మనన శక్తియే మాయాజీగా అయ్యేటందుకు సాధనం.
మననం ద్వారా మగ్న స్థితిలో ఉండే మాస్టర్ భగవాన్
పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
ఈ రోజు బాప్ దాదా పిల్లల యొక్క అనేక రకాల పురుషార్థం
యొక్క విధులను చూస్తూ పిల్లల యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు, బాబాని కలుసుకోవాలనే
సంలగ్నత, స్నేహం యొక్క సంకల్పం, సదా సహయోగి అయ్యే కార్యంలో తత్పరులై ఉండటం,
అన్ని సాంగత్యాలు వదిలి ఒకే సాంగత్యాన్ని జోడించే శ్రమను చూసి బాప్ దాదా
హర్షిస్తున్నారు కూడా మరియు వెనువెంట స్నేహం కారణంగా దయ అనిపిస్తుంది కూడా.
ప్రతి ఒక్కరు తమ తమ శక్తిననుసరించి లక్ష్యాన్ని పొందేటందుకు తీవ్రవేగంలో
నిమగ్నమై ఉన్నారు. వేగంగా వెళ్ళి మొదట నెంబరు రావాలి అని అందరి కోరిక ఇదే.
రాత్రి పగలు ఇదే సంలగ్నతతో నడుస్తున్నారు. లక్ష్యం ఒక్కటే మరియు సంలగ్నత కూడా
ఒకనితోనే ఉంది, తోడు కూడా ఒకరే అయినా కానీ కొంతమంది మహావీరులుగా ఉన్నారు,
మరికొంతమంది చాలా శ్రమను అనుభవం చేసుకుంటున్నారు. కొందరు సహజ యోగులు, కొందరు
పురుషార్థ యోగులు. కొందరు సర్వ ప్రాప్తి స్వరూపులు, కొందరు సర్వ ప్రాప్తిని
పొందటంలో బాగా నిమగ్నమై ఉన్నారు. కొందరు మాయాజీతులు, మరికొందరు మాయా విఘ్నాలతో
యుద్ధం చేయటంలో నిమగ్నమై ఉన్నారు. పొందవలసినదేదో పొందాను - ఇది కొందరి మనస్సు
యొక్క మాట, ఇప్పుడు పొందుతున్నాము అనేది మరికొందరి మాట. కొందరు సదా తోడుని
అనుభవం చేసుకుంటున్నారు, మరికొందరు సదా తోడు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా
చూసి శ్రమ చేసే పిల్లలపై బాప్ దాదాకి దయ వస్తుంది. ఒకే తండ్రి యొక్క పిల్లలు ఈ
విధంగా రెండు రకాలుగా ఉన్నారు, ఎందుకు? మరియు ఈ శ్రమ కూడా ఎంత వరకు? ఇది అలౌకిక
జన్మ, ఈ జన్మకి వరదానం ఉంది. ఎందుకంటే వరదాత ద్వారా ఈ జన్మ లభించింది ఇటువంటి
వరదాని జన్మ లభించినప్పటికి ఈ జన్మలో మజాగా ఉండడానికి బదులు శ్రమలోనే గడిపేస్తే
ఇటువంటి వరదాని జన్మ మరలా ఎప్పుడు లభిస్తుంది? అందువలన ఈ వరదాని జన్మ యొక్క
ప్రతి సెకను సర్వ పాపులనిచ్చే సౌభాగ్యశాలి సెకను. ఇటువంటి సమయాన్ని పొందడానికి
బదులు శ్రమలో వినియోగిస్తే బావుంటుందా? కోరుకోవటం లేదు కానీ అయినా కానీ
చేసేస్తున్నారు. ఎందుకు? ఈరోజు బాప్ దాదా విశేష కారణాన్ని చూశారు. ముఖ్య కారణం
ఏమిటంటే వద్దనుకున్నా కానీ
పరవశం అయిపోతున్నారు, ఎవరికి వశం అయిపోతున్నారు అనేది
కూడా బాగా తెలుసు. తెలిసి ఉండి, దాని నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ కూడా
తిరిగి ఆ చక్రంలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మాయ కూడా చాలా తెలివైన రూపంలో
వస్తుంది. ఈ బ్రాహ్మణులకి ముఖ్య ఆధారం బుద్ధియోగం, దివ్యబుద్ది ద్వారానే బాబాని
కలుసుకోగలరు అని మాయకి కూడా తెలుసు. అందువలన మాయ కూడా మొట్టమొదట బుద్ధిపైనే
యుద్ధం చేస్తుంది. బలహీనం చేసేస్తుంది. దేని ద్వారా? మాయ యొక్క విశేష బాణం -
వ్యర్థ సంకల్పాల రూపంలో వేస్తుంది. ఈ బాణం ద్వారా దివ్యబుద్ధిని బలహీనం
చేసేస్తుంది మరియు బలహీనం అయిన కారణంగా పరవశం అయిపోతున్నారు. బలహీన వ్యక్తి ఏది
కావాలంటే అది చేయలేడు. అందువలనే మీరు కూడా అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు.
ఈ కారణానికి నివారణ సర్వశక్తివంతుడైన బాబా ద్వారా ఏదైతే లభించిందో ఆ శక్తిని
కార్యంలో వినియోగించటం లేదు. ఆ విశేష శక్తి - మనన శక్తి. మననశక్తిని ఉపయోగించటం
రావటం లేదు. మననశక్తియే దివ్యబుద్ధికి ఆహారం.ఆహారం తినకపోవటం వలన బలహీనం
అయిపోతున్నారు మరియు బలహీనం అయిపోయిన కారణంగా పరవశం అయిపోతున్నారు. మననశక్తి
యొక్క విస్తారం చాలా పెద్దది. కానీ విధి రావటం లేదు.
బ్రాహ్మణ జన్మ తీసుకున్న దగ్గర్నుండి ఇప్పటి వరకు
స్వయంగా తండ్రి ద్వారా ఎన్ని బిరుదులు విన్నారు! వాటిని వర్ణిస్తే చాలా పెద్ద
మాల తయారవుతుంది. భక్తిమార్గంలో కూడా స్మరణ చేసే అభ్యాసీలు ఒకొక్క మణిని
చేతిలోకి తీసుకుని స్మరిస్తారు. భక్తిలో స్మరణ శక్తి, జ్ఞానంలో స్మృతి శక్తి.
భక్తాత్మలు తమ శక్తిని ఎప్పుడు మర్చిపోరు. అల్పకాలిక విధుల ద్వారా అల్పకాలిక
సిద్ధులు పొందుతూ ఉంటారు. మరి జ్ఞాని ఆత్మలైన మీరు స్మృతిశక్తి యొక్క విధిని
ఎందుకు మర్చిపోతున్నారు? రోజు అమృతవేళ మీ యొక్క ఒక బిరుదుని అయినా స్మృతిలోకి
తెచ్చుకోండి మరియు మననం చేస్తూ ఉంటే ఆ మననశక్తి ద్వారా బుద్ధి సదా శక్తిశాలిగా
ఉంటుంది. శక్తిశాలి బుద్ధిపై మాయ యుద్ధం చేయలేదు అంటే పరవశం కాలేరు. కనుక ముఖ్య
కారణం - బుద్ధి యొక్క బలహీనత; బలహీనతకు నివారణ - మననశక్తి.
ఈరోజుల్లో విశేషాత్మలు అంటే విద్యావంతులు ఎటువంటి
కార్యమో, ఎటువంటి స్థానమో ఆవిధంగా దుస్తులు మార్చుకుంటారు. మీ జడచిత్రాలకు కూడా
ప్రతి సమయం దుస్తులు మారుస్తూ ఉంటారు. భవిష్య దేవతా రూపంలో కూడా ప్రతి
కార్యానికి వేర్వేరు దుస్తులు ఉంటాయి. భవిష్య సంస్కారమనేది వర్తమానంపై ఆధారపడి
ఉంటుంది. ఈ సమయం యొక్క ఆధునికత (ఫ్యాషన్) లేదా ఆచార వ్యవహారాలు సత్యయుగంలో అయితే
నడుస్తాయి. అంతే కాకుండా మీ జడచిత్రాలకు కూడా ఆ ఆచారం ఇప్పుడు కూడా వస్తుంది.
అయితే సంగమయుగ ఆచార వ్యవహారాలు ఏమిటి? ఎటువంటి కార్యం చేస్తున్నారో ఆ
బిరుదుననుసరించి మీ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. బ్రాహ్మణులు అందరి కంటే
ఎక్కువ ఆధునికులు (ష్యాషనబుల్). ఎటువంటి సమయమో అటువంటి స్వరూపం, ఈ స్వరూపమే మీ
దుస్తులు. ఎటువంటి స్మృతియో అటువంటి వృత్తి, అటువంటి దృష్టి మరియు అటువంటి
స్థితి అంటే స్వరూపం. దుస్తులను బట్టి అలంకరణ చేసుకోవటం, అటువంటి బొట్టు
పెట్టుకోవటం, కళ్ళకి కూడా అటువంటి అలంకరణ చేసుకోవటం ఈరోజుల్లో ఫ్యాషన్ కదా!
బ్రాహ్మణులైన మీరే అందరి కంటే ఫ్యాషనబుల్. కనుక ఎటువంటి కర్తవ్యమో అటువంటి
స్మృతి, వృత్తి మరియు దృష్టిని తయారు చేసుకోండి. తిలకం అంటే స్మృతి, కళ్ళకి
అలంకరణ అంటే దృష్టి, మేకప్ వేసుకోవటం అంటే వృత్తి. వృత్తి ద్వారా ఎటువంటి
పరివర్తన కావాలంటే ఆవిధంగా చేయగలరు. కనుక మీరు విశ్వాన్ని పరివర్తన చేసే ఆత్మిక
అలంకార మూర్తులు.
మననశక్తి అంటే మీ యొక్క అనేక టైటిల్స్ ను అంటే
స్వరూపాలను స్మృతిలో ఉంచుకోండి. అనేక గుణాల శృంగారాన్ని స్మృతిలో ఉంచుకోండి,
అనేక రకాల సంతోషకరం విషయాలను స్మృతిలో ఉంచుకోండి. ఆత్మిక నషానిచ్చే పాయింట్స్
ని స్మృతిలో ఉంచుకోండి.రచయిత బాబా యొక్క పరిచయ పాయింట్స్ ను బుద్ధిలో
పెట్టుకోండి. రచన యొక్క విస్తారంగా యొక్క పాయింట్స్ స్మృతిలో ఉంచుకోండి. స్మృతి
ద్వారా అనేక రకాల అనుభవాలు మరియు ప్రాప్తుల యొక్క పాయింట్లను స్మృతిలో ఉంచుకోండి.
ఇలా మననశక్తి యొక్క సాధనం ఎంత పెద్దదో! ఏది కావాలంటే అది మననం చేయండి. మీకు
ఇష్టమైన దానిని మననం చేయండి. మననం చేస్తూ ఉంటే మగ్న స్థితి కూడా సహజంగా
ప్రాప్తిస్తుంది. పరవశం అవ్వడానికి బదులు మాయాజీత్ అయ్యే వశీకరణ మంత్రం సదా
వెంట ఉంటుంది. అప్పుడు మాయ సదాకాలికంగా నమస్కారం చేస్తుంది. మాయయే సంగమయుగంలో
మీ మొదటి భక్తురాలు అవుతుంది. మీరు మాస్టర్ భగవంతులు అయితే భక్తులు కూడా
తయారవుతారు కదా! స్వయమే భక్తునిగా ఉంటే వారు ఎవరికి భక్తులవుతారు! భక్తులు
అవుతారా లేక మాస్టర్ భగవంతులు అవుతారా? దీనికి సహజ సాధనం చెప్పాను కదా -
మననశక్తిని పెంచుకోండి. అర్థమైందా!
సదా శక్తిశాలి స్వరూపంలో స్థితిలై మాయా శత్రువుని కూడా
మీ భక్తునిగా చేసుకునేవారికి, సదా అలంకరించబడిన స్వరూపంలో ఉండేవారికి, వశీకరణ
మంత్రం ద్వారా మాయను వశం చేసుకునే వారికి, స్మృతి ద్వారా సదా సమర్థంగా
ఉండేవారికి, సర్వశక్తివంతులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
నమస్తే.