ఇష్టదేవతల విశేషతలు.
సదా పరమపూజ్యుడు మరియు ఆత్మలను పూజారి నుండి పూజ్య
దేవతగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు.
ఈరోజు బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క ఒకే సమయంలో నాలుగు
రూపాల యొక్క వంశాన్ని చూస్తున్నారు. మొదటిది - శివవంశం, రెండవది - బ్రహ్మవంశం,
మూడవది - దేవతావంశం,నాల్గవది - ఇష్టదేవ వంశం. ప్రతి ఒక్కరి నాలుగు వంశాల యొక్క
రూపం బాప్ దాదా ఎదురుగా స్పష్టంగా ఉంది. భక్తిమార్గంలో శ్రేష్ఠాత్మలైన మీరే
రకరకాల రూపాలలో భక్తులకు ఇష్టదేవతగా అవుతారు. ఈ సమయంలో కూడా మీ భక్తులు మీ ఇష్ట
దేవీ,దేవతలనే పిలుస్తున్నారు. ఎంతెంతగా ప్రత్యక్షతా సమయం స్పష్టంగా మరియు
సమీపంగా వస్తుందో అంతగా మీ అందరి దేవవంశం అంటే రాజ్యవంశం మరియు ఇష్టవంశం
ప్రత్యక్షం అవుతూ ఉంటుంది.మేమే ఇష్టదేవతగా అయ్యి అనేక భక్తాత్మల మనోకామనలను
పూర్తి చేయాలి అని అనుభవం చేసుకుంటారు. ఎలా అయితే రాజ్యవంశంలో నెంబర్ వారీగా
ఉంటారో అలాగే పూజ్య రూపంలో కూడా నెంబర్ వారీగా ఇష్టదేవతగా అవుతారు. మేము ఏ
ఇష్టదేవత? అనేది మీకు జ్ఞాపకం ఉందా? ఏ దేవీ రూపంలో మీకు పూజ జరుగుతుంది? మీ
భక్తిమాలను తెలుసుకుంటున్నారా? ఇప్పుడు ఎవరైతే మీకు సేవలో సహయోగిగా, తోడుగా
అవుతారో వారిలో కొద్దిమంది రాజ్యవంశంలోకి వస్తారు, కొద్దిమంది ప్రజలలోకి వస్తారు.
ఈ సమయంలో సేవా సహయోగులు మరియు సమీప సహయోగులు మరియు భవిష్యత్తులో ఉన్నత
కుటుంబీకులు మరియు ప్రజలు మరియు భక్తిలో ఇష్టవంశీయులు మరియు భక్తులుగా అవుతారు.
ఇష్టదేవ వంశావళిని కూడా చూపిస్తారు. మేము రాజ్యవంశీ నుండి ఇష్టవంశీయులమేనా? అని
స్వయాన్ని అడగండి. ఏ నెంబర్ యొక్క ఇష్టదేవతలు? కొంత ఎంది ఇష్టదేవతలకు రోజు పూజ
జరుగుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది, కొంతమందికి నియమానుసారం
యుక్తియుక్తంగా జరుగుతుంది, కొంతమందికి ఎప్పుడు వస్తే, ఎలా వస్తే అలా చేసేస్తారు.
కొంతమంది చాలా వైభవంగా రకరకాలైన వైభవాలతో పూజ జరుగుతుంది, కొంతమందికి
అప్పుడప్పుడు వైభవంగా చేస్తారు. కొంతమంది భక్తుల మాల చాలా పెద్దగా ఉంటుంది,
లెక్కలేనంత మంది భక్తులు ఉంటారు మరియు కొంతమందికి కొద్ది మందే భక్తులు ఉంటారు.
కానీ బ్రాహ్మణ వంశం నుండి రాజ్యవంశీయులు చిన్న లేదా పెద్ద ఇష్టదేవతగా తప్పకుండా
అవుతారు. మీరందరు భక్తులకు ఇష్టులు.
బాప్ దాదా ఈరోజు అందరినీ ఇష్టదేవీ లేదా ఇష్టదేవ్
రూపంలో నా పిల్లలు ఎంత పూజ్యులు అని చూస్తున్నారు. మీ పూజ్య స్వరూపాన్ని కూడా
సదా ఎదురుగా ఉంచుకోండి , ఇష్టదేవతగా అయ్యేటందుకు విశేషంగా 8 విషయాలు స్మృతి
ఉంచుకోండి. ఎలా అయితే అష్టశక్తులు స్మృతి ఉంటాయో అలాగే ఇష్టులుగా అయ్యేటందుకు 8
విశేషతలు ఉండాలి. వీటి గురించి మంచిగా తెలుసుకుంటున్నారు కదా! మీ స్మృతిచిహ్న
చిత్రాలలో కూడా ఈ విశేషతలు అనుభవం అవుతాయి.
మొదటి విశేషత - ఇష్టదేవతలు సదా దయాహృదయులుగా ఉంటారు.
ఏ దయ? ప్రతి ఆత్మను భ్రమించడం నుండి మరియు బికారీ స్థితి నుండి రక్షించే దయ
చూపిస్తారు. ప్రతి ఒక్కరిపై దయ చూపిస్తారు. నిష్కామ దయాహృదయులుగా ఉంటారు.
కొందరిపై దయ చూపించటం, కొందరిపై చూపించకపోవటమనేది ఉండదు అంటే బేహద్ రూపంలో
దయాహృదయులుగా ఉంటారు. వారి దయా సంకల్పంతో ఇతరాత్మలకు తమ ఆత్మిక రూపం మరియు ఆత్మ
యొక్క గమ్యం సెకనులో స్మృతి వస్తుంది. వారి దయా సంకల్పంతో బికారీలకు సర్వ
ఖజానాల మెరుపు కనిపిస్తుంది. భ్రమించే ఆత్మలకు ముక్తి లేదా జీవన్ముక్తి యొక్క
ఒడ్డు లేదా గమ్యం ఎదురుగా కనిపిస్తుంది ఇలా దయాహృదయులుగా ఉంటారు.
రెండవ విశేషత - ఇష్టదేవాత్మ సదా సర్వులకు దు:ఖహర్త,
సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తుంది. ఇతరుల దు:ఖాన్ని తమ దు:ఖంగా భావించి
సహించకుండా ఉండలేరు.దు:ఖాన్ని మరిపించే లేదా దు:ఖీలను సుఖీగా చేసే యుక్తి లేదా
సాధనం సదా వారి దగ్గర గారడీ మంత్రంలా ఉంటుంది.
మూడవ విషయం - సదా సంకల్పం, మాట, కర్మ ద్వారా పవిత్రత
యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది.
నాల్గవ విషయం - సదా స్వభావంలో, సంస్కారంలో, నడవడికలో
సాధారణంగా ఉంటారు కానీ శ్రేష్ఠముగా కనిపిస్తారు.
ఐదవ విషయం - ఎలా అయితే మీ జడచిత్రాలను సదా శృంగారంతో
చూపిస్తారో అలాగే సర్వగుణాల శృంగారంతో సదా అలంకరించబడి ఉన్నట్లు కనిపిస్తారు.
ఒక గుణం యొక్క ఆరవ విషయం - అటువంటి ఇష్ట దేవతల ముఖకవళికలు స్వయం కూడా కమల
సమానంగా ఉంటాయి మరియు ఇతరాత్మలను కూడా కమల సమానంగా అతీతంగా మరియు ప్రియంగా
చేస్తారు.
ఏడవ విషయం - సదా స్థితిలో అచంచలంగా, అఢోల్ గా ఉంటారు.
ఎలా అయితే మూర్తిని స్థాపితం చేస్తారో అలాగే చైతన్య మూర్తులైన వారు ఏకీరస
స్థితిలో ఉంటారు.
ఎనిమిదవ విషయం - వారు సదా సంకల్పం మరియు మాటలో
సర్వాత్మల పట్ల వరదానిగా ఉంటారు. నింద లేదా ఫిర్యాదులు చేసేవారికి కూడా వరదానిగా
ఉంటారు. నిందించేవారిపై కూడా ఓహో, ఓహో అనే పుష్పాల వర్షం కురిపించేవారిగా ఉంటారు.
దీనికి ఫలితంగా ఇష్టదేవతల రూపంలో పూలవర్షం కురిపించుకుంటారు.మహిమ చేసేవారి మహిమ
చేయటం సాధారణమైన విషయం కానీ నిందించేవారి మెడలో గుణమాల వేయటమనేది జన్మజన్మలకు
వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవటం మరియు వెనువెంట వర్తమాన సమయంలో కూడా సదా
సహయోగిగా చేసుకోవటం. ఇది నిశ్చితం అయిపోతుంది.
ఎలా అయితే ఈ రోజుల్లో విశేషాత్మలను స్వాగతం
చేసేటప్పుడు మెడలో స్థూల మాల వేస్తారు. మరి మీరు ఏమి చేస్తున్నారు? వేసినవారికి
తిరిగి మాల వేస్తారు కదా! అలాగే నిందించేవారికి కూడా మీరు గుణమాల వేయండి అప్పుడు
వారు స్వతహాగానే మీ గుణమాల వారు తిరిగి వేస్తారు. ఎలా అయితే మీరు బాబా యొక్క
ప్రతి అడుగు, ప్రతి కర్మ యొక్క గుణగానం చేస్తున్నారో అలాగే ఇష్టదేవతలు మరియు
మహాన్ ఆత్మలైన మీ యొక్క గుణాలు' సదా గానం చేస్తూ ఉంటారు. అంటే ఈ ఇవ్వటమనేది
అనేక సార్లు తీసుకోవటం అవుతుంది. ఇష్టదేవతల విశేషతలు అర్థమయ్యాయా? ఇప్పుడు అందరు
స్వయాన్ని పరిశీలించుకోండి - ఇష్టదేవ స్వరూపం ఎంత వరకు తయారయ్యింది? అని. మూర్తి
తయారైపోయిన తర్వాత పరదా తెరుస్తారు. ఇప్పుడు అందరు తయారైపోయారా లేక కొద్దిమంది
తయారవుతున్నారా? మీ భక్తులు సగం సాక్షాత్కారం అయితే రాజీ అవ్వరు అందువలన మీ
ఇష్టదేవతా స్వరూపాన్ని సదా అలంకరించుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఏం చేయాలో
అర్థమైందా?
ఇలా సదా అలంకరించబడి ఉండే మూర్తులకు, రాజ్యవంశి నుండి
ఇష్టవంశి సర్వాత్మలకు, సదా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా వరదానం ఇచ్చేవారికి,
సర్వాత్మల పట్ల దయాహృదయులుగా అయ్యి గమ్యాన్ని చూపించేవారికి, ఇలా మహాదాని,
వరదాని ఇష్టదేవ శ్రేష్ఠాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.