర్తం పెట్టుకోవాలంటే అలాంటిది
పెట్టుకోవచ్చు. దానితో పాటు అవ్యక్త వతనవాసీ బ్రహ్మాబాబా భాగ్య విధాత రూపంలో ఈ
అమృతవేళలో భాగ్యాన్ని అంటే అమృతాన్ని పంచుతారు. భాగ్యమనే అమృతాన్ని బ్రహ్మాబాబా
ద్వారా ఎంత పొందాలంటే అంత పొందవచ్చు. కానీ బుద్ధిరూపీ కలశం అమృతాన్ని ధారణ చేసే
యోగ్యంగా ఉండాలి. ఏ రకమైన విఘ్నం లేదా ఆటంకం ఉండకూడదు. ఈ సమయంలో ఇవ్వడం మరియు
తీసుకోవడం రెండూ వెనువెంటే నడుస్తాయి. వరదానీ మరియు మహాదాని రెండు పాత్రలు
వెనువెంటే నడుస్తాయి. ఇటువంటి స్థితిలో స్థితులయ్యే ఉపకారీ ఆత్మలకు ఆత్మల యొక్క
పిలుపు కూడా స్పష్టంగా వినిపిస్తుంది. చెవిలో ఎవరో మాట్లాడుతున్నంత స్పష్టంగా
వినిపిస్తుంది.
పిలిచే వారికి ఉపకారం ఎలా:-
వర్తమాన సమయంలో అందరి పిలుపు ఏమిటో తెలుసా? ధర్మనేతలు,
రాజ్య నేతలు మరియు సర్వ శ్రేష్ఠ వైఙ్ఞానికులు వీరితో పాటు సామాన్య ప్రజలు అందరి
పిలుపు ఇదే - ఇప్పుడు త్వరలో కొంచెం మారాలి అనే సర్వ క్షేత్రాలలోని ఆత్మలు
ఇప్పుడు తమను తాము ఫెయిల్ అయినట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. ఉన్నతోన్నత శక్తి
ఏదో ఇప్పుడు కావాలనుకుంటున్నారు. ఈ కోరిక యొక్క దీపం లేదా ఈ అవసరాన్ని పూర్తి
చేసుకోవాలనే సంకల్పం యొక్క దీపం వెలిగించబడి ఉంది. అప్పుడు ఆ దీపం యొక్క కాంతిని
పెంచడానికి మీ అందరి యొక్క సంకల్పం అనే నూనె కావాలి, దాని ద్వారా పిలిచిన
వారందరికీ ఉపకారం చేయగలగాలి (ఈ రోజు రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కరెంటు పోతూ
ఉంది) చూడండి, ఈ లైటు కూడా శిక్షణ ఇస్తోంది. ఈ లైట్ ఎలాగైతే ఒక్కసెకెనులో
వస్తుంది మరియు పోతుందో అదే విధంగా మీరు కూడా ఉపకారీ అయి ఒక్క సెకెనులో
పిలిచేవారి దగ్గరకి చేరుకోవాలి. ఇలా వస్తూ వెళ్తూ ఉండే అభ్యాసం చేయాలి. ఇప్పుడే
పిలుపు విన్నారు. ఇప్పుడే చేరిపోవాలి. శ్రమ నుంచి విడిపింపబడి సహజంగా ప్రాప్తి
పొందాలని అందరూ పిలుస్తున్నారు. వైజ్ఞానికులు కూడా చాలా శ్రమ చేసి అలసిపోయారు.
ధార్మిక ఆత్మలు కూడా సాధనలు చేసి అలసిపోయారు. రాజకీయ నేతలు కూడా పార్టీలు
మారడంలో అలసిపోయారు మరియు ప్రజలు సమస్యలతో అలసిపోయారు. ఇప్పుడు అందరి అలసటను
తీర్చేది ఎవరు?
ద్రౌపది పాదాలు నొక్కడం యొక్క అర్థం: -
కల్పపూర్వపు స్మృతి చిహ్న శాస్త్రాలలో స్వయం భగవంతుడే
ద్రౌపది పాదాలు నొక్కినట్టుగా వర్ణన ఉంది. అదే విధంగా బాబా సమాన ఉపకారీ
పిల్లలుగా అయి సర్వాత్మల అలసటను తొలగించండి. ఇప్పుడు బుద్ధి రూపీ పాదం అలసి
పోయింది. బుద్ధిలో స్మృతి అనే స్విచ్ వేయండి. ఇదే బుద్ధి రూపీ పాదాన్ని నొక్కడం.
ఈ సంవత్సరం ఏమి చేయాలో విన్నారా? ఒక్క సెకెనులో మెరుపు
మరియు ఫరిస్తా స్థితి యొక్క నషా చూపించాలి. ఇదే బాబా స్నేహానికి బదులివ్వడం,
ఇతరాత్మల సమస్యలకు సమాధాన స్వరూపంగా అవ్వడం ద్వారా స్వయం యొక్క సమస్యలు
స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. అందువలన ఇప్పుడు సమాధాన స్వరూపంగా అవ్వండి. ఈ
సంవత్సరంలో మీ స్వరూపాన్ని ఇలా పరివర్తన చేసుకున్నారు కదా? విశ్వ పరివర్తకులు,
స్వ పరివర్తకులుగా అయిపోయారు కదా? లేక ఇప్పుడు కూడా అవ్వాలా? ఇప్పుడు తయారవ్వాలా
లేదా విశ్వసేవ చేయాలా? ఇప్పుడు సేవ చేసే సమయం, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయం. ఒకే
సంకల్పంలో ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఇటువంటి తీవ్ర వేగం కావాలి. అంతిమ సీజన్
మరియు దాని కొరకు తయారీ ఎదురు చూస్తున్నారు కానీ తయారయ్యారా? బాబా రావాలని
ఎదురుచూశారు. కానీ బాబా వచ్చి ఏమి చూస్తారు? ఎంత వరకు తయారయ్యారో చూస్తారు. మరి
ఆ విధంగా తయారయ్యారా? స్థూల సీజన్ కొరకు అన్ని తయారీలు చేసుకుంటారు కదా!
సేవాధారులను తయారు చేసుకుంటారు, సామాన్లన్నింటినీ తయారు చేసుకుంటారు. ఎవరికీ ఏ
కష్టం కలుగకూడదు, సమయం వ్యర్థం అవ్వకూడదు, ఎవరు క్యూలో నిలుచుని ఉండకూడదని
భావిస్తూ వాటి కొరకు అన్ని సాధనాలను సమకూర్చుకుంటారు కదా! ఇది బ్రాహ్మణుల యొక్క
మధువనం యొక్క సీజన్. కానీ ఇప్పుడు అంతిమ సీజన్ ఏది రానున్నది? సర్వాత్మలకు గతి
సద్గతినిచ్చే సీజన్ రానున్నది. దాని కోసం ఏమి సాధన చేసారు? దప్పికతో ఉన్న
ఆత్మలను క్యూలో నిల్చుని పెట్టే హస్తం ఇవ్వకూడదు. వస్తూ ఉండాలి మరియు
తీసుకుంటుండాలి. దప్పికతో ఉన్న ఆత్మలు ఒక్క సెకను కూడా ఆగలేరు. హాహాకారాలు
చేసేస్తారు. ఇలాంటి సీజన్ కోసం తయారేనా? మహారథీలను మరియు అవిటివారిని కూడా
క్యూలో నిలుచోపెట్టకూడదు. లండన్ లో కూడా క్యూ కడతారా? విదేశీయులు కూడా క్యూలో
నిలుచుంటారా అయితే ఏం చేస్తారు? ఎవరెడీగా అవ్వాల్సి ఉంటుంది. భారతవాసీలు లేదా
విదేశీలు ఎవరెడీగా తయారు కాకుండా మాస్టర్ గతి సద్గతి దాతలుగా తయారుకాలేరు.
ఎక్కువ పురుషార్థీ జీవితంలో ఉండటం కంటే ఇప్పుడు దాత స్థితిలో ఉండండి. దాత
సంతానమైన నేను దాతగా ఉన్నానా అని ప్రతి సెకెను పరిశీలించుకోండి. ప్రతి సంకల్పం
మరియు ప్రతి సెకెను దాత అయి నడవండి. అప్పుడు సెకెండ్ లో మీరందరూ కూడా హైజంప్
చేయగలరు. ఇవ్వడంలో బిజీ అయిపోతే మాయ కూడా మీ బిజీని చూసి యుద్ధం చేయడానికి బదులు
నమస్కారం చేస్తుంది. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో?
నలువైపులా ఉన్న పిల్లలు సాకార రూపంలో దూరంగా ఉన్నా
కానీ స్నేహంతో సమీపంగా ఉన్నారు. ఇటువంటి స్నేహీ మరియు సమీప పిల్లలకు బాప్ దాదా
సమానభవ అనే వరదానంతో స్మృతికి బదులిస్తున్నారు (కరెంటు పోయింది) చంచలంలో కూడా
అచంచలంగా ఉండాలి. ఇలా జరగడం పెద్దదేమీ కాదు. అంతిమ సీజన్ సమయంలో ఏ రకమైన సాధనం
మీకు లభించదు. ఇప్పుడైతే చాలా సాధనాలున్నాయి. కనుక ఇది కూడా అభ్యాసం చేయండి.
వాతావరణంలో అలజడి ఉన్నా కానీ స్మృతి మరియు వృత్తి అచంచలంగా ఉండాలి. ఇలా
జరిగిందేమిటి అని కొంచెం కూడా అలజడి ఉండకూడదు. ఇప్పుడు దాని కొరకు అభ్యాసం
అవుతుందా?
బాప్ దాదాకు కూడా డ్రామానుసారం పాత ప్రపంచం యొక్క
దృశ్యాలు చూపిస్తున్నారు. మంచిది.
ఈ విధంగా సదా ఉపకారీ ప్రతి సెకెండు మాస్టర్ గతి సద్గతి దాతలుగా ఉండేవారికి ,
శక్తుల యొక్క భండారాతో నిండుగా ఉండేవారికి, తరగని ఖజానాల యొక్క దాతలకు
సర్వాత్మల అలసటను తొలగించే అలసిపోని సేవాదారులకు, ఇటువంటి దాత సమాన సమీప
పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.