క్రొత్త సంవత్సరం కోసం బాప్ దాదా ద్వారా
చేయించబడిన దృఢ సంకల్పం.
విజయీ రత్నాలు, బ్రాహ్మణకుల భూషణ పిల్లలతో బాప్ దాదా
మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా పిల్లల క్రొత్త ఉల్లాసాలు, క్రొత్త
దృఢ సంకల్పాలు, క్రొత్త ప్రపంచాన్ని సమీపంగా తీసుకువచ్చే మనోహర సంకల్పాలను
వినిపిస్తూ హర్షిస్తున్నారు. ప్రతి బిడ్డకు స్వయాన్ని సంపన్నంగా చేసుకుని విశ్వ
కళ్యాణం చేయాలి అనే విశేషమైన ఉత్సాహం ఉంది. ఈ రోజు మీలో ఉన్న బలహీనతలను
సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చే దృఢ సంకల్పానికి బాప్ దాదా కూడా శుభాకాంక్షలు
చెప్తున్నారు. ఈ వీడ్కోలు యొక్క శుభాకాంక్షలను ప్రతి రోజు అమృతవేళ స్మృతి ద్వారా
సమర్థంగా చేసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం స్వయం యొక్క సమర్ధతతో పాటు సేవలో కూడా
సమర్ధ స్వరూపాన్ని తీసుకురావాలి. వినాశకారులు చాలా తీవ్రగతితో తమ కార్యాన్ని
ముందుకు తీసుకువెళ్తున్నారు, ఒక సెకనులో శారీరక బంధనాల నుండి ముక్తి చేసే అంటే
శారీరక దు:ఖాల నుండి సహజంగా ముక్తి అయ్యేటువంటి మరియు అనేక ఆత్మలను రక్షించే
సహజ సాధనాలను, చాలా స్వచ్చంగా తయారుచేస్తున్నారు. దేని ఆధారంగా? వైజ్ఞానిక శక్తి
ఆధారంగా. అలాగే స్థాపనా కార్యానికి నిమిత్తం అయిన మాస్టర్ సర్వశక్తివంతుల గ్రూప్
అయిన మీరు ఆత్మలను జన్మ జన్మాంతరాలుగా మాయా బంధనాల నుండి, మాయ ద్వారా వచ్చే
అనేక రకాలైన దు:ఖాల నుండి ఒక సెకనులో ముక్తి చేసి మరియు సదాకాలిక సుఖ, శాంతుల
యొక్క వరదానం ఇచ్చి మరియు ప్రతి ఆత్మకి గమ్యాన్ని చూపించడానికి తయారుగా
ఉన్నారా?వినాశకారీ గ్రూప్ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు. కేవలం ఆజ్ఞ ఇవ్వటమే
ఆలస్యం. అలాగే స్థాపనకు నిమిత్తమైన గ్రూప్ కూడా సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే
స్థాపన కార్యం సంపన్నం అవ్వటం అంటే వినాశకారులకు ఆజ్ఞ లభించటం. ఎలా అయితే సమయం
సమీపంగా అంటే ముల్లు ఆ సమయం దగ్గరికి వచ్చేసరికి స్వతహాగానే గంటలు కూడా
మ్రోగుతాయి. అలాగే బేహద్ గడియారంలో స్థాపన యొక్క సంపన్నత అంటే సమయంపై ముల్లు
రావటం అంటే వినాశనం యొక్క గంటలు మ్రోగటం. అందువలన సంపన్నతలో ఎవరెడీగా ఉన్నారా?
ఇప్పుడు చెప్పండి!
ఈరోజు అమృతవేళ నుండి పిల్లలు క్రొత్త సంవత్సరం యొక్క
క్రొత్త ఉల్లాసాలను వింటూ విశేషంగా ఒక క్రొత్త టాపిక్ పై బాప్ దాదాలకు ఆత్మిక
సంభాషణ జరిగింది.
బ్రహ్మాబాబా అన్నారు - ముక్తి యొక్క ద్వారం ఎప్పుడు
తెరవాలి? అని. బ్రహ్మ ముక్తి ద్వారాన్ని తెరవనంత వరకు ఇతరాత్మలు కూడా
ముక్తిధామానికి వెళ్ళలేరు. ఇప్పుడు తాళం తీసేయనా? అని బ్రహ్మ అడిగారు.
బాబా చెప్పారు - ప్రారంభోత్సవం ఒంటరిగా చేయాలా లేక
పిల్లలతో చేయాలా? బ్రహ్మ అన్నారు - సవతి పిల్లలు మరియు సొంత పిల్లల దు:ఖం యొక్క
అలాపన, తపన యొక్క ఆలాపన వింటూ ఉంటే దయ వస్తుంది అని బాబా అన్నారు. పిల్లలలో
సర్వ శ్రేష్ట విజయీ రత్నాలు, భిన్న భిన్న సంబంధాలతో మరియు స్వరూపాల ద్వారా
బ్రహ్మ ఆత్మకి తోడుగా అయ్యే వారి విజయీరత్నాల మాల తయారయ్యిందా? వారికి ఆది నుండి
నీతోనే జీవిస్తాను, నీతోనే చనిపోతాను అనే సంకల్పం ఉంది, ఏదోక సంబంధంతో, ఏదోక
రూపంతో నీతోనే ఉంటాము అని వారు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం అటువంటి సహయోగులు లేకుండా
తాళం ఎలా తీస్తారు? ఇలా క్రొత్త సంవత్సరం యొక్క క్రొత్త సంకల్పం బ్రహ్మాబాబాకి
వినిపించారు. బాబా యొక్క ఈ సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే విజయీ గ్రూపు
ఇప్పుడు ఏమి చేస్తారు? శ్రేష్ట విజయీరత్నాలే బాబా యొక్క ఈ సంకల్పాన్ని పూర్తి
చేయగలరు. అందువలన ఈ సంవత్సరంలో విశేషంగా మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క అధికార
స్వరూపంతో సెకనులో ముక్తినిచ్చే మిషనరీ (కార్యాన్ని) తీవ్రం చేయండి. ఇప్పుడు
చాలా మంది ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాలిక సాధనాలతో లేదా ఆత్మిక శాంతి
పొందడానికి తయారైన అల్ప స్థానాలతో అంటే పరమాత్మను కలిపే కాంట్రాక్టర్స్ తో
ఇప్పుడు అలసిపోయారు, నిరాశ అయిపోయారు. ఇంకా సత్యం ఏదో ఉంది అని అనుకుంటున్నారు.
ఇలా సత్యత యొక్క గమ్యం గురించి పరిశోధనలో ఉన్నారు. ప్రాప్తి యొక్క దాహంతో
ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయం, పరమాత్మ పరిచయం యొక్క
యదార్ధ బిందువు కూడా తృప్తి ఆత్మగా చేస్తుంది. అందువలన జ్ఞాన కలశాన్ని ధారణ చేసి
దాహంతో ఉన్న వారి దాహం పూర్తి చేయండి. అమృత కలశం సదా వెంట ఉండాలి. నడుస్తూ,
తిరుగుతూ సదా అమృతంతో అమరులుగా చేస్తూ వెళ్ళండి. అప్పుడే బ్రహ్మాబాబాతో పాటూ
ముక్తి ద్వారం యొక్క ప్రారంభోత్సవం చేయగలరు. ఇప్పుడు భావనల యొక్క ప్రారంభోత్సవం
చేస్తున్నారు. ఇప్పుడు ఈ విశాల ద్వారం యొక్క ప్రారంభోత్సవం చేయాలి. దాని కొరకు
సదా అమరులుగా అవ్వండి మరియు అమరంగా తయారుచేయండి. అమర భవ అనే వరదానిమూర్తిగా
అవ్వండి. ఇప్పుడు పురుషార్ధం చేసే ఆత్మలలో అంతిమ బలహీన ఆత్మలు ఎంత బలహీనంగా
ఉంటారంటే వారిలో పురుషార్థం చేసే ధైర్యం కూడా ఉండదు. అటువంటి ఆత్మలను స్వయం
యొక్క శక్తుల ద్వారా సమర్ధంగా తయారుచేసి ప్రాప్తిని ఇవ్వండి. అందువలన ఇప్పుడు
జ్ఞానమూర్తి కంటే ఎక్కువగా వరదానిమూర్తి యొక్క పాత్ర కావాలి. వారిలో వినే శక్తి
కూడా ఉండదు, నడిచే ధైర్యం కూడా ఉండదు, కేవలం ఏదోకటి లభించాలి అనే దప్పికతో
ఉంటారు. ఇలా అనేకాత్మలు విశ్వంలో భ్రమిస్తున్నారు. నడిచే పాదం అంటే ధైర్యం కూడా
మీరే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ధైర్యం యొక్క స్టాక్ జమ అయ్యి ఉందా! అమృత కలశం
సంపన్నంగా ఉందా! లెక్కలేనంత ఉందా! అఖండంగా ఉందా! వరస పెట్టవచ్చా? మీ ప్రశ్నల
వరుసని సమాప్తి చేసుకున్నారా! ఒకవేళ స్వయమే వరసలో నిమగ్నం అయిపోతే ఇతరాత్మలని
ఎలా సంపన్నం చేస్తారు? అందువలన ఈ సంవత్సరంలో స్వయం యొక్క వరుసని సమాప్తి
చేసుకోండి. ఎందుకు, ఏమిటి అనే భాషను పరివర్తన చేసుకోండి. ఒకే భాష ఉండాలి.
సర్వుల పట్ల సంకల్పంలో, వాణీలో వరదాని భాష ఉండాలి. వరదాన మూర్తిగా ఉండాలి. ఎవరు
విన్నా ఇది ఉపన్యాసం కాదు, వరదానాల పూల వర్షం కురుస్తుంది అని అనుకోవాలి.
అప్పుడే ప్రారంభోత్సవం చేయగలరు. క్రొత్త సంవత్సరంలో ఇదే క్రొత్తదనం చేయాలి.
మంచిది.
ఈవిధంగా సదా అమృత కలశధారులకు, ప్రతి సంకల్పంలో వరదాని
అయ్యి అనేకాత్మల ధైర్యాన్ని పెంచేవారికి, ధైర్యవంతులైన పిల్లలకే బాబా సహాయం
చేస్తారు, ఇలా సంసిద్ధంగా అయ్యి బ్రహ్మాబాబాతో కలిసి సదా వెంట ఉండే పాత్ర
అభినయించే విజయీ రత్నాలకు, సంపన్న ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
నమస్తే.