విఘ్నాల నుండి ముక్తి అయ్యే సహజ యుక్తి.
సర్వుల ముక్తి - జీవన్ముక్తి దాత శివబాబా తన గారాభమైన
పిల్లలతో మాట్లాడుతున్నారు-
ఈరోజు బాప్ దాదా సదా తన అతి గారాభమైన ప్రియమైన
పిల్లలను స్నేహ దృష్టితో, సర్వ శ్రేష్ఠులు, తన యొక్క శిరోకిరీటాలు అయిన పిల్లలను
పదమాపద భాగ్యశాలుల రూపంలో చూస్తూ సదా సంతోషిస్తున్నారు. కల్పపూర్వం తప్పిపోయిన
పిల్లలు ఎంత శ్రేష్ఠ పదవిని పొందటానికి యోగ్యులయ్యారని. ప్రతీ బిడ్డ యొక్క
యోగ్యత మరియు విశేషత బాప్ దాదా ముందు సదా స్పష్టంగా ఉంటుంది. మరియు బాప్ దాదా
ప్రతీ ఒక్క బిడ్డ విశేషత యొక్క విలువను తెలుసుకుని ప్రతి ఒక్కరినీ అమూల్య
రత్నంగా భావిస్తున్నారు. సదా బాప్ దాదా స్మృతి స్వరూపులు, సదా సహయోగి పిల్లలు,
తన యొక్క విభిన్న విలువైన రత్నాలతోనే సదా తోడుగా ఉంటారు. ఎంత అమూల్య రత్నాలంటే
వారిని బాబా తన కంఠహారంగా, హృదయ సింహాసనాధికారులుగా, నయన సితారలుగా,
శిరోకిరీటంగా చేసుకున్నారు, విశ్వంలో తనతో పాటు పూజ్యనీయంగా తయారుచేశారు, అనేక
భక్తులకి ఇష్ట దేవతగా తయారు చేసారు - ఇటువంటి స్వమానంలో సదా స్థితులై ఉంటున్నారా?
ఏ దృష్టితో అయితే బాప్ దాదా మరియు విశ్వం చూస్తుందో అదే స్వరూపంలో సదా
స్థితులవుతున్నారా?
ఈరోజు బాబా మరియు దాదా ఇద్దరికి పిల్లల గురించి
ఆత్మిక సంభాషణ జరుగుతుంది. బాప్ దాదా అన్నారు - సహజ యోగి పిల్లలు, రాజ ఋషి
పిల్లలు నడుస్తూ, నడుస్తూ తీవ్రగతి నుండి అప్పుడప్పుడు ఆగిపోతున్నారు. ఎందుకు
ఆగిపోతున్నారు? తమ జీవితం యొక్క భవిష్య శ్రేష్ఠ గమ్యం స్పష్టంగా కనిపించటం లేదు.
ఇక ముందు ఏమవుతుందో అనే ప్రశ్న యొక్క పరీక్ష పేపరు ఎదురుగా వస్తుంది. దీని
కారణంగా తీవ్ర వేగం నుండి లేదా తీవ్ర పురుషార్థం నుండి పురుషార్థంలోకి
వచ్చేస్తున్నారు. వచ్చిన విఘ్నాన్ని తొలగించే మరియు రాయిని దాటే ధైర్యం తక్కువ
అయిపోతుంది. అందువలన నడుస్తూ, నడుస్తూ అలసిపోతున్నారు. కొంతమంది అలసిపోతున్నారు,
కొంతమంది మానసికంగా బలహీనం అయిపోతున్నారు అంటే తమతో తాము నిరాశ అయిపోతున్నారు.
ఇటువంటి సయమంలో బాబా యొక్క సహాయం లభిస్తున్నా కానీ నిస్సహాయులుగా అనుభవం
చేసుకుంటున్నారు. కానీ బాప్ దాదా ఒక్క సెకను యొక్క సహజ సాధనం లేదా ఏ విఘ్నం
నుండి అయినా ముక్తి అయ్యే యుక్తి ప్రతి సమయం వినిపిస్తున్నారు. కానీ అది
మరచిపోతున్నారు. ఒక్క సెకనులో స్వ స్వరూపం అనగా ఆత్మిక జ్యోతి స్వరూపం మరియు
కర్మలో నిమిత్త భావం యొక్క స్వరూపం ఈ డబల్ లైట్ స్వరూపం ఒక్క సెకనులో మనల్ని
దాటిస్తుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? దుమికి దానిపై నుండి
వెళ్ళిపోవడానికి బదులు ఆ రాయిని తొలగించటంలో నిమగ్నం అయిపోతున్నారు. దీని
కారణంగా వారిలో శక్తి ననుసరించి ఉన్న ధైర్యం, ఉల్లాసం దానిలో సమాప్తి
అయిపోతున్నాయి మరియు అలసిపోతున్నారు లేదా మనస్సుని బలహీనం చేసేసుకుంటున్నారు.
పిల్లల యొక్క ఈ శ్రమని చూసి బాప్ దాదాకి కూడా దయ వస్తుంది. దుమకండి మరియు ఒక్క
సెకనులో దాటేయండి కానీ మర్చిపోతున్నారు. అందువలన ఈరోజు ఆత్మిక సంభాషణ జరిగింది
- పిల్లలు ఏమి చేస్తున్నారు మరియు బాప్ దాదా ఏమి చెప్తున్నారు. చిన్న విస్మృతి
కారణంగా సహజ మార్గాన్ని ఇంత కష్టంగా చేసేసుకుంటున్నారు. దానిలో స్వయమే
అలసిపోతున్నారు.
ఇంకా ఏమి చేస్తున్నారు? వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను
స్వయమే రచించుకుంటున్నారు మరియు ఆ తుఫానులో స్వయమే కదలిపోతున్నారు. అనేక
ప్రాప్తుల ఆధారంగా నిశ్చయం యొక్క పునాది కదలిపోతుంది. వినాశనం అవుతుందో అవ్వదో?
భగవానువాచ నిజమో, కాదో? ప్రపంచం వారికి నిశ్చయంతో చెప్తామా, వద్దా? గుప్తంగా
ఉంచుదామా, ప్రత్యక్షం చేద్దామా? ఇంకా ధనం జమ చేసుకుందామా లేక సేవలో
ఉపయోగించుదామా? కుటుంబాన్ని సంభాళిద్దామా లేక సేవలో ఉండిపోదామా? ఆఖరికి
ఏమౌవుతుందో? బాబా అయితే నిరాకారి మరియు ఆకారి అయిపోయారు. సాకారంలో
ఎదుర్కోవలసింది మేము... ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాను స్వయమే
రచించుకుంటున్నారు. మామూలు తుఫాను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది కదా! అలాగే
ఈ వ్యర్థ సంకల్పాల తుఫాను తీవ్ర పురుషార్థం నుండి సాధారణ పురుషార్థానికి
తీసుకువచ్చేస్తుంది. ఇటువంటి తుఫానులలోకి రాకండి. ఇటువంటి పిల్లలను బాప్ దాదా
అడుగుతున్నారు - ఇప్పటికి మీరు నిమిత్తమాత్రులా లేక గృహస్థీలా? మీరు నిమిత్తులు
అయితే బాధ్యత ఎవరిది? మీదా లేక బాబాదా? బాధ్యత బాబాది అయినప్పుడు అవుతుందా?
అవ్వదా? ఏమి అవుతుంది? ఇది కూడా బాబా బాధ్యతా లేక మీదా? నిశ్చయబుద్ధికి మొదటి
గుర్తు ఏమిటి? నిశ్చయబుద్ధి అంటే సదా నిశ్చింతులు. బాబా మీ చింతలన్నీ తనపై
ఉంచుకుంటే ఇక మీకు ఎందుకు చింత - వినాశనం అవుతుందా? అవ్వదా? ఎప్పుడు అవుతుంది?
ఈ చింతలు బ్రాహ్మణ జీవితంలో ఎందుకు? బ్రాహ్మణ జీవితం వజ్రతుల్యమైన జీవితం,
బాబాతో కలయిక జరుపుకునే జీవితం, ఉన్నత కళ యొక్క జీవితం, సర్వ ఖజానాలతో సంపన్నం
అయ్యే జీవితం,సర్వ అనుభూతులతో సంపన్న జీవితం. ఇటువంటి జీవితం ఇష్టం అనిపించటం
లేదా? త్వరగా అయిపోవాలి అని అనుకుంటున్నారా? ఏదైనా కష్టం, శ్రమ ఉందా? భక్తి
మార్గంలో పిలిచారు కదా - ఈ అతీంద్రియ సుఖం యొక్క జీవితం ఒకటికి నాలుగు రెట్లు
అవ్వాలని. కానీ ఇప్పుడు అలసిపోయారు. ఇలాంటి సంకల్పాలు చేసేవారిని చూసి బాబాకి
నవ్వు వస్తుంది. ఇటువంటి సంకల్పాలు చేస్తున్నారు. అసలు మీకు అప్రాప్తి ఏమిటి?
కళ్యాణకారి బాబా మరియు కళ్యాణకారి జీవితం. బాబా ఏదైతే చెప్తున్నారో దానిలో అనేక
రకాలుగా కళ్యాణం నిండి ఉంటుంది. ఎందుకు చెప్పారు? ఎలా చెప్పారు? ఇలాంటి
సంకల్పాలతో నిశ్చయం యొక్క పునాదిని ఎందుకు కదుపుకుంటున్నారు? ఇలాంటి చిన్న
చిన్న తుఫానులలో పునాది కదలిపోతే మహా వినాశనం యొక్క మహా తుఫానులలో ఎలా ఉండగలరు?
ఇప్పుడయితే కేవలం మీ వ్యర్థ సంకల్పాల యొక్క తుఫానే ఉంది కానీ మహా వినాశనంలో
అనేక రకాలుగా నాలుగు వైపుల తుఫానులు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఇంత చిన్న
విషయంలో ఎందుకు అలజడి అయిపోతున్నారు. ఇప్పుడు అయితే ఇంకా సమయం లభించింది, బాబా
సహాయం లభించింది. అనేక రకాల ఖజానాలు లభించాయి. అన్నీ లభించి కూడా ఇది సమాప్తి
అయిపోవాలనే ఉత్కంఠ ఎందుకు పెట్టుకుంటున్నారు? సుఖం యొక్క రోజులు రానున్నవి,
ధైర్యం వహించండి. ఎప్పుడు మరియు ఎందుకు అనే అధైర్యంలోకి రాకండి. మీ వ్యర్థ
సంకల్పాల యొక్క తుఫానుని సమాప్తి చేసుకోండి. ధనవంతులుగా, సమర్థవంతులుగా అవ్వండి.
సదా నిశ్చయబుద్ధిగా ఉండండి. కళ్యాణకారి బాబా మరియు కళ్యాణకారి సమయం యొక్క ప్రతి
సెకను లాభం పొందండి. మొత్తం కల్పంలో ఇటువంటి ధనవంతమైన, భాగ్యవంతమైన రోజులు,
భాగ్యవిధాత యొక్క సాంగత్యంలో ఉండే రోజులు మరలా రావు. వినాశనం సమయంలో కూడా ఈ
ప్రాప్తి యొక్క రోజులను జ్ఞాపకం చేసుకుంటారు. అందువలన డ్రామానుసారం కళ్యాణార్థం
డ్రామా యొక్క దృశ్యాలను త్రికాలదర్శిగా అయ్యి ధైర్యం మరియు ఉత్సాహంతో సమర్థ
ఆత్మలుగా అయ్యి స్వయం సమర్థంగా ఉండండి మరియు విశ్వాన్ని కూడా సమర్థంగా చేయండి.
రాయిని పగలుగొట్టటంలో అలసిపోవద్దు, స్వయం తుఫానులలో కదలవద్దు. అచంచలంగా అవ్వండి.
అర్థమైందా? ఏం చేస్తున్నారో మరియు ఏం చేయాలో? పిల్లలు ఎలాంటి ఆటలు ఆడుతున్నారో?
ఇదే ఆత్మిక సంభాషణ బాప్ దాదాలు ఇద్దరికి జరిగింది. ఇప్పుడు సమర్థ ఆట ఆడండి, దాని
ద్వారా ఈ ఆటలన్నీ సమాప్తి అయిపోతాయి. మనస్సు బలహీనం అవ్వటానికి బదులు సంతోషం
అవుతుంది. ఇప్పుడు ఈ సంకల్పాలన్నింటిని ఈ మహా యజ్ఞంలో స్వాహా చేసి వెళ్ళాలి,
కూడా తీసుకువెళ్ళకూడదు. సదాకాలికంగా స్వాహా చేసేయాలి. స్వయం స్వాహా అయిపోతే ఈ
సంకల్పాలు ఎలా వస్తాయి? అందువలన స్వాహా అయిపోయినట్లు నైవేద్యం (భోగ్) పెట్టి
వెళ్ళాలి. సమర్థ సంకల్పాలనే పళ్ళుని నైవేద్యంగా పెట్టాలి. అర్థమైందా? ఏమి
నైవేద్యం చేయాలో? మంచిది.
ఈవిధంగా సదా నిశ్చింత, సదా నిశ్చయబుద్ది ఆత్మలకి, ప్రతీ మహావాక్యం యొక్క మహాన్
అర్థం తెలుసుకునేవారికి, సంకల్పాలకు కూడా నిమిత్తంగా భావించేవారికి అనగా బాబా
యొక్క సంకల్పమే పిల్లల యొక్క సంకల్పం, ఇలా మనస్సు, బుద్ధి, సంస్కారంలో బాబా
సమానమైన వారికి, బాప్ దాదాకి సమీప ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు
నమస్తే.