గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం.
సర్వులకు తండ్రి, శిక్షకుడు, మరియు సద్గురువు అయిన
శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు భాగ్య విధాత బాబా సర్వ భాగ్యశాలీ పిలలను చూసి
విశేషంగా ఆది నుండి అంతిమం వరకు ఒక విషయం యొక్క రికార్డ్ చూస్తున్నారు. ఏ విషయం?
గౌరవం యొక్క రికార్డ్ చూస్తున్నారు. గౌరవం అనేది బ్రాహ్మణ జీవితానికి వృది కళకు
సాధనం. ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో ఆ విశేష ఆత్మ వర్తమాన సమయంలో మరియు జన్మ
జన్మాంతరాలు ఇతరాత్మల ద్వారా గౌరవం పొందటానికి పాత్రులుగా అవుతారు. బాప్ దాదా
కూడా సాకార సృష్టిపై పాత్రను అభినయిస్తూ ఆది కాలం నుండి పిల్లలకి గౌరవం ఇచ్చారు.
పిల్లలని స్వయం కంటే శ్రేష్టంగా భావించి పిల్లల ముందు స్వయం సమర్పణ అయిపోయారు.
మొదట పిల్లలు, తర్వాత బాబా అంటూ పిల్లలను శిరోకిరీటాలుగా చేసారు. పిల్లలే డబల్
పూజ్యులుగా అవుతారు, పిల్లలే బాబాని ప్రత్యక్షం చేయటానికి నిమిత్తం అవుతారు.
బాబా కూడా ఆది కాలం నుండి గౌరవం ఉంచుకున్నారు. అలాగే తండ్రిని అనుసరించే పిల్లలు
ఆది నుండి తమ గౌరవం యొక్క రికార్డ్ చాలా మంచిగా ఉంచుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు
మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - మా యొక్క రికార్డ్ యొక్క ఎలా ఉంది అని?
గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం. 1. బాబాపై గౌరవం 2.
బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం 3. స్వయంపై గౌరవం 4. సంపర్కంలోకి వచ్చే
బ్రాహ్మణాత్మలు అయినా కానీ అజ్ఞానీ ఆత్మలు అయినా కానీ వారి పై కూడా గౌరవం
ఉంచుకోవాలి. ఈ నాలుగు విషయాలలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా రికార్డ్ ఎలా
ఉంది అని? నాలుగు విషయాలలో ఎన్ని మార్కులు వచ్చాయి? నాలుగు విషయాలలో సంపన్నంగా
ఉన్నానా లేక శక్తినననుసరించి కొన్నింటిలో తక్కువగా, కొన్నింటిలో ఎక్కువగా అలా
ఉన్నారా?
మొదటి విషయం - బాబాపై గౌరవం అంటే బాబా ఎవరో,
ఎలాంటివారో ఆ స్వరూపంతో యదార్థంగా గుర్తించి బాబాతో సర్వ సంబంధాలు యొక్క
మర్యాదలను నిలుపుకోవాలి. తండ్రి సంబంధంతో బాబాకి గౌరవం ఇవ్వటం అంటే బాబాని
అనుసరించాలి. శిక్షకుని సంబంధంతో గౌరవం అంటే సదా చదువులో నిత్యం చదువుకోవాలి
మరియు ఖచ్చితంగా ఉండాలి. చదువు యొక్క అన్ని సబ్బక్టులపై పూర్తి ధ్యాస
పెట్టుకోవాలి. సద్గురువు సంబంధంతో గౌరవం అంటే సద్గురువు యొక్క ఆజ్ఞ, దేహ సహితంగా
దేహం యొక్క సర్వసంబంధాలను మర్చిపోయి ఆత్మిక స్థితిలో అంటే సద్గురువు సమానంగా
నిరాకారి స్థితిలో స్థితులు అవ్వాలి. సదా తిరిగి ఇంటికి వెళ్ళిపోవటానికి
సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రియుడు సంబంధంతో గౌరవం ఇవ్వటం అంటే ప్రతి సంకల్పం
మరియు సెకనులో ఒకే సంలగ్నతతో ప్రేయసిగా ఉండాలి. నీతోనే తింటాను, నీతోనే ప్రతి
కర్మలో సదా సాంగత్యంలో ఉంటాను, ఇలా నమ్మకదారి అవ్వాలి. సఖుడు లేదా బంధువు
సంబంధంతో గౌరవం ఉంచుకోవటం అంటే సదా అన్ని విషయాలలో తోడుని అనుభవం చెసుకోవాలి.
ఇలా సర్వసంబంధాల సంబంధం నిలుపుకోవటమే గౌరవం ఇవ్వటం. గౌరవం ఉంచుకోవటం అంటే ఒక్క
బాబా తప్ప మరెవ్వరు లేరు అని ఏదైతే చెప్తున్నారో అలా ఉండాలి. బాబా చెప్పగానే
పిల్లలు చేసేయాలి. అడుగులో అడుగు వేసి నడవాలి. మన్మతం లేదా పరమతం బుద్ధి ద్వారా
ఎలా సమాప్తి చేయాలంటే ఆ విషయం లేనట్లుగా ఉండాలి. మన్మతం లేక పరమతం సంకల్పంలో టచ్
అవ్వటమనేది స్వప్నమాత్రంగా కూడా ఉండకూడదు అంటే అవిద్యాగా ఉండాలి, కేవలం ఒకని
శ్రీమతమే బుద్ధిలో ఉండాలి. విన్నా బాబాతోనే, మాట్లాడినా బాబాతోనే, చూసినా బాబానే,
నడచినా బాబాతోనే, ఆలోచించినా బాబా విషయాలే, చేసినా బాబా చెప్పిన శ్రేష్ట కర్మనే
చేయాలి. దీనినే బాబాపై గౌరవం యొక్క రికార్డు అని అంటారు. ఈ విధంగా
పరిశీలించుకోండి - మొదటి విషయంలో మొదటి తరగతిలో ఉన్నానా లేక రెండవ తరగతిలో
ఉన్నానా? అని. అఖండంగా ఉందా లేక ఖండితం అయిపోయిందా? అచంచలంగా ఉందా లేక మాయా
పరిస్థితులననుసరించి గౌరవం యొక్క రికార్డు అలజడిలోకి వచ్చిందా లేక రేఖ సదా
తిన్నగా ఉందా లేక వంకరగా ఉందా? అని.
రెండవ విషయం - జ్ఞానంపై గౌరవం అంటే ఆది నుండి ఇప్పటి
వరకు ఏవైతే మహావాక్యాలు చెప్పారో ఆ ప్రతి మహావాక్యాలపై అచంచల నిశ్చయం ఉండాలి.
ఎలా అవుతుంది? ఎప్పుడు అవుతుంది? అవ్వాల్సిందే, ఇది సత్యమే కానీ ఇలా ప్రశ్నలు
రావటం అంటే సూక్ష్మ సంకల్పంలో సంశయం రావటం. ఇది కూడా జ్ఞానాన్ని అగౌరవ పరచినట్లే.
ఈ రోజుల్లో అల్పకాలిక చమత్కారం చూపించేవారు అంటే బాబా నుండి వంచితం చేసేవారు,
యదార్ధం నుండి దూరం చేసే పేరుకి మహానాత్మలుగా పిలవబడేవారిని సత్యవచన మహా రాజులు
అంటారు. కానీ సద్గురువు, మహాన్ ఆత్మల రచయిత అయిన పరమపిత యొక్క సత్యమైన జ్ఞానంలో
ప్రశ్నలు రావటం లేదా సంకల్పాలు రావటం ఇది కూడా రాయల్ రూపం యొక్క సంశయం. అంటే
జ్ఞానాన్ని అగౌరవ పరచినట్లు. ఒకటి - స్పష్టంగా అర్థం చేసుకోవటానికి ప్రశ్నలు
వస్తాయి. రెండు - సూక్ష్మ సంశయంతో ప్రశ్నలు రావటం. ఇది కూడా అగౌరవ పరచినట్లు.
బాబా అయితే అలా చెప్తారు కానీ అలా అవ్వటం అసంభవం, కష్టం అనుకుంటే ఆ సంకల్పం కూడా
ఏ ఖాతాలోకి వెళ్తుందో పరిశీలించుకోండి.
మూడవ విషయం - స్వయంపై గౌరవం అంటే బాబా ద్వారా ఈ
అలౌకిక శ్రేష్ట జీవితం లేదా బ్రాహ్మణ జీవితానికి ఏవైతే బిరుదులు మరియు అనేక
గుణాలు మరియు కర్తవ్యాల ఆధారంగా ఏ స్వరూపానికి లేదా స్థితికి మహిమ ఉందో
స్వదర్శన చక్రధారులు, జ్ఞాన స్వరూపం లేదా ప్రేమ స్వరూపం, ఫరిస్తా అని బాబా
జ్ఞానం ఆధారంగా ఏవైతే బిరుదులు ఇచ్చారో అలా స్వయాన్ని అనుభవం చేసుకోవాలి లేదా
అటువంటి స్థితిలో స్థితులవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళమో అలాగే తెలుసుకుని భావించి
నడవాలి. ఎవరు అంటే శ్రేష్టాత్మను, డైరెక్ట్ బాబా సంతానాన్ని, అనంతమైన ఆస్తికి
అధికారిని, మాస్టర్ సర్వ శక్తివంతుడిని ఇలా మనం ఎలాంటి వాళ్ళమో అలా భావించి
నడవాలి. దీనినే స్వయంపై గౌరవం అని అంటారు. నేను బలహీనుడిని, నాలో ధైర్యం లేదు,
బాబా అంటున్నారు కానీ నేను తయారుకాలేను, డ్రామాలో నా పాత్ర వెనుకే ఉంది. ఎంత
ఉందో అంతే మంచిది. ఇలా స్వయం బలహీనం అవ్వటం కూడా స్వయాన్ని అగౌరవం పరచుకున్నట్లు.
అందువలన స్వయంపై గౌరవం యొక్క రికార్డ్ ఎలా ఉంది అని పరిశీలించుకోండి.
నాల్గవ విషయం - సంబంధ సంపర్కాలలోకి వచ్చే ఆత్మలపై
గౌరవం అంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఆత్మపై అంటే బ్రాహ్మణాత్మ అయినా, అజ్ఞాని
ఆత్మ అయినా కానీ ప్రతి ఆతపై శ్రేష్టభావన అంటే ఉన్నతంగా చేసే భావన మరియు ముందుకు
తీసుకువెళ్ళే భావన, విశ్వ కళ్యాణం యొక్క కామన ఉండాలి. ఈ ధారణలతో ప్రతి ఆత్మ
యొక్క సంపర్కంలోకి రావాలి. ఇదే గౌరవం ఉంచుకోవటం. సదా ఆత్మ యొక్క గుణాలను లేదా
విశేషతలను చూడాలి. అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు. మీ యొక్క ఉన్నతమైన శుభవృత్తి
ద్వారా, శుభ చింతక స్థితి ద్వారా, ఇతరాత్మల అవగుణాలను కూడా పరివర్తన చేయాలి.
దీనినే అంటారు ఒక ఆత్మ ఇంకొక ఆత్మకి ఇచ్చే గౌరవం అని. సదా మీ స్మృతి యొక్క
సమర్థత ద్వారా ఇతర్మాతలకు సహయోగం అవ్వటమే గౌరవం. సదా మొదట మీరు అనే మంత్రాన్ని
సంకల్పంలో మరియు కర్మలోకి తీసుకురావాలి. ఎవరి అవగుణాన్ని లేదా బలహీనతను అయినా
మీ అవగుణం లేదా మీ బలహీనతగా భావించి దానిని వర్ణన చేయడానికి బదులు,
వ్యాపింపచేయడానికి బదులు దానిని మనలో ఇముడ్చుకోవాలి మరియు పరివర్తన చేయాలి.
దీనినే గౌరవం అంటారు. ఎవరి బలహీనత యొక్క పెద్ద విషయాన్ని అయినా కానీ చిన్నదిగా
చేయాలి. పర్వతాన్ని రాయిగా చేయాలి కానీ రాయిని పర్వతంగా చేయకూడదు. దీనినే గౌరవం
అంటారు. బలహీనమైన వారిని శక్తిశాలిగా చేయాలి. సాంగత్యం యొక్క రంగులోకి రాకూడదు.
సదా ఉత్సాహ, ఉల్లాసాలలోకి తీసుకురావాలి. దీనినే గౌరవం ఇవ్వటం అంటారు. ఇలా ఈ
నాల్గవ విషయంలో కూడా ఎన్ని మార్కులు వచ్చాయి అని పరిశీలించుకోండి. అర్థమైందా ఎలా
గౌరవం ఇవ్వాలో?ఇలాగే నాలుగు విషయాలలో గౌరవాన్ని మంచిగా ఉంచుకున్నవారే విశ్వంలో
ఆత్మల ద్వారా గౌరవం పొందటానికి పాత్రులుగా అవుతారు. అంటే ఇప్పుడు
విశ్వకళ్యాణకారీ రూపంలో మరియు భవిష్యత్తులో విశ్వ మహారాజు రూపంలో మరియు మధ్యలో
శ్రేష్ట పూజ్యరూపంలో ప్రసిద్ధం అవుతారు. అందువలన విశ్వ మహారాజుగా అవ్వాలంటే
రికార్డ్ కూడా ఇలా తయారుచేసుకోండి. గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం. ఇవ్వటమే
తీసుకోవటం అయిపోతుంది. ఒకటి ఇవ్వటం అంటే పది పొందటం. సహజమే కదా!
కర్ణాటక వారు సదా బాబాకి స్నేహమూర్తిగా ఉంటారు.
కర్ణాటక భూమి చాలా సహజమైనది. భావన కారణంగా ఫలం ఇస్తుంది. అందువలన ఎక్కువ వృద్ధి
అవుతుంది. కర్ణాటక భూమికి సహజంగా సందేశం లభించే వరదానం డ్రామానుసారంగా లభించింది.
ఈ భూమి నుండి విశేషాత్మలు కూడా సహజంగా వస్తారు. కానీ ఇప్పుడు ఇక ముందు ఏమి
చేయాలి? ఏదైతే వృద్ధి అవుతుందో దానిని విధి పూర్వకంగా విడిపించాలి. సర్వ శక్తుల
ఆధారంగా పాలనలో సదా మహా వీరులుగా చేయాలి. స్నేహం మరియు శక్తి యొక్క సమానత
ఉంచుకునే విశేషతను తీసుకురావాలి. భోళానాధుడైన బాబా పిల్లలు భోళా పిల్లలు
మంచివారు. దీపపు పురుగులు మంచివారు. బాప్ దాదాకి ఇష్టమైనవారు. ఇప్పుడు బాబాకి
ప్రియమైనవారితో అవ్వటంతో పాటు లోకానికి ప్రియమైన వారిగా కూడా అవ్వాలి. మంచిది.
సదా బాబాని అనుసరించే వారికి, ఆజ్ఞాకారి,నమ్మకదారి,
విశ్వాసపాత్రులకు, సదా మహాదాని, వరదాని అంటే విశ్వకళ్యాణకారి, ప్రతి ఆత్మకు
గౌరవం ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళేవారికి, సదా శుభచింతకులైన ఆత్మలకు బాప్ దాదా
యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.