సంగమయుగంలో సమానతలో సమీపంగా ఉండే వారే భవిష్య
సంబంధంలో కూడా సమీప ఆత్మలు.
సర్వుల విఘ్నాలను వినాశనం చేసే ఆత్మిక తండ్రి శివబాబా
మాట్లాడుతున్నారు. -
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న విదేశీ మరియు
దేశవాసీయులైన పిల్లలను దూరంగా ఉన్నా కానీ దగ్గరగా చూస్తూ పిల్లలందరికి విశేషంగా
విదేశీయులకు ఒక విషయంలో శభాష్ చెప్తున్నారు. ఎందుకంటే కోనకోనలో దాగి ఉన్న బాబా
యొక్క పిల్లలు బాబాని గ్రహించి నిశ్చయంతో చాలా మంచిగా జంప్ చేసారు. రకరకాలైన
ధర్మాలనే పరదాల లోపల ఉంటూ కూడా సెకనులో పరదాలను తొలగించుకుని బాబాకి సహయోగి
ఆత్మలుగా అయిపోయారు. ఆ సంలగ్నతలో వచ్చే విఘ్నాలను కూడా సహజంగా దాటుతున్నారు.
అందువలనే బాప్ దాదా విశేషంగా శభాష్ చెప్తున్నారు. ఇలా ధైర్యం ఉంచుకునే పిల్లలకి
సదా బాప్ దాదా యొక్క సహయోగం సదా ఉంటుంది. ప్రతి బిడ్డకు ప్రతి కర్మలో బాబా
తోడుగా ఉంటారు. పిల్లలందరికి బాప్ దాదా ద్వారా బుద్ధి రూపి లిఫ్ట్ అనే గిఫ్ట్ (బహుమతి)
లభించింది. బహుమతి అయితే అందరికీ లభించింది. కానీ దానిని కార్యంలో
తీసుకురావటమనేది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. ఇది చాలా శక్తివంతమైన, సహజమైన
లిఫ్ట్ యొక్క బహుమతి. దీని ద్వారా సెకనులో ఎక్కడికి కావాలంటే అక్కడికి
చేరుకుంటారు. ఈ అద్భుతమైన లిఫ్ట్ మూడు లోకాల వరకు వెళ్తుంది. స్మృతి అనే స్విచ్
వేయగానే సెకనులో అక్కడికి చేరుకోగలము. ఈ లిఫ్ట్ ద్వారా ఎంత సమయం, ఏ లోకాన్ని
అనుభవం చేసుకోవాలనుకుంటున్నారో అంత సమయం అక్కడ ఉండవచ్చు. ఈ లిఫ్ట్ యదార్ధంగా
ఉపయోగించుకునే విధి - అమృతవేళ జాగ్రత్త (కేర్ఫుల్)గా స్మృతి అనే స్విచ్ ని
యదార్ధ రీతిలో అమర్చుకోండి. అప్పుడు రోజంతా స్వతహాగానే పని చేస్తూ ఉంటుంది. ఇలా
అమర్చుకోవటం వస్తుంది కదా! మంచి అభ్యాసీలు ఉన్నారు కదా! దివ్యబుద్ది అనే లిఫ్ట్
రోజంతటిలో ఎక్కడా ఆగిపోవటం లేదు కదా! అధికారి అయ్యి ఈ లిఫ్ట్ ని కార్యంలో
ఉపయోగించటం ద్వారా ఎప్పుడు మోసం చేయదు. వర్తమాన సంగమయుగీ లిఫ్ట్ - దివ్యబుద్ధి
యొక్క లిఫ్ట్. దానితో పాటు వెనువెంట భవిష్య స్వర్గ రాజ్యం యొక్క బహుమతి కూడా
బాప్ దాదా ఇప్పుడు ఇస్తున్నారు. స్వర ద్వారం యొక్క తాళంచెవి బాప్ దాదా పిల్లలకే
ఇస్తున్నారు. తాళంచెవి ఏమిటంటే అధికారి స్థితి అంటే అధికారిగా అవ్వటం. అధికారం
అనే తాళంచెవితో ద్వారం తెరుచుకుంటుంది. నెంబర్ వన్ అధికారిగా ఎవరు అవుతారు? అంటే
అధికారం ద్వారా ద్వారాన్ని మొదట ఎవరు తెరుస్తారో మీకు తెలుసు కదా! కాని ఒంటరిగా
తెరవరు. ఆ కార్యక్రమం చేసేటప్పుడు మీరందరు కూడా ఉంటారు కదా! చూసేవారు ఉంటారా
లేక చేసేవారు ఉంటారా? ఎవరు ఉంటారు? తోడుగా ఉండేవారే ఉంటారు కదా! తక్కువలో
తక్కువ చప్పట్లు కొట్టేవారు అయినా ఉంటారు కదా! సంతోష పుష్పాల వర్షం కురుస్తుంది
కదా! బాప్ దాదా సమయం యొక్క సమీపతను చూస్తూ ప్రతి బిడ్డ బాబాతో ఏ సమీప సంబంధంలో
ఉన్నారు అనేది చూస్తున్నారు. అతి సమీపంగా ఎవరు ఉన్నారు? మరియు సమీపంగా ఎవరు
ఉన్నారు? మరియు కొంచెం దూరం నుండి చూసేవారు ఎవరు? అని చూస్తున్నారు. పిల్లల
డబుల్ భవిష్యత్తు బాప్ దాదా ఎదురుగా వస్తుంది. 1. సంగమయుగీ భవిష్యత్తు అంటే బాబా
సమానంగా అయ్యే భవిష్యత్తు. 2. మొదటి జన్మ యొక్క భవిష్యత్తు అంటే స్వర్గం యొక్క
భవిష్యత్తు. ఇక్కడ సమానతలో సమీపంగా ఉన్నవారే అక్కడ సంబంధంలో సమీపంగా ఉంటారు.
ఎంతెంతగా ఇక్కడ సమానత ద్వారా సదా వెంట ఉంటారో అంత మూల వతనంలో కూడా అటువంటి
ఆత్మలు వెనువెంటే ఉంటారు మరియు స్వర్గంలో కూడా ప్రతి దినచర్యలో సంబంధంలో తోడుగా
ఉంటారు. ఎలా అయితే నీతోనే మాట్లాడతాను, నీతోనే ఆడుకుంటాను, నీతోనే తోడు
నిలుపుకుంటాను అని అంటున్నారో అలాగే భవిష్యత్తులో కూడా ఉదయం ఉండి తోటలో
ఆడుకుంటారు, నాట్యం చేస్తారు, పాఠశాలలో చదువుకుంటారు. ఇలా సదా కలుసుకుంటూ ఉంటారు
మరియు వెంటే రాజ్యం చేస్తారు. బ్రహ్మాబాబా ఎలాగైతే స్వ రాజ్యాధికారిగా ఉండేవారు,
స్వయానికి ఆధీనం అయ్యేవారు కాదు, అధికారిగా ఉండేవారు. అలాగే బ్రహ్మాబాబాని
అనుసరించేవారు అంటే సదా సంకల్పంలో స్వరాజ్యం మా జన్మ సిద్ధాధికారం అని ఇక్కడ
స్వరాజ్యం చేసేవారే అక్కడ బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యం చేస్తారు. ఇక్కడ నెంబర్
వన్ నిత్యం మరియు సరైన సమయానికి క్లాసుకి వచ్చే ఈశ్వరీయ విద్యార్థిగా ఉంటారో
వారే అక్కడ కూడా కృష్ణునితో పాటు చదువుకుంటారు. ఎందుకంటే బ్రహ్మాబాబా మొదటి
నెంబర్ భగవంతుని విద్యార్ధి. ఎవరైతే ఇక్కడ బాప్ దాదాతో అతీంద్రియ సుఖమనే ఊయలలో
సదా ఊగుతూ ఉంటారో వారు అక్కడ కూడా కలిసి ఊయలలో ఊగుతారు. ఎవరైతే ఇక్కడ అనేక
ప్రాప్తులనే సంతోషంతో నాట్యం చేస్తారో వారు అక్కడ కూడా కలిసి నాట్యం చేస్తారు.
ఎవరైతే ఇక్కడ బాబా యొక్క గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో. సర్వ
సంబంధాలు బాబాతో అనుభవం చేసుకుంటారో వారు అక్కడ ఉన్నత కుటుంబం యొక్క సమీప
సంబంధంలోకి వస్తారు. ఇలా బాప్ దాదా ప్రతి ఒక్కరి నయనాలలో రెండు భవిష్యత్తులను
చూస్తున్నారు. మొదటి జన్మలోకి రావటమే మొదటి నెంబర్ ప్రాలబ్దం. విదేశీ పిల్లలందరు
మొదటి జన్మలోకి వస్తారు కదా! ఇంతమంది మొదట నెంబర్లోకి వచ్చేస్తారా? మొదటి నెంబర్
లోకి ఎవరు వస్తారో విశేషంగా ఒక విషయం ఆధారంగా తెలుసుకోవచ్చు. అది ఏమిటి? ఆది
నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు. విఘ్నాలు వచ్చినా
కానీ విఘ్నాలను జంప్ చేసి దాటుతున్నారా లేక విఘ్నాలకు వశం అయిపోతున్నారా?
నిర్విఘ్నం అంటే విఘ్నాలు రావు అని కాదు, కానీ విఘ్నవినాశకులుగా మరియు విఘ్నాలపై
సదా విజయీగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఆది నుండి అంతిమం వరకు మంచిగా ఉంటే మొదటి
జన్మలో తోడుగా అవుతారు. సహజ మార్గమే కదా! మంచిది.
కర్ణాటక పిల్లలు కూడా వచ్చారు. ఇది కూడా భారత దేశానికి
విదేశమే. లండన్ నుండి సహజంగా వస్తున్నారు, కానీ వీరు చాలా కష్టపడుతున్నారు.
అందువలన శ్రమకు ఫలితంగా ప్రత్యక్షంగా బాబా యొక్క మిలనం జరిగింది. సంలగ్నత
ఉన్నవారు మంచిగా ఉన్నారు. పిల్లల సంలగ్నత చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. సదా
ఈ సంలగ్నత అనే దీపాన్ని మాటి మాటికి ధ్యాస అనే నూనెతో అవినాశిగా ఉంచుకోవాలి.
కర్నాటక వైపు దీపాలు చాలా వెలిగిస్తూ ఉంటారు. ఎలా అయితే సూలమైన దీపం సదా
వెలుగుతూ ఉంటుందో అలాగే సంలగ్నత అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి. అందరు స్వయాన్ని
బాబా యొక్క అదృష్టవంతమైన పిల్లలుగా భావిస్తున్నారు కదా! మంచిది. ఈరోజు కలయిక
యొక్క రోజు.
ఈవిధంగా ప్రియమైన పిల్లలకు, శ్రేష్ట భాగ్యాన్ని తయారు
చేసుకునే పిల్లలకు, సదా స్వరాజ్యాధికారిగా పిల్లలకు తిలకం మరియు సింహాసనాధికారి
పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.