మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం మొదటి స్మృతి
మరియు మొదటి మాట.
సర్వాత్మలపై దయ ఉంచుకునే వారు, విశ్వంలోని సర్వ
శ్రేష్ట ఆత్మలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు :-
ఈరోజు బాప్ దాదా విశ్వం యొక్క సర్వ శ్రేష్ట ఆత్మలను
చూసి హర్షిస్తున్నారు. సర్వాత్మలలో చాలా కొద్ది మంది ఆత్మలకే ఇంత శ్రేష్ట భాగ్యం
ఉంటుంది. ఎలాగైతే పిల్లలు భాగ్య విధాత బాబాను చూసి హర్షిస్తున్నారో అలాగే బాబా
కూడా భాగ్యవంతులైన పిల్లలను పొంది పిల్లల కంటే ఎక్కువ సంతోషిస్తున్నారు.
ఎందుకంటే ఇంత సమయం నుండి విడిపోయిన పిల్లలందరు మరలా కలుసుకున్నారు. అంటే సంతోషం
ఎందుకు ఉండదు? ప్రతి బిడ్డ యొక్క విశేషత, ప్రతి సితార యొక్క మెరుపు, ప్రతి ఆత్మ
యొక్క రంగు, ఆత్మీయత యొక్క ఈశ్వరీయ మెరుపు బాబా తెలుసుకున్నంతగా పిల్లలు స్వయం
ఒక్కొక్క సారి మర్చిపోతున్నారు. సర్వ విఘ్నాలనుండి, సర్వ పరిస్థితుల నుండి లేదా
తమోగుణి ప్రకృతి యొక్క ఆపదలలో ఒక్క సెకనులో విజయం పొందాలంటే ఒక విషయం యొక్క
నిశ్చయం మరియు నషా ఉండాలి. అది ఏమిటి? అది మీకు తెలుసు సంకల్పం, స్మృతి వరకు
తీసుకువచ్చారు. కానీ సంస్కార రూపంలోకి తీసుకురాలేదు. ఆలోచిస్తారు, అలా
భావిస్తున్నారు కూడా, వింటున్నారు కూడా. అయినా కానీ అప్పుడప్పుడు
మర్చిపోతున్నారు. అది ఏమిటి? చాలా పాత విషయం. ఓహో నేను అనేది వింటూ
సంతోషపడిపోతున్నారు అయినా కానీ మర్చిపోతున్నారు. ఈ మరజీవా జీవితం యొక్క జన్మ
సంస్కారమే - ఓహో నేను. మీ జన్మ యొక్క నిజ సంస్కారం, మొదటి స్మృతి, మొదటి మాటయే
- నేను శ్రేష్ట బ్రాహ్మణాత్మను అని. దీనిని కూడా మర్చిపోతున్నారు. మర్చిపోయే ఆట
మంచిగా అనిపిస్తుంది. అర్థ కల్పం మర్చిపోయే ఆట ఆడుకున్నారు. ఇప్పుడు కూడా ఆ ఆటే
మంచిగా అనిపిస్తుందా? బ్రాహ్మణులు అంటే స్మృతి స్వరూపులు. బ్రాహ్మణులు అంటే
సమర్ధ స్వరూపులు. స్వరూపాన్ని మర్చిపోయే వారిని ఏమంటారు? బాప్ దాదాకి పిల్లల
యొక్క ఈ ఆటను చూసి దయ వస్తుంది, నవ్వు కూడా వస్తుంది. ఇంత గొప్ప ఆత్మలు, కానీ
చేసేది ఏమిటి అని? ఇంకొక అద్భుతమైన ఆట కూడా ఆడుతున్నారు. అది ఏమిటి? మీకు చాలా
బాగా తెలుసు. మీకు మీరే చెప్పండి ఏమి చేస్తున్నారో? కొంతమంది ఒయ్యారాలు
చూపిస్తున్నారు మరియు కొంతమంది దాగుడుమూతలు ఆడుతున్నారు. ఒక్కొక్కసారి ఓహో
అంటున్నారు. ఒక్కొక్కసారి అయ్యో, అయ్యో అంటున్నారు. ఇవన్నీ మీకు తెలుసు,
చేస్తున్నారు, కానీ దీని కంటే మరొక అద్భుతమైన ఆట ఆడుతున్నారు. ఎప్పుడైతే బాబా
వారిగా అయ్యారో, మరజీవ అయ్యారో అప్పుడు మీ మొదటి ప్రతిజ్ఞ ఏమిటి? ఇది కూడా మీకు
బాగా తెలుసు. ప్రతిజ్ఞ ఏమి చేసారో తెలుసు. బాబా ప్రతిజ్ఞ చేయించారు మరియు మీరు
స్వీకరించారు. స్వీకరించిన తర్వాత మరలా ఏమి చేస్తున్నారు? బాబా శూద్ర, వికారీ
సంస్కారాలను వదలండి అని చెప్పారు. ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపి
శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు. ఈశ్వరీయ సంస్కారాలనే దివ్య శరీరాన్ని ధరించారు.
శూద్రత్వం యొక్క గుర్తులు, అశుద్ధ వృత్తి మరియు దృష్టిని పరివర్తన చేసుకుని
పవిత్ర దృష్టి మరియు వృత్తి యొక్క విశేష గుర్తులను ధారణ చేసారు. సర్వ శ్రేష్టాతి
శ్రేష్టమైన సంబంధానికి మరియు సంపత్తికి అధికారిగా అయ్యారు. ఇది చాలా మంచిగా
జ్ఞాపకం ఉంది. కానీ ఏమి చేస్తున్నారు? శ్రేష్టాత్మలు సంకల్పం ద్వారా వదిలేసిన
అంటే త్యాగం చేసిన వాటిని మరలా ధారణ చేయరు. ఎలాగైతే ఉన్నత కుటుంబీకులు క్రింద
పడిపోయిన వస్తువులను తీసుకోరు. అలాగే మీరందరు సంకల్పం ధారణ చేసారు అంటే ఈ
వికారాలను బుద్ధి నుండి పడేసారు. పనికిరానివిగా మరియు పాడైపోయినవిగా భావించి
ప్రతిజ్ఞ చేశారు, త్యాగం చేశారు, మరియు "ఇది విషం, దీనిని మేం తీసుకోము” అని
మాట ఇచ్చారు. మరలా ఏమి చేస్తున్నారు? పడేసిన వస్తువులను, మురికి వస్తువులను,
పనికిరాని వస్తువులను, కుళ్ళిపోయిన వస్తువులను మరలా ఎందుకు ఉపయోగిస్తున్నారు?
ఏమి ఆట ఆడుతున్నారో అర్థమైందా? అజ్ఞానుల ఆట ఆడుతున్నారు. ఈ ఆటను చూసి బాబాకు దయ
మరియు నవ్వు కూడా వస్తుంది. అన్నీ తెలిసిన వారిగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు
చేసే వారిగా అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారు? చేసేవారిగా అయ్యే విశేష కార్యక్రమం
చేసి చూపించండి. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో
కూడా స్వీకరించకండి. ఆలోచించుకోండి మరియు స్వయాన్ని అడగండి, నేనెవరిని మరియు ఏమి
చేస్తున్నాను అని. వాగ్దానం ఏమి చేశాను మరియు కర్మ ఏమి చేస్తున్నాను? అని.
ప్రతిజ్ఞ ఏమి చేసాను మరియు ఏమి నిలుపుకుంటున్నాను అని. మీ స్వమానం, శ్రేష్ట
స్మృతి, శ్రేష్ట జీవితం యొక్క సమర్థ స్వరూపంగా అవ్వండి. ఏం చెప్పారు మరియు ఏమి
చేశారు? ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన ఆట ఇప్పుడు ఆపేయండి. శ్రేష్ట స్వరూపులుగా,
శ్రేష్ట పాత్రధారులుగా అయ్యి శ్రేష్టత యొక్క ఆట ఆడండి. ఇలా సంపూర్ణ ఆహుతి యొక్క
సంకల్పం చేయండి. అప్పుడే పరివర్తనా కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమం
యొక్క తారీఖు సంఘటిత రూపంలో నిర్ణయించండి.
ఈవిధంగా ధృడ సంకల్పధారులకు, సంకల్పం మరియు స్వరూపం
యొక్క సమాన మూర్తులకు, అన్నీ తెలిసినవారిగా మరియు చేసేవారిగా ఉండేవారికి, ప్రతి
కర్మ ద్వారా స్వయం యొక్క శ్రేష్టత మరియు బాబా యొక్క ప్రత్యక్షత చేసే సర్వ
శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.