ఇప్పుడు వ్యర్థాన్ని(వేస్ట్) మరియు బరువుని (వెయిట్)
సమాప్తి చేసుకోండి ...... 10-1-79
వ్యర్థాన్ని సమర్థంగా పరివర్తన చేయించే శివబాబా
మాట్లాడుతున్నారు -
బాప్ దాదా ఈ రోజు విశేషంగా పిల్లల యొక్క సంలగ్నత మరియు
స్నేహాన్ని చూసి హర్షిస్తున్నారు. సంలగ్నతతో దీపపు పురుగులన్నీ దీపం దగ్గరకి ఎలా
వస్తున్నాయి అని. దీపపు పురుగులన్నింటికి ఒకే కలయిక యొక్క విశేష సంలగ్నత ఉంది.
అందువలనే బాప్ దాదా కూడా కలయిక జరుపుకోవటానికి సాకార సభలోకి రావల్సి వస్తుంది.
ప్రతి ఒక్కరి పురుషార్ధం యొక్క వేగాన్ని చూస్తూ బాప్ దాదాకి తెలుసు, ప్రతి
ఒక్కరు తమ శక్తిననుసరించి గమ్యాన్ని చేరుకోవాలి అనే సంకల్పం చేస్తున్నారు.
సంకల్పం, గమ్యం, దారి చూపించే పండా, శ్రీమతం అన్నీ ఒక్కటే అయినా కానీ నెంబర్
వారీ ఎందుకు వచ్చింది? మార్గం కూడా సహజమైనదే మరియు వర్తమాన సమయం యొక్క స్వరూపం
కూడా సహయోగి స్వరూపం అయినా కానీ వేగంలో ఎందుకు తేడా వచ్చింది? మొదటి నెంబర్
ఆత్మకి, 16, 108 మాలలోని చివరి మణికి ఇద్దరి పురుషార్థం యొక్క సమయం ఒక్కటే మరియు
తోడు ఒక్కరే, చదువుకునే స్థానం కూడా చివరి వారికి, మొదటి వారికి ఒకటే, శిక్షకుడు
కూడా ఒక్కరే, శిక్షణ కూడా ఒక్కటే. మొదటి నెంబర్ వారికి వేరే ప్రత్యేక శిక్షణ ఏమీ
లేదు. అయినప్పటికీ తేడా ఎందుకు? కారణం ఏమిటి? సంగమయుగం యొక్క బిరుదులు కూడా చాలా
గొప్పవి. మొదట నెంబర్ వారికి, చివరి నెంబర్ వారికి కూడా ఒకే బిరుదులు మాస్టర్
సర్వశక్తివంతులు, మాస్టర్ జ్ఞాన సాగరులు, త్రికాల దర్శి, మాస్టర్ అన్నీ
తెలిసినవారు అయినా కానీ చివరి నెంబర్ ఎందుకు? కులం కూడా ఒక్కటే, బ్రాహ్మణ కులం,
వంశం కూడా ఒక్కటే బ్రహ్మవంశం. కర్తవ్యం కూడా ఒక్కటే విశ్వ కళ్యాణం, అయినా కానీ
ఇంత తేడా ఎందుకు? వారసత్వం కూడా అనంతమైన బాబా నుండి ప్రతి ఒక్కరికి అనంతంగా
లభించింది. అంటే ముక్తి, జీవన్ముక్తి యొక్క అధికారం అందరికీ ఒక్కటే అయినా కానీ
తేడా ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? బాప్ దాదా అందరి పురుషార్థాన్ని చూసి
ముఖ్యంగా రెండు కారణాలు చూశారు 1.వ్యర్థం (వెస్ట్) అంటే వ్యర్ధంగా పోగొట్టుకోవటం.
2. బరువు (వెయిట్) ఎక్కువగా ఉంది. ఎలాగైతే ఈ రోజుల్లో ప్రపంచంలో శారీరక రోగానికి
కారణం బరువు ఎక్కువగా ఉండటం. అన్ని రోగాలకి నివారణ-బరువు తగ్గించుకోవటం, అలాగే
పురుషార్థం యొక్క వేగంలో చివరి మరియు మొదటి నెంబర్ కి కారణమేమిటంటే - బరువుని
తగ్గించుకోకపోవటం. ఎలాగైతే శరీరం యొక్క బరువు పెరిగితే స్వతహాగానే రోగాలు
వస్తాయో అలాగే ఆత్మ యొక్క భారంతో ఆత్మిక రోగాలు కూడా స్వతహాగానే వస్తాయి. బరువు
పెరగడానికి కారణం - శారీరకంగా కూడా బరువు పెరగటానికి కారణం పాడైపోయిన వస్తువులను
తినటం అని అంటారు కదా! అలాగే ఇక్కడ కూడా పాడైపోయిన వస్తువులు అంటే జరిగిపోయిన
విషయాల గురించి అంటే ఆలోచించకూడని విషయాలు అంటే తినకూడని, పాడై పోయిన విషయాలను
బుద్ధి ద్వారా స్వీకరిస్తున్నారు లేక ప్రతి ఆత్మ యొక్క లోపాలను లేదా అవగుణాలను
స్వయంలో ధారణ చేయటం వీటిని కూడా పాడైపోయిన వస్తువులు అని అంటారు. తాళింపు
వస్తువులు తినటానికి రుచిగా ఉంటాయి, చాలా ఆకర్షితం చేస్తుంటాయి. తినకూడదు
అనుకున్నా కానీ కొంచెం తినేస్తారు కానీ ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అంత నష్టం
చేసేవిగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఆకర్షణా వస్తువులు ఏమిటంటే ఒకరికొకరు వ్యర్థం
సమాచారం వినటం మరియు వినిపించటం. దాని రూపం ఆత్మిక సంభాషణలా ఉంటుంది, ఇచ్చి,
పుచ్చుకునేదానిలా ఉంటుంది కానీ దాని ఫలితంగా ఒకరిపట్ల ఒకరికి అసహ్య దృష్టి
వస్తుంది. అది మనోరంజనం అనుకుంటారు, కానీ అది అనేకుల మనస్సు బాధ పెట్టినట్లు.
బయటి రూపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాని ఫలితం క్రిందకు పడేయటం. ఇటువంటి
విషయాలను బుద్ధి ద్వారా ధారణ చేస్తున్నారు అంటే స్వీకరిస్తున్నారు. అందువలనే
బరువు పెరిగిపోతుంది. శారీరకంగా కూడా బరువు పెరిగిపోతే బాగా పరుగెత్తలేరు. ఏదైనా
ఎక్కాలన్నా ఎక్కలేరు అలాగే ఇక్కడ కూడా పురుషార్థంలో తీవ్రగతిని పొందలేరు. ప్రతి
అడుగులో ఎక్కే కళను అనుభవం చేసుకోలేరు. బరువు ఎక్కువగా ఉన్నవారు ప్రతి స్థానంలో
సెట్ అవ్వలేరు. నడుస్తూ నడుస్తూ మధ్య మధ్యలో 1.ఆగవలసి ఉంటుంది మరియు 2. ఎవరోకరి
సహాయం తీసుకోవాల్సి వస్తుంది, అలాగే పురుషార్థంలో కూడా నడుస్తూ నడుస్తూ
అలసిపోతారు. అంటే విఘ్నాలకి వశమైపోతారు, దాటలేరు. దానితో పాటు ఏదోక ఆత్మని తోడు
చేసుకుని నడుస్తారు. ఒక బాబా యొక్క తోడు అయితే అందరికీ లభించే ఉంది కానీ వీరు
ఆత్మలను తోడుగా చేసుకుని నడుస్తారు. ఆత్మల తోడు అంటే సహయోగం లేకపోతే నడవలేరు.
మాటి మాటికి సహయోగం లభిస్తే ముందుకు వెళ్తాం, అవకాశం లభిస్తే ఎవరైనా
తీసుకువెళ్లే ముందుకు వెళ్తాం అని అంటారు. ఎందుకంటే స్వయం బరువుగా ఉన్న కారణంగా
ఇతరుల తోడు ద్వారా స్వయం బరువుని తేలికగా చేసుకోవాలనుకుంటారు. అందువలన బాప్ దాదా
కూడా చెప్తున్నారు - బరువుని తగ్గించుకోండి అని. దీనికి సాధనం - ఎలా అయితే
శారీరకంగా కూడా బరువు తగ్గించుకోవటానికి సాధనం వ్యాయామం అలాగే ఆత్మిక వ్యాయామం
అయిన యోగ అభ్యాసం ద్వారా ఇప్పుడిప్పుడే కర్మ యోగిగా అంటే సాకారీ స్వరూపధారి
అయ్యి సాకార సృష్టిపై పాత్రను అభినయించాలి. మరియు ఇప్పుడిప్పుడే ఆకారీ ఫరిస్తాగా
అయ్యి ఆకారీ వతనవాసి అవ్యక్త రూపాన్ని అనుభవం చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే
నిరాకారిగా అయ్యి మూలవతన నివాసిగా అనుభవం చేసుకోవాలి. మరలా ఇప్పుడిప్పుడే మీ
స్వర్గం అంటే వైకుంఠవాసిగా అయ్యి దేవతా రూపాన్ని అనుభవం చేసుకోవాలి. ఈ విధంగా
బుద్ధి యొక్క వ్యాయామం చేసినట్లయితే బరువు తగ్గిపోతుంది. పురుషార్థం యొక్క వేగం
తీవ్రంగా అయిపోతుంది. ఎవరి తోడుని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సదా బాబా యొక్క
తోడు అంటే ఛత్ర ఛాయలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. పరుగు పెట్టడానికి బదులు
హైజంప్ చేసేవారిగా అయిపోతారు. అందువలన దీనికి సాధనం - 1. వ్యాయామం, 2. ఆహారం
యొక్క పత్యం, బుద్ధి ద్వారా ఏవైనా అశుభ వస్తువులను స్వీకరించడం అంటే ధారణ చేయటం
ఈ పత్యం చేయండి. పాడైపోయిన, తాళింపు వస్తువులను స్వీకరించకండి అని చెప్పారు కదా!
రెండవది వ్యర్థం చేయకండి. ఎందుకు వ్యర్థం చేస్తున్నారు? ఏదైనా విలువైన వస్తువుని
విలువైనదిగా ఉపయోగించకపోతే దానిని కూడా వ్యర్ధం అంటారు. బాబా ద్వారా ఈ సమయంలో
సంగమయుగీ ఖజానాగా లభించింది. సంగమయుగం యొక్క ఒక్క సెకను అనేక కోట్ల విలువైనది.
ఒక్క సెకను కూడా స్వయానికి, సర్వులకి కోట్లకు విలువైనదిగా భావించి
ఉపయోగించనట్లయితే ఇది కూడా వ్యర్ధం చేసినట్లే అంటే ఎంత విలువైనదో అంత జమ
చేసుకోలేదు. ప్రతి అడుగులో కోట్ల సంపాదన యొక్క వరదానం డ్రామాలో సంగమయుగీ
సమయానికే లభించింది. ఈ వరదానాన్ని స్వయంపట్ల జమ చేసుకోకుండా, ఇతరులకు కూడా దానం
చేయకపోతే దానిని కూడా వ్యర్ధం అంటారు. ఏ పాపం చేయలేదు లేదా ఏ పొరపాటు చేయటం లేదు
కదా అని అనుకోకండి. కానీ సమయం యొక్క లాభాన్ని పొందకపోవటం కూడా వ్యర్ధమే.
లభించిన వరదానాన్ని స్వయం పొందకుండా, ఇతరులకి ఇవ్వకపోవటం కూడా వ్యర్ధం అంటారు.
అదేవిధంగా సంకల్పం కూడా ఒక ఖజానా, జ్ఞానం కూడా ఒక ఖజానా, స్థూల ధనాన్ని కూడా
ఈశ్వరీయ కార్యార్ధం సమర్పణ చేస్తే ఒక నయా పైసా ఒక రత్నం సమానంగా విలువైనదిగా
అయిపోతుంది. ఈ అన్ని ఖజానాలను స్వయంపట్ల లేదా సేవ పట్ల ఉపయోగించటం లేదు అంటే అది
కూడా వ్యర్ధమే. ప్రతి సెకను విశ్వకళ్యాణం మరియు స్వకళ్యాణం కోసం ఉండాలి. ఇలా
సర్వ ఖజానాలు దీనికోసమే బాబా ఇచ్చారు. వాటిని ఈ కార్యములోనే ఉపయోగిస్తున్నారా!
కొంతమంది పిల్లలు అంటున్నారు. 'మంచి చేయలేదు, చెడు చేయలేదు' అని. ఇది ఏ ఖాతాలో
జమ అయినట్లు? విలువ ఉంచకపోవటం కూడా వ్యర్ధం చేసినట్లే, దీని కారణంగానే
పురుషార్థం యొక్క వేగం తీవ్రం అవ్వటం లేదు. దీని కారణంగానే నెంబర్ వారీ
పెరిగిపోతుంది. నెంబర్ వారీగా అవ్వటానికి కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైందా? బరువు
మరియు వ్యర్థం. ఈ రెండు విషయాలను ఇప్పుడు సమాప్తి చేస్తే మొదటి తరగతిలోకి
వచ్చేస్తారు. లేకపోతే ఎక్కువ బరువు గలవారు ఎక్కువ సేపు ఎదురు (వెయిట్) చూడవలసి
ఉంటుంది. మొదటి రాజ్యంలోకి బదులు రెండవ రాజ్యంలోకి వస్తారు. ఎదురు చూడటం ఇష్టమా?
లేక సీట్ తీసుకోవటం ఇష్టమా? ఇప్పుడు ఏం చేస్తారు? డబుల్ లైగా అయిపోండి. మంచిది.
ఈ విధంగా సదా ఫరిస్తా సమానంగా సదా తేలికగా ఉండేవారికి,
ప్రతి ఖజానాను సదా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల కార్యంలో ఉపయోగించేవారికి మరియు
సదా బాబా యొక్క తోడుని అనుభవం చేసుకుని సహజయోగీ జీవితాన్ని సొంతం చేసుకునే
వారికి, ఇలా తీవ్ర పురుషార్ధి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
నమస్తే.