సమయం యొక్క పిలుపు''
సదా స్వయాన్ని ఉన్నతోన్నతుడైన బాబా యొక్క ఈశ్వరీయ
సంతానంగా భావిస్తూ సదా సమర్థ స్థితిలోఉంటున్నారా? ఏ విధంగా బాబా సదా సమర్థులో
అలాగే బాబా సమానంగా సమర్థులుగా అయ్యారా? వర్తమాన సమయం అనుసారంగా సమయానికి
ముందుగానే మీరంతా సమయం యొక్క ఛాలెంజ్ అనుసారంగా ఎవర్రెడీగా ఉన్నారు. కావున
సమయానుసారంగా ఇప్పుడు వ్యర్ధం యొక్క ఖాతా కేవలం ఏదో నామమాత్రముగానే ఉండాలి. ఆ
పిండిలో ఉప్పు' అన్న నానుడి వలె సమర్థత యొక్క ఖాతా 99 శాతం ఉండాలి అప్పుడే
భవిష్య క్రొత్త ప్రపంచం కొరకు 100 శాతం సతో ప్రధాన రాజ్యానికి అధికారులుగా
అవ్వగలుతారు. ఇప్పుడు భవిష్య రాజ్యము లేక మీ యొక్క స్వరాజ్యము మిమ్మల్నందర్నీ
ఆహ్వానిస్తోంది. ఎవరిని ఆహ్వానిస్తోంది? సర్వగుణ సంపన్నులైన, 16 కళాసంపూర్ణులైన
ఆత్మలను ఆహ్వానిస్తోంది. సమయానుసారంగా వర్తమాన స్థితి యొక్క ఛార్టులో సమర్థత
ఎంత ఉందో, వ్యర్థము ఎంతుందో పరిశీలించండి. సంకల్పము మరియు సమయము రెండింటి యొక్క
ఛార్జునూ పెట్టండి. రోజంతటి దినచర్యలో ఏ ఖాతా ఎక్కువగా ఉంటోంది? ఇప్పటివరకూ ఇంకా
వ్యర్థం యొక్క ఖాతా 50 లేక 60 శాతం ఉన్నట్లయితే అటువంటి రిజల్టు కలవారిని ఏ సమయం
యొక్క రాజ్యాధికారులు అని అంటారు? సత్యయుగం యొక్క మొదటి రాజ్యానికి చెందిన వారా
లేక సత్వ యుగం యొక్క మధ్య కాలానికి లేక త్రేతాయుగం యొక్క ఆదికాలానికి చెందినవారా?
ఏ ఆత్మలకైతే వర్తమాన సమయంలో తమ సంకల్పములు మరియు సమయముపై అధికారము ఉంటుందో వారే
ఆదికాలము యొక్క విశ్వాధికారులుగా అవ్వగల్గుతారు. ఇటువంటి అధికారి ఆత్మలే
విశ్వములోని ఆత్మల ద్వారా సతో ప్రధానమైన ఆదికాలములో సర్వుల యొక్క సత్కారమును
ప్రాప్తించుకోగల్గుతారు.
మొదట స్వరాజ్యము, ఆ తర్వాత విశ్వరాజ్యము. ఎవరైతే
స్వరాజ్యమును చేయలేరో వారు విశ్వరాజ్యము యొక్క అధికారులుగా అవ్వలేరు. కావున
ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అంతర్ముఖులుగా అయి స్వచింతనలో ఉండండి.
ఆదిలో, మొదటిరోజున 'నేను ఎవరు?' అన్న చిక్కు ప్రశ్నను వినిపిస్తారు కదా! ఇప్పుడు
మళ్ళీ అదే చిక్కు ప్రశ్నను మీ సంపూర్ణ స్థితి అనుసారంగా, శ్రేష్ఠ పాజిషన్ (స్థితి)
అనుసారంగా పరిశీలించండి. వాట్ ఆమ్ ఐ? (నేను ఎవరిని) ఇప్పుడు ఈ చిక్కు ప్రశ్నను
విప్పాలి. రోజంతటి యొక్క స్థితి ద్వారా మిమ్మల్ని మీరు ఆదికాలము యొక్క అధికారులో
లేక సత్యయుగము యొక్క లేక మధ్యకాలము యొక్క అధికారులో తెలుసుకోగల్గుతారు. ఆదికాలం
యొక్క అధికారిగా అవ్వాలి అన్న లక్ష్యం ఉన్నప్పుడు మరి దాని అనుసారంగా మీ
వర్తమానమును కూడా సదా సమర్థముగా చేసుకోండి. జ్ఞానము యొక్క మననంతో పాటు మీ స్థితి
యొక్క పరిశీలన కూడా ఎంతో అవసరం. ప్రతిరోజూ జమ అయిన ఖాతాలో స్వయంతో సంతుష్టంగా
ఉన్నారా లేక ఇప్పటివరకూ కూడా ఎంత కావాలనుకుంటున్నామో అంత లేదు అనే అంటున్నారా?
ఇప్పటివరకూ ఇంకా ఇదే రిజల్టు ఉండకూడదు. ఎవరైతే స్వయముతో సంతుష్టులుగా ఉండరో వారు
విశ్వములోని ఆత్మలను సంతుష్టపరిచేవారిగా ఎలా అవ్వగలరు? సత్యయుగ ఆదికాలములో
ఆత్మలే కాదు, ప్రకృతి కూడా సంతుష్టంగా ఉండేది ఎందుకంటే వారు సంపూర్ణంగా ఉండేవారు.
కావున ఇప్పుడు సంతుష్ట మణులుగా అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా!
సేవ యొక్క సాధనాలేవైతే ఇప్పటివరకూ ఉన్నాయో వాటి
అనుసారంగా సేవ అయితే చేస్తూనే ఉన్నారు, ఎంతో లగ్నముతో చేస్తున్నారు, ఎంతో
కష్టపడుతున్నారు కూడా. ఉల్లాస ఉత్సాహాలు కూడా చాలా బాగున్నాయి కాని, ఆ సేవతో
పాటుగా విశ్వము యొక్క సేవ మరియు స్వయం యొక్క సేవ కూడా జరగాలి. విశ్వము కొరకు
కూడా దయార్ద్రహృదయులుగా అవ్వాలి మరియు స్వయం ప్రతి కూడా దయార్ద్రహృదయులుగా
అవ్వండి. రెండూ తోడుగా ఉండాలి. అప్పటికి సంపన్నమై పోతాములే అని సమయం కొరకు
ఎదురుచూడకండి. ఇతర ఆత్మలతో రేపు కాదు, ఈ రోజు, ఈ రోజు కూడా కాదు ఇప్పుడే చేయండి
అని అనేటప్పుడు, మరి ఆ విధంగా నేను అలా ఎవర్రడీగా ఉన్నానా అని స్వయాన్ని
ప్రశ్నించుకోండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ లేదు అన్న స్మృతి సదా ఉంటోందా?
ఈవిధంగా మీతో మీరు ఆత్మిక సంభాషణను జరపండి. అచ్చా! బాబా వినిపించడమైతే ఎంతో
వినిపించారు. ఇప్పుడు ఏం కోరుతున్నారు. ఇప్పుడు ఇది వినిపించే సమయం కాదు. చూసే
సమయం. బాబా ఒక్కొ రత్నమును సంపన్నముగా మరియు సంపూర్ణముగా చూడాలనుకుంటున్నారు.
అర్హమైందా!
ఈ విధంగా సంజ్ఞ తోటే అర్థం చేసుకొనే వారికి వినడమును
మరియు చేయడమును సమానతలో తీసుకొవచ్చేవారికి, సదా సంపూర్ణుడైన తండ్రి యొక్క సమర్ద
స్మృతిలో ఉండేవారికి, సమర్ధ స్థితిలో ఉండే సఫలతా మూర్త ఆత్మలకు బాప్ దాదా యొక్క
ప్రియస్మృతులు మరియు సమస్తే.
దాదీలతో మిలనము- మహారథులను చూసి అందరూ ఎంతో
సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? ఎందుకంటే మహారధులు సాకార బాబా సమానంగా అందరి
ముందూ సాకార రూపంలో సంపన్నంగా మరియు శ్రేష్టముగా ఉన్నారు. కావున మహారధులను చూసి
బాబా కూడా హర్షిస్తారు. ఎందుకంటే సమానంగా ఉన్నారు, కావున సమానులను చూసి హర్షం
కలుగుతుంది. సంగమ యుగంలోనే బాబా పిల్లలను సేవ యొక్క సింహాసనాధికారులుగా
తయారుచేస్తారు. ఈ సంగమ యుగం యొక్క ఆచారములు భవిష్యత్తులో కూడా
సింహాసనాధికారులుగా తయారుచేస్తాయి. స్వయం గుప్తరూపంలో ఉంటూ సింహాసనాధికారులైన
పిల్లలను చూస్తున్నారు, సహయోగమును కూడా ఇస్తున్నారు కాని ప్రత్యక్షంగా
సింహాసనాధికారులుగా పిల్లలనే తయారుచేస్తారు. ఈ ఆచారము ఇప్పటినుండే
ప్రారంభమవుతుంది. బాబా చేయువాడు మరియు చేయించువాడు. కావున చేసే పాత్రనూ
అభినయించారు మరియు ఇప్పుడు చేయించే పాత్రను కూడా అభినయిస్తున్నారు. తండ్రి
యొక్క సింహాసనమయి ఉన్న కారణంగా సింహాసనాధికారులుగా అవ్వడంలో భారము అనుభవమవ్వదు.
ఎందుకంటే అది తండ్రి యొక్క సింహాసనం కదా! మరియు ఆ తండ్రియే స్వయం
సింహాసనాధికారులుగా తయారుచేసారు. ఈ నిమిత్తులుగా తయారయ్యే ఆసనం ఎంత సహజమైనది. ఈ
సింహాసనానికే విశేషత ఉంది, ఈ సింహాసనంలోనే విశేషమైన ఇంద్రజాలము నిండి ఉంది. దీని
ద్వారా కష్టమైనది కూడా క్షణంలో సహజమైపోతుంది. ఈ నిమిత్తముగా అయ్యే సింహాసనము
సమయానుసారంగా, డ్రామా అనుసారంగా సర్వశ్రేష్ఠ ఆసనము మరియు అతి సఫలతా సంపన్నమైన
ఆసనముగా గాయనము చేయబడ్డది. ఆ ఆసనంపై ఎవరు కూర్చున్నా సఫలతామూర్తులే అవుతారు. ఈ
ఆసనానికి ఈ అనాది మరియు ఆది వరదానము ఉంది. ఈ సింహాసనం యొక్క సింహాసనాధికారులుగా
కూడా చాలా గుహ్యమైన, రహస్యయుకమైన ఆత్మలే అవుతారు. బాబా మహారధులను వర్తమాన సమయంలో
కూడా డబల్ సింహాసనాధికారులుగా చూస్తారు. హృదయ సింహాసనమైతే ఉండనే ఉంది. కాని, ఈ
నిమిత్తులుగా అయ్యే ఆసనము చాలా కొద్దిమందికే ప్రాప్తమవుతుంది. ఈ రహస్యము కూడా
చాలా గుహ్యమైనది, అచ్ఛా!
మధువన నివాసులైన పాండవులతో- మధువన నివాసులు ఎంతో
విన్నారు. ఇంకా వినేదేమైనా మిగిలి ఉందా? సమ్ము ఖముగా విన్నారు. రివైజ్ కోర్సునూ
విన్నారు. ఇప్పుడు ఇంకా వినేందుకు ఏం మిగిలి ఉంది? ఎన్ని బాణాలనైతే
నింపుకున్నారో అన్ని బాణాలను వదిలారా? మధువన నివాసులకు మూడు రకాల సేవల యొక్క
అవకాశము ఉంది. ఏ రకమైన సేవ యొక్క విశేష అవకాశము ఉంది? ఈ వరదాన భూమి లేక చరిత్ర
భూమి యొక్క ఆధారము విశేషంగా
మధువన నివాసులకు సహజ సేవ యొక్క సాధనము. ఈ భూమి చరిత్ర
యొక్క మహిమను ఏ ఆత్మకైనా వినిపిస్తే ఏవిధంగా గీతను వినడంకన్నా భాగవతమును వినడంలో
ఎక్కువ ఆసక్తిని చూపుతారో అలాగే ఈ విధంగా ప్రత్యక్ష చరిత్రను వినిపించే సాధనము
మధువనం వారికి ఉంది. ఈ స్థానము మరియు చరిత్ర యొక్క పరిచయమును ఇచ్చినా ఆత్మలు
సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు వచ్చినా విశేషంగా చరిత్ర భూమిని
తెలుసుకొనేందుకు మరియు అనుభవం చేసుకొనేందుకు వస్తారు. కావున మధువన నివాసులు
ఇక్కడ ఇలా జరుగుతుంది అంటూ భాగవతం ద్వారా సేవ చేయవచ్చు. కావున మీరు ధరణి యొక్క
విశేషతను, మహత్యమును వినిపించేందుకు నిమిత్తులు. ఏ దృష్టితోనైతే సర్వ ఆత్మలు
ఒకొక్క రత్నమును చూస్తాయో అదేవిధంగా వారిని ఆకర్షించినట్లయితే అందులో ఎంతటి సేవ
ఉంది. ఇక్కడ కూర్చొని ఉంటూ ప్రజలను తయారుచేసుకోగలరు. ఆ పరివారాన్ని
తయారుచేసుకోగలరు. ఏ విధంగా తాజ్ మహల్లో గైడ్లు ఎంతో రమణీయంగా తాజమహల్ యొక్క
చరిత్రను వినిపిస్తారో అలాగే చరిత్రను వినిపించినట్లయితే వారికి నిజంగానే
గుర్తుంటుంది మరియు ఆ సేవ యొక్క ఫలితము మీకు తప్పక లభిస్తుంది. ఎవరు వచ్చినా
వారికి ఎంతో సంతోషంగా, ఉల్లాసంతో, లగ్నంతో, మహత్వంలో స్థితులై మహత్వమును
వినిపించినట్లయితే ఎంతో అధిక ఫలమును తీసుకోవచ్చు. ఇటువంటి సేవను చేయడం ద్వారా
ఎంతో సంతోషము ఉంటుంది. కావున సేవా ఉంటుంది, స్మృతి ఉంటుంది మరియు ప్రాప్తి కూడా
ఉంటుంది. ఇంక ఏం కావాలి? ఇంతటి అదృష్టవంతులు మధువన నివాసులు.
ఈ సంవత్సరంలో విశేషంగా స్వయం యొక్క మరియు సేవ యొక్క
బ్యాలన్స్ కావాలి. సేవతో పాటు స్వయం యొక్క పర్పనాలిటీ మరియు ప్రభావము లేక
ధారణామూర్తి స్థితి యొక్క ప్రభావము బంగారంపై వన్నెలా పనిచేస్తుంది.ఎవరైనా చూస్తే
మీరు జ్ఞానమూర్తులు మరియు గుణమూర్తులు అని అనుభవం చేసుకోవాలి. రెండింటి యొక్క
సమతుల్యత కనిపించాలి. జ్ఞానము ఉన్నతముగా ఉంది. కానీ నడవడిక ఆ విధంగా లేదు అని
ఇప్పటివరకూ వినిపిస్తోంది. కావున రెండింటి సమతుల్యత యొక్క జ్ఞానమును ఉంచడం
ద్వారా ప్రజలు లేక వారసులు కనిపిస్తారు.సేవ యొక్క సాధనాలు ఎన్నో ఉన్నాయి.
ఇప్పటికి ఇంకా ధర్మానేతల వరకు చేరుకోలేదు. ఇది మరి యుద్దము. దీని ద్వారా
నలువైపులా శబ్దము వ్యాపించి పోతుంది. ఇది జ్ఞానము యొక్క విషయం ద్వారా జరుగుతుంది.
గీతా భగవానుని యొక్క విషయం ద్వారా పేరు ప్రసిద్ధం కానున్నది. దీని కొరకు చిన్న
చిన్న గ్రూపులను తయారుచేసి నలువైపులా మొదట మీ సహయోగులను కొందరిని తయారుచేయండి.
విద్యార్థులలో పోటీలను పెట్టారు కదా! మళ్ళీ అందులో నుండి ఒకరిని ఎంచుకున్నారు.
అలా ప్రతి స్థానములోనూ చిన్న చిన్న గ్రూపులను తయారుచేయండి మళ్ళీ వారందరినీ ఒక
స్థానంలో సంఘటితం చేయండి అప్పుడు పేరు ప్రఖ్యాతమవుతుంది. ఈ సంవత్సరం పేరును
ప్రఖ్యాతం చేసే సంవత్సరం, అచ్చా!