సత్యతయే(రియాల్టీ) అన్నింటికంటే గొప్ప ఠీవి (రాయల్టీ).
సర్వుల అదృష్టం తయారు చేసేవారు, భాగ్య విధాత, శివబాబా
తన యొక్క తెలివైన, అదృష్టవంతులైన పిల్లలతో మాట్లాడుతున్నారు -
ఈరోజు బాప్ దాదా పిల్లలను చూసి హర్షిస్తున్నారు.
ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు ఈ పిల్లలే తెలివైనవారు అని. ప్రతీ ఒక్కరి వర్తమానం
మరియు భవిష్యత్తు యొక్క అదృష్టాన్ని చూసి ప్రతి ఒక్కరి చిత్రంలో అదృష్టాన్ని
చూస్తున్నారు. బ్రాహ్మణుల యొక్క వర్తమాన ముఖకవళికల ద్వారా భవిష్యత్తుని
చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ స్వర్గాధికారి. పిల్లల అధికారాన్ని చూసి బాప్
దాదాకి కూడా ఈశ్వరీయ గర్వంగా ఉంది - విశ్వమంతటిలో ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలు
ఎవరికి ఉండరు. ఇటువంటి గర్వం పిల్లలకి కూడా ఉంటుందా - మా వంటి అదృష్టం ఇంకెవరికీ
ఉండదు అని.
బాప్ దాదా ఈరోజు విశేషంగా ప్రతి ఒక్క బిడ్డలో ఒక
విశేషతను చూస్తున్నారు - ప్రతి ఒక్కరిలో సత్యత (రియాల్టీ) అనే ఠీవి (రాయల్టీ)
ఎంత వరకు వచ్చిందని. సత్యతయే ఠీవి. దీనికంటే పెద్ద ఠీవి ఇంకేదీ ఉండదు. ఠీవి
అనేది ఏయే విషయాలలో లేదా సత్యత ఏయే విషయాలలో ఉండాలి? మొదట మీ స్వరూపం యొక్క
సత్యత. సత్యత అంటే మీ అసలు స్వరూపం సదా స్మృతిలో ఉంటే స్థూల ముఖంలో కూడా అలౌకిక
ఠీవి కనిపిస్తుంది. ఎవరు చూసినా కానీ వారి నోటి నుండి ఇదే మాట వస్తుంది - వీరు
ఈ ప్రపంచంవారు కాదు, అలౌకిక ప్రపంచం యొక్క ఫరిస్తాలు లేదా స్వర్గం నుండి దేవత
దిగి వచ్చిందని. ఇటువంటి అనుభవం అవుతుంది. రెండవ విషయం - స్మృతిలో సత్యత అనగా
ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈ సత్యత యొక్క స్మృతి ద్వారా కర్మలో లేదా మాటలో
కూడా ఠీవి కనిపిస్తుంది. ప్రతి కర్మ సత్యంగా అంటే శ్రేష్టంగా ఉంటుంది. అందువలన
ఎవరు సంప్రదింపుల్లోకి వచ్చినా కానీ వారు కర్మలో బాబా సమానమైన చరిత్రను అనుభవం
చేసుకుంటారు. ప్రతి మాటలో బాబా సమానంగా అధికారం (అధార్టీ) మరియు ప్రాప్తి యొక్క
అనుభవం అవుతుంది. అంటే ప్రతి మాట సమర్థంగా, ఫలం ఇచ్చేదిగా ఉంటుంది. వీటినే
సత్యవచనాలు అని అంటారు. ఇలా కర్మలో మరియు మాటలో సత్యత యొక్క ఠీవి ఉంటుంది. వారి
సంప్రదింపు అనగా సాంగత్యం సత్యంగా ఉంటుంది. కనుక అది పరుసవేది వలె పనిచేస్తుంది.
ఎలా అయితే పరుసవేది లోహాన్ని కూడా పరివర్తన చేస్తుందో అలాగే సత్యత యొక్క ఠీవి
గల ఆత్మ యొక్క సాంగత్యం అసమర్థులను సమర్థులుగా చేస్తుంది. అంటే నకిలీని అసలుగా
తయారుచేస్తుంది. ఇటువంటి ఆత్మ యొక్క నిజ మరియు రాయల్ నయనాలు అంటే దివ్యదృష్టి
ఒక గారడీ వస్తువుగా పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ముక్తి యొక్క అనుభూతి మరలా
ఇప్పుడిప్పుడే జీవన్ముక్తి స్థితి యొక్క అనుభూతి, ఇప్పుడిప్పుడే చివరి అంతిమ
జన్మ, మరలా ఇప్పుడే ఆది జన్మ యొక్క సాక్షాత్కారం చేయిస్తాయి. ఇప్పుడు చాలా దు:ఖం
యొక్క స్థితి మరలా ఇప్పుడే చాలా సుఖవంతమైన జీవితాన్ని అనుభవం చేయిస్తాయి. "నేనే
నువ్వు, నువ్వే నేను” అనే గారడీ మంత్రాన్ని అనుభవం చేయిస్తాయి అంటే 84 జన్మల
యొక్క జ్ఞానాన్ని స్మృతి ఇప్పిస్తాయి. ఇప్పుడిప్పుడే స్థూల వతనం, సంగమయుగీ సుఖం
యొక్క అనుభూతి, మరలా ఇప్పుడే సూక్ష్మ ఫరిస్తా స్వరూపం యొక్క అనుభూతి చేయిస్తాయి.
ఇప్పుడిప్పుడే పరంధామనివాసి ఆత్మిక స్వరూపం యొక్క అనుభూతి, ఇప్పుడిప్పుడే
స్వర్గం యొక్క సుఖమయ జీవితం యొక్క అనుభూతిని చేయిస్తారు. ఒక్క సెకనులో ఈ నాలుగు
ధామాలను అనుభవం చేయిస్తాయి - ఇదే గారడీ మంత్రం.
ఇటువంటి ఠీవి గలవారు సదా సర్వ కర్మేంద్రియాల ద్వారా
ఏదోక ప్రాప్తిని ఇచ్చేవారిగా అంటే దాతగా ఉంటారు. ఇలాంటి ఠీవి గల ఆత్మలు ఎలాంటి
మాయా ఆకర్షణల వైపు సంకల్పం ద్వారా కూడా వంగరు, అంటే ప్రభావితం అవ్వరు. ఎలాగైతే
ఈ రోజుల్లో ఉన్నత కుటుంబం యొక్క ఠీవి గల వారు సదా నిండుగా ఉంటారు, కనుక ఎవరికీ
ఎక్కడా ఆధీనమవ్వరు. అలాగే వీరికి కూడా సదా బుద్ధి నిండుగా ఉంటుంది. దీనినే
స్థూలంగా పొట్ట నిండుగా ఉంది అంటారు. వీరి బుద్ది ప్రతి ఖజానాతో నిండుగా ఉంటుంది.
అందువలన ఏ అల్పజ్ఞ వ్యక్తి లేదా అల్పకాలిక వైభవం వైపు బుద్ధి వెళ్ళదు తీసుకోవాలి
అని దృష్టి వెళ్ళటానికి వారికి ఏ వస్తువు లోటుగా ఉండదు. వారి నయనాలలో సదా
బిందురూపుడైన బాబాయే నిండి ఉంటారు. ఇదే ఠీవి అనగా సత్యత. ఈ దేహం కూడా సత్యమైనది
కాదు, ఆత్మయే సత్యం. అందువలన మిమ్మల్ని మీరు అడగండి - సత్యత యొక్క ఠీవి ఎంత వరకు
వచ్చింది? ఠీవి నెంబరువారీగా ఉంటుంది కానీ నా నెంబర్ ఏది? అనేది పరిశీలించుకోండి.
మొదటి తరగతిలో ఉందా లేక రెండవ తరగతిలో ఉందా? మూడవ తరగతి అని అయితే అనరు కదా?
పంజాబ్ వారు ఏ నెంబర్? అందరు మొదటి తరగతి వారే కదా? ఒకవేళ రెండవ తరగతిలో ఉంటే ఈ
రోజు మొదటి తరగతిలోకి వచ్చేయండి. రెండవ తరగతి వారికి కూడా సంగమయుగంలో
సర్వప్రాప్తులు అనుభవం అవ్వవు. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొంతమంది అంటారు
కదా, శాంతి యొక్క అనుభూతి అయితే అవుతుంది, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం లేదు,
సంతోషం యొక్క అనుభూతి ఉంది, కానీ శక్తి రూపం అనుభవం అవ్వటం లేదని. మొదటి తరగతి
వారికి ప్రతి గుణం మరియు ప్రతి శక్తి అనుభవమవుతాయి. ఒకవేళ ఏదైనా లోపంగా ఉంటే 14
కళలవారిగా రెండవ తరగతిలోకి వస్తారు. ఇటువంటి ఆత్మలు ఇప్పుడు కూడా శ్రేష్ఠ
ప్రాప్తి నుండి వంచితంగా ఉండిపోతారు మరియు భవిష్యత్తులో కూడా సతో ప్రధాన
ప్రాప్తికి బదులు సతో ప్రాప్తిని పొందుతారు. అంటే రెండవ తరగతి అయిపోయింది కదా!
మొదటి తరగతి వారు సతో ప్రధానమైన రాజ్యం మరియు ప్రకృతి యొక్క సుఖం పొందుతారు.
కానీ సతో ప్రాప్తి కాదు. అందువలన ఇప్పుడు ఆలోచించుకోండి ఏమి తీసుకోవాలో? సతో
ప్రధాన ప్రాప్తియా లేక సతో ప్రాప్తియా? సర్వప్రాప్తుల అనుభూతి కావాలా? లేక
కొన్ని ప్రాప్తుల అనుభూతి కావాలా? ఇది స్వయానికి స్వయమే నిర్ణయించుకోండి.
అప్పుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళక్కరలేదు. అర్థమైందా? సత్యత యొక్క ఠీవి ఎలా
ఉంటుందో? ఇంకా ఠీవి యొక్క విస్తారం తర్వాత వినిపిస్తాను. మంచిది.
ఈవిధంగా ఠీవిగా ఉండేవారికి, సదా సర్వప్రాప్తుల అనుభూతి
స్వరూపులకి, ప్రతి కర్మ చరిత్రగా అంటే శ్రేష్ఠముగా చేసేవారికి, ఒక్క సెకనులో
నాలుగు ధామాలను అనుభవం చేయించేవారికి, శ్రేష్ఠ అదృష్టవంతులకు బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు నమస్తే