సూర్యవంశీయులు మరియు చంద్రవంశీ ఆత్మల యొక్క
ప్రత్యక్ష జీవితంలో ఉండే ధారణల యొక్క గుర్తులు.
సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యాల రహస్యాలను వినిపించే
శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా పిల్లల యొక్క పురుషార్ధంలో వృద్ధి కళ గురించి సంభాషణ
చేస్తున్నారు. దీనిలో రెండు రకాలైన పిల్లలను చూసారు. 1. మొదటి తరగతివారు
సూర్యవంశీ దేవతల రూపంలో ఉంటారు 2. రెండవ తరగతి వారు చంద్రవంశీ క్షత్రియులు
రూపంలో ఉంటారు. ఇద్దరి స్థితిలో మరియు వేగంలో తేడా ఉంది. సంకల్పమైతే ఇద్దరికి
సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవాలి అనే ఉంది. మరియు ఇప్పుడు కూడా ఉంది కానీ
మొదటి నెంబర్ అంటే సూర్యవంశీయుల సంకల్పం మరియు స్వరూపంలో ఎక్కువ తేడా లేదు కానీ
రెండవ నెంబర్ చంద్రవంశీయులలో సంకల్పంలో మరియు స్వరూపంలో చాలా తేడా ఉంది. సంకల్పం
100% శక్తిశాలిగా ఉంది కానీ స్వరూపంలో ఒక్కొక్కసారి 75%, ఒక్కొక్కసారి 50% తేడా
ఉంది.
సూర్యవంశీయులు సదా మాష్టర్ జ్ఞాన సూర్యులుగా అంటే
శక్తిశాలి బీజ రూపి స్థితిలో ఉంటారు. కానీ రెండవ రకం వారు అవ్యక్త ఫరిస్తా
స్థితిలో ఎక్కువగా ఉంటారు. చంద్రవంశీయులు జ్ఞాన సూర్యులుగా అంటే బీజరూపి
స్థితిలో తక్కువగా ఉంటారు కానీ ఫరిస్తా స్థితిలో మరియు అనేక రకాలైన మాయా
విఘ్నాలతో యుద్ధం చేసి విజయం పొందే స్థితిలో ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు
వ్యర్థ సంకల్పాల రూపంలో, అప్పుడప్పుడు సమస్యల రూపంలో, మాయతో విజయం పొందే శ్రమలో
ఎక్కువ సమయం ఉంటారు. ఒక గంట శ్రమకి అర గంట లేదా పావు గంట సఫలతను అనుభవం
చేసుకుంటారు. అందువలన పురుషార్థంలో శ్రమ చేసి అప్పుడప్పుడు అలసిపోతున్నారు,
అప్పుడప్పుడు నడుస్తున్నారు, ఒక్కొక్కసారి పరుగు పెడుతున్నారు, కానీ
ఒక్కొక్కసారి పరుగెత్తే వారిని చూసి పరుగెత్తాలి అనుకుంటున్నారు కానీ
పరుగెత్తలేకపోతున్నారు. బాబా యొక్క ప్రతి గుణాన్ని అనుభవం చేసుకోవటంలో సగం
స్థితి వరకే చేరుకుంటున్నారు అంటే 50-50 శాతం యొక్క స్థితి ఉంటుంది. బాబా సుఖ
సాగరుడు, నేను సుఖ స్వరూపాన్ని అని వర్ణన చేస్తారు. కానీ సదా సుఖం యొక్క అనుభూతి
అవ్వదు. సంపూర్ణ సుఖం యొక్క అనుభూతి ఒకోసారి అవుతుంది, ఒకోసారి అవ్వదు. ఎలా
అయితే చంద్రుని కళలు పెరుగుతూ ఉంటాయి మరియు తరుగుతూ ఉంటాయి. ఒకోసారి తగ్గుతాయి
కదా! అలాగే చంద్రవంశీయులు అప్పుడప్పుడు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో సంపూర్ణ
స్థితిని అనుభవం చేసుకుంటారు మరియు అప్పుడప్పుడు స్వయాన్ని సంపూర్ణ స్థితికి
చాలా దూరంగా అనుభవం చేసుకుంటారు. అప్పుడప్పుడు సహాయం కోసం స్మృతి స్థితి నుండి
ఫిర్యాదుల స్థితిలోకి వచ్చేస్తారు.
సూర్యవంశీయులు 1. సదా బాబా తోడు మరియు సర్వసంబంధాల
అనుభవంలో లవలీనమై ఉంటారు. 2. సూర్యవంశీయులు ఎక్కేకళ మరియు దిగేకళలోకి రారు. సదా
ఎక్కేకళను అనుభవం చేసుకుంటూ ఎలాగైతే సూర్యుడు సదా ప్రకాశ స్వరూపంగా ఉంటాడో, కళల
చక్రంలోకి రాడో అలాగే వీరి స్థితిలో కూడా అప్పుడప్పుడు 14 కళల సంపన్నస్థితి
మరియు అపుడపుడు 8 కళల సంపన్న స్థితి ఇలా తేడా ఉండదు. 3.సూర్యవంశీయుల దగ్గరకి
మాయ మేఘం రూపంలో తప్పకుండా ఎదురుగా వస్తుంది కానీ మేఘం వస్తుంది, మరలా
వెళ్ళిపోతుంది. 4.సూర్యవంశీయులు సదా తమ స్వరూపాన్ని ఎదురుగా ఉంచుకుని ఆ మేఘాలను
చూసి ప్రకాశం తక్కువ చేసుకోరు, సదా తమలో బాబా యొక్క గుణాలను సాకార రూపంలో అనుభవం
చేసుకుంటూ, ఇతరుల ముందు కూడా ప్రత్యక్షం అవుతారు 5. సూర్యవంశీయులు సదా బేహద్
సేవాధారిగా ఉంటూ స్వయాన్ని లైట్ హౌస్, మైట్ హౌస్ అనుభవం చేసుకుంటారు. 6.
సూర్యవంశీయుల ప్రతి అడుగు సాకార బ్రహ్మాబాబా కర్మ రూపీ అడుగుపై అడుగు ఉంటుంది
అంటే కర్మ మరియు పురుషార్ధం యొక్క వేగం సాకార బ్రహ్మాబాబా సమానంగా ఉంటుంది. 7.
సూర్యవంశీయుల మొదటి అడుగు తండ్రిని అనుసరించే విధంగా ఉంటుంది. మనస్సు, బుద్ధి,
సంస్కారాలతో సదా బాబా ముందు అర్పణ అయిపోతారు. బ్రహ్మాబాబా యొక్క విశేషతను చూశారు
కదా - ఈ మహా త్యాగం ద్వారానే మహా భాగ్యం లభించింది. నెంబర్ వన్ ఫరిస్తాగా మరియు
నెంబర్ వన్ విశ్వ మహారాజుగా అయ్యారు. అలాగే సూర్యవంశీయులు కూడా మహాత్యాగిగా,
సర్వస్వత్యాగిగా ఉంటారు. సర్వస్వ త్యాగులు అంటే సంస్కారాల రూపంలో కూడా వికారాల
వంశాన్ని త్యాగం చేయాలి ఇలా సర్వస్వత్యాగులుగా బ్రహ్మాబాబాను అనుసరించే వారే
వర్తమానంలో ఫరిస్తా స్వరూపంగా మరియు భవిష్యత్తులో నెంబర్ వన్ విశ్వ మహా రాజుగా
అవుతారు. 8. సూర్యవంశీయులు సదా నిశ్చయబుద్ధికి ప్రత్యక్ష స్వరూపంగా సదా
నిశ్చింతగా మరియు సదా కల్ప కల్పం నిశ్చిత విజయీలుగా అనుభవం చేసుకుంటారు. 9.
సూర్యవంశీయులు సదా విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంత పెద్ద
బాధ్యతయో అంత డబుల్ లైట్ గా ఉంటారు. 10. సూర్యవంశీయులు తమ వృత్తి లేదా తరంగాల
యొక్క కిరణాల ద్వారా అనేక ఆత్మలకి ఆరోగ్యం అంటే స్వ స్మృతిలో ఉండే స్థితి యొక్క
అనుభవం చేయిస్తారు. 11. సూర్యవంశీయులు సదా తమకి లభించిన ఖజానాలను స్వార్థంగా
అంటే స్వయం కోసం ఉపయోగించరు. సర్వులకి మహాదానిగా, వరదానిగా ఉంటారు. 12.
సూర్యవంశీయులలో విశేషంగా రెండు గుర్తులు అనుభవం అవుతాయి 1. సదా నిర్వాణ స్థితిలో
ఉంటూ మాటలలోకి వస్తారు. 2. సదా స్థితిలో స్వమానం, మాట మరియు కర్మలో నిర్మాణంగా
అంటే నిర్వాణం మరియు నిర్మాణం రెండు గుర్తులు అనుభవం అవుతాయి.
ఈవిధంగానే చంద్ర వంశీయులు ఈ అన్ని విషయాలలో
అప్పుప్పుడు ఒక విధంగా, అప్పుడప్పుడు మరో విధంగా ఉంటారు మరియు అన్నింటిలో 50-50
శాతమే ఉంటారు. ఒక్కొక్కసారి 100 శాతం మణిలా మెరిసి పోతూ ఉంటారు. అప్పుడప్పుడు
తమ బలహీనతల యొక్క మాలను బాప్ దాదా ముందు మాటి మాటికి స్మరిస్తూ ఉంటారు.
అప్పుడప్పుడు సమర్ధంగా, అప్పుడప్పుడు వ్యర్ధంగా ఉంటారు, అప్పుడప్పుడు మహాన్ గా,
అప్పుడప్పుడు సాధారణంగా ఉంటారు. అప్పుడప్పుడు స్వయాన్ని అధికారిగా అంటే మహావీర్
గా అనుభవం చేసుకుంటారు. అప్పుడప్పుడు సహాయం, సహయోగం లభిస్తే ముందుకు వెళ్తాము
అని అంటారు. ఇలా కుంటుతూ నడుస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు స్వయాన్ని
నేను ఎంత వరకు చేరుకున్నాను అని అడగండి. సూర్యవంశీయుడినా లేక చంద్ర వంశం నుండి
సూర్య వంశం పరిధి వరకు వచ్చానా లేక చంద్ర వంశంలోనే ఉన్నానా! పరిధి వరకు
చేరుకున్నవారు అప్పుడప్పుడు సూర్యవంశీ స్థితిని జంప్ చేసి చంద్రవంశంలోకి
వచ్చేస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో పరిశీలించుకోండి. పరిధిని
దాటి సూర్యవంశీయులుగా అవ్వండి. అర్ధమైందా! ఏమి చేయాలో అర్ధమైందా? మంచిది.
ఈవిధంగా స్వయం సదా సూర్యవంశానికి అధికారులుగా
అయ్యేవారికి, బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగు వేసి బాబా సమానంగా సదా ఫరిస్తా
రూపంలో ఉండేవారికి, మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి విశ్వానికి ప్రాప్తులు అనే
కిరణాల ద్వారా అంధకారాన్ని వెలుగుగా చేసేవారికి, మాస్టర్ జ్ఞాన సూర్యులైన
పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.