తిలకం, కిరీటం మరియు సింహాసనాధికారిగా అయ్యే
యుక్తులు.
దేహానికి అతీతంగా ఆత్మ రూపంలో స్థితులయ్యే ప్రియమైన
పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -
బాప్ దాదా పిల్లలందరి వర్తమానం మరియు భవిష్యత్తు
రెండింటి తేడా చూస్తూ ఈరోజు బాప్ దాదా పిల్లల వర్తమానాన్ని చూస్తూ హరిస్తున్నారు
కూడా, వెనువెంట కొంతమంది పిల్లల విచిత్ర నడవడికను చూసి దయ కూడా వస్తుంది. బాబా
ఎంతో శ్రేష్టంగా తయారుచేస్తున్నారు కానీ పిల్లలు తమ చిన్న పొరపాటు కారణంగా లేదా
సోమరితనం కారణంగా శ్రేష్ట స్థితి నుండి క్రిందికి వచ్చేస్తున్నారు. ఈ రోజు బాప్
దాదా విశేషంగా పిల్లల యొక్క రకరకాలైన నవ్వు వచ్చే రూపాలను చూస్తున్నారు.
బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాప్ దాదా సంగమయుగీ విశ్వ సేవా బాధ్యతా కిరీటధారులుగా
తయారు చేస్తున్నారు. కానీ ఈరోజు రమణీయమైన ఆటను చూసారు. కొంతమంది కిరీటం మరియు
తిలకధారులుగానే ఉన్నారు. కానీ కొంతమంది కిరీటధారులుగా ఉండటానికి బదులు పూర్వ
జన్మ యొక్క మరియు ఇప్పుడు చేసిన చిన్న, పెద్ద పాపాలు లేదా నడుస్తూ, నడుస్తూ
చేసిన అవజ్ఞల యొక్క మూట తలపై ఉంది. కొంతమంది కిరీటధారులుగా ఉన్నారు, కొంతమంది
మూటను పెట్టుకుని ఉన్నారు. వాటిలో కూడా నెంబర్ వారీగా చిన్న, పెద్ద మూటలు
ఉన్నాయి మరియు కొంతమంది తలపై డబుల్ లైట్ బదులు బ్రాహ్మణ జీవితం యొక్క సదా
నిమిత్త స్వరూపానికి బదులు గృహస్థం యొక్క రకరకాల భారం అనే గంపను తలపై
పెట్టుకుంటున్నారు. ఇది చూసి బాబాకి చాలా దయ వస్తుంది. ఇంకేమి చూసారు? కొంతమంది
పిల్లలు బాబా ద్వారా అనేక సహజ సాధనాలు లభిస్తున్నా కానీ నిరంతరం బుద్ది యొక్క
సంబంధం బాబాతో జోడించని కారణంగా, సహజాన్ని కష్టంగా చేసుకుంటున్న కారణంగా అనేక
రకాల కష్టమైన సాధనాలు సొంతం చేసుకోవటంలో అలసిపోయిన రూపంలో కనిపిస్తున్నారు. సహజ
మార్గానికి బదులు పురుషార్ధం యొక్క సాధనాలను హఠంగా ఉపయోగిస్తున్నారు. ఇంకేమి
చూసారు?
ఎలాగైతే సూర్యుడి ముందుకి మేఘాలు రావటం ద్వారా
సూర్యుడు కనిపించడో అలాగే మాటి మాటికి మాయ అనే మేఘాల కారణంగా కొంతమంది పిల్లలు
జ్ఞాన సూర్యుని నుండి వేరు అయిపోయి మరలా సూర్యుడిని పొందటానికి ప్రయత్నం
చేస్తున్నారు. ఒక్కొక్కసారి సన్ముఖంగా, ఒక్కొక్కసారి విముఖంగా ఇలా ఈ ఆటలో
నిమగ్నం అయ్యి ఉన్నారు. వెనువెంట కొంతమంది పిల్లలు తుంటరివారు అవ్వటం వలన బాబా
యొక్క స్మృతి అనే ఒడి నుండి తొలగిపోయి మాయ యొక్క మట్టిలో అంటే దేహాభిమానం అనే
స్మృతి రూపి మట్టితో ఆడుకుంటున్నారు. బాబా మాటి మాటికి ఆ మట్టి నుండి దూరం
చేస్తున్నారు కానీ తుంటరితనం యొక్క సంస్కారం కారణంగా మరలా మురికిగా
అయిపోతున్నారు. కొంతమంది పిల్లలు అల్పకాలిక సుఖాల యొక్క ఆకర్షణీయ వస్తువుల
యొక్క ఆకర్షణలోకి వచ్చి ఆ వస్తువులలో ఎంతగా బిజీ అయిపోతున్నారంటే అంత సమయం మరియు
అవినాశి ప్రాప్తిని మర్చిపోతున్నారు, మరలా తెలివిలోకి వస్తున్నారు. ఇలా పిల్లల
అనేక రకాలైన విచిత్ర రూపాలను చూసారు. ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి నా రూపం ఏమిటి?
అని. బాప్ దాదా అయితే ప్రతి ఒక్క బిడ్డను శ్రేష్ట స్వరూపంలో చూడాలనుకుంటున్నారు.
కిరీటాన్ని, హృదయ సింహాసనాన్ని వదిలేసి మూటను ఎందుకు పెట్టుకుంటున్నారు? కిరీటం
బాగుందా? గంప బాగుందా? మూట బాగుందా? మూడింటి ఫోటోలను ఎదురుగా ఉంచుకుంటే ఏది
ఇష్టమనిపిస్తుంది? 63 జన్మలు అందరు ఈ అద్భుతమైన ఆటను ఆడారు. ఇప్పుడు సంగమయుగంలో
ఏమి ఆట ఆడాలి? అన్నింటికంటే మంచి ఆట బాబా మరియు పిల్లల కలయిక యొక్క ఆట. బాబా
ద్వారా లభించిన జ్ఞాన రత్నాలతో ఆడుకోండి. ఎక్కడ జ్ఞాన రత్నాలు? ఎక్కడ మట్టి?
ఇప్పుడు ఏమి చేయాలి? చిన్ననాటి సోమరితనం యొక్క లేదా తుంటరితనం యొక్క ఆట చాలా
సమయం ఆడారు. కానీ ఇప్పుడు అందరు వానప్రస్థంలోకి వెళ్ళిపోయే సమయం సమీపంగా
వస్తుంది. అందువలన ఇప్పుడు ఈ విషయాలు అన్నీ సమాప్తి చేసుకోవాలి అనే దృఢ సంకల్పం
చేయండి. సదా తిలకం, సింహాసనం, కిరీటధారిగా అవ్వండి. ఈ మూడింటికి పరస్పరం సంబంధం
ఉంది. తిలకం ఉంటే కిరీటం, సింహాసనం తప్పకుండా ఉంటాయి. మీ యొక్క శ్రేష్ట భాగ్యం
మరియు శ్రేష్ట ప్రాప్తులను మాటి మాటికి ఎదురుగా తెచ్చుకోండి. సదా సర్వ
ప్రాప్తులను, సర్వ ప్రాప్తులను ఇచ్చే బాబాను ఎదురుగా ఉంచుకుంటే ఎప్పుడు కూడా
మాయను ఎదుర్కోవటంలో బలహీనం అవ్వరు. కేవలం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి -
సర్వ సంబంధాలతో, ప్రతి కార్యంలో బాప్ దాదా సదా తోడుగా ఉన్నారు అని. తోడుని
వదిలేస్తున్న కారణంగా ఈ విచిత్రమైన ఆటలు ఆడవలసి వస్తుంది. విశ్వసేవా బాధ్యత
తీసుకునే బాబా తోడుగా ఉన్నప్పటికీ కూడా హద్దు యొక్క బాధ్యతలు అనే బరువుగల గంపను
ఎందుకు పెట్టుకుంటున్నారు? విశ్వబాధ్యత తీసుకునే వారు ఈ చిన్న బరువుని మోయలేరా?
అయినప్పటికీ పాత సంస్కారాలకు వశమై మాటి మాటికి భారాన్ని కూడా తలపై
పెట్టుకుంటున్నారు, మరలా అలసిపోయి ఇప్పుడు మమ్మల్ని విడిపించు అని అరుస్తున్నారు.
ఒకవైపు దానిని పట్టుకుంటున్నారు, రెండవవైపు అరుస్తున్నారు. వదిలేస్తే
వదిలిపోతాయి. ఒక సెకను యొక్క ధైర్యం అనేక జన్మల అనేక రకాల బరువుల నుండి
విడిపిస్తుంది. మొట్ట మొదట బాబాతో ఏమి ప్రతిజ్ఞ చేసారు? జ్ఞాపకం ఉందా? “నాకు
ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు” అని. నాది అనేదే సమాప్తి అయిపోయి ఒకే నాది
అనేది మిగిలినప్పుడు మరలా హద్దులోని బాధ్యతల యొక్క నాది అనేది ఎక్కడ నుండి
వచ్చింది? దేహం యొక్క నాది అనే భావం ఎక్కడ నుండి వచ్చింది? బలహీన సంస్కారాల
యొక్క నాది అనే భావన ఎక్కడి నుండి వచ్చింది? స్వయాన్ని జ్ఞానీ ఆత్మలుగా
పిలిపించుకుంటున్నారు. జ్ఞాన స్వరూపం అంటే చెప్పటం, ఆలోచించటం మరియు చేయటం,
సమానంగా ఉండాలి. సదా సమర్థంగా ఉండాలి. జ్ఞానీ ఆత్మల యొక్క ప్రతి కర్మ బాబా
సమానంగా సమర్థంగా మరియు గుణాలు, సంస్కారాలు మరియు కర్తవ్యం సమర్థ బాబా సమానంగా
ఉండాలి. సమర్థ స్థితిలో స్థితులైన వారు ఇటువంటి వ్యర్థ, విచిత్ర ఆటలు ఆడరు. సదా
బాబాతో కలయిక అనే ఆటలో నిమగ్నం అయ్యి ఉంటారు. స్వయం బాబాను కలుసుకోవాలి మరియు
ఇతరులను కూడా బాబా సమానంగా తయారు చేయాలి. అందువలన ఈ సంవత్సరం ఏమి చేస్తారు? 78వ
సంవత్సరం అయిపోయింది. మీరందరు 76 సంవత్సరంలోనే తయారైపోయారు కదా! వినాశనంతో పాటూ
స్థాపన వారు కూడా తయారైపోయారు కదా! ఇప్పుడు ఇది మీకు ఎగస్ట్రా సమయం లభించింది.
ఎందుకు? స్వయం కోసం లభించిందా? ఈ ఎగస్ట్రా సమయానికి కూడా రహస్యం ఉంది. వెనుక
వచ్చేవారు మాకు చాలా తక్కువ సమయం లభించింది అని నిందించకుండా ఉండడానికి
లభించింది. ఎలా అయితే వ్యాపారంలో ఎగస్ట్రా లాభం ఇస్తారో అలాగే ఈ సమయం సేవ కొరకు
తాకట్టుగా లభించింది. ఈ తాకట్టు సమయాన్ని బాప్ దాదా యొక్క శ్రేష్ట మతానుసారం
ఉపయోగించండి. ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్థమైందా? ప్రతి సమయం మరియు సంకల్పంలో
స్వయాన్ని విశ్వ సేవలో ఎంతగా నిమగ్నం చేసుకోవాలంటే దాని ద్వారా వ్యర్ధం యొక్క
ఆట స్వతహాగా సమాప్తి అయిపోవాలి. ఈ ఫలితం బాప్ దాదా చూడాలనుకుంటున్నారు.
సదా సంకల్పంలో మరియు ప్రతి సెకను నిమిత్తంగా
భావించేవారికి, ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు అనే బేహద్ సమర్థ సంకల్పంలో
ఉండేవారికి, సదా విశ్వకళ్యాణం యొక్క సంకల్పంలో బిజీగా ఉండేవారికి, బాబా సమానంగా
సమర్ధ సంస్కారాలు కలిగినవారికి, వ్యర్థాన్ని బాబా తోడుతో సదా కాలికంగా వీడ్కోలు
ఇచ్చేవారికి, ఙ్ఞానీ ఆత్మలకి బాబా యొక్క అనేక శుభాకాంక్షలు మరియు సింహాసనాధికారి
పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.