ఎదురు చూడటానికి బదులు తయారుకండి.
కళ్యాణకారి, మహాదాని, మహావరదానిగా తయారుచేసే
దయాసాగరుడైన తండ్రి తన పిల్లలతో మాట్లాడుతున్నారు-
ఈరోజు బాబా పిల్లలను చూసి సదా సంతోషిస్తున్నారు. ప్రతి
బిడ్డ వర్తమాన సమయంలో విశ్వంలో సర్వాత్మల కంటే శ్రేష్ఠమైనవారు మరియు
భవిష్యత్తులో కూడా విశ్వం ద్వారా పూజ్యనీయులు. ఇలా సర్వ శ్రేష్ఠ మహిమకు మరియు
పూజకు యోగ్యమైన యోగి ఆత్మలు, జ్ఞాని ఆత్మలు, సదా విశ్వ సేవాధారులు, బాప్ దాదా
యొక్క స్నేహంలో మరియు సహయోగిగా ఉండేవారు - ఇటువంటి పిల్లలను చూసి బాబాకి ఎంత
సంతోషంగా ఉంటుంది! నెంబర్ వారీగా ఉన్నప్పటికీ చివరి నెంబర్ మణి కూడా విశ్వం
ముందు మహాన్. ఇలా మీ యొక్క గొప్పతనాన్ని, మహిమని తెలుసుకుంటూ నడుస్తున్నారా లేక
నడుస్తూ, నడుస్తూ స్వయాన్ని సాధారణంగా భావిస్తున్నారా? అలౌకిక తండ్రి ద్వారా
లభించిన అలౌకిక జన్మ, అలౌకిక కర్మ సాధారణమైనది కాదు. చివరి నెంబర్ మణిని కూడా ఈ
రోజు వరకు భక్తాత్మలు తమ కళ్ళలో పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చివరి నెంబర్ కూడా
బాప్ దాదా యొక్క నయన సితార, కంటి వెలుగు. అటువంటి కంటి రత్నాలను ఇప్పటి వరకు
కళ్ళలో పెట్టుకుంటున్నారు. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తెలుసుకుంటూ, వర్ణన చేస్తూ
కూడా అజ్ఞానులుగా కావద్దు. ఒకసారి మనస్సుతో, సత్యమైన హృదయంతో స్వయాన్ని బాబా
బిడ్డగా నిశ్చయం చేసుకుంటే ఆ ఒక్క సెకను యొక్క మహిమ మరియు ప్రాప్తి చాలా గొప్పది.
స్వయంగా (డైరెక్ట్) బాబాకి బిడ్డగా అవ్వటం ఎంత గొప్ప లాటరీయో తెలుసా? ఒక సెకనులో
శూద్ర సంస్కారం నుండి బ్రాహ్మణుల సంస్కారంలోకి వచ్చేస్తారు. ప్రపంచం మారిపోతుంది.
సంస్కారాలు మారిపోతాయి. ఒక సెకను యొక్క ఆటలో దృష్టి. వృత్తి ,స్మృతి అన్నీ
మారిపోతాయి. ఇటువంటి శ్రేష్ఠ సెకనుని మర్చిపోతున్నారా? ప్రపంచం వారు ఇప్పటి వరకు
మర్చిపోలేదు. మీరు చక్రం తిరుగుతూ మారిపోయారు కానీ ప్రపంచం వారు మర్చిపోలేదు,
మీ భాగ్యాన్ని వర్ణన చేస్తూ ఎంత సంతోష పడుతున్నారంటే భగవంతుడే లభించారు అని
అనుకుంటున్నారు. ప్రపంచం వారే మర్చిపోనప్పుడు మీరు స్వయం అనుభవీ మూర్తులు,
సర్వప్రాప్తులు అనుభవం చేసుకునే ఆత్మలు మరలా ఎందుకు మర్చిపోతున్నారు?
మర్చిపోవాలనుకోవటం లేదు కానీ మర్చిపోతున్నారు.
ఈ క్రొత్త సంవత్సరంలో బాప్ దాకి ఏమి నవీనత చూపిస్తారు?
ఇప్పుడు ఏదైతే సమయం ఇచ్చారో దానిననుసరించి అందరు సంపూర్ణంగానే కనిపిస్తున్నారు.
77 సంవత్సరంలో ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని అనుసరించి
బ్రాహ్మణాత్మలందరు తమ పురుషార్థాన్ని సంపన్నం చేసకోవాలి. మీరు పరివర్తనకు
తయారుగా ఉన్నారు కదా! ఇప్పుడు లభించిన సమయం బ్రాహ్మణాత్మలకు స్వపురుషార్థం కోసం
కాదు, కానీ ప్రతి సంకల్పం, ప్రతి మాట ద్వారా దాత పిల్లలైన మీరు విశ్వాత్మలకు
ఖజానాలు ఇచ్చేటందుకు లభించింది. ఈ అదనపు సమయం స్వ పురుషార్థం కోసం కాదు, కానీ
ఇతరులకు ఇచ్చే సమయం, గుణాలు, సర్వ ఖజానాలు ఇతరులకు ఇచ్చేటందుకు లభించింది. బాబా
ఏ పని కోసం సమయాన్ని మరియు ఖజానాలను ఇచ్చారో దానికి బదులు స్వయం పట్ల సమయాన్ని,
సంపదని ఉపయోగిస్తే తాకట్టు పెట్టిన వస్తువుని మనదిగా భావించినట్లు అవుతుంది. ఈ
విశేష సంవత్సరం బ్రాహ్మణాత్మలకు మహాదానిగా, వరదానిగా అయ్యేటందుకు లభించింది.
మీరు కార్యక్రమం తయారుచేసుకుంటారు కదా! విశేషంగా ఈ నెల యోగం యొక్క ప్రోగ్రామ్,
మరుసటి నెల విశేషంగా సేవా ప్రోగ్రామ్ అని. అలాగే డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ
విశేష సమయం మహాదానిగా అయ్యేటందుకు లభించింది. ఇప్పటి వరకు పాత భాష, పాత విషయాలు,
పాత పద్ధతులు అన్నీ బాగా తెలుసుకున్నారు. కానీ ఈ సంవత్సర సమయం వీటి కోసం కాదు.
ఎలాగైతే బాబా ముందు స్వయాన్ని సమర్పణ చేసుకున్నారో అలాగే ఇప్పుడు మీ సమయాన్ని
మరియు సర్వ ప్రాప్తులను, జ్ఞానాన్ని, గుణాలను మరియు శక్తులను విశ్వ సేవార్థం
సమర్పితం చేయండి. ఏ సంకల్పం వచ్చినా అది విశ్వ సేవార్థం ఉందా అని
పరిశీలించుకోండి. ఇలా సేవకి సమర్పితం అవ్వటం ద్వారా స్వయం స్వతహాగానే సంపన్నం
అయిపోతారు. ఎలాగైతే మీరు ఏదైనా సేవ యొక్క విశేష కార్యక్రమాన్ని తయారుచేస్తే ఆ
విశేష కార్యక్రమంలో బిజీ అయిపోయిన కారణంగా స్వయం యొక్క విశ్రాంతి, స్వయానికి
కావలసిన సాధనాలు, నడుస్తూ, నడుస్తూ ఇతరాత్మల ద్వారా వచ్చే చిన్న చిన్న పరీక్షలపై
ధ్యాస పెట్టరు. వాటిని తొలగించేస్తారు. ఎందుకంటే సదా కార్యాన్ని ఎదురుగా
పెట్టుకుంటారు మరియు దానిలోనే నిమగ్నం అయ్యి ఉంటారు. స్వయం కోసం కూడా సమయం
ఉపయోగించకుండా విశేషంగా సేవలోనే ఉపయోగిస్తారు. అలాగే ఈ సంవత్సరం ప్రతి సెకను,
సంకల్పం సేవార్థంగా భావించి, ఈ కార్యంలో నిమగ్నం అయిపోతే ఏమీ లేనట్లుగా
పరీక్షలను దాటేయగలుగుతారు. ఈ విషయం ఏమిటి మరియు ఏమైంది అని సంకల్పంలో కూడా రాదు.
స్వయాన్ని సమర్పణ చేసుకోవటం ద్వారా ఈ సేవా సంలగ్నతలో ఈ చిన్న పెద్ద పేపర్స్,
పరీక్షలు అన్నీ స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. ఎలా అయితే అగ్నిలో వేసిన ప్రతి
వస్తువు యొక్క నామరూపాలు మారిపోతాయో అలాగే పరీక్షల నామరూపాలు మారిపోయి పరీక్షలు
కూడా ప్రాప్తి స్వరూపంగా అయిపోతాయి. మాయ అనే మాటకు భయపడరు. సదా విజయీగా అయ్యే
సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. మాయని స్వయం యొక్క దాసీగా భావిస్తే దాసీ
సేవాధారిగా అవుతుందా లేక భయపడతారా! స్వయం సేవలో సమర్పితం అయిపోతే స్వతహాగానే
మాయ సమర్పితం అయిపోతుంది. కానీ సమర్పణ అవ్వటం లేదు అందువలనే మాయ కూడా మంచిగా
అవకాశం తీసుకుంటుంది. అవకాశం తీసుకుంటున్న కారణంగా బ్రాహ్మణాత్మలు అవకాశదారులుగా
అవుతున్నారు. మాయను అవకాశదారునిగా అవ్వనివ్వకండి. స్వయం సేవ యొక్క అవకాశం
తీసుకుని అవకాశదారులుగా అవ్వండి. ఇప్పుడు సమయం ఎందుకు లభించిందో విన్నారా!
ఇప్పుడు ఎటువంటి ఫిర్యాదు చేయకూడదు. సమయం యొక్క లెక్కతో ప్రతి ఒక్కరు సంపన్నం
అవ్వాలి. సంపన్న ఆత్మ ఎప్పుడు ఫిర్యాదు చేయదు. అయిపోతుంది, అవుతుంది. ఇటువంటి
భాష మాట్లాడరు. క్రొత్త సంవత్సరం, క్రొత్త భాష. క్రొత్త అనుభవం. పాత వస్తువులని
సంభాళించటం మంచిగా అనిపిస్తుంది. కానీ ఉపయోగించటం ఇష్టమనిపించదు. మరి మీరు
ఎందుకు ఉపయోగిస్తున్నారు? 5000 సంవత్సరాల కోసం దాచి ఉంచుకోండి కానీ పాత వాటితో
ప్రీతి ఉంచుకోకండి.
సదా భక్తి ఆత్మలు, బికారీ ఆత్మలు మరియు దాహంతో ఉన్న
ఆత్మల ముందు స్వయాన్ని సాక్షాత్తు బాబా సమానంగా, సాక్షాత్కారమూర్తిగా భావించి
నడవండి. ఈ ముగ్గురి వరుస చాలా పెద్దది. ఈ వరుసను సమాప్తి చేయటంలో నిమగ్నమవ్వండి.
దాహంతో ఉన్నవారి దాహం తీర్చండి, బికారులకు దానం ఇవ్వండి. భక్తి ఆత్మలకి భక్తి
యొక్క ఫలంగా బాబాని కలుసుకునే మార్గం చెప్పండి. వరుసను సంపన్నం చేయటంలో నిమగ్నమై
ఉంటే స్వయం యొక్క ఎందుకు అనే వరుస సమాప్తి అయిపోతుంది. సమయం యొక్క నిరీక్షణలో
ఉండకండి, మూడు రకాలైన ఆత్మలను సంపన్నంగా తయారుచేయండి. ఇప్పుడు ఇక వినాశనం
ఎప్పుడు అవుతుంది అని అడగరు కదా! ఈ వరుసను సమాప్తి చేసేస్తే పరివర్తనా సమయం కూడా
సమాప్తి అయిపోతుంది. సంగమయుగం యొక్క సమయం సత్యయుగం కంటే శ్రేష్ఠముగా అనిపించటం
లేదా? అలసిపోయారా? అలసిపోతేనే కదా వినాశనం ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు!
బాబాకి పిల్లలపై చాలా స్నేహం ఉంది. బాబాకి ఈ కలయిక మంచిగా అనిపిస్తుంది.
పిల్లలకు స్వర్గం మంచిగా అనిపిస్తుంది. స్వర్గం అయితే 21 జన్మలు లభిస్తుంది కానీ
సంగమయుగం లభించదు. అందువలన అలసిపోకండి. సేవలో నిమగ్నం అయిపోతే ప్రత్యక్ష ఫలాన్ని
అనుభవం చేసుకుంటారు. భవిష్య ఫలం అయితే నిశ్చితం అయిపోయింది. కానీ ప్రత్యక్ష ఫలం
యొక్క అనుభవం, సుఖం మొత్తం కల్పంలో లభించదు. అందువలన భక్తుల యొక్క పిలుపు వినండి.
దయా హృదయులుగా అవ్వండి. మహాదాని అయ్యి మహాన్ పుణ్యాత్మ యొక్క పాత్ర అభినయించండి.
ఈవిధంగా బాబా యొక్క ఆజ్ఞాకారులకు, దృఢ సంకల్పం మరియు
సెకనులో ఆజ్ఞాకారి బాబా సమాన విశ్వ కళ్యాణకారులకు, మహాదాని, మహావరదాని, సర్వులని
సంపన్నం చేసే సేవలో స్వయాన్ని సేవలో తత్పరులు చేసుకునే వారికి, ఇలా బాబా
సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.